
తొలి రెండు అంతస్తుల్లో కార్యాలయాలు రెండు నెలల్లో అందుబాటులోకి..
సాధ్యమైనంత తొందరగా మిగిలిన అంతస్తుల పనులు
అత్యాధునిక సాంకేతికతతో మరింత పకడ్బందీగా శాంతిభద్రతలు
అన్ని విభాగాల కార్యాలయాలు ఇక్కడి నుంచే నిర్వహణ
కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో క్షేత్రస్థాయిలో మరింత నిఘా
సాక్షి, వరంగల్: శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. పెద్దపెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. ఇదే సిద్ధాంతంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీ సు కమిషనరేట్ల భవన నిర్మాణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ (సీసీటీవీ కెమెరాల అనుసంధానం) సెంటర్లు ఏర్పా టు చేసి నేర నియంత్రణపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. వరంగల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల విషయంలో అనుకున్నంత శ్రద్ధ కనబరచలేదు.
ఫలితంగా మరో మూడు నెలలైతే నిర్మాణ పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతుంది. ప్రస్తుతమున్న వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తుండడంతో కొద్ది నెలల నుంచి పనుల్లో వేగిరం పెరిగింది. మరో రెండు నెలల్లో జీప్లస్ 5 అంతస్తులతో కూడిన భవనంలోని తొలి రెండు అంతస్తులను పూర్తిస్థాయి మౌలిక వసతులతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు.
పూర్తిస్థాయి భవనం అందుబాటులోకి రావాలంటే ఈ ఏడాది ఆఖరు వరకు సమయం తీసుకునే అవకాశముందని కిందిస్థాయి పోలీసులు చెబుతున్నారు. ఇందులోనే కమిషనర్ కార్యాలయం, డీసీపీలు, అడిషనల్ డీసీపీ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, కాన్ఫరెన్స్‌హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, సిటీ స్పెషల్ డిపార్ట్‌మెంట్లు ఉంటాయి.
ఇక్కడి నుంచే ‘కమాండ్’..
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కా వాల్సిన డేటా సెంటర్ పరికరాలను జర్మ నీ, బెల్జియం నుంచి తెప్పించనున్నారు. ఇక్కడి నుంచే అన్ని సీసీ కెమెరాలను పో లీస్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఇందుకు ఓ ఫ్లోర్‌లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. మూడు విభాగాలుగా సీసీ టీవీ కెమెరాలను బిగించనున్నారు. సిటీవైడ్ సర్వేలైన్స్‌తోపాటు కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలను అనుసంధానించనున్నారు.
వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని ప్రధాన కూడళ్లతోపాటు పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలు అనుసంధానించడం ద్వారా ఎక్కడేం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఈ సెంటర్ ద్వారా ఏదైనా నేరం జరిగిన సందర్భంలో నిందితులను పట్టుకునేందుకు సమన్వయం చేసే వీలుంటుంది. శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. 2017 మే 29న రూ.50 కోట్ల వ్యయంతో వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది.
ఆ తర్వాత పనులు నింపాదిగా సాగడం, కరోనా రావడంతో కొన్ని నెలలపాటు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత పోలీస్ కమిషనర్లు తరుణ్‌జోషి, ఏవీ రంగనాథ్‌తోపాటు ప్రస్తు త పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కాస్త దృష్టి సారించడంతో నిర్మా ణ పనులు పూర్తయ్యేందుకు వచ్చా యి. సాధ్యమైనంత తొందరలోనే తొలి రెండు అంతస్తుల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి’అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment