నేను పోకిరినే అంటున్న జైఆకాశ్‌ | jai akash new film ama non pori kkidan | Sakshi
Sakshi News home page

నేను పోకిరినే అంటున్న జైఆకాశ్‌

Published Fri, Jan 20 2017 3:49 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

నేను పోకిరినే అంటున్న జైఆకాశ్‌

నేను పోకిరినే అంటున్న జైఆకాశ్‌

అవును నేను పొకిరినేనంటున్నారు నటుడు జైఆకాశ్‌. ఏమిటీ ఆశ్చర్యంగా ఉందా? ఈయన తాజా చిత్రం పేరు అమా నాన్  పొరి క్కిదాన్ . ఏమిటండీ అలాంటి టైటిల్‌ పెట్టారు అనుకుంటున్నారా? దానికీ జైఆకాశ్‌ వద్ద బదులుంది. నెగటీవ్‌ వైబ్రేషన్స్ తో కూడిన టైటిల్స్‌ పాజిటీవ్‌ రిజల్ట్స్‌నిస్తున్నాయి అన్నదే ఆయన సమాధానం. జైఆకాశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా అనిషా, దీప్తి నాయికలుగా నటిస్తున్నారు.

పొన్నంబళం, పవర్‌స్టార్, శ్యామ్స్, సునిల్‌శెట్టి, కయల్‌ విన్సెంట్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో ముంబైకి చెందిన జితేంద్రసింగ్‌ విలన్ గా నటిస్తున్నారు. జీ ఫిలింస్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఇంతకు ముందు చెన్నై టూ బ్యాంకాంగ్‌ చిత్రాన్ని నిర్మించిన షాజహాన్  ఈ చిత్రానికి నిర్మాత. దేవరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యూకే.మురళి సంగీతాన్ని అందిస్తున్నారు.చిత్రం బుధవారం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.

చిత్ర వివరాలను జైఆకాశ్‌ తెలుపుతూ తాను హీరోగా నటిస్తున్న అత్యంత భారీ చిత్రం ఇదన్నారు. దేశ, విదేశాల్లో అక్రమ వ్యాపారాలను చేసే వ్యక్తికి దంపతుల కారణంగా సమస్యలు ఏర్పడతాయన్నారు.దీంతో అతను వారిని అంతం చేయడానికి ప్రయత్నిస్తాడన్నారు. అలా అతని దుర్మార్గాని హీరో భార్య హతం అవుతుందన్నారు. చనిపోయే ముందు తన మరణానికి కారణమైన వారిని కనిపెట్టి ప్రతీకారం తీసుకోవాలని భర్తను కోరుతుందన్నారు.

దీంతో అమాయకుడైన హీరో పగతో రగిలిపోయి దేశదేశాలు చుట్టి విలన్ పై ఎలా ప్రతీకారం తీసుకున్నాడన్నదే చిత్ర కథ అని తెలిపారు. ఇందులో తాను ఏడు గెటప్‌లలో కనిపిస్తానని చెప్పారు. చెన్నై, హాంకాంగ్, జర్మనీ దేశాల్లో మూడు షెడ్యూల్‌లలో 60 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేసి చిత్రాన్ని మేలో విడుదలకు ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.చిత్రంలో భారీ పోరాటాలు,ఛేజింగ్స్‌ చోటు చేసుకుంటాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement