
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈనెల 8వ తేదీ నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీచేసింది. మెడికల్ కాలేజీలను సెలవుల నుంచి మినహాయించినట్లు ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జీవోలో పేర్కొన్నారు. 17 నుంచి విద్యాసంస్థలు పనిచేస్తాయని తెలిపారు.