Sandeep Kumar
-
ద్రోహి
సందీప్ కుమార్, దీప్తీ వర్మ జంటగా విజయ్ పెందుర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘ద్రోహి’. ‘ద క్రిమినల్’ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెలో మీడియా, సఫైరస్ మీడియా, వెడ్నెస్ డే ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, డి. శ్రీకాంత రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని మల్టీప్లెక్స్‌లో రూ. 112లకే సినిమా టిక్కెట్ ఇస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా టీజర్‌ని నటుడు త్రిగుణ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘సందీప్, విజయ్‌లకు కళ అంటే ప్రాణం. దర్శకుడి పని తీరు టీజర్లో కనిపించింది. ఈ చిత్రం విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘అద్భుతమైన డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. క్రైమ్, థ్రిల్లర్‌తో పాటు అన్ని అంశాలున్నాయి’’ అన్నారు సందీప్ కుమార్. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉన్నాయి.. ఎవర్నీ నిరాశపరచదు’’ అన్నారు విజయ్ పెందుర్తి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు నటి డెబా డాలీ. ఈ చిత్రానికి కెమెరా: అశోక దార్బీరు, సంగీతం: అనంత నారాయణ్. -
అప్పులు తీర్చలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం..!
సంగారెడ్డి: స్వయం ఉపాధి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సాపూర్ మండలం రాంచంద్రపురంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుని తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వడ్ల గిరికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు సందీప్‌కుమార్(26) డిప్లొమా వరకు చదివి మధ్యలోనే మానేశాడు. ఇతనికి పెళ్లి కాలేదు. ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో స్వయం ఉపాధితో ఎదుగుదామని అప్పు చేసి ఆటో కొనుగోలు చేశాడు. దానిపై సంపాదన లేక అప్పు ఎలా తీర్చాలో అని మదన పడేవాడు. దీంతో మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కడుపులో మంటలు భరించలేక తండ్రికి ఫోన్‌చేసి విషయం చెప్పాడు. సందీప్‌కుమార్‌ను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి సంగారెడ్డికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 12.20గంటలకు మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ద్రోహి వస్తున్నాడు
సందీప్ కుమార్ బొడ్డ పాటి, దీప్తి వర్మ జంటగా విజయ్ పెందుర్తి దర్శకత్వంలో రూపొందిన ఫిల్మ్ ‘ద్రోహి’. ‘ది క్రిమినల్’ అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, ఆర్. రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా లుక్, గ్లింప్స్ ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ప్రేక్షకులు మెచ్చే అన్ని థ్రిల్లర్ అంశాలున్న చిత్రం ఇది. ఈ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. డెబి, ‘షకలక’ శంకర్, నిరోజ్, శివ, మహేశ్ విట్టా కీలక పాత్రలు పొషించిన ఈ చిత్రానికి సంగీతం: అనంత్ నారాయణ. -
జీవో ఆర్టీ ప్రామాణికమా లేక మెమోనా?
సాక్షి, హైదరాబాద్: సర్విసుల రెగ్యులరైజేషన్ ప్రక్రియపై జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో (జేపీఎస్) ఆందోళన వ్యక్తమౌతోంది. ఉద్యోగాలు క్రమబద్ధీకరించేందుకు ఐదేళ్ల కిందట అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన జీవో ఆర్టీ ప్రామాణికమా? లేక తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన మెమో ప్రామాణికమా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసి మూల్యాంకనం చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తాజాగా జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా ఎస్పీ, జిల్లా అటవీ అధికారులతో ఒక కమిటీని నియమిస్తూ మెమోను జారీచేశారు. వివిధ అంశాల ప్రాతిపదికన... ఆయా విధుల నిర్వహణకు అనుగుణంగా వందమార్కులు కేటాయించి, నాలుగేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌ల పనితీరు మదింపు ఆధారంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఉంటుందని స్పష్టంచేశారు. జీవో ఆర్టీలో ఏముంది? జిల్లా ఎంపిక కమిటీల ద్వారా జేపీఎస్‌ల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించి 2018 ఆగస్టు 30న అప్పటి పీఆర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ జీవో ఆర్టీ నెంబర్ 617ను జారీచేశారు. ప్రభుత్వం జేపీఎస్‌ల పోస్టులను మంజూరు చేసినందున, మూడేళ్ల సర్విసు పూర్తిచేసుకున్నాక సంతృప్తికరమైన పనితీరు కనబరిచిన జేపీఎస్‌లను గ్రేడ్–4 పంచాయతీ సెక్రటరీలుగా రెగ్యులరైజ్ చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. అయితే వీరి క్రమబద్ధికరణను పరిగణనలోకి తీసుకునేందుకు జేపీఎస్‌ల మూడేళ్ల సర్విసు కాలాన్ని నాలుగేళ్లకు పెంచుతూ గతేడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత మార్చినెలతో వారి నాలుగేళ్ల సర్విసు కూడా పూర్తయ్యింది. క్రమబద్ధికరణ ప్రక్రియ మాత్రం మొదలుకాలేదు. దీంతో జేపీఎస్‌లు నిరవధిక సమ్మెకు దిగి 16 రోజుల తర్వాత విర మించుకున్నారు. జేపీఎస్‌లు విధుల్లో చేరేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నపుడే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పలేదని, మెరుగైన పనితీరు ఆధారంగా నిపుణుల కమిటీ నివేదిక మేరకు జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టంచేసింది. కొన్నిరోజుల తరువాత జేపీఎస్‌ల సర్విసులను క్రమబద్ధిక రించే చర్యలు చేపడతామని అధికారులు ప్రకటించారు. సీఎస్ దృష్టికి... ఈ నేపథ్యంలో తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి జారీచేసిన మెమో నేపథ్యంలో జేపీఎస్‌ల విధులు, బాధ్యతల పట్ల ఏమాత్రం సంబంధం లేని జిల్లా ఎస్పీలు, జిల్లా అటవీ అధికారులతో మూల్యాంకనం చేయించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. వివిధ విభాగాల పీఆర్ ఉద్యోగులు, సంఘాలు సైతం ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల గురించి త్వరలోనే సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉద్యోగ సంఘాలున్నాయి. -
‘కంటివెలుగు’పై అవగాహన కల్పించండి
సాక్షి, హైదరాబాద్/ ఏజీవర్సిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం అమలుకోసం గ్రామాల్లో తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులకు సూచించారు. ఈనెల 18 నుంచి కంటి వెలుగు రెండో విడత ప్రారంభించనున్న నేపథ్యంలో గ్రామాలలో ఈ కార్యక్రమం తేదీలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గురువారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఈ పథకంపై ఏర్పాట్లను సమీక్షించారు. ఎస్‌హెచ్‌జీల ఆదాయం పెంచడమే లక్ష్యం.. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆదాయ మార్గా లను పెంపొందించే లక్ష్యాన్ని మరువరాదని పీఆర్ ‘సెర్ప్’సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం వివిధ జిల్లాల అధికారుల ఓరియెంటేషన్ వర్క్ షాపులో ఆయన మాట్లాడారు. గత సీజన్లో ఖమ్మం జిల్లాలో ఎస్‌హెచ్‌జీ ద్వారా ప్రయోగాత్మకంగా ఎండుమిర్చి కొనుగోలు, మార్కెటింగ్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటు మహబూబాబాద్, వరంగల్, జనగామ, సూర్యాపేట జిల్లాలకు దీనిని విస్తరించనున్నట్లు వెల్లడించారు. -
‘టీమ్ వైఎస్ఎస్ఆర్’ కోఆర్డినేటర్‌గా మల్లాది సందీప్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ టీమ్ వైఎస్ఎస్ఆర్ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా మల్లాది సందీప్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు సందీప్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మల్లాది పేర్కొన్నారు. కీలక బాధ్యతలను అప్పగించిన పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో పనిచేస్తానని సందీప్‌కుమార్ తెలిపారు. చదవండి: సమస్యలు లేవంటే ముక్కు నేలకు రాస్తా -
మెడికల్ కాలేజీలకు సెలవుల్లేవ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈనెల 8వ తేదీ నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీచేసింది. మెడికల్ కాలేజీలను సెలవుల నుంచి మినహాయించినట్లు ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జీవోలో పేర్కొన్నారు. 17 నుంచి విద్యాసంస్థలు పనిచేస్తాయని తెలిపారు. -
స్థానిక ప్రజాప్రతినిధుల వేతనం 30శాతం పెంపు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల (జెడ్పీటీసీ) గౌరవ వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.13 వేలకు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీ), గ్రామ సర్పంచుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6,500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పీఆర్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. జూన్ నెల నుంచే పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని తెలియజేశారు. కాగా, స్థానిక సంస్థలను బలోపేతం చేసి గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు ఈ పెంపుదల జరిగిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఆత్మగౌరవం నిలబెట్టేందుకు ప్రత్యేకగ్రాంట్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు నిధుల విడుదలతో పాటు ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలని సీఎం కేసీఆర్‌కు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి కోరారు. స్థానిక ప్రతినిధుల గౌరవ వేతనం పెంపు, స్థానికసంస్థల బలోపేతంపై కౌన్సిల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చర్చించడం సంతోషదాయకమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం: కవిత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తంచేశారు. వేతనాల పెంపుతో స్థానికసంస్థలు బలోపేతం కావడంతో పాటు సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వేతనాల పెంపు ఉత్తర్వులు జారీచేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు కవిత కృతజ్ఞతలు తెలిపారు. -
కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించాలి
సాక్షి, హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) పెద్ద పెద్ద వ్యాపారాలు, రంగాల్లోకి ప్రవేశించి సత్తా చాటాలని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. నాణ్యతతో కూడిన కారం, పసుపు వ్యాపారాలు, కూరగాయల సాగు వంటి వాటిని మొదలుపెట్టాలన్నారు. సోమవారం రంగారెడ్డి జడ్పీ సమావేశ మందిరంలో స్త్రీనిధి రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్త్రీనిధి ద్వారా రాష్ట్రంలోని 619 మండల, పట్ట ణ సమాఖ్యలతో పాటు, నైబర్‌హుడ్ సెంట ర్లకు రూ.4.31 కోట్ల విలువైన 692 కంప్యూ టర్లు, యూపీయస్‌లు, ప్రింటర్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సురక్ష బీమా పథకం ద్వారా ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.1 లక్ష వరకు జీవిత బీమా పథకం, స్త్రీనిధి మహిళా సభ్యుల పిల్లలు ఇంటర్మీడియట్ చదివేందుకు స్కాలర్ షిప్‌లు అందజేస్తున్న ట్లు తెలిపారు. ఈ ఏడా ది స్త్రీనిధి ద్వారా మళా స్వయం సహాయక సంఘాలకు రూ.3,060 కోట్ల మేర అందజేయనున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి సంస్థ ద్వారా ఒక లక్ష పాడి పశువుల కొనుగోలుకు రుణ సౌకర్యం అందజేస్తున్నట్లు చెప్పారు. శ్రీనిధి విజయ డైరీ, కరీంనగర్ డైరీ, ముల్కనూరు మహిళా సహకార డైరీ, నార్ముల్ డైరీల సహకారంతో రైతులతో సమన్వయం చేసుకొని పాడి పరిశ్రమ అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో స్త్రీనిధి సంస్థలో అందుబాటులో ఉన్న రూ.10 వేల కోట్ల డబ్బును ఎస్‌హెచ్‌జీలు సద్వినియోగం చేసుకోవాలని పీఆర్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. -
మూడు పేర్లతో వేధించిన యువతి అరెస్ట్
రాయపర్తి: ఒకే అమ్మాయి మూడు పేర్లతో వ్యవహరించి యువకుడి ఆత్మహత్యకు కారణ మైంది. ఆ యువతిని అదుపులోకి తీసుకుని కేసు వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మైలపాక సందీప్‌కుమార్(23)కు దుగ్గొండి మండలం లక్ష్మిపురానికి చెందిన ఓ యువతి ఫోన్ ద్వారా పరిచయమైంది. ఈ క్రమంలో సందీప్‌ను ప్రేమిస్తున్నట్లు చెప్పి అతడికి ప్రియురాలిగా వ్యవహరించింది. ఇదేసమయంలో అదే యువతి స్రవంతి, కావ్య, మనీషా పేర్లతో వేరే నంబర్ల ద్వారా సందీప్‌తో మాట్లాడి ప్రేమ పేరుతో వల వేసింది. అతడు కూడా ప్రేమగా మాట్లాడటంతో ఆ యువతి సందీప్‌ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. దీంతో భయపడిపోయిన ఆ యువకుడు ఈనెల 12న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి ఫోన్ కాల్స్ పరిశీలించిన అనంతరం..ఈనెల 18న అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో ఆ యువతిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
3 పేర్లు 3 ఫోన్ నంబర్ల కేసు: సోదరి బాల్య స్నేహన్ని వాడుకుని..
సాక్షి, వరంగల్: ఒక అమ్మాయి సందీప్ అనే యువకుడికి ప్రేమ వలవేసి.. చివరకు అతని ఆత్మహత్యకు కారణమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఘటన వరంగల్‌లో కలకలంగా మారింది. అయితే, మొరిపిరాలలో జరిగిన లవ్ చీటింగ్ ఘటనలో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాయలేడి మృతుడి సోదరి బాల్య స్నేహాన్ని వాడుకుని అతడితో ప్రేమాయణంను నడిపిందని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీంతో గ్రామాలకు కూడా హనీట్రాప్ కల్చర్ విస్తరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఇన్స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లలో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి కొందరు కేటుగాళ్లు హానీ ట్రాప్‌కు పాల్పడుతున్నారు. చదవండి: 3 పేర్లు 3 ఫోన్ నంబర్లు.. స్రవంతికి పెళ్లయినా వదల్లేదు.. -
ప్రేమ పేరుతో యువతి మోసం : పురుగుల మందు తాగిన యువకుడు
-
స్రవంతే.. కావ్య, మనీషాలా మారి వేధించింది.. చివరికి..
సాక్షి, రాయపర్తి: ఒకే అమ్మాయి. మూడు పేర్లతో వ్యవహరించింది. మూడు వేర్వేరు ఫోన్ నంబర్లు వాడింది. ఓ యువకుడికి ప్రేమ వల విసిరింది. రకరకాల కథలు చెప్పింది. వేధింపులకు గురి చేసింది. బెదిరింపులకు కూడా దిగింది. చివరకు అతని ఆత్మహత్యకు కారణమయ్యింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మెరిపిరాలకు చెందిన మైలపాక సోమయ్య, జయమ్మ కుమారుడు మైలపాక సందీప్‌కుమార్ (23) మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. తన సోదరితో కలిసి చదివిన దుగ్గొండి మండలం లక్ష్మీపురానికి చెందిన స్రవంతి ఫోన్లో పరిచయమైంది. ఇద్దరు రోజూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అయితే ఆమే మరో ఇద్దరు యువతుల్లాగా (కావ్య, మనీషా పేర్లతో) వేరే నంబర్లతో ఫోన్ చేయడం ప్రారంభించింది. ముగ్గురు అమ్మాయిల మాదిరి వ్యవహరిస్తూ నేను ప్రేమిస్తున్నానంటే.. నేను ప్రేమిస్తున్నానని చెప్పొకొచ్చింది. కేవలం ఫోన్లో మాట్లాడటం తప్ప వారిద్దరూ ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసుకోలేదు. ఇలా మాట్లాడే క్రమంలో సందీప్.. తాను మొదట పరిచయమైన స్రవంతినే ప్రేమిస్తున్నానని చెప్పేవాడు. ఈ క్రమంలో స్రవంతికి పెళ్లి అయ్యింది. కానీ ఆమె మిగతా ఇద్దరిలాగా ఫోన్లో సందీప్‌తో మాట్లాడుతూనే ఉంది. మనీషా పేరుతో ఫోన్ చేస్తే.. స్రవంతి పెళ్లి అయిపోయింది కదా.. నన్ను పెళ్లి చేసుకో అనేది. కావ్య పేరుతో ఫోన్ చేసినప్పుడు కూడా అలాగే అనేది. అయితే సందీప్ తాను ఒకే అమ్మాయిని ప్రేమించానని, ఆమె పెళ్లయిపోయింది కాబట్టి ఇక ఎవరినీ ప్రేమించలేనని చెప్పేవాడు. ఆరు నెలలు ఇలానే గడిచాయి. తర్వాత స్రవంతి భర్తను వదిలేసి వచ్చిందని, కాబట్టి తమను ప్రేమించకపోయినా పర్వాలేదుకానీ.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ మిగతా ఇద్దరు పేర్లతో ఫోన్ చేసి వేధించడం ప్రారంభించింది. అయితే సందీప్.. తాను గతంలో ప్రేమించానని, తనను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాక మళ్లీ ఆమెను ఎలా చేసుకుంటానని చెప్పేవాడు. అయినా నీ కోసమే భర్తను వదిలేసి వచ్చిందని, పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని ఆ రెండు పేర్లతో ఫోన్లో మాట్లాడుతూ బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో మనస్తాపానికి గురైన సందీప్ ఈనెల 12న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బండారి రాజు తెలిపారు. -
ఇంకొన్నాళ్లు ఇంటి నుంచే పని!
‘కరోనా సంక్షోభానికి ముందు నుంచే హైదరాబాద్ ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోం విధానం అమల్లో ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో 95 శాతం మంది ఇంటి నుంచే పనిచేశారు. ఉద్యోగుల ఉత్పాదక సామర్థ్యం పెరగడంతో మరికొంత కాలం ఇదే విధానం కొనసాగించేందుకు ఐటీ కంపెనీలు మొగ్గు చూపుతాయి. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారు ఎమర్జింగ్ టెక్నాలజీపై శిక్షణ పొందితే మంచిది’ అని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల అన్నారు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ ఐటీ రంగం స్థితిగతులపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ► కరోనాకు ముందు నుంచే హైదరాబాద్ ఐటీ రంగంలో 15 – 20 శాతం మందికి ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు ఉండేది. కరోనా సంక్షోభం తరువాత మార్చి రెండో వారం నుంచే మన దగ్గర చాలా ఐటీ కంపెనీలు ఈ విధానాన్ని అనుసరించాయి. దీంతో సుమారు 90 – 95 శాతం మంది లాక్డౌన్ సమయంలో ఇంటి నుంచే పనిచేశారు. ► ఒక్కసారిగా లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సి రావడంతో.. కొందరికి లాప్‌టాప్‌లు, డాంగుల్స్ లేకపోవడం, బ్రాడ్‌బ్యాండ్ సమస్యల వంటివి తలెత్తాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, మారుమూల ప్రాంతాల నుంచి ఈ విధానంలో పనిచేయడంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. హైదరాబాద్ ఐటీ రంగం తనకున్న సామర్థ్యంతో దీన్నుంచి బయటపడింది. వర్క్ ఫ్రమ్ హోం విధానం ద్వారా 90 శాతంగా ఉన్న ఉద్యోగుల ఉత్పాదక సామర్థ్యం 130 శాతం ఉన్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీంతో కొన్ని కంపెనీలు జూలై వరకు, మరికొన్ని కంపెనీలు పరిస్థితి చక్కబడే వరకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ కొనసాగించవచ్చు. పర్యవేక్షణ, డేటా సెంటర్ల సిబ్బంది మినహా కోడర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఉంది. ► కరోనా సంక్షోభంతో చాలా ఐటీ కంపెనీలు క్యూబికల్స్ అద్దె, హౌస్ కీపింగ్, క్యాబ్‌లు, విద్యుత్ బిల్లులు తదితర నిర్వహణ వ్యయాలను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐటీ కంపెనీలు వ్యూహాలను మార్చు కుంటాయి. చైనాపై అమెరికాతో పాటు పలు దేశాలు ప్రతికూల ధోరణితో ఉండటం భారతీయ ఐటీ రంగానికి, ప్రత్యేకించి హైదరాబాద్‌కు మేలు చేస్తుంది. ఐటీ పెట్టుబడులతో పాటు కొత్త ప్రాజెక్టులొచ్చే అవకాశం ఉండటంతో ఈ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. ► ఐటీ రంగంలో శాశ్వత సిబ్బంది కాకుండా పెద్ద కంపెనీల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది ఎప్పుడూ బఫర్‌లో ఉంటారు. ప్రస్తుత సంక్షోభం అక్కడక్కడా వీరి ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చు. ఐటీ రంగంలో ఆరోగ్యం, ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో (వెర్టికల్స్)లో పనిచేసే వారికి ఇబ్బంది లేకపోవచ్చు. అయితే కరోనా ఈ సంక్షోభ సమయంలోనూ వైద్య, ఆరోగ్య రంగాల్లో కొత్త అవకాశాలను తెచ్చిపెడుతోంది. ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్ వంటి ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్‌కు మంచి భవిష్యత్తు ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీపై దృష్టి పెడితే మంచి అవకాశాలుంటాయి. ► కరోనా సంక్షోభ సమయంలో ‘టిటా’ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ‘కోవిడ్–19 హ్యాకథాన్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో 8వేల మంది పాల్గొని సలహా సూచనలిచ్చారు. ‘టీ కన్సల్ట్’ యాప్ ద్వారా రోగులు, వైద్యులు ఆన్లైన్ విధానంలో సంప్రదింపులు జరిపే విధానానికి మంచి స్పందన వస్తోంది. -
కలెక్టర్ దూకుడు.. అధికారుల హడల్..
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాకు నూతంగా వచ్చిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తన మార్క్ పాలన చూపుతున్నారు. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు. ఈనెల 3 నుంచి విధుల్లో చేరిన నుంచి తనదైన శైలిలో అధికార, రోజువారి పాలనలో వినూత్నంగా వ్యవహరిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లోనే తన మార్కును చూపించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడంతో పాటు రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నారు. తహసీల్దార్ల బదిలీలు.. అధికారులు ఒకవేళ ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహారణ.. ఆదివారం జిల్లాలో ఆరుగురు తహసీల్దార్లను ఒక్కసారిగా బదిలీ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ బదిలీల వెనక అసలు కారణం తహసీల్దార్లు ఎవరూ ఆయా మండలాల హెడ్ క్వార్టర్స్‌లలో లేకపోవడంతోనే ఆగ్రహంతో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ బదిలీలతో విధుల పట్ల ఆలసత్వం వహించే వారికి గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు అయింది. దీంతో ఇతర విభాగాల అ«ధికార యంత్రాంగం కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి్సన ఆవశ్యకం ఏర్పడుతుంది. ప్రక్షాళన షురూ.. దేశంలోనే వెనకబడిన జిల్లాగా ఉన్న గిరిజన ప్రాంతమైన కుమురం భీం జిల్లాలో అధికార యంత్రాంగం మైదాన ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులతో పోల్చితే కాస్తా భిన్నంగా ఉంటుంది. వేరే ప్రాంతం వారు ఇక్కడ వచ్చి పనిచేసేందుకు పెద్దగా ఆసక్తిచూపని సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో పనిచేస్తున్న వాళ్లు సైతం ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దీంతో అనేక ఫైళ్లు, కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలులో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. వీటన్నింటిని నివారించేందుకు జిల్లా యంత్రాంగం అంతా తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మండలాధికారులు, జిల్లా అధికారులు ఎవరూ కూడా హెడ్‌క్వార్టర్ దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చారు. అలాగే పాలనలో ప్రక్షాళన ప్రారంభించారు. జిల్లాలో ఈ– ఆఫీస్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ విధానంలో మొత్తం సమాచారం అంతా అన్లైన్లోనే సాగనుంది. ఇందులో భాగంగా ప్రతి ఆఫీస్‌కు ప్రత్యేకమైన మెయిల్‌కు, ప్రత్యేకమైన లాగిన్‌తో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతిశాఖలో ప్రతిస్థాయిలో ఏదైనా ఒక ఫైల్ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఓ సర్వర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ– ఆఫీస్ అమలు అయితే కిందిస్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకూ వివిధ దశలలో ఫైళ్లు ఎక్కడ పెండింగ్ ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో ఎవరూ విధుల్లో అలసత్వం వహిస్తారో సులువుగా గుర్తించవచ్చు. అలాగే ప్రతివారం వచ్చే ప్రజా ఫిర్యాదుల్లో ఆలసత్వం వహించద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి.. గిరిజన ప్రాంతంలో మౌలిక వసతులైనా విద్య, వైద్యంపైనే ప్రధానంగా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికీ అనేక గిరిజన గ్రామాలు సరైన వైద్యం అందని స్థితిలో ఉన్నాయి. ఈ సమస్యలను అధిగవిుంచేలా జిల్లా వైద్య వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో సర్కార్ బడులు, ఆశ్రమ, ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన విద్యను అందించేలా కొత్త కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఇప్పటికే విద్య, వైద్య పరిధిలో సంబంధిత సమచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు శాఖలే కాకుండా జిల్లాలో ఇతర ప్రభుత్వ శాఖలపైన కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ జిల్లా స్థితి గతులను తెలుసుకుంటున్నారు. ఏ శాఖ ఎక్కడ వెనకబడి ఉందో గుర్తించి అందుకు తగినట్లుగా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు. గతంలో పనిచేసిన ముగ్గురు కలెక్టర్ల కంటే కొత్త కలెక్టర్ నిక్కచ్చిగా వ్యవహరించడంతో అధికారులు హడలెత్తిపోతున్నారు. ఎక్కడైనా ఏమైనా పోరపాటు జరిగితే ఎలా స్పందిస్తారో అని అధికార యంత్రాంగం అంతా ముందు జాగ్రత్తలు పడుతున్నారు. -
సందీప్‌కుమార్‌కు జుడిషియల్ రిమాండ్
న్యూఢిల్లీ: రేప్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు 14 రోజులు జుడిషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. సందీప్ కుమార్‌కు పోలీస్ కస్టడీ ముగియడంతో శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణలో భాగంగా సందీప్‌కు తదుపరి పోలీస్ కస్టడీ అవసరంలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. దీంతో ఈ నెల 23 వరకు సందీప్‌ను జుడిషియల్ రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సందీప్ కుమార్ ఓ మహిళతో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పటి సీడీ వెలుగుచూడటంతో ఆయన పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు కోసం సందీప్ కార్యాలయానికి వెళ్లినపుడు మత్తమందు కలిపిన డ్రింక్ ఇచ్చి, తనపై అత్యాచారం చేశాడని సీడీలో ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. -
కేజ్రీవాల్ నన్ను హర్ట్ చేశాడు: హజారే
రాలేగావ్ సిద్ది(మహారాష్ట్ర) : ఢిల్లీ రాష్ట్ర అధికార పక్షం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతుండటం, జైళ్లకు వెళ్లడం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌పై తాను పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు జైలుకు వెళ్లడం, మరికొందరిపై ఆరోపణలు రావడం బాధ కలిగిస్తోందని అన్నారు. కేజ్రీవాల్ తనతో ఉన్నప్పుడు గ్రామ్ స్వరాజ్ పేరుతో ఒక పుస్తకం రాశారని తెలిపిన హజారే.. గ్రామ్ స్వరాజ్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ చాలా ఏళ్లు తనతో ఉన్నారని, రాజకీయాల్లో ఆయన సరికొత్త ఒరవడిని తీసుకువస్తారని ఆశించానని హజారే పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన సహచరులు చేస్తున్న పనులు, ముఖ్యంగా కొందరు జైలుకు వెళ్లడం, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం తనకు చాలా బాధ కలిగించిందని హజారే చెప్పారు. -
ఆ సీడీలతో నన్ను బ్లాక్మెయిల్ చేశాడు!
న్యూఢిల్లీ: ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల సీడీల కేసులో మరో కీలక విషయం వెలుగుచూసింది. ఈ సీడీలను చూపించి తనను తన వ్యక్తిగత కార్యదర్శి బ్లాక్మెయిల్ చేశారని ఆయన పోలీసులకు తెలిపినట్టు సమాచారం. గతంలో సందీప్‌కుమార్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఈ సీడీలను లీక్ చేసి చాలామందికి పంచిపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సోమవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, సీడీల లీకేజీ వెనుక ప్రవీణ్ హస్తముందని, ఈ సీడీల వ్యవహారంలో అతను తనను బ్లాక్మెయిల్ చేశాడని నిందితుడు సందీప్ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. సందీప్‌కుమార్ ఇద్దరు మహిళలతో రాసలీలలు గడుపుతున్న రెండు వేర్వేరు సీడీలు వెలుగుచూడటంతో ఆయనను పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ సీడీలో మంత్రితో కలసి ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11 నెలల క్రితం రేషన్ కార్డు కోసం వెళితే సందీప్ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఢిల్లీ పోలీసులు సందీప్‌పై అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సందీప్‌ను కోర్టు మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. -
ఆ సీడీలను లీక్ చేసింది సెక్రటరీనే!
న్యూఢిల్లీ: ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల సీడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సందీప్ కుమార్‌కు కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఈ సీడీని లీక్ చేసి చాలామందికి పంచిపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు సోమవారం సెక్రటేరియట్‌కు వెళ్లి ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీడీ లీకేజీ వెనుక ప్రవీణ్ హస్తముందని సందీప్ భావిస్తున్నాడు. సందీప్ ఓ మహిళతో అభ్యంతరకర పరిస్థితుల్లో ఉన్న సీడీ బయటకురావడంతో ఆయన పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. ఈ సీడీలో మంత్రితో కలసి ఉన్న మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11 నెలల క్రితం రేషన్ కార్డు కోసం వెళితే సందీప్ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఢిల్లీ పోలీసులు సందీప్‌పై అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సందీప్‌ను ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించారు. -
తొలగించలేదు.. నేనే రాజీనామా చేశా!
శృంగార సీడీ వివాదంలో ఢిల్లీ మాజీ మంత్రి సందీప్‌కుమార్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయన ప్రాథమిక స్వభ్యత్వాన్ని రద్దుచేసింది. ఇద్దరు మహిళలతో సందీప్‌కుమార్ సాన్నిహిత్యంగా గడిపిన వీడియో సీడీలు వెలుగుచూడటంతో సందీప్‌కుమార్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంత్రి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. వీడియో సీడీ వివాదం నేపథ్యంలో సందీప్‌కుమార్ బర్తరఫ్ చేసినట్టు మీడియాతో కేజ్రీవాల్ పేర్కొన్నారు. కానీ, సందీప్‌కుమర్ మాత్రం తనను మంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ తొలగించలేదని, తానే ఆ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చానని చెప్పారు. వీడియో సీడీల వివాదం నేపథ్యంలో తాను రాజీనామాకు సిద్ధమని ఆయన గత నెల 31 సీఎం కేజ్రీవాల్‌కు రాసిన లేఖ వెలుగుచూసింది. ఇక ఈ వీడియో సీడీలను వెలుగులోకి తెచ్చిన ఓంప్రకాశ్ అనే వ్యక్తి శుక్రవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరై తన వాదనలను వినిపించాడు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఈ సీడీని తనకు అందించాడని, ఒక మధ్యవర్తిలాగా దానిని తాను సీఎం కేజ్రీవాల్‌కు పంపించానని, అంతేకానీ ఆ వీడియో సీడీ ఎవరు పంపారో తనకు తెలియదని చెప్పారు. -
ఆ వీడియో సీడీతో పీకల్లోతు కష్టాలు!
-
ఆ వీడియో తీసుకున్నది మంత్రేనట!
ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉండి మంత్రిపదవి కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సందీప్ కుమార్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఆ వీడియో ఇప్పటిది కాదని, కనీసం ఆరేడేళ్ల క్రితం నాటిదని సందీప్‌కుమార్‌కు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి ఆయన ఇంకా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టలేదని, అప్పటికి న్యాయ విద్య చదువుతూ ఉన్నారని అంటున్నారు. ఇందులో ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే.. సదరు వీడియో, ఫొటోలను ఆయనే స్వయంగా తీసుకున్నారని చెబుతున్నారు!! సందీప్ కుమార్ చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్లు ఎక్కడా లేదు. వీడియోలో ఉన్న మహిళలు గానీ, సందీప్ భార్య గానీ ఆయన మీద ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. కానీ, వీడియో.. ఫొటోలు ఉన్న సీడీ తనకు అందిన సరిగ్గా అరగంటలోనే ఆయన మంత్రి పదవి ఊడిపోయింది. ''మా మౌలిక విలువల విషయంలో మేమెప్పుడూ రాజీపడే ప్రసక్తి లేదు. తపపుడు పనులను భరించేకంటే ప్రాణాలు వదలడానికే ఇష్టపడతాం'' అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కాగా, ఇలాంటి కేసులోనే అభిషేక్ సింఘ్వి కూడా అన్ని పార్టీ పదవులు, పార్లమెంటరీ కమిటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు. నష్ట నియంత్రణ చర్యలలో భాగంగానే సందీప్ కుమార్ మీద కేజ్రీవాల్ చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్, బీజేపీ విమర్శించాయి. కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో ప్రదర్శనలు నిర్వహించాయి. తాను ఖండించలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే కేజ్రీవాల్ ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటారని ఆప్ మాజీ నేత యోగేంద్రయాదవ్ అన్నారు. -
ఆ వీడియో సీడీతో పీకల్లోతు కష్టాలు!
ఆప్ నేత, మాజీ మంత్రి సందీప్ కుమార్ ఓ మహిళతో గడుపుతున్న సీడీ వెలుగుచూడటం ఢిల్లీలో పెద్ద దుమారమే రేపింది. ఈ వీడియో సీడీని చూసిన వెంటనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నైతిక విలువల ఆధారంగా సందీప్ కుమార్‌ను మంత్రిపదవి నుంచి తొలగించారు. ఇది నైతిక విలువల అంశమే కాకుండా చట్టబద్ధంగానూ నేరపూరిత అంశం కావడంతో సందీప్ కుమార్‌కు మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశముందని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఢిల్లీ కేబినెట్ దళిత ముఖమైన సందీప్ కుమార్ ఇన్నాళ్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. సెక్స్ టేప్ స్కాండల్ లో ఆయన దొరికిపోవడంతో మంత్రి పదవికి ఎసరు వచ్చింది. అయితే, మహిళతో రాసలీలలు జరుపుతూ ఈ వీడియోను సందీప్ కుమారే స్వయంగా తీసినట్టు చెప్తున్నారు. ఇదే నిజమైతే ఆయన చుట్టూ చట్టం ఉచ్చుబిగించే అవకాశముంది. ఐటీ చట్టం సెక్షన్ 67 ప్రకారం ఒకరితో సన్నిహితంగా గడుపుతూ ఆ సంఘటనను చిత్రీకరించడం నేరం. ఇందుకుగాను పోలీసులు కేసు నమోదు చేయవచ్చు. ఈ అశ్లీల వీడియోలో ఉన్న మహిళ స్వయంగా ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయకున్నా.. సెక్షన్ 67 ప్రకారం పోలీసులు సమోటోగా కేసు నమోదు చేసే అవకాశముంది. అయితే, ఈ అసభ్యకర సీడీ ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు వెల్లడించాల్సిన అవసరముంటుంది. దీనిని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేస్తే.. ఆ వెబ్సైట్ లింక్‌ను సమర్పించాలి. అంతేకాకుండా సీడీపై ఫోరెన్సిక్ పరీక్షలు జరిపి నిర్ధారణ చేయడం తప్పనిసరి. శిక్ష ఎంత? ఒకవేళ ఇలాంటి వీడియో అశ్లీలంగా, అసభ్యంగా ఉండి, అందులో లైంగిక చర్య లేకపోతే, నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ. ఐదు లక్షల జరిమానా విధించే అవకాశముంది. ఈ వీడియోలో లైంగిక చర్య కూడా ఉంటే ఐదేళ్ల జైలుశిక్ష, రూ. ఐదులక్షల జరిమానా కోర్టు విధిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తే అందుకుగాను మరో మూడేళ్ల జైలుశిక్ష, ఐదు లక్షల జరిమానా విధించే అవకాశముంటుంది. -
‘మా కులాన్ని అణగదొక్కేందుకు కుట్ర’
-
‘మా కులాన్ని అణగదొక్కేందుకు కుట్ర’
న్యూఢిల్లీ: తనను కుట్రపూరితంగా ఇరికించి మంత్రి పదవి నుంచి తొలగించారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత సందీప్ కుమార్ ఆరోపించారు. దళితుడిని కాబట్టే తనని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. అభ్యంతకర వీడియోలో తాను లేనని, విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. ఏకలవ్యుడిని నిరాయుధుడిని చేసినట్టుగా తమ కులం వారిని అణగదొక్కేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ‘అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించినప్పటి నుంచి నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. పేదవాణ్ణి, దళితుడిని కాబట్టే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. సీడీలో నేను ఉన్నానని ఏబీపీ కూడా నిర్థారించలేదు. ఇది మీడియా చేస్తున్న విచారణ. నేను వాల్మికి సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాపై కుట్ర చేశార’ని సందీప్ కుమార్ వాపోయారు. ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియో బయటపడడంతో మంత్రి పదవి నుంచి సంపత్ కుమార్ ను సీఎం కేజ్రీవాల్ తొలగించారు. -
'బార్లలో హ్యాపీ అవర్స్ పెట్టకూడదు'
హైదరాబాద్: అమ్మకాలు పెంచుకునేలా బార్లలో హ్యాపీ అవర్స్ పెట్టకూడదని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. శనివారం శేరిలింగంపల్లిలో ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చంద్రవదన్ మాట్లాడుతూ.. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమన్న హెచ్చరికతో పాటు మద్యం తాగి వాహనాలు నడపరాదన్న హెచ్చరికను కూడా మద్యం బాటిళ్లపై ముద్రించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పబ్‌లు, బార్లకు వచ్చి మందుతాగి వెళ్లేవారు వాహనాలు నడపకుండా సంబంధిత బార్లు, పబ్ యాజమానులే చర్యలు తీసుకోవాలని సూచించారు. 21 లోపువారికి మద్యం విక్రయించే దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపి ఏటా 5 లక్షల మంది ప్రమాదానికి గురవుతున్నారని కమిషనర్ సందీప్ కుమార్ వెల్లడించారు. ప్రమాదాలకు గురవుతున్న వారిలో 77 శాతం మంది యువకులే ఉన్నారని సందీప్ కుమార్ తెలిపారు. -
'ఆ ప్రమాదంలో ఒక్క ప్రాణం పోకపోవడం ఆశ్చర్యం'
మెల్బోర్న్: నిర్లక్ష్యంగా కారు నడిపి కొందరిని తీవ్రంగా గాయపరిచినందుకు ఓ భారతీయ సంతతి వ్యక్తికి న్యూజిలాండ్ కోర్టు భిన్నంగా శిక్ష విధించింది. 125గంటలపాటు (ఐదు రోజుల ఐదుగంటలు) కమ్యూనిటీ సేవ చేయాలని ఆదేశించింది. దీంతోపాటు మరో ఏడాదికాలంపాటు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని రద్దు చేసింది. సందీప్ కుమార్ అనే భారత సంతతి పౌరుడు 2014 జనవరిలో నిర్లక్ష్యంగా కారు నడిపాడు. ఆ సమయంలో కారులో మొత్తం ఏడుగురు తన కుటుంబ సభ్యులు ఉన్నారు. కారు డ్రైవింగ్ చేస్తూ అతడు నిద్రలోకి జారడంతో అది కాస్త రోడ్డుపక్కకు వెళ్లి ఓ పది మీటర్ల ఎత్తున్న కొండలాంటిదానికి తగిలి ఆగిపోయింది. దీంతో ఆ కారులో ప్రయాణించేవారిలో అతడి వదిన, అన్నయ్య, వారి కుమారుడు తీవ్రంగా గాయపడగా స్నేహితులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడు ఆరోపణలతో కోర్టు ఈ ఏడాది జూన్‌లో విచారణ చేపట్టింది. ఈ తీర్పు సందర్భంగా అంతపెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరగకపోవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. -
అప్పుడే పత్తి పూతపై ఆందోళన వద్దు
యాచారం: జానెడు పత్తి మొక్కకు పూత రావడంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు యాచారం మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్. ఈ ఏడాది అదనులో వర్షాల్లేకపోవడంతో విత్తే సమయానికంటే 30 రోజుల తర్వాత రైతులు పత్తి విత్తనాలు విత్తారు. దీంతో సరైన, సమృద్ధిగా వర్షాలు లేకపోవడం వల్ల ఎదుగుదల లేక జానెడు మొక్కకే పూత పూయడం ప్రారంభమైంది. వేలాది రూపాయల పెట్టుబడితో పత్తి సాగు చేస్తే జానెడు మొక్కకు పూసిన 5 వరకు పూతలు కాత కాస్తే పెట్టుబడులు ఎలా వెళ్లుతాయని రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఇబ్రహీంపట్నం డివిజన్లో 4 వేల హెక్టార్లకు పైగా రైతులు పత్తి పంట సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేలు ఖర్చు చేశారు. ఆలస్యంగా కురిసిన వర్షాల వల్ల, సమయానుకూలంగా కురవని వర్షంతో పత్తి మొక్కల ఎదుగుదలలో మార్పు లేకుండాపోయింది. దీంతో మొక్క జానెడు పెరగడంతోనే చెట్టుకు పూత ప్రారంభమవుతోంది. మొక్కకు 50 నుంచి 70 వరకు పువ్వులు పూసి కాతకాసి పత్తి వెళ్లితేనే రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది. కానీ జానెడు మొక్కకు కేవలం 5కు మించి కూడా పూత పూయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జానెడు మొక్కకు పూతపై.. వర్షాలు అదనులో కురవకపోవడంతో సరైన సమయంలో పత్తి విత్తనాలు విత్తకపోవడం, విత్తిన తర్వాత కూడా వర్షాల్లేక మొక్కలు ఎదగలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి సందీప్ కుమార్ పేర్కొంటున్నారు. సరైన విధంగా నీరు అందిస్తే 9 నెలల పాటు మొక్క బతుకుతుందని అన్నారు. జానెడు మొక్కకు పూత రావడంతో ఇకముందు పూత పూయదేమోనని రైతులు ఆందోళనకు గురి కావద్దన్నారు. ఎకరాకు 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ అందించాలి. 3 అంగుళాల దూరంలో మట్టి జరిపి మందులు పోయాలి. దీంతో మొక్క గట్టిగా మారి ఎదుగుతుంది. పత్తిలో ఎరువులు అందిస్తే ఎదిగే గుణం ఉంది. అందుకే రైతులు ఆందోళనపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో జానెడు మొక్కకు పూస్తున్న పూత కారణంగా సూచించిన మేరకు మందులు వేయాలని చెప్పారు. ప్రతి నెలకోసారి క్రమం తప్పకుండా మందులు వేస్తే మొక్క పెరగడమే కాకుండా గణనీయమైన పూత, కాత వస్తుందన్నారు. చీడపురుగులు తగలకుండా బొట్టు పద్ధతిని పాటించాలన్నారు. 100 మిల్లిమీటర్ల మోనోక్రోటోఫాస్, అర లీటర్ నీటిలో కలిపి కాండానికి బొట్టు అంటించాలని ఆయన సూచించారు. ఇలా 15 రోజులకోసారి చేస్తే రసం పీల్చే పురుగులు దరిచేరవన్నారు. ప్రస్తుతం డివిజన్లోని పత్తి మొక్కలు 45 నుంచి 60 రోజుల వయసులో ఉన్నట్లు, సరైన విధంగా సూచనలు పాటిస్తే దిగుబడి గణనీయంగా ఉంటుందని ఆయన తెలిపారు. -
అద్దెకున్నవారే ‘కత్తి’దూశారు!
డుంబ్రిగుడలో సంచలనం వివాహిత భర్త గోంతుకోసి పరారైన ముగ్గురు యువకులు నిందితులు ‘ఆధార్’ ఉద్యోగులు పోలీసుల అదుపులో నిందితులు డుంబ్రిగుడ: ఇంట్లో అద్దెకున్న ముగ్గురు యువకులు ఊరెళ్లి రాత్రిమీద వచ్చారు. బయట హోటళ్లు లేవని, ఆకలిదప్పులతో ఉన్నామని నమ్మబలికారు. అయ్యో నిజమేకాబోలు అంటూ వారికి ఇంటిని అద్దెకిచ్చిన ఆ ఇల్లాలు వంట చేస్తుండగా, ఇంతలో ఆ యువకులు ఆమె భర్తపై అనూహ్యంగా కత్తితో దాడి చేశారు. మండల కేంద్రమైన డుంబ్రిగుడలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితుల బంధువుల కథనం ప్రకారం... మండలంలోని అరమ పంచాయతీ సుండివలస గ్రామానికి చెందిన బంగారుబండి సందీప్ కుమార్ డుంబ్రిగుడ మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న సంతవలసలో ఇల్లు నిర్మించుకుని భార్య గౌరితోపాటు కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. తన ఇంటిలో ఒక గదిని ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ చేపట్టే ఖమ్మం జిల్లా బయ్యారానికి చెందిన రంజిత్, శ్రీకాంత్, అనిల్‌అనే యువకులకు నెల క్రితం అద్దెకిచ్చారు. వారు కొద్ది రోజుల కిత్రం స్వగ్రామం వెళ్లి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వచ్చారు. బయట హోటళ్లు లేవని, ఆకలితో ఉన్నామని సందీప్‌కు చెప్పారు. ఆయన సూచనమేరకు గౌరి వంటగదిలోకి వెళ్లి భోజన ఏర్పాట్లు చేస్తుండగా, ముందు గదిలో ఒంటరిగా ఉన్న సందీప్‌పై ఆ ముగ్గురూ దాడి చేశారు. కత్తితో పీక కోశారు. వారి పెనుగులాటను చూసిన గౌరి భయంతో కేకలు వేయడంతో నిందితులు బ్యాగును, చిన్నకత్తిని, వారి చెప్పులను సైతం వదిలేసి పరారయ్యారు. చుట్టుపక్కలవారు వచ్చి చూసేసరికి గదిలో నేలపై రక్తపుమరకలు ఉండడంతో సందీప్‌పై హత్యాయత్నం జరిగినట్లు గమనించి, వెంటనే 108కు సమాచారం అందించారు. 20 నిమిషాల్లోగా వాహనం రావడంతో విశాఖపట్నంలోని ఓ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఎలా చిక్కారంటే? పరారైన ముగ్గురిలో రంజిత్ ఆ రాత్రి మీద పరుగుతీసి కించుమండ సమీపంలోని ఓ బస్ షెల్టర్ వద్ద తలదాచుకున్నాడు. తెల్లవారుజామున బస్సు ఎక్కుతున్న సమయంలో కంగారు పడుతుండడాన్ని కించుమండ గ్రామానికి చెందిన కొందరు చూశారు. ఊరికి కొత్తవ్యక్తి అయిన రంజిత్ ఒంటిపై రక్తపు చారికలున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పరారైన ఇద్దరూ ఎస్.కోట ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అనిల్, శ్రీకాంత్ మాత్రమే సందీప్‌పై హత్యాయత్నం చేశారని, తనకు ఎలాంటి సంబంధమూ లేదని రంజిత్ పోలీసుల దర్యాప్తులు తెలిపినట్లు తెలిసింది. హత్యాయత్నానికి గల పూర్తి కారణాలు తెలియరాలేదు. సందీప్ బంధువుల మౌఖిక ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని ఎస్ఐ రామకృష్ణ సోమవారం ఉదయం సందర్శించి పరిశీలించారు. చిన్నకత్తితోపాటు, నిందితులు వదిలి వెళ్లిన ఓ బ్యాగును గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డుంబ్రిగుడ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
కారు బోల్తా.. ఒకరి దుర్మరణం
కంచిలి, న్యూస్‌లైన్: మండలంలోని కంచిలి బైపాస్ రోడ్డులో బలియాపుట్టుగ గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి కటక్ వెళుతున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒడిశా నుంచి కటక్ వద్ద గల జాజిపూర్‌కు చెందిన సందీప్ కుమార్ పుష్టి(31) అనే వ్యక్తి మృతిచెందాడు. కారు డ్రైవర్ జితేంద్ర కుమార్ తీవ్రగాయాల పాలయ్యాడు. ప్రమాదానికి దారి తీసిన వివరాలిలా ఉన్నాయి... ఒడిశాకు చెందిన సందీప్ కుమార్ పుష్టి, అతని స్నేహితుడు పక్కగ్రామానిక చెందిన సందీప్‌కుమార్‌తో హైదరాబాద్ నుంచి ఒడిశాలో ఉన్న తమ స్వగ్రామానికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. దురదృష్టవశాత్తు రైలు వెళ్లిపోవడంతో హైదరాబాద్ నుంచి సోమవారం కారులో తమ గ్రామానికి బయల్దేరారు. మంగళవారం ఉదయం కంచిలి వద్దకు వచ్చేసరికి కారు నడుపుతున్న అతని స్నేహితుడు జితేంద్రకుమార్‌కు రాత్రంతా నిద్రలేక పోవటంతో నడిపేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు దిగువకు దింపేయటంతో చాలా దూరంపాటు రాసుకొంటూ వచ్చి బోల్తాపడింది. కారు నుంచి బయటపడ్డ సందీప్‌కుమార్ పుష్టిపై కారు ఎక్కింది. దీంతో అపస్మాకరక స్థితికి చేరాడు. స్థానికులు దీన్ని గమనించి కారు కింద చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీశారు. అనంతరం ఇద్దర్నీ సోంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సందీప్‌కుమార్ పుష్టి మృతిచెందాడు. కారు నడుపుతున్న జితేంద్రకుమార్‌కు చెయ్యి విరిగి తీవ్రగాయాల పాలయ్యాడు. కంచిలి హెచ్‌సి తులసిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రైలులో వెళ్లి ఉంటే ప్రమాదం నుంచి బయట పడేవారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో పడి వ్యక్తి మృతి నందిగాం, న్యూస్‌లైన్: మండల పరిధిలోని పెద్దతామరాపల్లి గ్రామానికి చెందిన వగాడి జగన్నాయకులు (42) స్థానిక మంచినీటి కోనేరులో పడి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం... సోమవారం సాయంత్రం ఉపాధి పనులకు వెళ్లిన జగన్నాయకులు చెరువులో స్నానం చేసేందుకని వెళ్లి తిరిగి రాలేదు. అయితే ఈయన చెరువులో మునిగిపోయాడనే విషయం ఎవరికీ తెలియకపోవడంతో ఆయన ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంతతిరిగినా ఆచూకీ లభ్యం కాలేదు. తీరా మంగళవారం ఉదయం స్థానిక మంచినీటి కోనేరులో తల పైకి తేలి ఉండటం కొంతమంది స్థానికులు గమనించారు. చెరువులో దిగి చూడగా జగన్నాయకుల మృతదేహంగా గుర్తించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున చెరువు దగ్గరకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. మృతునికి భార్య శకుంతల, కుమారుడు అనిల్‌కుమార్ తొమ్మిదో తరగతి, కుమార్తె కావ్య ఏడో తరగతి చదువుతున్న వారు ఉన్నారు. శవ పంచనామా అనంతరం టెక్కలి ప్రాంతీయ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. హెచ్‌సీ తులసీ నాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2 తల్లీకూతురుఃఎంపీటీసీ నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికలంటే ఎన్నో తమాషాలు, ఎన్నో వింతలు ఉంటూనే ఉంటారుు. అలాగే నరసన్నపేటలోనూ చోటుచేసుకుంది. వేరు వేరు చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన తల్లీ, కూతురు ఇద్దరూ ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేగాక ఇద్దరి మోజార్టీ కూడా ఒకటే కావడం మరో విశేషం. ఈ తల్లీ కూతురు ఇద్దరూ 375 మోజార్టీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మాకివలస, నరసన్నపేట నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీచేసిన తల్లి శిమ్మ పార్వతమ్మ, కూతురు నేతింటి భారతి ఇద్దరూ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. -
ఈదురుగాలుల బీభత్సం
యాచారం: మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వడగళ్లతో మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, నల్లవెల్లి, నానక్‌నగర్, చింతపట్ల, నక్కగుట్ట తండా, మల్కీజ్‌గూడ, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నక్కగుట్ట తండాలో ఈదురుగాలులకు ఓ ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చింతపట్లలో రైతు అచ్చెన రమేష్‌కు చెందిన రూ. లక్ష విలువైన రెండు పాడి ఆవులు పిడుగుపాటుతో మృతి చెందాయి. సింగారం, నందివనపర్తి, తమ్మలోనిగూడ, మాల్ తదితర గ్రామాల్లో మామిడికాయలు నేలరాలాయి. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్, విస్తరణ అధికారి లక్ష్మణ్ తదితరులు దెబ్బతిన్న పంటల ను సోమవారం పరిశీలించారు. నివేదిక అం దజేయాలని ఆయా గ్రామాల ఆదర్శ రైతు లు, రెవెన్యూ కార్యదర్శులకు సూచించారు. శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: మండలంలోని పెద్దతూప్ర, పాల్మాకులలో సోమవారం హోరుగాలి, వడగళ్లతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పెద్దతూప్రలో మల్లెల యాదయ్య ఇంటి సమీపంలోని ఓ తుమ్మ చెట్టు, కరెంటు స్తంభం నేలకొరిగి ఇంటి గోడ పాక్షికంగా ధ్వంసమయ్యింది. పాల్మాకులలో ఎం.చంద్రయ్య, రుక్కమ్మ ఇళ్ల పైకప్పు రేకులు, పిల్లోనిగూడ రోడ్డులో పశువుల డెయిరీఫాం రేకులు గాలివానకు ఎగిరిపోయాయి. పి.యాదయ్య ఇంటిపై చెట్టు కొమ్మలు విరిగిపడడంతో పైకప్పు రేకులు విరిగిపడ్డాయి. ఇంట్లో ఉన్న వారిపై రేకుల ముక్కలు పడడంతో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. పెద్దతూప్ర, పెద్దతూప్రతండా, ఇనాంషేరి, పిల్లోనిగూడ, అచ్చం పేట, పాల్మాకుల, ముచ్చింతల్ గ్రామాల్లోని పంటలకు వాటిల్లింది. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి.