అథ్లెటిక్ చాంప్ దీప్తితో మాటామంతి
కలకు సాధన తోడైతే చాలు మిగతావన్నీ వాటికవే వచ్చి చేరతాయి. ఈ మాట నా విషయంలో అక్షర సత్యం అంటోంది దీప్తి జివాంజీ. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన దీప్తి జివాంజీ దినసరి కూలీ కుమార్తె. జపాన్‌లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగంలో సోమవారం 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల దీప్తిని పలకరిస్తే ఇలా సమాధానమిచ్చింది.
⇢ క్రీడలే ప్రధానంగా!
నా చిన్నప్పుడు స్కూల్‌లో పీఈటీ సర్ చెప్పిన విధంగాప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే జిల్లా స్థాయి ΄ోటీల్లో పాల్గొనేదాన్ని. నాకు చిన్నతనంలో తరచూ ఫిట్స్ వస్తుండేవి. రన్నింగ్ చేసేటప్పుడు బాడీ షేక్ అయ్యేది. దీంతో మా పీఈటీ సర్‡పారా అథ్లెట్స్‌తో మాట్లాడి, టెస్టులు చేయించారు. వారితో మాట్లాడి ‘ఇక పారా అథ్లెట్స్ గ్రూప్‌లో పాల్గొనమ’ని చె΄్పారు. మా అమ్మనాన్నలది మేనరికం కావడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చాయని తెలిసింది. అక్కణ్ణుంచి పారా అథ్లెటిక్ కాంపిటిషన్‌లో పాల్గొంటూ వచ్చాను. ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అందులో పాల్గొన్నాను. మెడల్ రావడంతో అక్కణ్ణుంచి నా జీవితంలో క్రీడలు ప్రధాన భాగంగా మారి΄ోయాయి. డిగ్రీలో చేరాను కానీ, అప్పటికి ఇంకా పరీక్షలు రాయడం పూర్తి చేయలేదు.
⇢ బలహీనతలను అధిగమించేలా..
స్పోర్ట్స్‌లో పాల్గొనడం వల్ల ఒక ఆరోగ్యపరమైన సమస్యను ఆ విధంగా అధిగమించాను అనుకుంటాను. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ ఆటలు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, కానీ, మా అమ్మ మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. నీవనుకున్నదానిపైనే దృష్టి పెట్టు. ఈ రోజు నిన్ను అన్నవాళ్లే రేపు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు’ అని చెప్పేది. ఆ విధంగా మానసిక ధైర్యం కూడా పెరిగింది. స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని నమ్ముతాను. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ చాంపియన్‌షిప్ ΄ోటీల్లో పాల్గొన్నాను. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు.
⇢ ధైర్యమే బలం
మా ఇంటి పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉండేవి. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు స్కూల్‌కు వెళుతుంది. ఉండటానికి మాకు కనీసం అద్దె ఇల్లు కూడా ఉండేది కాదు. మొన్న మొన్నటి వరకు మా అమ్మమ్మ వాళ్లింటోనే ఉన్నాం. ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నాం. ఈ మధ్య ఆ ఇంటినే కొనుగోలు చేశాం.
ఇక బలమైన ఆహారం అంటే స్పోర్ట్స్ అకాడమీలోకి వచ్చిన తర్వాతే అని చెప్పుకోవాలి. అమ్మ ఎప్పుడూ చెప్పే విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ‘కష్టపడితే ఏదీ వృథా ΄ోదు. నీకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే నిన్ను కాదని వెళ్లి΄ోయినవి కూడా నీ ముందుకు వస్తాయి’ అంటుంది. మొన్న జపాన్‌లో జరిగిన పారా ఒలింపిక్‌లో బంగారు పతకం సాధించిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా సంతోషించింది. నా బలం మా అమ్మే. ఆమె ఏమీ చదువుకోలేదు. కానీ, ధైర్యంగా ఎలా ఉండాలో
చెబుతుంది. ఆడపిల్లలమైనా మేం బాగా ఎదగాలని కోరుకుంటుంది.
⇢ ప్రాక్టీస్ మీదనే దృష్టి
టీవీ కూడా చూడను. ΄÷లిటికల్ లీడర్స్‌కు సంబంధించి వచ్చే సాంగ్స్ వింటుంటాను. ఆ పాటల్లో స్ఫూర్తిమంతమైన పదాలు ఉంటాయి. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉంటున్నాను. మరో మూడు నెలల్లో ఒలపింక్స్ లో పాల్గొనబోతున్నాను. దేశం తరపున పాల్గొనబోతున్నాను కాబట్టి నా దృష్టి అంతాప్రాక్టీస్ మీదనే ఉంది. సాధారణంగా ఉదయం రెండు గంటలు; సాయంత్రం రెండు గంటలుప్రాక్టీస్ ఉంటుంది. మధ్యలో మా రోజువారీ పనులు, విశ్రాంతికి సమయం కేటాయిస్తాం. నాతో పాటు ఉన్న స్నేహితులతో చిట్ చాట్ ఉంటుంది.
⇢ బాధ్యతగా ఉండాలి
చిన్నప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరగడం వల్ల సొంతంగా ఇష్టాలు, అభిరుచులు అనే ధ్యాస ఏమీ లేదు. కానీ, చిన్నప్పటి నుంచి ΄ోలీసు కావాలనేది నా కల. ఇప్పటికీ అదే ఆలోచన. నా కృషి నేను చేస్తున్నాను. నేను కోరుకున్నది వస్తుందనేది నా నమ్మకం. అమ్మనాన్నలు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ΄ోలీసుని అయి మా అమ్మ నాన్నలను, చెల్లెలిని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత అనుకుంటున్నాను’’అంటూ ముగించింది దీప్తి.
ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment