సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీలకు చెందిన ఎంబీబీఎస్, బీడీఎస్ కోటా సీట్ల ఫీజులు పెరిగాయి. తమకు నిర్వహణ ఖర్చులు అధికంగా ఉన్నాయని ఆయా కాలేజీలు సమర్పించిన ఆడిటింగ్ రి పోర్టులను పరిశీలించిన తెలంగాణ ప్రవేశాలు, ఫీజు ల నియంత్రణ మండలి (ఏఎఫ్‌ఆర్‌సీ) ఫీజుల పెం పునకు అంగీకరించింది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా ఫీజులు పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను మాత్రం యథాతథంగా ఉంచారు.
పెంచిన ఫీజులు ఈ వైద్య విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లకు ఏడాదికి రూ. 60 వేలు ఫీజు వసూలు చేస్తున్నారు. దీన్ని ఈ ఏడాది కూడా యథాతథంగా ఉంచారు. గతం వరకు యాజమాన్య కోటాకు చెందిన బీ కేటగిరీకి ఏడాదికి రూ. 11.55 లక్షలు, ఎన్నారై కోటా సీట్లకు బీ కేటగిరీ ఫీజుకు రెట్టింపు వసూలు చేస్తున్నారు. అంటే రూ. 23.10 లక్షల వరకు సీ కేటగిరీకి వసూ లు చేసుకోవచ్చు. డెంటల్ ఫీజు రూ. 4.20 లక్షలుండగా, దాన్ని కూడా కొన్ని కాలేజీల్లో పెంచారు. బీ కేటగిరీకి ఏయే కాలేజీలు ఎంత ఫీజు తీసుకుంటున్నాయో ఆ ఫీజుకు 1.25 రెట్లకు మించకుండా సీ కేటగిరీ సీట్లకు ఆయా డెంటల్ కాలేజీల ఫీజులు తీసుకోవచ్చు. కాలేజీ యాజ మాన్యాలు క్యాపిటేషన్ ఫీజును వసూలు చేయ కూడదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
► చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కామినేని అకాడమీ, కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీలో బీ కేటగిరీ ఫీజును రూ. 13 లక్షలకు పెంచారు. ఆయా కాలేజీల్లో సీ కేటగిరీ కింద చేరే వారు రూ. 26 లక్షల వరకు చెల్లించాలి.
► అపోలో, మల్లారెడ్డి, ఎస్వీఎస్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ ఫీజు రూ. 12.50 లక్షలు చేశారు. సీ కేటగిరీ కింద చేరాలనుకునేవారు ఈ కాలేజీల్లో ఏడాదికి రూ. 25 లక్షలు చెల్లించాలి.
► బీడీఎస్ బీ కేటగిరీ సీటు ప్రస్తుతం రూ. 4.20 లక్షలుగా ఉంది. దాన్ని ఎంఎన్‌ఆర్ కాలేజీ, పనానియా మహావిద్యాలయ డెంటల్ కాలేజీల్లో
5 లక్షలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment