Deepti
-
చిరంజీవితో ఫోటో దిగితే చాలనుకున్న 'దీప్తి'కి మెగా ప్రోత్సాహం
గతేడాదిలో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజీ దీప్తిని చిరంజీవి అభినందించారు. ఈ విషయన్ని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇలా తెలిపారు.'ఇటీవల మన తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్‌లో దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ అనే చిన్న గ్రామంలో జన్మించిన జీవాంజీ దీప్తి దేశానికి ఎంతో పేరు తెచ్చింది. అయితే, ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన సందర్భంగా మీకేం కావాలని నేను ఆమెను అడిగినప్పుడు, చిరంజీవి గారిని కలవాలని ఉందని చెప్పారు. ఇటీవల నేను చిరంజీవిగారిని ఓ సందర్భంలో కలిసినప్పుడు దీప్తి జవాంజి గురించి చెప్పాను. ఆయన చాలా గొప్ప మనసుతో స్పందించారు. చాలా పెద్ద అచీవ్మెంట్ చేసినప్పుడు, ఆమె రావటం కాదు, నేను అకాడమీకి వస్తానని అన్నారు. అన్నట్లుగానే చిరంజీవిగారు మా అకాడమీకి వచ్చి, అక్కడున్న పిల్లలందరినీ కలిశారు. రెండు గంటల పాటు అక్కడే గడిపారు. అలాగే ప్రతి ప్లేయర్‌ని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆయన మూడు లక్షల రూపాయల చెక్‌ను దీప్తికి అందించటం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా క్రీడాకారులకు చిరంజీవిగారు ఇచ్చిన గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ ఇన్స్పిరేషన్తో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను.' అని ఆయన అన్నారు.దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు రూ. కోటి2024లో పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో జీవాంజీ దీప్తి మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో దీప్తి కాంస్యం సాధించారు. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా చాలామంది ప్రశంసలు కురిపించారు. ఆమె విజయంలో పుల్లెల గోపీచంద్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి ప్రకటించింది. ఆపై దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు వరంగల్‌లో 500 గజాల స్థలం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.కూతురి కోసం పొలం అమ్మేసిన తండ్రిజీవాంజీ దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మిల శ్రమ ఆమె విజయంలో ఎక్కువగా ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన దీప్తి మానసిక వైకల్యంతో చాలా ఇబ్బందులు పడింది. మేధోపరమైన బలహీనత ఉండడంతో ఆమె కోసం తండ్రి యాదగిరి చాలా తల్లడిల్లిపోయారు. చిన్నతనంలో కూతురుకు ఫిట్స్ వస్తే వారు విలవిలలాడిపోయేవారు. అయితే, దీప్తి క్రీడల్లో మాత్రం చాలా చురుకుగా ఉండేది. దీంతో ఆమె సంతోషం కోసం ఆ తండ్రి డబ్బులకు వెనకాడలేదు. తనకున్న ఎకరం పొలాన్ని కూతురి కోసం అమ్మేశారు. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో దీప్తి తిరుగులేని విజయాన్ని దేశానికి అందించింది. -
Deepthi Jeevanji: గేలిచేస్తే గెలిచేసి...
పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో మన వరంగల్ బిడ్డ దీప్తి జీవాన్జీ కాంస్యం సాధించింది. 400 మీటర్ల టి20 విభాగంలో ఆమె ఈ ఘనతను లిఖించింది. పారా ఒలింపిక్స్‌లో ఏ విభాగంలో అయినా పతకం సాధించిన అతి చిన్న వయస్కురాలు దీప్తే. ఊర్లో అందరూ వెక్కిరించినా హేళనతో బాధించినా వారందరికీ తన విజయాలతో సమాధానం చెబుతోంది దీప్తి. ఒకనాడు హేళన చేసిన వారు నేడు ఆమె పేరును గర్వంగా తలుస్తున్నారు.మొన్నటి మంగళవారం (సెప్టంబర్ 3) పారిస్ పారా ఒలింపిక్స్‌లో దీప్తి పరుగు తెలుగు వారికీ దేశానికి గొప్ప సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చింది. 400 మీటర్ల టి20 (బుద్ధిమాంద్యం) విభాగంలో దీప్తి 55.52 సెకండ్లలో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ ΄ోటీలో మొదటి స్థానంలో ఉక్రెయిన్‌కి చెందిన యూలియా (55.16 సెకండ్లు), రెండవ స్థానంలో టర్కీకి చెందిన ఐసెల్ (55.23) సెకన్లు నిలిచారు. ఇంకొన్ని సెకన్లలో ఆమెకు స్వర్ణమే వచ్చేదైనా ఈ విజయం కూడా అసామాన్యమైనదే ఆమె నేపథ్యానికి.షూస్ లేని పాదాలుదీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. పుట్టుకతో దీప్తి బుద్ధిమాంద్యంతో ఉంది. ఆమె రూపం కూడా పూర్తిగా ఆకారం దాల్చలేదు. దాంతో స్కూల్లో చుట్టుపక్కల అన్నీ హేళనలే. మాటల్లో వ్యక్తపరచడం రాని దీప్తి అన్నింటినీ మౌనంగా సహించేది. కొందరు ‘కోతి’ అని వెక్కిరించేవారు. స్కూల్లో ఆమె ఆటల్లో చరుకుదనం చూపించేసరికి తల్లిదండ్రులు కనీసం ఈ రంగంలో అయినా ఆమెను ్ర΄ోత్సహిస్తే కొంత బాధ తగ్గుతుందని భావించారు. పిఇటీ టీచర్ బియాని వెంకటేశ్వర్లు ఆమెను ్ర΄ోత్సహించారు. హనుమకొండలో స్కూల్ లెవల్లో ఆమె పరుగు చూసి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ ్ర΄ోత్సహించాడు. రాష్ట్రస్థాయి ΄ోటీలకు హైదరాబాద్ రమ్మంటే షూస్ లేకుండా ఖాళీ పాదాలతో వచ్చిన దీప్తికి సహాయం అందించేందుకు నాగపురి రమేశ్ పూర్తి దృష్టి పెట్టాడు. దాంతో అంచలంచెలుగా ఎదిగిన దీప్తి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. పుల్లెల గోపిచంద్ కూడా ఆమె శిక్షణకు ఆర్థిక సహాయం అందించారు.బంగారు పరుగు2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. అదే సంవత్సరం బ్రిస్బే¯Œ ఆసియానియా ΄ోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిపతకం గెలిచింది. 400 మీటర్లను 57.58 సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మే 2024లో జపాన్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు పారిస్‌లో కాంస్యం సాధించడంతో ఆమె దేశ పతాకాన్ని తల ఎత్తుకునేలా చేసింది. ఒకప్పుడు గేలి చేసిన ఊరికి ఆమె పేరు ఇప్పుడు చిరునామాగా మారింది. -
Paralympics: సచిన్‌కు రజతం.. 21కి చేరిన పతకాల సంఖ్య
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ మరో పతకం సాధించింది. ప్రపంచ చాంపియన్ సచిన్ ఖిలారి పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో రజతం గెలిచాడు. బుధవారం నాటి ఈ ఈవెంట్లో కెనడాకు చెందిన గ్రెగ్ స్టువర్ట్ 16.38 మీటర్ల దూరం షాట్ విసిరి స్వర్ణం గెలవగా.. సచిన్ 16.32 మీటర్ల దూరంవిసిరి రెండో స్థానంలో నిలిచాడు.తద్వారా పారాలింపిక్స్ తాజా ఎడిషన్‌లో భారత్ ఖాతాలో 21వ మెడల్ చేరింది. ఇక ఇదే ఈవెంట్లో సచిన్‌తో పాటు పోటీ పడిన భారత అథ్లెట్లు మొహ్మద్ యాసిర్, రోహిత్ కుమార్ వరుసగా 8, 9వ స్థానాల్లో నిలిచారు. కాగా ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు గెలిచింది.ప్యారిస్ పారాలింపిక్స్-2024లో ఇప్పటి వరకు పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు👉శరద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ63- రజతం👉అజీత్ సింగ్- మెన్స్ జావెలిన్ త్రో- రజతం👉మరియప్పన్ తంగవేలు- మెన్స్ హై జంప్ టీ63- కాంస్యం👉సుందర్ సింగ్ గుర్జార్- మెన్స జావెలిన్ త్రో ఎఫ్46- కాంస్యం👉దీప్తి జివాంజి- వుమెన్స్ 400 మీటర్ల టీ20 పరుగు- కాంస్యం👉సుమిత్ ఆంటిల్- మెన్స్జావెలిన్ త్రో ఎఫ్64- స్వర్ణం👉సుహాస్ యతిరాజ్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎస్64- రజతం👉తులసిమతి మురుగేశన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- రజతం👉మనీషా రామదాస్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- కాంస్యం👉నిత్యశ్రీ సుమతి శివన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6- కాంస్యం👉శీతల్ దేవి- రాకేశ్ కుమార్- మిక్స్డ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ- కాంస్యం👉యోగేశ్ కతూనియా- మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్56- రజతం👉నితేశ్ కుమార్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3- స్వర్ణం👉అవని లేఖరా- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- స్వర్ణం👉మోనా అగర్వాల్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స్ 100 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉మనీశ్ నర్వాల్- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1- రజతం👉రుబీనా ఫ్రాన్సిస్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స 200 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉నిషద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ47- రజతం👉సచిన్ ఖిలారి- పురుషుల షాట్‌పుట్ ఎఫ్46- రజతం -
కల్లెడ నుంచి ‘పారిస్’ దాకా... మా దీప్తి ’బంగారం’!
పారాలింపిక్స్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. సోమవారం ఏకంగా ఎనిమిది పతకాలతో భారత క్రీడాకారులు అదరగొట్టగా... మంగళవారం కాంస్యం రూపంలో ఒక పతకం లభించింది. మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల టి20 రేసులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజి కాంస్య పతకం సాధించింది. ప్రపంచ పారా చాంపియన్, పారా ఆసియా గేమ్స్ చాంపియన్ హోదాలో తొలిసారి పారాలింపిక్స్‌లో అడుగుపెట్టిన దీప్తి మూడో స్థానాన్ని సంపాదించింది. దీప్తి కాంస్యంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరుకుంది. మరిన్ని మెడల్ ఈవెంట్స్‌లో మన క్రీడాకారులు పోటీపడాల్సి ఉండటంతో ఈసారి భారత్ పతకాల సంఖ్య 20 దాటే అవకాశముంది. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో 16వ పతకం చేరింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల టి20 కేటగిరి ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాంజి కాంస్య పతకాన్ని సాధించింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో 20 ఏళ్ల దీప్తి 55.82 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. యూలియా షులియర్ (ఉక్రెయిన్; 55.16 సెకన్లు) స్వర్ణం సంపాదించగా... టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండెర్ (55.23 సెకన్ల) రజత పతకాన్ని గెల్చుకుంది. ఈ ఏడాది మేలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకం నెగ్గిన దీప్తి అదే ప్రదర్శనను ‘పారిస్’లో పునరావృతం చేయలేకపోయింది. ఒకవేళ ఇదే టైమింగ్‌ను దీప్తి ‘పారిస్’లో నమోదు చేసి ఉంటే ఆమెకు స్వర్ణ పతకం లభించేది. ఫైనల్ రేసు ఆరంభంలో చివరి వరకు రెండో స్థానంలో ఉన్న దీప్తి ఆఖరి పది మీటర్లలో వెనుకబడిపోయి మూడో స్థానంలో నిలిచింది. సోమవారం రాత్రి జరిగిన హీట్స్‌లో 54.96 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండెర్ చివరి పది మీటర్లలో వేగంగా పరుగెత్తి దీప్తిని దాటేసి రజత పతకాన్ని ఖరారు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ముగిసిన మహిళల బ్యాడ్మింటన్ ఎస్‌హెచ్6 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి నిత్యశ్రీ శివన్ కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో నిత్యశ్రీ 21–14, 21–6తో రీనా మార్లిన్ (ఇండోనేసియా)పై గెలిచింది. మహిళల షాట్‌పుట్ ఎఫ్34 కేటగిరీలో భారత అథ్లెట్ భాగ్యశ్రీ జాధవ్ ఇనుప గుండును 7.28 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అవనికి ఐదో స్థానం తన పారాలింపిక్స్ కెరీర్లో మూడో పతకం సాధించాలని ఆశించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్‌హెచ్1 ఈవెంట్ ఫైనల్లో 22 ఏళ్ల అవని ఐదో స్థానంలో నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని 420.6 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో అవని 1159 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ముగిసిన పూజ పోరు మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్ పూజ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో పూజ 4–6 (28–23, 25–24, 27–28, 24–27, 24–27)తో వు చున్యాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండు సెట్లు గెలిచిన పూజ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో సెట్లో స్కోరును సమం చేసినా పూజ సెమీఫైనల్‌కు చేరుకునేది. కానీ పూజ తడబడి మూడు సెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో పూజ 6–0 (27–24, 26–22, 272–6)తో యాగ్ముర్ (టరీ్క)పై నెగ్గింది.కల్లెడ నుంచి ‘పారిస్’ దాకా...పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న క్రీడాకారులు ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా లోని కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఇబ్బంది పెడుతుండగా... మరోవైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా గ్రామంలో హేళన చేసేవారు. ఇలాంటి తరుణంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ టోర్నీలో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన స్నేహితుడి ద్వారా రమేశ్‌కు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో ట్రెయినింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో దీప్తికి శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి దీప్తికి ఆర్థికంగా సహకారం అందించారు. కెరీర్ ఆరంభంలో దీప్తి అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆర్థిక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ స్వర్ణ ప్రదర్శనతో ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఈ ఏడాది మే నెలలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా చాంపియన్‌షిప్‌లో దీప్తి 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించి పారాలింపిక్స్‌లో మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ పతకం సాధించింది. -
హల్దీ ఫంక్షన్లో ముఖేశ్ అంబానీ చెల్లెలు సందడి (ఫొటోలు)
-
World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
కలకు సాధన తోడైతే చాలు మిగతావన్నీ వాటికవే వచ్చి చేరతాయి. ఈ మాట నా విషయంలో అక్షర సత్యం అంటోంది దీప్తి జివాంజీ. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన దీప్తి జివాంజీ దినసరి కూలీ కుమార్తె. జపాన్‌లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో సోమవారం 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల దీప్తిని పలకరిస్తే ఇలా సమాధానమిచ్చింది.⇢ క్రీడలే ప్రధానంగా!నా చిన్నప్పుడు స్కూల్లో పీఈటీ సర్ చెప్పిన విధంగాప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే జిల్లా స్థాయి ΄ోటీల్లో పాల్గొనేదాన్ని. నాకు చిన్నతనంలో తరచూ ఫిట్స్ వస్తుండేవి. రన్నింగ్ చేసేటప్పుడు బాడీ షేక్ అయ్యేది. దీంతో మా పీఈటీ సర్‡పారా అథ్లెట్స్‌తో మాట్లాడి, టెస్టులు చేయించారు. వారితో మాట్లాడి ‘ఇక పారా అథ్లెట్స్ గ్రూప్‌లో పాల్గొనమ’ని చె΄్పారు. మా అమ్మనాన్నలది మేనరికం కావడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చాయని తెలిసింది. అక్కణ్ణుంచి పారా అథ్లెటిక్ కాంపిటిషన్లో పాల్గొంటూ వచ్చాను. ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అందులో పాల్గొన్నాను. మెడల్ రావడంతో అక్కణ్ణుంచి నా జీవితంలో క్రీడలు ప్రధాన భాగంగా మారి΄ోయాయి. డిగ్రీలో చేరాను కానీ, అప్పటికి ఇంకా పరీక్షలు రాయడం పూర్తి చేయలేదు.⇢ బలహీనతలను అధిగమించేలా..స్పోర్ట్స్‌లో పాల్గొనడం వల్ల ఒక ఆరోగ్యపరమైన సమస్యను ఆ విధంగా అధిగమించాను అనుకుంటాను. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ ఆటలు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, కానీ, మా అమ్మ మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. నీవనుకున్నదానిపైనే దృష్టి పెట్టు. ఈ రోజు నిన్ను అన్నవాళ్లే రేపు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు’ అని చెప్పేది. ఆ విధంగా మానసిక ధైర్యం కూడా పెరిగింది. స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని నమ్ముతాను. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ చాంపియన్‌షిప్ ΄ోటీల్లో పాల్గొన్నాను. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ⇢ ధైర్యమే బలంమా ఇంటి పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉండేవి. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు స్కూల్‌కు వెళుతుంది. ఉండటానికి మాకు కనీసం అద్దె ఇల్లు కూడా ఉండేది కాదు. మొన్న మొన్నటి వరకు మా అమ్మమ్మ వాళ్లింటోనే ఉన్నాం. ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నాం. ఈ మధ్య ఆ ఇంటినే కొనుగోలు చేశాం. ఇక బలమైన ఆహారం అంటే స్పోర్ట్స్ అకాడమీలోకి వచ్చిన తర్వాతే అని చెప్పుకోవాలి. అమ్మ ఎప్పుడూ చెప్పే విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ‘కష్టపడితే ఏదీ వృథా ΄ోదు. నీకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే నిన్ను కాదని వెళ్లి΄ోయినవి కూడా నీ ముందుకు వస్తాయి’ అంటుంది. మొన్న జపాన్‌లో జరిగిన పారా ఒలింపిక్‌లో బంగారు పతకం సాధించిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా సంతోషించింది. నా బలం మా అమ్మే. ఆమె ఏమీ చదువుకోలేదు. కానీ, ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతుంది. ఆడపిల్లలమైనా మేం బాగా ఎదగాలని కోరుకుంటుంది.⇢ ప్రాక్టీస్ మీదనే దృష్టిటీవీ కూడా చూడను. ΄÷లిటికల్ లీడర్స్‌కు సంబంధించి వచ్చే సాంగ్స్ వింటుంటాను. ఆ పాటల్లో స్ఫూర్తిమంతమైన పదాలు ఉంటాయి. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉంటున్నాను. మరో మూడు నెలల్లో ఒలపింక్స్ లో పాల్గొనబోతున్నాను. దేశం తరపున పాల్గొనబోతున్నాను కాబట్టి నా దృష్టి అంతాప్రాక్టీస్ మీదనే ఉంది. సాధారణంగా ఉదయం రెండు గంటలు; సాయంత్రం రెండు గంటలుప్రాక్టీస్ ఉంటుంది. మధ్యలో మా రోజువారీ పనులు, విశ్రాంతికి సమయం కేటాయిస్తాం. నాతో పాటు ఉన్న స్నేహితులతో చిట్ చాట్ ఉంటుంది.⇢ బాధ్యతగా ఉండాలిచిన్నప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరగడం వల్ల సొంతంగా ఇష్టాలు, అభిరుచులు అనే ధ్యాస ఏమీ లేదు. కానీ, చిన్నప్పటి నుంచి ΄ోలీసు కావాలనేది నా కల. ఇప్పటికీ అదే ఆలోచన. నా కృషి నేను చేస్తున్నాను. నేను కోరుకున్నది వస్తుందనేది నా నమ్మకం. అమ్మనాన్నలు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ΄ోలీసుని అయి మా అమ్మ నాన్నలను, చెల్లెలిని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత అనుకుంటున్నాను’’అంటూ ముగించింది దీప్తి. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
World Para Championships: శభాష్ దీప్తి...
