కంచిలి, న్యూస్‌లైన్: మండలంలోని కంచిలి బైపాస్ రోడ్డులో బలియాపుట్టుగ గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి కటక్ వెళుతున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒడిశా నుంచి కటక్ వద్ద గల జాజిపూర్‌కు చెందిన సందీప్ కుమార్ పుష్టి(31) అనే వ్యక్తి మృతిచెందాడు. కారు డ్రైవర్ జితేంద్ర కుమార్ తీవ్రగాయాల పాలయ్యాడు. ప్రమాదానికి దారి తీసిన వివరాలిలా ఉన్నాయి... ఒడిశాకు చెందిన సందీప్ కుమార్ పుష్టి, అతని స్నేహితుడు పక్కగ్రామానిక చెందిన సందీప్‌కుమార్‌తో హైదరాబాద్ నుంచి ఒడిశాలో ఉన్న తమ స్వగ్రామానికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. దురదృష్టవశాత్తు రైలు వెళ్లిపోవడంతో హైదరాబాద్ నుంచి సోమవారం కారులో తమ గ్రామానికి బయల్దేరారు.
మంగళవారం ఉదయం కంచిలి వద్దకు వచ్చేసరికి కారు నడుపుతున్న అతని స్నేహితుడు జితేంద్రకుమార్‌కు రాత్రంతా నిద్రలేక పోవటంతో నడిపేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు దిగువకు దింపేయటంతో చాలా దూరంపాటు రాసుకొంటూ వచ్చి బోల్తాపడింది. కారు నుంచి బయటపడ్డ సందీప్‌కుమార్ పుష్టిపై కారు ఎక్కింది. దీంతో అపస్మాకరక స్థితికి చేరాడు. స్థానికులు దీన్ని గమనించి కారు కింద చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీశారు. అనంతరం ఇద్దర్నీ సోంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సందీప్‌కుమార్ పుష్టి మృతిచెందాడు. కారు నడుపుతున్న జితేంద్రకుమార్‌కు చెయ్యి విరిగి తీవ్రగాయాల పాలయ్యాడు. కంచిలి హెచ్‌సి తులసిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రైలులో వెళ్లి ఉంటే ప్రమాదం నుంచి బయట పడేవారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
నందిగాం, న్యూస్‌లైన్: మండల పరిధిలోని పెద్దతామరాపల్లి గ్రామానికి చెందిన వగాడి జగన్నాయకులు (42) స్థానిక మంచినీటి కోనేరులో పడి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం... సోమవారం సాయంత్రం ఉపాధి పనులకు వెళ్లిన జగన్నాయకులు చెరువులో స్నానం చేసేందుకని వెళ్లి తిరిగి రాలేదు. అయితే ఈయన చెరువులో మునిగిపోయాడనే విషయం ఎవరికీ తెలియకపోవడంతో ఆయన ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంతతిరిగినా ఆచూకీ లభ్యం కాలేదు. తీరా మంగళవారం ఉదయం స్థానిక మంచినీటి కోనేరులో తల పైకి తేలి ఉండటం కొంతమంది స్థానికులు గమనించారు. చెరువులో దిగి చూడగా జగన్నాయకుల మృతదేహంగా గుర్తించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున చెరువు దగ్గరకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. మృతునికి భార్య శకుంతల, కుమారుడు అనిల్‌కుమార్ తొమ్మిదో తరగతి, కుమార్తె కావ్య ఏడో తరగతి చదువుతున్న వారు ఉన్నారు. శవ పంచనామా అనంతరం టెక్కలి ప్రాంతీయ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. హెచ్‌సీ తులసీ నాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
2
తల్లీకూతురుఃఎంపీటీసీ
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికలంటే ఎన్నో తమాషాలు, ఎన్నో వింతలు ఉంటూనే ఉంటారుు. అలాగే నరసన్నపేటలోనూ చోటుచేసుకుంది. వేరు వేరు చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన తల్లీ, కూతురు ఇద్దరూ ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేగాక ఇద్దరి మోజార్టీ కూడా ఒకటే కావడం మరో విశేషం. ఈ తల్లీ కూతురు ఇద్దరూ 375 మోజార్టీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మాకివలస, నరసన్నపేట నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీచేసిన తల్లి శిమ్మ పార్వతమ్మ, కూతురు నేతింటి భారతి ఇద్దరూ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు.
కారు బోల్తా.. ఒకరి దుర్మరణం
Published Wed, May 14 2014 2:39 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement