World Para Athletics
-
World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
కలకు సాధన తోడైతే చాలు మిగతావన్నీ వాటికవే వచ్చి చేరతాయి. ఈ మాట నా విషయంలో అక్షర సత్యం అంటోంది దీప్తి జివాంజీ. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన దీప్తి జివాంజీ దినసరి కూలీ కుమార్తె. జపాన్‌లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో సోమవారం 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల దీప్తిని పలకరిస్తే ఇలా సమాధానమిచ్చింది.⇢ క్రీడలే ప్రధానంగా!నా చిన్నప్పుడు స్కూల్లో పీఈటీ సర్ చెప్పిన విధంగాప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే జిల్లా స్థాయి ΄ోటీల్లో పాల్గొనేదాన్ని. నాకు చిన్నతనంలో తరచూ ఫిట్స్ వస్తుండేవి. రన్నింగ్ చేసేటప్పుడు బాడీ షేక్ అయ్యేది. దీంతో మా పీఈటీ సర్‡పారా అథ్లెట్స్‌తో మాట్లాడి, టెస్టులు చేయించారు. వారితో మాట్లాడి ‘ఇక పారా అథ్లెట్స్ గ్రూప్‌లో పాల్గొనమ’ని చె΄్పారు. మా అమ్మనాన్నలది మేనరికం కావడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చాయని తెలిసింది. అక్కణ్ణుంచి పారా అథ్లెటిక్ కాంపిటిషన్లో పాల్గొంటూ వచ్చాను. ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అందులో పాల్గొన్నాను. మెడల్ రావడంతో అక్కణ్ణుంచి నా జీవితంలో క్రీడలు ప్రధాన భాగంగా మారి΄ోయాయి. డిగ్రీలో చేరాను కానీ, అప్పటికి ఇంకా పరీక్షలు రాయడం పూర్తి చేయలేదు.⇢ బలహీనతలను అధిగమించేలా..స్పోర్ట్స్‌లో పాల్గొనడం వల్ల ఒక ఆరోగ్యపరమైన సమస్యను ఆ విధంగా అధిగమించాను అనుకుంటాను. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ ఆటలు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, కానీ, మా అమ్మ మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. నీవనుకున్నదానిపైనే దృష్టి పెట్టు. ఈ రోజు నిన్ను అన్నవాళ్లే రేపు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు’ అని చెప్పేది. ఆ విధంగా మానసిక ధైర్యం కూడా పెరిగింది. స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని నమ్ముతాను. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ చాంపియన్‌షిప్ ΄ోటీల్లో పాల్గొన్నాను. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ⇢ ధైర్యమే బలంమా ఇంటి పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉండేవి. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు స్కూల్‌కు వెళుతుంది. ఉండటానికి మాకు కనీసం అద్దె ఇల్లు కూడా ఉండేది కాదు. మొన్న మొన్నటి వరకు మా అమ్మమ్మ వాళ్లింటోనే ఉన్నాం. ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నాం. ఈ మధ్య ఆ ఇంటినే కొనుగోలు చేశాం. ఇక బలమైన ఆహారం అంటే స్పోర్ట్స్ అకాడమీలోకి వచ్చిన తర్వాతే అని చెప్పుకోవాలి. అమ్మ ఎప్పుడూ చెప్పే విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ‘కష్టపడితే ఏదీ వృథా ΄ోదు. నీకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే నిన్ను కాదని వెళ్లి΄ోయినవి కూడా నీ ముందుకు వస్తాయి’ అంటుంది. మొన్న జపాన్‌లో జరిగిన పారా ఒలింపిక్‌లో బంగారు పతకం సాధించిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా సంతోషించింది. నా బలం మా అమ్మే. ఆమె ఏమీ చదువుకోలేదు. కానీ, ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతుంది. ఆడపిల్లలమైనా మేం బాగా ఎదగాలని కోరుకుంటుంది.⇢ ప్రాక్టీస్ మీదనే దృష్టిటీవీ కూడా చూడను. ΄÷లిటికల్ లీడర్స్‌కు సంబంధించి వచ్చే సాంగ్స్ వింటుంటాను. ఆ పాటల్లో స్ఫూర్తిమంతమైన పదాలు ఉంటాయి. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉంటున్నాను. మరో మూడు నెలల్లో ఒలపింక్స్ లో పాల్గొనబోతున్నాను. దేశం తరపున పాల్గొనబోతున్నాను కాబట్టి నా దృష్టి అంతాప్రాక్టీస్ మీదనే ఉంది. సాధారణంగా ఉదయం రెండు గంటలు; సాయంత్రం రెండు గంటలుప్రాక్టీస్ ఉంటుంది. మధ్యలో మా రోజువారీ పనులు, విశ్రాంతికి సమయం కేటాయిస్తాం. నాతో పాటు ఉన్న స్నేహితులతో చిట్ చాట్ ఉంటుంది.⇢ బాధ్యతగా ఉండాలిచిన్నప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరగడం వల్ల సొంతంగా ఇష్టాలు, అభిరుచులు అనే ధ్యాస ఏమీ లేదు. కానీ, చిన్నప్పటి నుంచి ΄ోలీసు కావాలనేది నా కల. ఇప్పటికీ అదే ఆలోచన. నా కృషి నేను చేస్తున్నాను. నేను కోరుకున్నది వస్తుందనేది నా నమ్మకం. అమ్మనాన్నలు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ΄ోలీసుని అయి మా అమ్మ నాన్నలను, చెల్లెలిని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత అనుకుంటున్నాను’’అంటూ ముగించింది దీప్తి. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
చరిత్ర సృష్టించిన తంగవేలు.. మనసును కదిలించే కథ
భారత పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలు సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో T63 హై జంప్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించాడు.జపాన్‌లోని కోబేలో జరిగిన ఈవెంట్లో 1.88 మీటర్లు దూకి పసిడి ఒడిసిపట్టాడు 28 ఏళ్ల తంగవేలు. అంతేకాదు పనిలో పనిగా శరత్ కుమార్ పేరిట ఉన్న(1.83 మీటర్లు) రికార్డు కూడా బద్దలు కొట్టాడు.మనసును కదిలించే కథతమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు ఐదేళ్ల వయసులో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. తాగి బస్సు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన కుడికాలును శాశ్వతంగా పోగొట్టుకున్నాడు.అయితే, తంగవేలు చదివే పాఠశాలలోని పీఈటీ సర్ అతడిని ఎంతగానో ఎంకరేజ్ చేశాడు. ఒంటికాలితోనే హై జంప్‌లో రాణించేలా శిక్షణ ఇచ్చాడు.తల్లే తండ్రిగా మారి.. రోజూ వారీ కూలీగాతంగవేలు బాల్యం కూడా కష్టంగా గడిచింది. అతడి తల్లి రోజూ వారీ కూలీ. కొడుకును పోషించుకునేందుకు అప్పుడప్పుడు కూరగాయలు కూడా అమ్మేవారు.ఇలాంటి ఒడిదుడుకుల నడుమ పాఠశాల విద్య పూర్తి చేసిన తంగవేలు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించాడు. చదువుకుంటూనే ఆటపై కూడా దృష్టి సారించిన అతడు జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించాడు.పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్అంచెలంచెలుగా ఎదిగిన తంగవేలు 2016 రియో పారాలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు.అందుకున్న పురస్కారాలుహై జంప్‌లో విశేష ప్రతిభ కనబరిచిన తంగవేలును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అదే విధంగా అర్జున అవార్డు కూడా ప్రదానం చేసింది. ఇక తంగవేలు 2020లో అత్యుత్తమ క్రీడా పురస్కారం ఖేల్ రత్న అందుకున్నాడు. ధ్యాన్ చంద్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.డబ్బు మొత్తం వాటికే ఖర్చు పెట్టివివిధ టోర్నీల్లో పతకాలు గెలవడం ద్వారా సంపాదించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తంగవేలు పొలాలు కొనేందుకు వినియోగించాడు. తన తల్లి కోసం ఇంటిని కూడా నిర్మించాడు.చదవండి: MS Dhoni: ఐపీఎల్‌కు గుడ్‌బై?.. ధోని కీలక వ్యాఖ్యలు That's Mariyappan Thangavelu. Just few hours back he won India's 🇮🇳 first ever Gold Medal in High Jump at World Para Athletics. Media won't share stories of such incredible athletes. But should know more about him.At the age of 5, he met with an accident where a drunk bus… pic.twitter.com/d4zaKEXJR5— Dilip Kumar (@kmr_dilip) May 22, 2024 -
World Para Championships: శభాష్ దీప్తి...
కోబే (జపాన్): ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్, తెలంగాణకు చెందిన దీప్తి జివాంజి పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచ రికార్డుతో ఆమె స్వర్ణం సొంతం చేసుకోవడం విశేషం. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల (టి20 కేటగిరీ) పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ ఈవెంట్లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (55.12 సెకన్లు)ను దీప్తి బద్దలు కొట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో 56.18 సెకన్లతో రేసును ముగించన 20 ఏళ్ల దీప్తి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ టోరీ్నలో ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పతకాలు ఉండగా, శనివారం వరకు పోటీలు జరుగుతాయి. పేదరికం నుంచి పైకెగసి... పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఉండగా, మరో వైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా ఊర్లో అందరూ హేళన చేసేవారు. ఇలాంటి సమయంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ మీట్లో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన మిత్రుడి ద్వారా ఆయనకు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో కోచింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో ఆమెకు శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి ఆరి్థకంగా సహకారం అందించారు. తన ప్రతిభ కారణంగా కెరీర్ ఆరంభంలో ఆమె అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్íÙప్లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆరి్థక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ విజయం తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఇదే ప్రపంచ రికార్డు జోరులో మున్ముందు పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగల సత్తా దీప్తిలో ఉంది. -
ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో కరమ్‌జ్యోతికి కాంస్యం
లండన్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. మహిళల ఎఫ్–55 డిస్కస్ త్రో ఈవెంట్లో కరమ్జ్యోతి దలాల్‌కు కాంస్య పతకం దక్కింది. ఆమె డిస్క్‌ను 19.02 మీటర్ల దూరం విసిరి మూడో స్థానాన్ని సంపాదించింది. ఇంతకుముందు జావెలిన్ త్రోలో సుందర్ సింగ్ గుర్జర్ స్వర్ణం, క్లబ్ త్రోలో అమిత్ సరోహా రజతం సాధించారు.