కోబే (జపాన్): ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్, తెలంగాణకు చెందిన దీప్తి జివాంజి పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచ రికార్డుతో ఆమె స్వర్ణం సొంతం చేసుకోవడం విశేషం. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల (టి20 కేటగిరీ) పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ ఈవెంట్లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (55.12 సెకన్లు)ను దీప్తి బద్దలు కొట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో 56.18 సెకన్లతో రేసును ముగించన 20 ఏళ్ల దీప్తి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ టోరీ్నలో ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పతకాలు ఉండగా, శనివారం వరకు పోటీలు జరుగుతాయి. పేదరికం నుంచి పైకెగసి... పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఉండగా, మరో వైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా ఊర్లో అందరూ హేళన చేసేవారు. ఇలాంటి సమయంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ మీట్లో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన మిత్రుడి ద్వారా ఆయనకు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో కోచింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో ఆమెకు శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి ఆరి్థకంగా సహకారం అందించారు. తన ప్రతిభ కారణంగా కెరీర్ ఆరంభంలో ఆమె అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్íÙప్లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆరి్థక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ విజయం తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఇదే ప్రపంచ రికార్డు జోరులో మున్ముందు పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగల సత్తా దీప్తిలో ఉంది. -
చిత్తంతో చిత్రప్రయాణం
ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగికి ఆఫీస్‌కు అవతలి ప్రపంచంపై దృష్టి మళ్లదు. పనే ప్రపంచం అవుతుంది. దీప్తి ఆస్థాన మాత్రం ఆఫీస్ క్యూబికల్‌కు ఆవలి ప్రపంచాన్ని చూడాలనుకుంది. కెమెరా తన నేస్తం అయింది. దేశమంతా తిరుగుతూ స్త్రీల జీవితంలోని ఎన్నో కోణాలను కెమెరా కంటితో ఆవిష్కరిస్తోంది... సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం నుంచి సెల్ఫ్ లెర్నింగ్ ఫోటోగ్రాఫర్‌గా ప్రయాణం దీప్తి అస్థాన జీవన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు క్యూబికల్ అవతల తనకు తెలియని ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంది. ఎక్కడికి ప్రయాణం చేసినా కెమెరా తనతోపాటు వచ్చేది. సంభాషించేది. కెమెరా ద్వారా ప్రయాణాలలో లోతైన అర్థాన్ని, సామాజిక ప్రయోజ నాన్ని కనుగొంది దీప్తి. మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి, తాను కలుసుకున్న వ్యక్తుల జీవిత కథలను ప్రపంచంతో పంచుకోవడానికి ఫొటోగ్రఫీ దీప్తికి బలమైన మాధ్యమంలా ఉపయోగపడింది. సాధారణంగా దూర ప్రయాణాలు అనగానే ప్రముఖ, ప్రసిద్ధ స్థలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ దీప్తి మాత్రం అనామక, అంతగా ఎవరూ పట్టించుకోనిప్రాంతాలకు వెళ్లేది. ఆప్రాంతాల గురించి ఎవరూ పనిగట్టుకొని ఫొటోలు తీసి ఉండరు. నాలుగు ముక్కలు రాసి ఉండరు. ఆ పని దీప్తి చేసింది. ఆ తరువాత...‘ఉమెన్ ఇండియా’ప్రాజెక్ట్‌తో తన ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఇది ఒకటి రెండు నెలల పరిమిత కాల ప్రయాణం కాదు. సంవత్సరాలుగా సాగిన ప్రయాణం. పట్టణాల్లోని మార్పుల సంగతి ఎలా ఉన్నా, పల్లెప్రజలు మాత్రం గతంలోనే ఉన్నారని గ్రహించింది దీప్తి. బాల్య వివాహాల నుంచి ఆడపిల్లలు చదువుకు దూరం కావడం వరకు కెమెరా కంటితో ఎన్నో సమస్యలను లోకం దృష్టికి తీసుకువచ్చి మహిళలు తమ గళం విప్పడానికి ఒక వేదికను నిర్మించింది. సోషల్ మీడియా దృష్టిలో పడని మహిళల సమస్యలను అదే మీడియా ద్వారా నలుగురి దృష్టికి తీసుకు వచ్చింది. సమస్యల గురించి మాత్రమే కాకుండా వివిధప్రాంతాలలోని సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టింది. ‘నా ప్రాజెక్ట్‌లో అన్ని కథలు మనుగడ కోసం చేసే పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాదు. జీవితాన్ని, సంస్కృతిని సెలబ్రెట్ చేసుకునేవి కూడా’ అంటుంది దీప్తి. స్ఫూర్తిదాయకమైన కథలు మార్పు తీసుకురాగలవా?’ అని అడిగితే ‘అందుకు నేనే ఉదాహరణ. ఆ మార్పు ముందు నాలోనే వచ్చింది’ అంటుంది దీప్తి. తాను షూట్ చేయడానికి ఎంచుకునే ప్రదేశాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. గుజరాత్‌లోని మిధాపూర్లో పన్నెండేళ్ల భారతితో మాట్లాడింది దీప్తి. ఆ అమ్మాయి ఎప్పుడూ బడి ముఖం చూడలేదు. కొంతకాలం ఇంటిపట్టునే ఉన్న భారతి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు కూలిపనికి వెళుతుంది. ఈ చిన్నారి పెద్ద పెద్ద తట్టలను మోస్తున్న దృశ్యం చూసి దీప్తికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘భారతి అందమైన, చురుకైన అమ్మాయి. ఆమె భవిష్యత్ కూలిపనులకు పరిమితం కావాల్పిందేనా? అనే బాధ కలిగింది. కెమెరా గురించి భారతి ఆసక్తిగా తెలుసుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఇలాంటి పిల్లలకు కొత్త దారి చూపితే పురోగమించగలరు’ అంటుంది దీప్తి. భారతి లాంటి ఎంతోమంది పిల్లల కథలను లోకం దృష్టికి తీసుకువచ్చింది. పట్టణ ప్రాం తాలలో పెరిగిన దీప్తి దేశ విదేశాల్లో ఎన్నో మెట్రోపాలిటన్ నగరాలలో పనిచేసింది. ‘సమాజ నిర్మాణంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి సమాన అవకాశాలు లేవు’ అనే ఎరుక ఆమెను ఎప్పటికప్పుడు కొత్తప్రాంతాలకు తీసుకు వెళుతుంది. కొత్త జీవితాలను ఆవిష్కరించేలా చేస్తున్న దీప్తి ప్రస్తుతం గోవాలో ఉంటోంది. లక్ష్యంతో కూడిన ప్రయాణం భావాలను వ్యక్తీకరించడానికి పుస్తకం రాయడం, ఉపన్యాసం చేయడం లాగే ఫొటోగ్రఫీ కూడా ఒక సాధనం. నేను తీసిన చిత్రాలు నా భావాలకు అద్దం పట్టేలా ఉంటాయి. ఒక మహిళగా ఇతర మహిళలు, పిల్లలతో మాట్లాడడం నాకు సులువు అయింది. సోలోగా ట్రావెల్ చేయడంలో లైఫ్‌స్కిల్స్ క్రమక్రమంగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ప్రయాణానికి ఒక లక్ష్యం తోడైతే అది అద్భుతంగా ఉంటుంది. – దీప్తి అస్థాన వారి జీవితంలో భాగం అవుతాను కెమెరా ఉన్నా సరే, ఎదుటి వ్యక్తి జీవితపు లోతు అప్పటికప్పుడు ఆవిష్కారం కాదు. వారితో సరిగ్గా కనెక్ట్ కాగలగాలి. మనం వారిని అర్థం చేసుకున్నట్లే వారూ మనల్ని అర్థం చేసుకోవాలి. తమ గురించి తెలుసుకోవడంలో, కెమెరా ఉపయోగించడంలో ఎలాంటి వాణిజ్య ప్రయోజనం లేదనే భావన వారికి కలగాలి. ఇదేమంత సులభం కాదు. అలా అని జటిలం కాదు. మన ఓపిక, ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఫోటోలు తీసుకున్నప్పుడు వారి జీవితంలో భాగం అవుతాను. వారు నాలో భాగం అవుతారు. కలిసి భోజనం చేస్తాం. సరదా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటాం. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ మూలకు వెళ్లినా తమలో భాగంగా చూసుకున్నారు. ఆత్మీయత పంచారు. ఇది నా అదృష్టం. – దీప్తి అస్థాన -
దీప్తి ‘పసిడి’ పరుగు
హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో రెండో రోజూ భారత క్రీడాకారులు తమ పతకాల వేట కొనసాగించారు. తొలి రోజు సోమవారం 17 పతకాలు నెగ్గిన భారత ప్లేయర్లు... రెండో రోజు మంగళవారం ఏకంగా 18 పతకాలతో అదరగొట్టారు. ఇందులో నాలుగు స్వర్ణ పతకాలు ఉన్నాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి జీవంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 కేటగిరీలో పసిడి పతకాన్ని సాధించింది. వరంగల్ జిల్లాలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి అందరికంటే వేగంగా 400 మీటర్ల దూరాన్ని 56.69 సెకన్లలో పూర్తి చేసి ఆసియా పారా గేమ్స్‌తోపాటు ఆసియా రికార్డును సృష్టించింది. మహిళల కనోయింగ్ ఎల్2 ఈవెంట్లో ప్రాచీ యాదవ్ 500 మీటర్ల దూరాన్ని 54.962 సెకన్లలో అధిగమించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్54/55/56) కేటగిరీలో నీరజ్ యాదవ్ డిస్క్‌ను 38.56 మీటర్ల దూరాన్ని విసిరి విజేతగా నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల 5000 మీటర్ల (టి13 కేటగిరీ) విభాగంలో శరత్ శంకరప్ప 20ని:18.90 సెకన్లలో రేసును ముగించి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. రెండో రోజుల పోటీలు ముగిశాక భారత్ 10 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి మొత్తం 35 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
ద్రోహి
సందీప్ కుమార్, దీప్తీ వర్మ జంటగా విజయ్ పెందుర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘ద్రోహి’. ‘ద క్రిమినల్’ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెలో మీడియా, సఫైరస్ మీడియా, వెడ్నెస్ డే ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, డి. శ్రీకాంత రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని మల్టీప్లెక్స్‌లో రూ. 112లకే సినిమా టిక్కెట్ ఇస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా టీజర్‌ని నటుడు త్రిగుణ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘సందీప్, విజయ్‌లకు కళ అంటే ప్రాణం. దర్శకుడి పని తీరు టీజర్లో కనిపించింది. ఈ చిత్రం విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘అద్భుతమైన డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. క్రైమ్, థ్రిల్లర్‌తో పాటు అన్ని అంశాలున్నాయి’’ అన్నారు సందీప్ కుమార్. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉన్నాయి.. ఎవర్నీ నిరాశపరచదు’’ అన్నారు విజయ్ పెందుర్తి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు నటి డెబా డాలీ. ఈ చిత్రానికి కెమెరా: అశోక దార్బీరు, సంగీతం: అనంత నారాయణ్. -
ప్రియుడితో కలసి అక్కను చంపి..
కోరుట్ల/జగిత్యాల క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంక దీప్తి (24) హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లెలు చందన ప్రేమ పెళ్లిని దీప్తి వ్యతిరేకించడంతోనే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీప్తి హత్య కేసులో సూత్రధా రి చందన (22), ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ (25), అతడి తల్లి సయ్యద్ ఆలియా (47), చెల్లెలు ఫాతిమా (22), ఉమర్ మిత్రుడు హఫీజ్ (25)ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇద్దరూ బీటెక్ చదివారు.. కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు దీప్తి, చందన, కుమారుడు సాయి ఉన్నారు. పాతికేళ్ల క్రితం శ్రీనివాస్‌రెడ్డి ఉపా«ధి కోసం నెల్లూరు నుంచి కోరుట్లకు వలస వచ్చారు. ఇటుక బట్టీ వ్యాపారం చేస్తున్నారు. దీప్తిని బీటెక్ చదివించగా ఆమె పుణేకు చెందిన ఓ కంపెనీలో వర్క్‌ఫ్రం హోమ్ పద్ధతిన పనిచేస్తోంది. చందన 2019లో హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చేరి ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. తన సీనియర్, హైదరాబాద్‌కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ ఒక ఏడాది డిటెయిన్ కావడంతో చందనకు క్లాస్మేట్ అయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చందన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరు కూతుళ్ల వివాహం చేసేందుకు తండ్రి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న మధ్యాహ్నం దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం... నగదు, బంగారంతో చందన పరారు కావడం కలకలం రేపింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లికి అభ్యంతరం చెప్పినందుకే.. చందన ప్రేమ వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు మతాంతర వివాహానికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని చందన తన ప్రియుడు ఉమర్ షేక్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ తనకు జాబ్ లేదని, డబ్బు లేదని, బతుకడం ఎలా అని ఉమర్ షేక్ బదులిచ్చాడు. దీంతో తన ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తెస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన చందన.. తన అమ్మానాన్న ఇంట్లో లేనిసమయంలో కోరుట్లకు రావాలని ప్రియుడికి సూచించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లగా చందన తన ప్లాన్ అమలు చేసింది. సూత్రధారి చందన.. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఉమర్ షేక్ కారులో కోరుట్లకు చేరుకున్నాడు. సాయంత్రం మద్యం తాగుదామని చందన తన అక్కతో చెప్పింది. ప్రియుడితో వొడ్కా, బ్రీజర్ తెప్పించింది. మద్యం ఇచ్చి వెళ్లిన ఉమర్ షేక్ స్థానికంగానే ఉండిపోయాడు. రాత్రి చందన తన అక్క దీప్తికి వొడ్కా తాగించి, తాను బ్రీజర్ తాగింది. మత్తులో అక్క నిద్రపోయిందని నిర్ధారించుకున్న చందన.. రాత్రి 2 గంటల సమయంలో షేక్ ఉమర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఉమర్ షేక్ వచ్చాక నగదు, బంగారం బ్యాగుల్లో సర్దుతున్న క్రమంలో దీప్తికి మెలకువ వచ్చి.. ‘ఏం చేస్తున్నారని’ చందనను నిలదీసింది. దీంతో చందన, ఆమె ప్రియుడు కలిసి దీప్తిని చున్నీతో కట్టేసి నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేసి చంపి సోఫాలో పడేశారు. అనుమానం రాకుండా ఆ తర్వాత తొలగించారు. దీప్తి అతిగా మద్యం తాగి నిద్రలో చనిపోయినట్లు నమ్మించడం కోసం సినీఫక్కీలో సీన్ క్రియేట్ చేశారు. తర్వాత ఇద్దరూ కారులో హైదరాబాద్ పరారయ్యారు. వాయిస్ మెసేజ్‌తో దారిమళ్లింపు.. అక్కను చంపాక పరారైన చందన.. మర్నాడు హైదరాబా ద్‌లోని తన ప్రియుడు ఉమర్ షేక్ కలసి అతని తల్లి అలి యా, చెల్లి ఫాతిమా వద్దకు వెళ్లింది. వారంతా కలసి నగదు, డబ్బుతో నాగ్‌పూర్ వెళ్లాలనుకున్నారు. ఇంతలో చందన బుధవారం తన తమ్ముడు సాయికి ఫోన్లో వాయిస్ మెసేజ్ పంపించింది. అక్కను తాను చంపలేదని.. బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రివేళ ఇంటికి రావాలని అక్క చెప్పిందని, తాను వద్దన్నా నని హత్య కేసును దారిమళ్లించే ప్రయత్నం చేసింది. నాగ్‌పూర్ వెళ్తుండగా.. చందన, ఉమర్‌షేక్ సెల్ఫోన్ల డేటా ఆధారంగా వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో అక్కడకు వెళ్లారు. అయితే కారులో బురఖా వేసుకొని తప్పించుకొని తిరుగుతున్న చందనతోపాటు ప్రియుడు ఉమర్ షేక్, అతడి తల్లి అలియా, చెల్లి ఫాతిమా, బంధువు హఫీజ్‌ను నాగ్‌పూర్ వైపు పరారవుతుండగా శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్–బాల్కొండ మార్గంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.20 లక్షల నగదు, సుమారు రూ.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు కిరణ్, చిరంజీవిని ఎస్పీ అభినందించారు. -
ప్రియుడి కోసం.. అక్కకు వోడ్కా తాగించి.. చేతులు కట్టేసి..
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో సంచలనంగా మారిన జగిత్యాల దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. దీప్తి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియుడి సహకారంతో చెల్లినే అక్కను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే క్రమంలో సొంత అని కూడా చూడకుండా చందన.. దారుణానికి ఒడిగట్టింది. హత్య ప్లాన్‌లో భాగంగా వోడ్కా, బ్రీజర్ ఆమె తగించినట్టు పోలీసులు తెలిపారు. దీప్తి హత్య కేసు వివరాలను జగిత్యాల ఎస్పీ భాస్కర్ శనివారం మీడియాకు వెల్లడించారు. "కోరుట్లకు చెందిన బంక చందన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఉమర్ షేక్ సుల్తాన్(25) అనే యువకుడు చందనకు వన్ ఇయర్ సీనియర్. బీటెక్‌లో చందన ఒక ఏడాది డిటెయిన్డ్ అయింది. ఇక ఉమర్ రెండేళ్లు డిటెయిన్డ్ అయ్యాడు. దీంతో ఇద్దరు క్లాస్మేట్స్ అయ్యారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం ఏర్పడింది. ప్రేమలో పడ్డారు". పెళ్లి ప్రపోజల్.. ప్రేమ అనంతరం.. తనను పెళ్లి చేసుకోవాలని ఉమర్‌ను చందన కోరింది. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన ఉమర్‌ను చందన కోరుట్లకు పిలిపించింది. పెళ్లి చేసుకోవాలని అతన్ని కోరింది. అయితే, ఇద్దరు ఇంకా సెటిల్ కాకపోవడంతో తర్వాత పెళ్లికి ప్లాన్ చేద్దామని ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ఉమర్ తల్లి సయ్యద్ అలియా, చెల్లి ఫాతిమా, స్నేహితుడు హాఫీజ్తో చందన మాట్లాడినట్టు తెలిపారు. అక్కకు వోడ్కా తాగించి.. ఆగస్టు 28న కాల్ చేసి "ఓ ఫంక్షన్ నిమిత్తం మా అమ్మ, నాన్న హైదరాబాద్ వెళ్తున్నారు. ఇంట్లో నేను, మా అక్కనే ఉంటామని చందన.. ఉమర్‌కు చెప్పింది. ఇంట్లో మనీ, బంగారం ఉంది. అది తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటే.. సెటిలవుతామని" చెప్పింది. ఆగస్టు 28న ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరి 11 గంటలకు కోరుట్లకు ఉమర్ చేరుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా వోడ్కా, బ్రీజర్ తెప్పించింది చందన. రాత్రి సమయంలో దీప్తి, చందన కలిసి వోడ్కా, బ్రీజర్ తాగారు. రాత్రి 2 గంటల సమయంలో ఉమర్‌కు మేసేజ్ చేయడంతో ఇంటి వెనుకాల కారు ఆపి ఇంట్లోకి వచ్చాడు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీస్తున్న సమయంలో దీప్తికి మెలకువ వచ్చి లేచింది. గట్టిగా అరిచింది. చందన తన వద్ద స్కార్ఫ్‌తో దీప్తి మూతికి, ముక్కుకు చుట్టింది. ఆమె సోఫా మీద పడిపోయింది. ఉమర్, చందన కలిసి ఆమె చేతులు కట్టేశారు. గట్టిగా అరవకుండా మూతికి ప్లాస్టర్ వేశారు. పది నిమిషాల తర్వాత దీప్తిలో చలనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. డబ్బు, బంగారంతో పరారీ.. అక్క అచేతన స్థితిలో ఉండిపోవడంతో.. ఇంట్లో ఉన్న ఒక లక్షా 20 వేల నగదు, 70 తులాల బంగారం బ్యాగులో వేసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దీప్తికి ప్లాస్టర్ తీసేసి వెళ్లారు. వోడ్కా తాగి చనిపోయినట్లు అందరు నమ్మేలా సీన్ క్రియేట్ చేశారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉమర్ తల్లి, చెల్లి, బంధువుకు జరిగిన విషయం చెప్పి.. నగదు, బంగారంతో.. ముంబై, నాగ్‌పూర్ వెళ్లాలని చందన, ఉమర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకుని, సెటిల్ అవ్వాలని అనుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 చందన, ఏ2 ఉమర్, ఏ3 సయ్యద్ అలియా, ఏ4 ఫాతిమా, ఏ5 హాఫీజ్‌గా చేర్చామని తెలిపారు. ఈ ఐదుగురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు. ఇది కూడా చదవండి: సహజీవనం పేరుతో ఒక్కో సీజన్లో ఒక్కో భాగస్వామి.. ఆరోగ్యకరం కాదు -
కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్?
సాక్షి, జగిత్యాల జిల్లా: సంచలనం సృష్టించిన కోరుట్ల దీప్తి మృతి కేసులో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కీలకం కానుంది. ఈ రోజు వైద్యులు ఇచ్చే పోస్ట్‌మార్టం నివేదికలో మరిన్ని విషయాలు బయటకురానున్నాయి. మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన దీప్తి ఒంటిపై స్వల్పగాయాలు ఉన్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు తెలిసింది. దీప్తి చెల్లె చందన, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఆ రాత్రి ఇంట్లో మద్యం పార్టీ అనంతరం వెళ్లిపోవడంతో పలు అనుమానాలు నెలకొన్నాయి. చందన తాను అక్కను చంపలేదని తమ్ముడు సాయికి వాయిస్ మేసేజ్ పంపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చందన ఆడియో కాల్స్‌పై పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నారు. అలాగే నిన్న అంతా హైలెట్ అయిన కోరుట్ల బస్టాండ్‌లో సీసీ కెమెరా ఫుటేజ్ చందన, ఆమె బాయ్ ఫ్రెండ్‌ది కాదని పోలీసులు తేల్చారు. చందన వాయిస్ మెసేజ్ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. కోరుట్ల బస్టాండ్‌లో మంగళవారం ఉదయం కనిపించిన సీసీ ఫుటేజీ చిత్రాలు.. చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌వి కావనే సమాచారంతో విచారణ గందరగోళంగా మారింది. అయితే, చందన బాయ్ ఫ్రెండ్ కారులో వచ్చి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు. ఆమె వాయిస్ మేసేజ్ వచ్చిన సెల్‌ఫోన్ ఆధారంగా రెండు బృందాలు హైదరాబాద్‌కు చేరుకుని గాలింపు చేపట్టాయి. చదవండి: నా తప్పేం లేదు.. నాకు అక్కను చంపే ఉద్దేశమే లేదు.. బంక శ్రీనివాస్‌రెడ్డి(దీప్తి తండ్రి) ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, సుమారు 50 తులాల వరకు బంగారు ఆభరణాలు మాయమైనట్లు సమాచారం. ఇంట్లోనుంచి వెళ్లిపోయిన చందన.. డబ్బులు తాను తీసుకున్నట్లు వాయిస్ మేసేజ్‌లో చెప్పినా.. బంగారం విషయం ఎత్తలేదు. బంగారం సైతం చందన తీసుకెళ్లి ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చందన తన క్లాస్మేట్ ఒకరితో కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటోందని, అతడితో కలిసి డబ్బులు, నగలు తీసుకు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
సెల్ఫ్ ఎంపవర్మెంట్
కోల్‌కతాకు చెందిన దీప్తి ఘోష్ ఇంజనీరింగ్ చదువుకుంది. తండ్రి చనిపోవడంతో కుటుంబ బరువు బాధ్యతలు తనపై పడ్డాయి. ఉద్యోగాల వేటలో పడింది. అయితే వచ్చిన ఒకటీ రెండు ఉద్యోగాలు ‘ఔట్ ఆఫ్ కోల్‌కతా’ వచ్చాయి. తల్లి, చెల్లిని విడిచి దూరంగా ఉండలేని పరిస్థితి. సిటీలో ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో ఏమో అనుకునే పరిస్థితుల్లో ఖాళీగా ఉండడం ఎందుకని క్యాబ్ డ్రైవర్‌గా మారింది. మంచి ఆదాయాన్ని అర్జిస్తూ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. దీప్తి క్యాబ్‌లో ప్రయాణించిన దిల్లీకి చెందిన పరమ్ కల్యాణ్‌సింగ్ ఆమె స్టోరీని పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఇదే’ ‘చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదని బాధపడుతూ కూర్చోవడం కంటే ఇది ఎంత గొప్ప పని!’ ‘దీప్తి తన వృత్తిని గౌరవిస్తుంది. శ్రమజీవుల లక్షణం ఇది. స్త్రీ సాధికారతకు తిరుగులేని ఉదాహరణ దీప్తి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
గ్రామస్తులు వద్దన్నా గుడి వద్ద షూటింగ్ చేసాం
-
ఆ దృశ్యం యుద్ధం పట్ల నాకు శాశ్వత అభిప్రాయం ఏర్పరిచింది: దీప్తి నావల్
‘నీ ఇవాళ్టి స్థానానికి నిన్నటి నీ బాల్యమే కారణం’. ‘అప్పుడు ఏవి నీ మీద ప్రభావాలు చూపుతాయో అవే నిన్ను తీర్చిదిద్దుతాయి’. ‘బాల్యాన్ని తరచి చూసుకుంటే ఎక్కడ బయలుదేరామో తెలుస్తుంది. ఎక్కడకు వెళుతున్నామో కూడా’... అంటుంది దీప్తి నావల్. అమృత్‌సర్‌లో గడిచిన తన బాల్యం, యవ్వనపు తొలి రోజుల జ్ఞాపకాలను ఆమె ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది. ‘నావల్’ అని ఇంటి పేరు రావడంతో మొదలు ఒక రాత్రి ఇంటి నుంచి పారిపోవడం వరకు ఆమె అనేక సంగతులను వెల్లడి చేసింది. దీప్తి నావల్‌కు దేశమంతా అభిమానులు ఉన్నారు. ఆమె పోస్టర్‌ను గోడలకు అంటించుకున్న ఆరాధకులు 1980లలో 90లలో చాలామంది ఉన్నారు. ‘జునూన్’, ‘కథ’, ‘చష్మేబద్దూర్’, ‘సాథ్సాథ్’, ‘ఏక్ బార్ ఫిర్’ వంటి సినిమాలతో ఆమె ఒక కాలపు సినిమాలో గొప్ప ప్రభావం చూపగలిగింది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్‌తో పాటు దీప్తి నావల్ కూడా పార్లల్ సినిమాకు ఊతం ఇచ్చింది. అయితే మిగిలిన ఇద్దరితో పోల్చితే ఆమె చేయవలసినన్ని సినిమాలు చేయలేదు. అయితే ఇప్పటికీ ఆమె సినిమాలలో నటిస్తూ రచన, చిత్రకళలో కృషి చేస్తోంది. తాజాగా తన బాల్య జ్ఞాపకాల సంచయం ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ పేరుతో పుస్తకంగా వెలువరించింది. 70 ఏళ్ల వయసులో... దీప్తి నావల్ 1952లో పుట్టింది. అంటే నేటికి 70 ఏళ్లు. కాని ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఆమె నిమగ్నమై ఉంటుంది. ఆమె పెయింటింగ్స్ వేస్తుంది. ఫొటోగ్రఫీ చేస్తుంది. కథలు, కవిత్వం రాస్తుంది. గతంలో ‘లమ్హా లమ్హా’, ‘బ్లాక్ విండ్’ అనే కవితల పుస్తకాలు వెలువడ్డాయి. ఆమె రాసిన కథల సంపుటి పేరు ‘ది మ్యాడ్ డిబెటిన్’. ఇప్పుడు వచ్చింది ఆమె నాలుగో పుస్తకం. ఈ పుస్తకం అమృత్‌సర్‌లో గడిచిన నా బాల్యం గురించి మా అమ్మమ్మ గురించి అమ్మ గురించి ముఖ్యంగా అమృత్‌సర్‌తో ముడిపడ్డ నా జ్ఞాపకాల గురించి చెబుతుంది అంటుంది దీప్తి. ఇంటి పేరు మార్పు దీప్తి నావల్ కుటుంబం రెండో ప్రపంచ యుద్ధకాలంలో బర్మా నుంచి అస్సాంకు వలస వచ్చింది. ఆ తర్వాత అమృత్సర్ చేరింది. ఆ కాలంలో పేరు చివర ‘శర్మ’ చాలామందికి ఉండేది. అందుకని ఆమె తండ్రి ఉదయ్ శర్మ తన పేరు చివర ‘నావల్’ను ఎంచుకున్నాడు. ‘నావల్’ అంటే ‘నవీనమైనది’ అని అర్థం. అలా దీప్తి పేరు దీప్తి నావల్ అయ్యింది. ‘మా నాన్న చాలా ప్రాక్టికల్ మనిషి. మా అమ్మ కళాభిరుచి ఉన్న మహిళ. ఆమె బొమ్మలు వేసేది. కథలు చెప్పేది. ఆ కళ నాకు వచ్చింది. అమృత్‌సర్‌లోని హాల్ బజార్లో ఖైరుద్దీన్ మసీదు పక్కన ఉండే మా ఇంట్లో మేడ మీద ఎక్కి వీధుల్లో చూసేవాళ్లం. దేశ విభజన గురించి, వలస కాలంలో జరిగిన విషాదాల గురించి నేను పెద్దల మాటల్లో వినేదాన్ని. జలియన్ వాలా బాగ్ మా అందరికీ ఒక తాజా గాయంగా అనిపించేది. నాకు 13 ఏళ్లు వచ్చినప్పుడు (1965) ఇండో పాక్ యుద్ధం వచ్చింది. విమానాలు గాల్లోకి ఎగురుతూ భయపెట్టేవి. చిన్నదాన్ని కావడంతో అదంతా ఉత్సాహంగా అనిపించేది. కాని మా నాన్న ఒకరోజు బార్డర్‌కు తీసుకెళ్లి చూపించాడు. ‘యుద్ధం అసలు రూపం పిల్లలకు తెలియాలి’ అని నాకూ అక్కకూ చూపించాడు. అక్కడకు వెళితే గాలి అంతా మందుగుండు వాసన. శవాలు పడి ఉన్నాయి. కాకులు కూడా చడీ చప్పుడు చేయకుండా ఉండటం చూశాను. ఆ దృశ్యం యుద్ధం పట్ల నాకు శాశ్వత అభిప్రాయం ఏర్పరిచింది’ అని రాసింది దీప్తి నావల్. 20 ఏళ్ల కృషి దీప్తి నావల్ పర్ఫెక్షనిస్ట్. తన బాల్యం, యవ్వనపు రోజులను అథెంటిక్‌గా చెప్పేందుకు ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్’ కోసం దాదాపు 20 ఏళ్ల సమయం తీసుకుంది. కొన్ని తనకు తెలుసు. కొన్ని బంధువుల నుంచి, తెలిసిన వారి నుంచి రాబట్టాల్సి వచ్చింది. ‘అమృత్సర్ స్వర్ణదేవాలయ ఘటన, జలియన్ వాలా బాగ్ స్థలం నాపై ఏర్పరిచిన ప్రభావం గురించి రాయడానికి సమయం పట్టింది. స్వర్ణదేవాలయం ఆధునీకరించడం నాకు అభ్యంతరం లేదు. కాని జలియన్ వాలా బాగ్‌ను బాగా తీర్చిదిద్ది అదొక సెల్ఫీ పాయింట్లా చేశారు. అది సెలబ్రేట్ చేసుకునే స్థలం కాదు. జాతి త్యాగాలను తలచుకుని బాధ పడాల్సిన సమయం. దానిని అప్పటికాలంలో ఎలా ఉండేదో అలాగే ఉంచేస్తే బాగుండేది. జపాన్‌లో హిరోషిమాను అలాగే ఉంచేశారు’ అందామె. తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లాక తాను అమెరికాలో చదవడం, అక్కడ రేడియో అనౌన్సర్‌గా పని చేస్తూ రాజ్ కపూర్‌ను ఇంటర్వ్యూ చేయడం... ఇలాంటి జ్ఞాపకాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘నేను కథక్ డాన్సర్‌ని. కాని నాకు డాన్సులు చేసే కమర్షియల్ వేషాలే రాలేదు’ అని నవ్వుతుంది ఆమె. సుదీర్ఘ కాలం కలిసి జీవించిన తల్లిదండ్రులు డెబ్బయిల వయసులో విడిపోవడం ఆమెకు ఒక షాక్. ఇలాంటి విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీప్తి నావల్ దర్శకుడు ప్రకాష్ ఝాను వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఒక కుమార్తెను దత్తత చేసుకుంది. ఆమెకు ముంబైలో కాకుండా ‘కులూ’లో ఒక ఇల్లు ఉంది. రాబోయే రోజుల్లో తన సినిమా కెరీర్‌కు సంబంధించిన జ్ఞాపకాలను కూడా పుస్తకంగా తేవాలనుకుంటోంది. ఆమె అభిమానులకు అదీ ఒక మంచి కబురే. -
మట్టి కాని గట్టి బొమ్మలు
బంక మట్టితో చేసిన బొమ్మలు ఎక్కువసేపు నిలబడవు. ఎండిపోగానే పగుళ్లు వచ్చేస్తాయి. అందుకే పిల్లలు రసాయనాలతో తయారైన మట్టితో బొమ్మలు చేస్తూ ఆడుకుంటారు. ఆ మట్టిలో ప్రమాదకరమైన కిరసనాయిల్, బొరాక్స్ వంటివి ఉంటాయి. అవి పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. తన యేడాది వయసున్న కొడుకు మట్టితో ఆడుతుంటే దీప్తికి భయంగా ఉండేది. పిల్లవాడి ఆరోగ్యం కోసం రసాయనాలు లేని బొమ్మలు తయారు చేయాలనుకుంది దీప్తి. ఆ ఆలోచన నుంచి వచ్చినదే పర్యావరణ హితమైన మట్టి. పిల్లల కోసం బెంగళూరుకు చెందిన దీప్తి భండారీ హాని కలిగించని కృత్రిమ మట్టిని తయారు చేయడం ద్వారా ఆ మట్టితో ఆడుకునే పిల్లలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు.. తాను ఆర్థికంగా ఎదుగుతున్నారు దీప్తి. బయో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన దీప్తి.. టీచింగ్ మీద ఆసక్తి పెంచుకున్నారు దీప్తి. బంధువుల పిల్లలకు పాఠాలు చెబుతూ టీచింగ్ లో అనుభవం సంపాదించారు. ఆ అనుభవంతో పిల్లల కోసం ‘మిల్క్ టీత్ యాక్టివిటీ సెంటర్’ను బెంగళూరులోని చామరాజ్‌పేట్‌లో ప్రారంభించారు. పిల్లలకు పాఠాలు చెబుతూ, వృత్తి మీద ప్రేమ పెంచుకున్నారు. ఆ సమయంలోనే ఒక తల్లి పిల్లల్ని ఎలా పెంచాలనే విషయం మీద అవగాహన ఏర్పడింది దీప్తికి. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ, వాళ్లకి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో తెలుసుకున్నారు దీప్తి. ‘‘పసి వయసులో నేర్చుకున్న విద్య జీవితాంతం గుర్తుండిపోతుంది. అందులో నైపుణ్యం కూడా వస్తుంది’’ అంటారు దీప్తి. ఆటల్లోనే అన్నీ... పిల్లలకు బొమ్మలతో ఆటలు నేర్పుతూ, రంగులు, ఆకారాలు, పరిమాణాల గురించి కూడా నేర్పించటం దీప్తి ప్రత్యేకత. ‘‘మా అబ్బాయి చేతి రాత బాగుండేది కాదు. కాని మట్టితో బొమ్మలు చేయడం ద్వారా అందమైన రాత అలవాటయ్యింది. అంతకుముందు పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేకపోయేవాడు. ఇలా మట్టితో ఆటలు మొదలుపెట్టాక, చేతి వేళ్లు, కండరాలు బలంగా తయారు కావడంతో పెన్సిల్ చక్కగా పట్టుకోగలిగాడు. చక్కగా రాయగలుగు తున్నాడు. టీచర్‌గా నాకున్న అనుభవం మా అబ్బాయిని పెంచుకోవటానికి ఉపయోగపడింది’’ అంటారు దీప్తి. అందరూ ఆసక్తి చూపించారు ‘‘నేను పిల్లల కోసం టాడ్లర్ క్లాసులు ప్రారంభించాను. ఆ క్లాసులో పిల్లలంతా మట్టితో బొమ్మలు తయారు చేస్తారు. పిల్లలు చేసిన బొమ్మలు చూసిన తల్లిదండ్రులు ఆ మట్టి గురించి సమాచారం అడిగారు’’ అంటూ ఆనందంగా చెబుతారు దీప్తి. సాధారణంగా మార్కెట్ లో దొరికే మట్టితో చేసిన బొమ్మలు చాలా త్వర గా ఎండిపోతాయి. ఆ మట్టి ని మళ్లీ ఇంక ఉపయోగించలేం. కాని దీప్తి.. ఉప్పు, పిండి, నూనె, ఫుడ్ గ్రేడ్ కలర్స్, నీళ్లు కలిపి తయారు చేసిన మట్టి ఆరునెలల వరకు గట్టి పడకుండా ఉంటుంది. ‘‘నేను చేసిన మట్టి చూసి తల్లిదండ్రులంతా చాలా సంతోషించారు. వాళ్లకి కూడా ఈ మట్టి కావాలి అని అడిగి కొని తీసుకు వెళ్తున్నారు’’అంటున్న దీప్తి 20 వేల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు నెలకు 35 వేలు సంపాదిస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యంతోపాటు, తనకు ఆదాయం వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటారు దీప్తి భండారీ. -
సింగర్‌ను వివాహమాడిన నటుడు
చండీగఢ్: ‘‘మంచి తరుణం మించిన దొరకదు’’ అన్న చందంగా సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, సాండల్‌వుడ్ అన్న తేడా లేకుండా ఇప్పటికే చాలా మంది హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి.. లాక్డౌన్ ఇచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కమెడియన్, రియాలిటీ షో ఖత్రోంకీ ఖిలాడీ 10 ఫేం బాల్‌రాజ్ సియల్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. బాలీవుడ్ సింగర్ దీప్తి తులిని అతడు వివాహమాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ జలంధర్‌లో ఆగష్టు 7న తనను మెచ్చిన నిచ్చెలి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇన్నాళ్లు పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచిన బాల్‌రాజ్ భార్య దీప్తితో కలిసి ఉన్న ఇన్‌స్టాలో షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: పెళ్లి పీటలెక్కనున్న లేడీ కమెడియన్) ఇక తమ ప్రేమ- పెళ్లికి సంబంధించిన విషయాల గురించి బాల్‌రాజ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘జూలై 2019.. చండీఘడ్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో తొలిసారి దీప్తిని కలిశాను. నేను హోస్ట్ చేస్తున్న షోలో ఆమె తన మ్యూజిక్ బ్యాండ్‌తో కలిసి పాటలు పాడుతోంది. తొలి చూపులోనే తను నాకు నచ్చేసింది. కానీ ఎందుకో తనకు నేను నచ్చనేమో అనిపించింది. తర్వాత ఖత్రోంకీ ఖిలాడీ షో చేసే సమయంలో తనకు మెసేజ్ చేశాను. నాకు కావాల్సిన రిప్లై లభించలేదు. అయినా నేను వదల్లేదు. టర్కీ, గ్రీస్ టూర్‌కి వెళ్లినపుడు తనతో సంభాషణ జరిపే అవకాశం వచ్చింది. (చదవండి: హీరోయిన్‌తో బిగ్‌బాస్ విన్నర్ పెళ్లి!) అలా మా స్నేహం కొనసాగుతున్న సమయంలో నా బర్త్‌డే రోజు (జనవరి 26) గోవాలో తనకు ప్రపోజ్ చేశాను. ముందు తను ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అంగీకరించింది. పెద్దలకు విషయం చెప్పాం. మా జాతకాలు కలిశాయి. ఇంతలో లాక్డౌన్ డౌన్ వచ్చిపడింది. అయితే పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేక సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. మా ఇంటి నుంచి దీప్తి ఇంటికి కేవలం 15 నిమిషాల దూరంలోనే ఉంటుంది. కానీ తను నా జీవితంలోకి రావడానికి ఇదిగో ఇంత సమయం పట్టింది’’అంటూ నవ్వులు చిందించాడు. -
పరువు హత్య.. తల్లిదండ్రులకు జీవిత ఖైదు
సాక్షి, గుంటూరు: ఓ పరువు హత్య కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు, రూ.2వేల జరిమానా విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ బుధవారం తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే..గుంటూరు నగరంలోని రాజేంద్రనగర్ 2వలైనులో పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి(26), శృతి అనే కుమార్తెలున్నారు. దీప్తి హైదరాబాదులోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తుండేది. అదే కంపెనీలో పశ్చిమ గోదావరి జిల్లా రాజఒమ్మంగి గ్రామానికి చెందిన అనంతపల్లి కిరణ్‌కుమార్ ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో దీప్తి(26), కిరణ్‌కుమార్ ప్రేమించుకున్నారు. 2014 మార్చి నెల 21వ తేదీ దీప్తి, కిరణ్ హైదరాబాదులోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దీప్తి తల్లిదండ్రులు 22వ తేదీ హైదరాబాద్‌కు వెళ్లి గుంటూరులో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తామని నమ్మ బలికి, దీప్తిని ఇంటికి తీసుకెళ్లి మంచానికి కట్టేసి చున్నీ మెడకు బిగించి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో హరిబాబు, సామ్రాజ్యం దంపతులకు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. -
నేను పోకిరినే అంటున్న జైఆకాశ్
అవును నేను పొకిరినేనంటున్నారు నటుడు జైఆకాశ్. ఏమిటీ ఆశ్చర్యంగా ఉందా? ఈయన తాజా చిత్రం పేరు అమా నాన్ పొరి క్కిదాన్ . ఏమిటండీ అలాంటి టైటిల్ పెట్టారు అనుకుంటున్నారా? దానికీ జైఆకాశ్ వద్ద బదులుంది. నెగటీవ్ వైబ్రేషన్స్ తో కూడిన టైటిల్స్ పాజిటీవ్ రిజల్ట్స్నిస్తున్నాయి అన్నదే ఆయన సమాధానం. జైఆకాశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా అనిషా, దీప్తి నాయికలుగా నటిస్తున్నారు. పొన్నంబళం, పవర్‌స్టార్, శ్యామ్స్, సునిల్‌శెట్టి, కయల్ విన్సెంట్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో ముంబైకి చెందిన జితేంద్రసింగ్ విలన్ గా నటిస్తున్నారు. జీ ఫిలింస్ ఫ్యాక్టరీ పతాకంపై ఇంతకు ముందు చెన్నై టూ బ్యాంకాంగ్ చిత్రాన్ని నిర్మించిన షాజహాన్ ఈ చిత్రానికి నిర్మాత. దేవరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యూకే.మురళి సంగీతాన్ని అందిస్తున్నారు.చిత్రం బుధవారం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను జైఆకాశ్ తెలుపుతూ తాను హీరోగా నటిస్తున్న అత్యంత భారీ చిత్రం ఇదన్నారు. దేశ, విదేశాల్లో అక్రమ వ్యాపారాలను చేసే వ్యక్తికి దంపతుల కారణంగా సమస్యలు ఏర్పడతాయన్నారు.దీంతో అతను వారిని అంతం చేయడానికి ప్రయత్నిస్తాడన్నారు. అలా అతని దుర్మార్గాని హీరో భార్య హతం అవుతుందన్నారు. చనిపోయే ముందు తన మరణానికి కారణమైన వారిని కనిపెట్టి ప్రతీకారం తీసుకోవాలని భర్తను కోరుతుందన్నారు. దీంతో అమాయకుడైన హీరో పగతో రగిలిపోయి దేశదేశాలు చుట్టి విలన్ పై ఎలా ప్రతీకారం తీసుకున్నాడన్నదే చిత్ర కథ అని తెలిపారు. ఇందులో తాను ఏడు గెటప్‌లలో కనిపిస్తానని చెప్పారు. చెన్నై, హాంకాంగ్, జర్మనీ దేశాల్లో మూడు షెడ్యూల్లలో 60 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేసి చిత్రాన్ని మేలో విడుదలకు ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.చిత్రంలో భారీ పోరాటాలు,ఛేజింగ్స్ చోటు చేసుకుంటాయని చెప్పారు. -
ఈ రోజుల్లో ప్రేమకథ!
కాలం మారే కొద్దీ మానవ సంబంధాలన్నీ కనుమరుగవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమకి ఎలాంటి స్థానం ఉంది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఇక సె....లవ్’. సాయి రవి, దీప్తి జంటగా నాగరాజ్ దర్శకత్వంలో గన్నవరపు చంద్రశేఖర్, డుంగ్యోత్ పీర్యా నాయక్, గ్యార రవి నిర్మించిన ఈ చిత్రం పాటలను దర్శకుడు నాగేశ్వరరెడ్డి విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సంగీత దర్శకుడు మధు ఈ సినిమా కోసం మంచి పాటలు అందించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశాం. జూన్ 10న విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘రవిరాజా పినిశెట్టి, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకుల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాను. దర్శకుడిగా నాకిది తొలి చిత్రం’’ అని దర్శకుడు చెప్పారు. -
'నా భార్యను రక్షించిన వాయుసేనకు వందనం'
చెన్నై: ఆమె పేరు దీప్తి(28). తొమ్మిది నెలల గర్భిణీ. మరో వారం రోజుల్లోనో అంతకంటే ముందుగానో తల్లిగా మారబోతున్నాని ఆనందం.. ఇంతలో అకాల వర్షాలు.. ఇళ్లు మునిగిపోయేలా వచ్చిన వరదలు.. తల్లిగా మారబోతున్న ఆమహిళ మనసులో ప్రశాంతత దూరమై ఆందోళన అలుముకుంది. ఎందుకంటే అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి.. సర్వత్రా జలమయం. సాయం చేసేందుకు ఎవరూ రాలేని పరిస్థితి. వైద్యం కూడా అందుతుందో లేదో అని అనుమానం. ఈ సమాచారం తెలుసుకున్న భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ రానే వచ్చింది. ఆమెకు దన్నుగా నిలిచింది. ఇంటిపై భాగంలో తన రెక్కలు రెపరెపలాడిస్తూ తన ఒడిలో కూర్చోబెట్టుకుని సురక్షితంగా ఆస్పత్రికి చేర్చింది. డిసెంబర్ 2న ఈ దృశ్యం ఆవిష్కృతంగా కాగా ఇప్పుడు ఆమె పండంటి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తల్లి దీప్తితో సహా ఇద్దరు పిల్లలు చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు. ఈ సందర్బంగా ఆమె భర్త కార్తిక్ వెల్చామీ తాను పడిన ఆందోళన, భయాన్ని మీడియాతో పంచుకున్నాడు. చెన్నైకి సమీపంలోని వర్ష ప్రభావానికి గురైన గిండీకి సమీపంలోని రామపురం ప్రాంతం తమదని, నిండు గర్భవతి అయిన తన భార్యను ఏ విధంగా రక్షించుకోవాలా అని ఎంతో భయానికి లోనయ్యానని, ఆ సమయంలో తాను బెంగళూరులో ఉన్నానని, డిసెంబర్ 2న ఆమెను హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా ఆస్పత్రికి తరలించడంతో డిసెంబర్ 4న ప్రసవించిందని చెప్పాడు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి లోనవుతూ భారత వాయు సేనకు కార్తిక్ ధన్యవాదాలు తెలిపాడు. తమను ఎవరూ కాపాడలేరనుకున్న సమయంలోనే వాయుసేన రక్షించిందని చెప్పారు. -
పాత కథలకు ‘ఇక సె..లవ్’
వెండితెరపై ఇప్పటిదాకా వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు దర్శకుడు నాగరాజు. ఆయన దర్శకత్వంలో సాయి రవి, దీప్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇక సె..లవ్’. గ్రీన్ సన్ ఇన్నోవేటివ్స్, జైహిత క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఏప్రిల్ మొదటి వారంలో చిత్రీకరణ పూర్తవుతుంది. మే నెలలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి. శ్రీనివాస రెడ్డి. -
‘బుల్లితెర నటి దీప్తిది ఆత్మహత్యే’
-
‘బుల్లితెర నటి దీప్తిది ఆత్మహత్యే’
హైదరాబాద్: బుల్లితెర నటి దీప్తి అలియాస్ రామలక్ష్మిది ఆత్మహత్యగా తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆమెది ఆత్మహత్యేనని ప్రాథమికంగా తేల్చినట్లు సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. హైదరాబాద్ ఫతేనగర్‌లోని ఠాకూర్ ఆర్డీ కాంప్లెక్స్‌లోని తన ప్లాట్‌లో దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె ఉరివేసుకొని చనిపోయినట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వారం రోజుల కిందట దీప్తి ఫోన్ చేసి తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని, ఇంటికి వచ్చేస్తానంటూ తమతో చెప్పిందని దీప్తి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కాగా, దీప్తి చనిపోయే ముందు వరకు లాప్టాప్ ఉపయోగించినట్లు తెలిసింది. దానికి పాస్వర్డ్ ఉండటంతో పోలీసులు ఓపెన్ చేయలేకపోయారు. లాప్టాప్ ద్వారా దీప్తికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
టీవీ నటి దీప్తి ఆత్మహత్య
హైదరాబాద్: బాలానగర్ ప్రాంతంలోని ఫతే నగరలో దీప్తి(30) అనే టీవీ నటి ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన చెందిన దీప్తి ఆలియాస్ రామలక్ష్మీ ఫతేనగర్‌లోని ఓ అపార్టుమెంటులో నివాసముంటుంది. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరివేసుకుందని పోలీసులు తెలిపారు. ఆమె ఆత్యహత్య పాల్పడుతూ ఐ ప్యాడ్ లో సెల్ఫీ ఫొటోలను కూడా తీసుకుంది. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీప్తి ఆడదే ఆధారం, ఆహ్వానం తదితర సీరియల్స్ లో నటించింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి సూసైడ్ నోట్ ఇంట్లో వదలకపోవడం, ఎవరూ కూడా ఆమె గురించిన వివరాలు చెప్పలేకపోవడంతో దర్యాప్తు ఇంకా ముందుకు సాగట్లేదు. -
పోలీసుల అదుపులో దీప్తి తల్లిదండ్రులు
-
పోలీసుల అదుపులో దీప్తి తల్లిదండ్రులు
గుంటూరు : పరువు హత్య కేసులో దీప్తి తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబు పోలీసులకు లొంగిపోయారు. కులాంతర వివాహం చేసుకుందని కుమార్తెను దీప్తి తల్లిదండ్రులే కసాయిలుగా మారి దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరులోని రాజేంద్ర నగర్ లో చోటు చేసుసుకున్న విషయం తెలిసిందే. రిసెప్షన్ ఏర్పాటు చేసి, సత్యనారాయణ వ్రతం జరిపిస్తామని నమ్మించి దీప్తి తల్లిదండ్రులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. నిందితులను పోలీసులు ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. -
కులాంతర వివాహం చేసుకుందని..
కన్నకూతుర్ని దారుణంగా చంపిన తల్లిదండ్రులు గుంటూరులో పరువు హత్య ఈనెల 21న ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్న ప్రేమికులు రిసెప్షన్ చేస్తామని నమ్మించి తీసుకెళ్లి ఘోరం రాజవొమ్మంగి, పరువుకోసం కన్నకూతుర్నే తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన గుంటూరు నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రా మానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు కొద్దికాలంగా గుంటూరు రాజేంద్రనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి దీప్తి(26), శృతి ఇద్దరు కుమార్తెలు. దీప్తి హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన అనంతపల్లి నాగ సత్యనారాయణ కుమారుడు కిరణ్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, ప్రేమగా మా రింది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో వీరి వివాహానికి రెండు కుటుంబాల పెద్దలు మొదట్లో అంగీకరించలేదు. అయితే కుమారుడి కోరిక మేరకు కిరణ్ తల్లిదండ్రులు ఆమోదించినా, దీప్తి తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. కంపెనీ పనిలో భాగంగా అమెరికా వెళ్లిన కిరణ్... ఇటీవలే హైదరాబాద్ వచ్చి ఈనెల 21వ తేదీన అక్కడి ఆర్య సమాజంలో దీప్తిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న దీప్తి తల్లిదండ్రులు శనివారం ఇరువురినీ తమ ఇంటికి ఆహ్వానించారు. మంచి ముహూర్తం చూసి రిసెప్షన్ ఏర్పాటుచేసి, సత్యనారాయణ వ్రతం జరిపిస్తామని నమ్మించారు. వీరి మాటలు నమ్మిన దీప్తి, కిరణ్, అతడి సోదరులు, మిత్రులతో కలిసి ఆదివారం గుంటూరు చేరుకున్నారు. తీరా కుమార్తెను మాత్రం ఇంట్లోకి తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు.. కిరణ్‌ను పిలవలేదు. దీంతో అతను ఓ హోటల్లో గది అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉన్నాడు. ఉదయం దీప్తికి కిరణ్ ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తన స్నేహితులను దీప్తి కన్నవారింటికి పంపంచాడు. వారు అక్కడకు వెళ్లే సమయానికి దీప్తి తల్లిదండ్రులు కంగారుగా వెళ్లిపోతూ కనిపించారు. అనుమానం వచ్చిన మిత్రులు తలుపులు తీసి చూసేసరికి మెడకు చున్నీ బిగించి, మంచంపై కట్టివేసిన స్థితిలో దీప్తి నిర్జీవంగా పడివుండటాన్ని గమనించారు. వారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న కిరణ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పశ్చిమ డీఎస్పీ టి.వి.నాగరాజు, పట్టాభిపురం ఎస్‌హెచ్‌వో బిలాలుద్దీన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కిరణ్‌కుమార్, అతని స్నేహితుల నుంచి సమాచారాన్ని సేకరించారు. దీప్తి తల్లిదండ్రులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెడ్డింగ్ ఫ్యాషన్
-
భారీ జీతం.. మత్తెక్కించిన మద్యం.. ఆపై వీరంగం
విక్రమ్ (శంషాబాద్): అమ్మానాన్నలకు ఒక్కర్తే కూతురు. అల్లారుముద్దుగా పెంచి మంచి చదువు చదివించారు. బాగా చదవడంతో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అది కూడా అలాంటి, ఇలాంటి ఉద్యోగం కాదు. నెలకు దాదాపు లక్ష రూపాయల జీతం తెచ్చిపెడుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం. హైటెమ్ సిటీలో ఉద్యోగం చేసుకుంటోంది. ఇంకా పెళ్లి కాలేదు. జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తోంది. ఆమె పేరు దీప్తి (25). కూకట్‌పల్లిలో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెతో పాటు విశాఖపట్నం ప్రాంతానికే చెందిన స్నేహితుడు ప్రసాద్ (27), స్వస్థలానికి చెందిన మేనమామ కొడుకులు రాధాకృష్ణ (28), పృథ్వీరాజ్(28), కారు డ్రైవర్ చంద్రశేఖర్ (25) శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. పూర్తిస్థాయిలో మద్యం తాగారు. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత శంషాబాద్‌లో జరుగుతున్న మడ్ రేసింగ్ గేమ్ షోలో పాల్గొనేందుకు వెళ్లారు. గేమ్ షోలో అక్కడే ఉన్న ఉద్యోగులకు సంబంధించిన కూర్చీలో దీప్తి కూర్చుంది. అందులో కూర్చోకూడదని ఉద్యోగి శివ ఆమెను వారించాడు. దీంతో ఆగ్రహంతో ఆ యువతి గొడవకు దిగింది. శివను దూషిస్తూ కుర్చీ ఖరీదు చెల్లిస్తానని వీరంగం సృష్టించింది. అంతటితో ఆగకుండా అతడిపై చేయి కూడా చేసుకుంది. పరిస్థితి గమనించిన మిగతా ఉద్యోగులు విమానాశ్రయంలోని పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతితో పాటు మిగతా నలుగురిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మడ్ రేసింగ్ గేమ్‌షో నిర్వాహకుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, దాడిలో ఎవరికీ గాయాలు కాకపోవడం వల్ల నాన్ కాగ్నిజబుల్ కేసుగా నమోదు చేశారు. -
ఎయిర్‌పోర్టులో యువతి వీరంగం
హైదరాబాద్ : శంషాబాద్, న్యూస్‌లైన్: మద్యం మత్తులో ఓ యువతి శంషాబాద్ విమానాశ్రయంలో వీరంగం సృష్టించింది. ఆమెతో పాటు నలుగురు స్నేహితులు మడ్ రేసింగ్ గేమ్ షో సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆర్జీఐఏ సీఐ దుర్గాప్రసాద్, బాధితుల కథనం ప్రకారం.. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన దీప్తి(25) కూకట్‌పల్లిలో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెతో పాటు అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు ప్రసాద్ (27), స్వస్థలానికి చెందిన బంధువులు రాధాకృష్ణ (28), పృథ్వీరాజ్(28), కారు డ్రైవర్ చంద్రశేఖర్ (25) శనివారం రాత్రి బంజారాహిల్స్‌లో ఓ విందులో పాల్గొన్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో విమానాశ్రయంలో ఉన్న మడ్ రేసింగ్ గేమ్ షోలో పాల్గొనేందుకు వచ్చారు. గేమ్ షోలో అక్కడే ఉన్న ఉద్యోగులకు సంబంధించిన కూర్చీలో దీప్తి కూర్చుంది. అందులో కూర్చోకూడదని ఉద్యోగి శివ ఆమెను వారించాడు. దీంతో ఆగ్రహంతో ఆ యువతి గొడవకు దిగింది. శివను దూషిస్తూ కుర్చీ ఖరీదు చెల్లిస్తానని వీరంగం సృష్టించింది. అంతటితో ఆగకుండా అతడిపై చేయి కూడా చేసుకుంది. ‘మీ బతుకులు ఇంతే’నంటూ దుర్భాషలాడింది. పరిస్థితిని గమనించిన గేమ్ షో సిబ్బంది దీప్తితో పాటు ఆమెతో ఉన్న వారికి నచ్చచెప్పే యత్నం చేశారు. వారు వినకుండా సిబ్బందితో గొడవకు దిగారు. సిబ్బంది కి రణ్, విశాల్, శ్రీశైలంపై దీప్తితో పాటు మిగతా నలుగురు దాడి చేశారు. పరిస్థితి గమనించిన మిగతా ఉద్యోగులు విమానాశ్రయంలోని పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతితో పాటు మిగతా నలుగురిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మడ్ రేసింగ్ గేమ్‌షో నిర్వాహకుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. యువతితో పాటు మిగతా నలుగురిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఎయిర్‌పోర్టులో యువతి వీరంగం
శంషాబాద్, న్యూస్‌లైన్: మద్యం మత్తులో ఓ యువతి శంషాబాద్ విమానాశ్రయంలో వీరంగం సృష్టించింది. ఆమెతో పాటు నలుగురు స్నేహితులు మడ్ రేసింగ్ గేమ్ షో సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆర్జీఐఏ సీఐ దుర్గాప్రసాద్, బాధితుల కథనం ప్రకారం.. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన దీప్తి(25) కూకట్‌పల్లిలో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెతో పాటు అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు ప్రసాద్ (27), స్వస్థలానికి చెందిన బంధువులు రాధాకృష్ణ (28), పృథ్వీరాజ్(28), కారు డ్రైవర్ చంద్రశేఖర్ (25) శనివారం రాత్రి బంజారాహిల్స్‌లో ఓ విందులో పాల్గొన్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో విమానాశ్రయంలో ఉన్న మడ్ రేసింగ్ గేమ్ షోలో పాల్గొనేందుకు వచ్చారు. గేమ్ షోలో అక్కడే ఉన్న ఉద్యోగులకు సంబంధించిన కూర్చీలో దీప్తి కూర్చుంది. అందులో కూర్చోకూడదని ఉద్యోగి శివ ఆమెను వారించాడు. దీంతో ఆగ్రహంతో ఆ యువతి గొడవకు దిగింది. శివను దూషిస్తూ కుర్చీ ఖరీదు చెల్లిస్తానని వీరంగం సృష్టించింది. అంతటితో ఆగకుండా అతడిపై చేయి కూడా చేసుకుంది. ‘మీ బతుకులు ఇంతే’నంటూ దుర్భాషలాడింది. పరిస్థితిని గమనించిన గేమ్ షో సిబ్బంది దీప్తితో పాటు ఆమెతో ఉన్న వారికి నచ్చచెప్పే యత్నం చేశారు. వారు వినకుండా సిబ్బందితో గొడవకు దిగారు. సిబ్బంది కి రణ్, విశాల్, శ్రీశైలంపై దీప్తితో పాటు మిగతా నలుగురు దాడి చేశారు. పరిస్థితి గమనించిన మిగతా ఉద్యోగులు విమానాశ్రయంలోని పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతితో పాటు మిగతా నలుగురిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మడ్ రేసింగ్ గేమ్‌షో నిర్వాహకుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. యువతితో పాటు మిగతా నలుగురిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
రిలేషణం: తన గొంతు వినగానే గట్టిగా ఏడ్చేశా...
ఆగస్టు 21 రాఖీ పౌర్ణమి సందర్భంగా... తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఒకరి మీద మరొకరి కంప్లయింట్లు... ఆ రోజు అన్నీ పుల్‌స్టాప్. రాఖీ పండుగ అనురాగాల కొమ్మలు తొడుక్కుని, ఆప్యాయతల రెక్కలు విప్పుకుని వర్షరుతువులో తడి ఆరని జ్ఞాపకమై తోడొస్తుంది. తూర్పున ఉన్న తమ్ముడు నానీని, పడమరలో ఉన్న అక్క దీప్తిని కలిపి కట్టిన రక్షాబంధనమే ఈ వారం రిలేషణం... దీప్తి మాటల్లో... అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమతోపాటు గొడవలు, అలకలు మామూలే. మేం కూడా అందుకు మినహాయింపు కాదు. ఇద్దరం విపరీతంగా కొట్టుకునేవాళ్లం. టీవీ చానెల్ విషయంలో యుద్ధాలే జరిగేవి. నేనొక చానల్ చూస్తానంటే, తను మరోటి చూస్తానని! ఓ వంద రిమోట్ల దాకా విరగ్గొట్టి ఉంటాం. ఇద్దరం కలసి చేసే అల్లరి సంగతేమో కానీ, నాని అల్లరికి స్కూలు వాళ్లు కూడా హడలిపోయేవారు. ఎనిమిదో తరగతి విజయవాడలోని సిద్ధార్ధ స్కూల్లో చదివాడు నానీ. వాడి అల్లరిని భరించలేక ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ ఇంటికి లెటర్స్ పంపించేవాళ్లు, ఫోన్లు చేసేవాళ్లు. ఒక్కోసారి ఆ ఫోన్లు నేనే రిసీవ్ చేసుకునేదాన్ని. అమ్మలా నటించేసి, ఏదేదో చెప్పి మేనేజ్ చేసేదాన్ని. అయినా వాడి అల్లరి మితిమీరడంతో స్కూల్వాళ్లు వాణ్ని హైదరాబాద్ పంపేశారు. అంతేకాదు... మావాడికి చిన్నప్పట్నుంచీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. వాడికొచ్చే బ్లాంక్ కాల్స్‌కి నేను తిట్లు తినేదాన్ని. నాకు మొదటినుంచీ చదువు మీద శ్రద్ధ ఎక్కువ. కానీ నానీకి మాత్రం సినిమా అంటే ప్రాణం. ఏ సినిమా విడుదలైనా, ఫస్ట్ షోకే పరిగెత్తేవాడు. ఎంత ఇన్వాల్వ్ అయి చూస్తాడంటే... పక్కన బాంబు పేలినా పట్టించుకోడు. నాకు తనలో నచ్చని విషయం అదే. మరీ అంత పిచ్చేంట్రా అనేదాన్ని. పైగా సినిమా చూసి, ఆ కథకు తన ఇమాజినేషన్ జోడించి మరీ ఫ్రెండ్స్‌కు చెప్పేవాడు. తీరా వాళు సినిమా చూశాక ‘నువ్వు చెప్పిందేదీ సినిమాలో లేదురా’ అనేవాళ్లు. అంత బాగా చెప్పేవాడు! తన పర్స్పెక్టివ్ నుంచి చూస్తే, ఏ సినిమా అయినా నచ్చేస్తుంది మనకు! ఇంజినీరింగ్ అయ్యాక నేను యు.ఎస్. వెళ్లిపోయాను. ఒక్కసారిగా ఏదో దూరమైపోయినట్టుగా అనిపించింది. కొత్తలో ఓ రోజు ఫోన్ చేశాను. వాడి గొంతు వినగానే దుఃఖం పొంగుకొచ్చి గట్టిగా ఏడ్చేశాను. వాడిదీ అదే పరిస్థితి. ఎంత కొట్టుకున్నా అంత ప్రేమ ఒకరంటే ఒకరికి! వాడు డెరైక్షన్ ఫీల్డ్‌లోకి అడుగుపెడుతున్నానని చెబితే సంతోషమేసింది. కానీ యాక్టింగ్ అంటే వెంటనే ఎస్ అనలేకపోయాను. ఎందుకంటే, వాడికి డెరైక్టర్‌కి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయని నాకు తెలుసు. కానీ నటన అంటే చేయగలడో లేదోనని భయమేసింది. కానీ ‘అష్టాచెమ్మా’ చూశాక నా భయం పటాపంచలయ్యింది. వెంటనే ఫోన్‌చేసి ‘అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా, చాలా బాగా చేశావ్’ అని మెచ్చుకున్నాను. సంబరపడిపోయాడు. సినిమా పట్ల తనకున్న అంకితభావం, కమిట్మెంట్ వల్లే మంచి నటుడు కాగలిగాడు. అయితే వాడు ఏదో ఒక రోజు గొప్ప దర్శకుడు అవుతాడని నా నమ్మకం. మణిరత్నం ప్రభావం తనమీద చాలా ఉంది. తప్పకుండా ఒకనాడు వాడు ఆ స్థాయి డెరైక్టర్ అవుతాడు. ఆ రోజుకోసం కోసం ఎదురుచూస్తూ ఉంటా! చిన్నతనంలో అక్క రాఖీ కట్టగానే ఫైవ్‌స్టార్ చాక్లెట్, డైరీ మిల్క్ ఇచ్చేవాణ్ని. అమెరికా వెళ్లినప్పట్నుంచిఆన్లైన్లో పంపిస్తోంది. దాన్ని మా కజిన్స్లో ఎవరితోనైనా కట్టించుకుంటాను. నా సినిమాలకు సంబంధించి బెస్ట్ క్రిటిక్ అక్కే. సినిమాల్లో ఏం బాగుంది, ఏం బాగోలేదు అని రివ్యూ రాసి మరీ పంపిస్తుంది. నేను ఏ ఇంపార్టెంట్ విషయమైనా మొదట పంచుకునేది అక్కతోనే. నా ప్రేమ విషయం కూడా ముందు తనకే చెప్పాను. వెంటనే అంజూని చూడాలంటూ ఎగ్జయిటయ్యింది. ఇప్పుడు వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఎక్కువసేపు ఉండటం లేదని అంజూ అక్కకి కంప్లయింట్ చేస్తుంది. నేను తనకి సరిగ్గా ఫోన్ చేయట్లేదని అక్క అంజుకి కంప్లయింట్ చేస్తుంది. (నవ్వుతూ) ఇద్దరి మధ్యలో నేను బుక్కయిపోతూ ఉంటాను!