
స్టాండింగ్ క్రాప్స్‌ను కాపాడుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
దివంగత నేత వైఎస్‌ఆర్ వల్లే దేవాదుల ఎత్తిపోతల: మంత్రి పొంగులేటి
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్‌లో దేవాదుల ప్రాజెక్టు కింద వేసిన పంటలు చేతికందే వరకు సాగునీటిని సరఫరా చేస్తామని..స్టాండింగ్ క్రాప్స్ లాస్ కాకుండా చూస్తామని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎంత రాత్రయినా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో పంపుహౌస్‌లో ఉన్న 800 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసే పంప్ స్విచ్చాన్ చేశాకే హైదరాబాద్‌కు వెళతానని ఆయన స్పష్టం చేశారు.
దేవాదుల ప్రాజెక్టు ప్రగతిపై చర్చ, అదనంగా పంప్‌లను ఆన్‌చేసి జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల చివరి ఆయకట్టుకు సాగునీటి విడుదల చేసేందుకు మంగళవారం సాయంత్రం ఆయన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటకు చేరుకున్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, కలెక్టర్ ప్రావీణ్య, ఇంజనీరింగ్ అధికారులతో ఈ సందర్భంగా ఉత్తమ్ దేవాదుల ప్రాజెక్టుపై సమీక్షించారు. అనంతరం మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నాం అని చెప్పారు.
గోదావరి జలాలు అందించాలని..: పొంగులేటి
2004లో దివంగత నేత డాక్టర్ వైఎస్‌ఆర్ జలయజ్ఞంలో భాగంగా గోదావరి నీళ్లను 5.57 లక్షల ఎకరాలకు అందించాలని దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించారని, ఫేస్–1, 2 పూర్తయి గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఫేస్– 3 పనులు ఆగిపోయాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు ఫేస్–3 పూర్తి చేస్తున్నామని చెప్పారు.
నిట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి 11:30 దాకా వేచిచూసి...
‘జనగామ జిల్లాలో కొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. దేవాదుల ఎత్తిపోతల పథకం మోటార్‌ను ప్రారంభిస్తే 50–60 వేల ఎకరాలకు నీరు అందుతుంది. అయితే టెక్నికల్ సమస్యతో ట్రయల్‌రన్ ఆలస్యమైంది. మరమ్మతు పనుల్లో ఆ్రస్టియా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఉంది. మరో నాలుగు గంటల్లో రిపేర్లు పూర్తి కావొచ్చు.
రాత్రి 11 గంటలే కాదు ఎంత సమయం పట్టినా మోటార్‌ను ఆన్ చేశాకే వెళతానని’మంత్రి ఉత్తమ్ హనుమకొండ ‘నిట్’ గెస్ట్‌హౌస్‌లోనే వేచి ఉన్నారు. మరమ్మతులు ఆలస్యం కావడంతో రాత్రి 11:30 తర్వాత ఉత్తమ్ హైదరాబాద్‌కు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment