
సందీప్ కుమార్(ఫైల్)
సాక్షి, వరంగల్: ఒక అమ్మాయి సందీప్ అనే యువకుడికి ప్రేమ వలవేసి.. చివరకు అతని ఆత్మహత్యకు కారణమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఘటన వరంగల్‌లో కలకలంగా మారింది. అయితే, మొరిపిరాలలో జరిగిన లవ్ చీటింగ్ ఘటనలో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మాయలేడి మృతుడి సోదరి బాల్య స్నేహాన్ని వాడుకుని అతడితో ప్రేమాయణంను నడిపిందని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీంతో గ్రామాలకు కూడా హనీట్రాప్ కల్చర్ విస్తరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లలో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి కొందరు కేటుగాళ్లు హానీ ట్రాప్‌కు పాల్పడుతున్నారు.
చదవండి: 3 పేర్లు 3 ఫోన్ నంబర్లు.. స్రవంతికి పెళ్లయినా వదల్లేదు..