‘సాయిబాబా భౌతికకాయాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగిస్తాం’ | EX DU professor Saibaba family says to donate his body to medical college | Sakshi
Sakshi News home page

‘సాయిబాబా భౌతికకాయాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగిస్తాం’

Oct 13 2024 7:01 PM | Updated on Oct 13 2024 7:07 PM

EX DU professor Saibaba family says to donate his body to medical college

కుటుంబ సభ్యుల ప్రకటన

హైదరాబాద్‌: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, పౌర హక్కుల ఉద్యమకారుడు జీఎన్‌ సాయిబాబా (54) శనివారం రాత్రి హైదరాబాద్‌ నిమ్స్‌లో కన్నుమూశారు. సాయిబాబా మృతదేహాన్ని ఆయన కోరుకున్న విధంగా మెడికల్‌ కాలేజీకి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

మావోయిస్టు సంబంధాలు ఉన్నాయన్న అభియోగాల కేసులో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో మార్చి నెలలో ఆయన విడుదలయ్యారు. సాయిబాబా భౌతికకాయాన్ని ఆయన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నివాళులర్పించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఆయన కళ్లను ఇప్పటికే ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

సాయిబాబా మృతిపట్ల ‘ఎక్స్‌’ వేదికగా ప్రముఖలు సంతాపం తెలిపారు. ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సంతాపం తెలిపారు. ‘‘ మానవ హక్కుల ఉద్యమకారుల సంఘానికి సాయిబాబా మరణం తీరని లోటు. అణగారిన ప్రజలకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా, స్వేచ్ఛకు ముప్పు ఏర్పడినప్పుడు ఆయన అవిశ్రాంతంగా పోరాడారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పౌర హక్కులను కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నా’’అని ఎక్స్‌లో తెలిపారు.

మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా మృతి పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంతాపం తెలిపారు. ‘‘ హక్కుల ఉద్యమకారుడు మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్. సాయిబాబా అకాల మరణం బాధాకరం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. దేశంలోని ప్రజా ఉద్యమాలకు మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు’’ అని ‘ఎక్స్‌’ తెలిపారు.

చదవండి: డీయూ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement