ఆ సీడీలను లీక్ చేసింది సెక్రటరీనే! | Sacked AAP minister Sandeep Kumar's aide detained for leaking, circulating sex video | Sakshi
Sakshi News home page

ఆ సీడీలను లీక్ చేసింది సెక్రటరీనే!

Published Mon, Sep 5 2016 3:09 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

ఆ సీడీలను లీక్ చేసింది సెక్రటరీనే! - Sakshi

ఆ సీడీలను లీక్ చేసింది సెక్రటరీనే!

న్యూఢిల్లీ: ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల సీడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సందీప్ కుమార్కు కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఈ సీడీని లీక్ చేసి చాలామందికి పంచిపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు సోమవారం సెక్రటేరియట్కు వెళ్లి ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీడీ లీకేజీ వెనుక ప్రవీణ్ హస్తముందని సందీప్ భావిస్తున్నాడు.

సందీప్ ఓ మహిళతో అభ్యంతరకర పరిస్థితుల్లో ఉన్న సీడీ బయటకురావడంతో ఆయన పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. ఈ సీడీలో మంత్రితో కలసి ఉన్న మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11 నెలల క్రితం రేషన్ కార్డు కోసం వెళితే సందీప్ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఢిల్లీ పోలీసులు సందీప్పై అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సందీప్ను ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement