Police Command and Control Centre
-
రెడీ అవుతున్న వరంగల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
సాక్షి, వరంగల్: శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. పెద్దపెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. ఇదే సిద్ధాంతంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీ సు కమిషనరేట్ల భవన నిర్మాణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ (సీసీటీవీ కెమెరాల అనుసంధానం) సెంటర్లు ఏర్పా టు చేసి నేర నియంత్రణపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. వరంగల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల విషయంలో అనుకున్నంత శ్రద్ధ కనబరచలేదు. ఫలితంగా మరో మూడు నెలలైతే నిర్మాణ పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతుంది. ప్రస్తుతమున్న వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తుండడంతో కొద్ది నెలల నుంచి పనుల్లో వేగిరం పెరిగింది. మరో రెండు నెలల్లో జీప్లస్ 5 అంతస్తులతో కూడిన భవనంలోని తొలి రెండు అంతస్తులను పూర్తిస్థాయి మౌలిక వసతులతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. పూర్తిస్థాయి భవనం అందుబాటులోకి రావాలంటే ఈ ఏడాది ఆఖరు వరకు సమయం తీసుకునే అవకాశముందని కిందిస్థాయి పోలీసులు చెబుతున్నారు. ఇందులోనే కమిషనర్ కార్యాలయం, డీసీపీలు, అడిషనల్ డీసీపీ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, కాన్ఫరెన్స్‌హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, సిటీ స్పెషల్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇక్కడి నుంచే ‘కమాండ్’.. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కా వాల్సిన డేటా సెంటర్ పరికరాలను జర్మ నీ, బెల్జియం నుంచి తెప్పించనున్నారు. ఇక్కడి నుంచే అన్ని సీసీ కెమెరాలను పో లీస్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఇందుకు ఓ ఫ్లోర్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. మూడు విభాగాలుగా సీసీ టీవీ కెమెరాలను బిగించనున్నారు. సిటీవైడ్ సర్వేలైన్స్తోపాటు కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలను అనుసంధానించనున్నారు.వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని ప్రధాన కూడళ్లతోపాటు పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలు అనుసంధానించడం ద్వారా ఎక్కడేం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఈ సెంటర్ ద్వారా ఏదైనా నేరం జరిగిన సందర్భంలో నిందితులను పట్టుకునేందుకు సమన్వయం చేసే వీలుంటుంది. శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. 2017 మే 29న రూ.50 కోట్ల వ్యయంతో వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పనులు నింపాదిగా సాగడం, కరోనా రావడంతో కొన్ని నెలలపాటు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత పోలీస్ కమిషనర్లు తరుణ్‌జోషి, ఏవీ రంగనాథ్‌తోపాటు ప్రస్తు త పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కాస్త దృష్టి సారించడంతో నిర్మా ణ పనులు పూర్తయ్యేందుకు వచ్చా యి. సాధ్యమైనంత తొందరలోనే తొలి రెండు అంతస్తుల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి’అని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
Hyderabad: కమాండ్ కంట్రల్ సెంటర్ వద్ద సరికొత్త బారికేడింగ్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం కొనసాగుతున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే వివిధ రాజకీయ పార్టీల ధర్నాలు, ఆందోళనలు కొనసాగే అవకాశాన్ని గుర్తించిన అధికారులు పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆందోళనలకు తావు లేకుండా, ఎవరూ లోనికి దూసుకురాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. శనివారం బీజేపీ కార్యకర్తలు, నేతలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి యత్నించగా వారిని సమీపంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పక్కా ప్రణాళికతో కమాండ్ కంట్రల్ సెంటర్ వద్దకు రాకుండానే వారిని నియంత్రించారు. ఇందుకోసం సరికొత్త బారికేడింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా పికెటింగ్‌లు కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ కూడా ఆధునిక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆందోళనకారులు ముందుకు రాకుండా నిరోధించేందుకు ఈ కొత్త బారికేడింగ్ సిస్టమ్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. సీబీఆర్టీ పరీక్ష నేపథ్యంలో 144 సెక్షన్ అమలు హిమాయత్‌నగర్: సీబీఆర్టీ పరీక్షల నేపథ్యంలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సీబీఆర్టీ పరీక్ష కేంద్రాల వద్ద సుమారు 500 అడుగుల మేర నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం 6 గంటల పాటు, మంగళవారం 6 గంటల పాటు ట్విన్ సిటీస్‌లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సెంటర్స్‌లో సీబీఆర్టీ ఎగ్జామ్ జరుగుతున్నట్లు తెలిపారు. పరీక్షకు ఏవిధమైన ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్) -
Hyderabad: పీసీఎస్ హెడ్– క్వార్టర్స్‌గా ఐసీసీసీ
సాక్షి, హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ) పోలీసు కంప్యూటర్ సర్వీసెస్‌కు హెడ్–క్వార్టర్స్‌గా మారనుంది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ భవనంలోని ఏ–టవర్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంగా వినియోగంలో ఉన్న విషయం విదితమే. రాష్ట్రానికే తలమానికంగా, దేశానికే ఆదర్శంగా నిర్మితమైన ఈ ఐసీసీసీ ఆగస్టు మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అన్ని విభాగాల అధిపతులూ ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకునే దీన్ని డిజైన్ చేశారు. డయల్–100, అంబులెన్స్, ఫైర్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంచనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న సీసీ కెమెరాలను ఈ కమాండ్ సెంటర్‌ను అనుసంధానించనున్నారు. ఎఫ్ఐఆర్ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్ మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ ఇతర టూల్స్ నేరాల నిరోధం తదితరాలకు ఐసీసీసీలోని బి–టవర్‌ను వాడనున్నారు. నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్‌న్స్ సెర్చ్‌కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్ డిజైనింగ్ టూల్స్‌తో మెరుగైన సేవలు అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బి–టవర్‌ను పోలీసు కంప్యూటర్ సర్వీసెస్‌కు (పీసీఎస్) అప్పగించాలని నిర్ణయించారు. ఈ విభాగం ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో కొనసాగుతోంది. పీసీఎస్ అదనపు డీజీ నేతృత్వంలోనే బి–టవర్ పని చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఈ మార్పు నేపథ్యంలో పీసీఎస్కు అదనంగా సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. ప్రాథమిక అంచనా ప్రకారం అదనపు డీజీ నుంచి పరిపాలన సిబ్బంది వరకు కలిపి మొత్తం 350 మంది అవసరమని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం పీసీఎస్లో ఉన్న వారికి అదనంగా మరో 200 మంది వరకు అవసరం. ఈ సిబ్బందిని ప్రస్తుతానికి ఇతర విభాగాల నుంచి సర్దుబాటు చేయడానికి డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. త్వరలో జరుగబోయే రిక్రూట్మెంట్ నుంచి శాశ్వత ప్రాతిపదికన వీరిని తీసుకోనున్నారు. సాంకేతిక విద్యనభ్యసించిన, ఈ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. (క్లిక్ చేయండి: 153 సెక్షన్లు మూత! అధికారులకు 58 ఇంజనీరింగ్ కాలేజీల వినతి)