
అనిల్ బురగాని, ఆర్. జ్వలిత జంటగా నటించిన చిత్రం ‘ప్రేమకు జై’. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ని ప్రముఖ పాటల రచయిత శివశక్తి దత్త విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. నూతన నటీనటులు చాలా బాగా నటించారనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు.
‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హీరో హీరోయిన్లతో పాటు ప్రతినాయకుడు దుబ్బాక భాస్కర్ బాగా నటించారు. మా సినిమాని నూతన సంవత్సరంలో విడుదల చేయనున్నాం’’ అని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉరుకుందా రెడ్డి, సంగీతం: చైతు, లైన్‌ప్రోడ్యూసర్: మైలారం రాజు.
Comments
Please login to add a commentAdd a comment