ద్రోహి  | Drohi : National Cinema Day Special for Rs 112 only | Sakshi
Sakshi News home page

ద్రోహి 

Oct 9 2023 3:24 AM | Updated on Oct 9 2023 3:24 AM

Drohi : National Cinema Day Special for Rs 112 only - Sakshi

సందీప్‌ కుమార్, దీప్తీ వర్మ

సందీప్‌ కుమార్, దీప్తీ వర్మ జంటగా విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘ద్రోహి’. ‘ద క్రిమినల్‌’ అన్నది ఉపశీర్షిక. గుడ్‌ ఫెలో మీడియా, సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌ డే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై విజయ్‌ పెందుర్తి, డి. శ్రీకాంత రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు నేషనల్‌ సినిమా డేని పురస్కరించుకుని మల్టీప్లెక్స్‌లో రూ. 112లకే సినిమా టిక్కెట్‌ ఇస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

ఈ సినిమా టీజర్‌ని నటుడు త్రిగుణ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘సందీప్, విజయ్‌లకు కళ అంటే ప్రాణం. దర్శకుడి పని తీరు టీజర్‌లో కనిపించింది. ఈ చిత్రం విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘అద్భుతమైన డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. క్రైమ్, థ్రిల్లర్‌తో పాటు అన్ని అంశాలున్నాయి’’ అన్నారు సందీప్‌ కుమార్‌. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉన్నాయి.. ఎవర్నీ నిరాశపరచదు’’ అన్నారు విజయ్‌ పెందుర్తి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు నటి డెబా డాలీ. ఈ చిత్రానికి కెమెరా: అశోక దార్బీరు, సంగీతం: అనంత నారాయణ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement