ద్రోహి వస్తున్నాడు   | Director Krish launches the title and poster of Drohi | Sakshi
Sakshi News home page

ద్రోహి వస్తున్నాడు  

Published Sat, Sep 9 2023 12:23 AM | Last Updated on Sat, Sep 9 2023 12:23 AM

Director Krish launches the title and poster of Drohi - Sakshi

సందీప్, క్రిష్, విజయ్‌ పెందుర్తి

సందీప్‌ కుమార్‌ బొడ్డ పాటి, దీప్తి వర్మ జంటగా విజయ్‌ పెందుర్తి దర్శకత్వంలో రూపొందిన ఫిల్మ్‌ ‘ద్రోహి’. ‘ది క్రిమినల్‌’ అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌ పెందుర్తి, ఆర్‌. రాజశేఖర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసిన దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా లుక్, గ్లింప్స్‌ ప్రామిసింగ్‌గా ఉన్నాయి.

ఈ సినిమాకు పని చేసిన అందరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ప్రేక్షకులు మెచ్చే అన్ని థ్రిల్లర్‌ అంశాలున్న చిత్రం ఇది. ఈ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. డెబి, ‘షకలక’ శంకర్, నిరోజ్, శివ, మహేశ్‌ విట్టా కీలక పాత్రలు పొషించిన ఈ చిత్రానికి సంగీతం: అనంత్‌ నారాయణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement