MBBS seats
-
నలుగురు కూతుళ్ళకు MBBS సీట్లు
-
కొత్తగా మరో 150 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కొనసాగుతున్న కీలక సమయంలో రాష్ట్రంలో మరో కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటైన నోవా మెడికల్ కాలేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 150 ఎంబీబీఎస్ సీట్లు నింపుకునేందుకు ఆ కాలేజీకి అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటికే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. రెండు రౌండ్లు ముగిసిన తర్వాత ప్రైవేటు కాలేజీకి అనుమతులు రావడం గమనార్హం.తాజాగా అందుబాటులోకి వచ్చిన 150 సీట్లలో సగం అంటే 75 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రస్తుతం రెండో రౌండ్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 20–25 సీట్లు ఆ కోటాలో ఖాళీగా ఉన్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. కొత్త వాటిని కలిపితే 95 నుంచి 100 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయని వెల్లడించాయి.ఇలావుండగా కొత్త కాలేజీతో కలిపి రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య 29కి చేరింది. వాటిలో మల్లారెడ్డి గ్రూపునకు చెందిన రెండు మెడికల్ కాలేజీలు ఈ ఏడాది డీమ్డ్ యూనివర్సిటీగా మారాయి. అందులోని సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాలోనే భర్తీ చేసుకునే అవకాశముంది. రాష్ట్ర కౌన్సెలింగ్‌తో సంబంధం ఉండదు. దీంతో తెలంగాణ విద్యార్థులకు సీట్లు లభించే ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య 27కే పరిమితం అయింది. ఈ కాలేజీలన్నీ కలిపి 4,550 సీట్లున్నాయి. -
మన విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీరు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ సీట్ సాధించాలన్న లక్ష్యంతో ఏపీలో వేలాది విద్యార్థులు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు కష్టపడి 500 నుంచి 600 మార్కులు తెచ్చుకున్నా చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విద్యార్థులకు నిరాశే ఎదురైంది. రాష్ట్రానికి కొత్త కళాశాలలు రాకుండా, సీట్లు పెరగకుండా అడ్డుపడి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.దీంతో పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకంటే మన పిల్లలు 150 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా ఎంబీబీఎస్ సీటు దక్కక మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్ సీట్లను అక్కడి ప్రభుత్వం పెంచడంతో బీసీ–ఏ విభాగంలో రెండో దశ కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 420 స్కోర్ చేసిన వారికి కూడా ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా సీట్ దక్కింది. అదే ఏపీలో 568 మార్కుల వద్దే ఆగిపోయింది. అంటే అక్కడితో పోలిస్తే ఏపీలో కటాఫ్ 148 మార్కులు ఎక్కువ. బీసీ–సీ విభాగంలో 142, బీసీ–డీలో 103, ఓసీల్లో 101 చొప్పున తెలంగాణకంటే ఏపీలో కటాఫ్ ఎక్కువగా ఉంది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం కోసం ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంది. పులివెందుల కళాశాలకు అనుమతులు వచ్చి సీట్లు మంజూరైనా.. ఆ సీట్లు వద్దంటూ ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ప్రభుత్వ చర్యలతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు నష్టపోయారు. బాబు ప్రభుత్వం చేసిన ఆ పాపం విద్యార్థులకు శాపంగా మారింది.14 వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్లలో 2024–25 విద్యా సంవత్సరానికి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్ పొందిన విద్యార్థులకు ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం కల్పించారు. తొలి 2 కౌన్సెలింగ్‌ల్లో సీట్ పొంది, కళాశాలల్లో రిపోర్ట్ చేసిన విద్యార్థులు గడువు లోగా ఎగ్జిట్ అవ్వవచ్చని హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఎగ్జిట్ అయిన వారిని తదుపరి కన్వినర్ కోటా కౌన్సెలింగ్‌లో అనుమతించబోమని స్పష్టం చేశారు. కేవలం యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలకు అనుమతిస్తామని తెలిపారు. -
దివ్యాంగ కోటాలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని కన్వీనర్ సీట్లలో దివ్యాంగ కోటాకు కేటాయించిన 121 ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోయాయి. ఈ విభాగంలో మొత్తం 182 సీట్లు ఉండగా 61 మంది మాత్రమే అర్హులైన విద్యార్థులున్నారు. వీరందరికీ ఆదివారం హెల్త్ వర్సిటీ సీట్లు కేటాయించింది. విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. ఎంబీబీఎస్ తరగతులు ఈ నెల 14 నుంచి ప్రారంభం అవుతాయి. మిగిలిపోయిన 121 సీట్లను ఆర్ఓఆర్ ఆధారంగా సాధారణ విద్యార్థులకు కేటాయిస్తారు. ఆలస్య రుసుము లేకుండానే.. 2024–25 విద్యా సంవత్సరానికి మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆలస్య రుసుము లేకుండా సోమవారం రాత్రి 9 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. శుక్రవారంతో దరఖాస్తుల గడువు ముగియగా, శని, ఆది, సోమవారాల్లో ఆలస్య రుసుముతో దరఖాస్తుకు తొలుత అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుము కన్నా ఆలస్య రుసుముతో విధించిన పెనాల్టీ అధికంగా ఉందని అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆలస్య రుసుమును మినహాయించారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ 8,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ఎన్ఎంసీ షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. గతంలో లాగానే కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందు సీట్ మ్యాట్రిక్స్ ను ప్రకటిస్తామన్నారు. -
ప్రభుత్వ వైద్యమూ.. పేదలకు దూరం!
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదలకు చేరువైన సూపర్ స్పెషాలిటీ వైద్యం.. కూటమి ప్రభుత్వ తీరుతో ఇక క్రమంగా దూరం కాబోతుంది. ప్రభుత్వ వైద్యానికీ, చికిత్సలకు కూడా డబ్బులు కట్టే పరిస్థితులు రాబోతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను అడ్డుకుంటూ.. ఎంబీబీఎస్ సీట్లు రద్దు చేయిస్తూ.. ప్రైవేటీకరణ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. తద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన వైద్య విప్లవానికి పూర్తిగా తూట్లు పొడుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేద ప్రజలకు చేరువ చేసేందుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఏకంగా 17 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి వైద్య విప్లవానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తొలిదశలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరంలో మరో ఐదు కాలేజీలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణపై మోజుతో ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి నీట్ విద్యార్థులకు తీవ్ర నష్టం చేకూర్చింది. అలాగే బోధనాస్పత్రుల ఏర్పాటుకు అడ్డుపడి పేదల వైద్యానికి గండి కొట్టింది. టెరిషరీ కేర్ బలోపేతమే లక్ష్యంగా..ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అని మూడు లేయర్లుగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విస్తరించి ఉంది. ప్రైమరీ కేర్‌లో విలేజ్ క్లీనిక్‌లు, పీహెచ్‌సీలు, సెకండరీ కేర్‌లో సీహెచ్ïÜలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులుంటాయి. టెరిషరీ కేర్‌లో బోధనాస్పత్రులు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఉంటాయి. ప్రజలు తీవ్రమైన జబ్బుల బారినపడినప్పుడు మెరుగైన చికిత్సలు అందించడంలో టెరిషరీ కేర్ కీలక పాత్ర పోషిస్తుంది. 2019 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వీటికి అనుబంధంగా బోధనాస్పత్రులు ఉండేవి. దీంతో గ్రామీణ ప్రజలు మెరుగైన చికిత్సల కోసం 50 నుంచి 100 కి.మీ పైగా దూరం ప్రయాణించి టెరిషరీ కేర్ ఆస్పత్రులను చేరుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తద్వారా అప్పటి వరకు జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు ఉన్న చోట.. ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో బోధనాస్పత్రులు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక రచించింది. గుండె, మెదడు, కిడ్నీ, క్యాన్సర్ తదితర రోగాలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు.. వైద్యులు, అధునాత పరికరాలు, సిబ్బందిని సమకూర్చేలా కార్యాచరణ రూపొందించి ఆ దిశగా చర్యలు చేపట్టింది. విద్య, వైద్యంతో ప్రజలకు మేలు..కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువవుతాయి. ఇప్పటివరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు ఉన్న చోట్ల బోధనాస్పత్రులు ఏర్పాటైతే నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. అధునాతన వైద్య పరికరాలు, ల్యాబ్‌లు సమకూరి.. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత హౌస్ సర్జన్లుగా అందుబాటులోకి వస్తారు. వీరు నిరంతరం ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటం వల్ల రోగులకు సేవలు మరింత మెరుగవుతాయి. నాలుగైదేళ్ల తర్వాత పీజీ సీట్లు కూడా సమకూరితే.. స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరిగేది. పేదల్లో ఆందోళనచంద్రబాబు చెబుతున్న గుజరాత్ పీపీపీ విధానంతో ఉచిత వైద్య సేవలపై పేదల్లో ఆందోళన మొదలైంది. ప్రైవేట్ వ్యక్తులకు కొత్త మెడికల్ కాలేజీలను అప్పగిస్తే వారి అజమాయిషీలో నడిచే బోధనాస్పత్రుల్లో వైద్య సేవల కోసం ప్రజలు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదల ప్రయోజనాలకు తూట్లు పొడిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చేరువలోనే మెరుగైన వైద్యసేవలువందల ఏళ్ల చరిత్ర కలిగిన బందరు నగరంలో 2019 ముందు వరకూ సరైన వైద్య సేవలు అందుబాటులో లేవు. తీవ్ర అనారోగ్యం పాలైన వారు 70 కి.మీ ప్రయాణించి విజయవాడకు వెళ్లేవాళ్లు. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కొత్త మెడికల్ కాలేజీ నెలకొల్పింది. అప్పటి వరకు 300 పడకలుగా ఉన్న జిల్లా ఆస్పత్రిని.. 600 పడకల బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసింది. 150 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీని ప్రారంభించింది. 60కి లోపు వైద్యులు ఉండే ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం వంద మంది వరకూ వైద్యులు అందుబాటులోకి వచ్చారు. స్టాఫ్ నర్సులు, ఇతర సహాయక సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు 700 మేర ఓపీలు నమోదు అవుతున్నాయి.వ్యయ ప్రయాసలు తగ్గాయిగతంలో మచిలీపట్నంలో జిల్లా ఆస్పత్రి ఉండేది. కానీ అనుభవజ్ఞులైన వైద్యులు ఉండేవారు కాదు. దీంతో చిన్నచిన్న సమస్యలకు కూడా విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులు, ఇతర రోగులు 70 కి.మీ దూరం ప్రయాణించి విజయవాడకు వెళ్లేలోగా ప్రాణాపాయం సంభవించేది. వైఎస్ జగన్ ప్రభుత్వం బోధనాస్పత్రి ఏర్పాటు చేయడంతో అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారు. గతంతో పోలిస్తే సేవలు మెరుగయ్యాయి. ప్రైవేట్‌పై మోజుతో ఆస్పత్రిని నిర్లక్ష్యం చేస్తే పేదలకు తీరని నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆస్పత్రి నడిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. – ఎ. గాంధీ, మచిలీపట్నంప్రైవేటీకరణ నిర్ణయంతో పేదలకు చేటు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమా జానికి హానికరం. ప్రభుత్వం ఏదైనా కానీ.. ప్రజల శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాలు, పనులను కొనసాగించాలి.అలా చేయకుండా మంజూరైన ఎంబీబీఎస్ సీట్లు వద్దనడం, కాలేజీల నిర్మాణాలను ఆపేయడం వంటి పనులు హర్షణీయం కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని ఏర్పాటైతే.. అంతగా పేదలకు మేలు జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలోకి బోధనాస్పత్రులు వెళ్లడం వల్ల.. పేదల ప్రయోజనాలు దెబ్బతింటాయి. చికిత్సలకు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. – డాక్టర్ ఎంవీ రమణయ్య,చైర్మన్, రాష్ట్ర ప్రజారోగ్య వేదిక -
ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: కొత్త వైద్య కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సెల్ఫ్‌ఫైనాన్స్, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు జాబితాను శుక్రవారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. విద్యార్థులు ఆయా క ళాశాలల్లో ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం మూ డు గంటల్లోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. క్యాప్ కోటా జాబితా విడుదలచిల్ర్డన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ (క్యాప్) విభాగంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రయారిటీ జాబితాను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తగ్గించిన నీట్ ఎండీఎస్–2024 కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులు ఎండీఎస్ కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు గడువు విధించారు. -
వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
తిరుపతి సిటీ: రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటును అడ్డుకున్న కూటమి ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. మంగళవారం తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం బడాబాబుల చేతుల్లో పెట్టేందుకు ప్రయతి్నస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యను కార్పొరేట్ విద్యగా మార్చి.. పేద విద్యార్థులకు అందకుండా చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో వచ్చే రెండేళ్లలో రాష్ట్ర విద్యార్థులు సుమారు 1,750 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. తక్షణమే పులివెందుల కాలేజీకి 50 సీట్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను అడ్డుకోవద్దని డిమాండ్ చేశారు. ఈ నెల 19న నిర్వహించబోతున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్ఓ, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్ఓ, వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘాలు నేతలు పాల్గొన్నారు. పేద విద్యార్థుల కలలపై కూటమి కుట్ర: ఎంపీ డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకునేందుకు ఎంతో శ్రమిస్తున్న పేద విద్యార్థులపై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వైద్య విద్యను ప్రైవేటుపరం చేసి సంపన్నులకే ఎంబీబీఎస్ చేసే అవకాశం కల్పించే విధంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేయడం దారుణం. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకతో పోల్చిచూస్తే.. ఏపీలో కేవలం 50 శాతం సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో సైతం కోత విధిస్తే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కలి్పంచడంతోపాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై సర్కారు పట్టు
సాక్షి, హైదరాబాద్: డీమ్డ్ మెడికల్ కాలేజీలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కృత నిశ్చయంతో ఉంది. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరిగానే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం డీమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కనీ్వనర్ కోటా కిందే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయా కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కనీ్వనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది.ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు డీమ్డ్ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల డీమ్డ్ హోదా పొందిన రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనిపై బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించనున్నారు.డీమ్డ్ హోదా పొందిన కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సదుపాయాలు పొందుతున్నాయని, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల పేరిట ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాయని అంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా దీనిపై తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు నీట్ ఫలితాలు వెలువడి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత, డీమ్డ్ హోదా పొందటం న్యాయపరంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.డీమ్డ్‌లో సొంత నిబంధనలపై గరంగరం..రాష్ట్రంలో రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా దక్కించుకున్నాయి. మరో నాలుగు మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడం, ఫీజులు తమకు అవసరమైన రీతిలో వసూలు చేసుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం.. వంటివి ఉంటాయని ఆయా కాలేజీలు చెబుతున్నాయి. నీట్లో ర్యాంకు సాధించిన ప్రతిభ గల, పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న ఆశను దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. డీమ్డ్ వర్సిటీలుగా మారా లంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న వాదననను ప్రైవేట్ యాజమాన్యాలు తెరపైకి తెస్తున్నాయి.ఇదే జరిగితే మున్ముందు మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా సాధించుకునే అవకాశం ఉంది. అలాగైతే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లు మొత్తం మేనేజ్మెంట్ సీట్లుగా మారిపోతాయని అంటున్నారు. దీనివల్ల కన్వీనర్ కోటా ఫీజు ఎత్తేసి మేనేజ్మెంట్ ఫీజులు అమలవుతాయి. డీమ్డ్ హోదా కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిందేనని అంటున్నారు.ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి పొందుతున్నందున ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఎలా ఉంటుందంటున్నారు. ఫీజును కూడా ఆయా కాలేజీలు సొంతంగా నిర్ణయించుకునే అధికారం లేదని అంటున్నారు. దీనిపై సీరియస్‌గా ఉన్న మంత్రి రిజర్వేషన్లు రాజ్యాంగం కలి్పంచిన హక్కు అని... దానిని డీమ్డ్ పేరుతో ఎలా కాలరాస్తారని ప్రశి్నస్తున్నారు. -
'టాప్‌లో కటాఫ్'
సాక్షి, అమరావతి: గతేడాది ఏయూ పరిధిలో ఓసీ విద్యార్థికి ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నీట్ కటాఫ్ మార్కులు 563.. ఈ ఏడాది ఏకంగా 615..! ఇదే కేటగిరీకి ఎస్వీయూ పరిధిలో గతేడాది కటాఫ్ 550.. ఈ ఏడాది 601..!! ఆదివారం కన్వీనర్ కోటా తొలిదశ కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పరిస్థితి ఇదీ!! అప్పుడు సీటు దొరకటానికి.. ఇప్పుడు గగనంగా మారటానికి కారణం.. కొత్త మెడికల్ కాలేజీలే!గతేడాది 5 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంతో సీట్లు పెరిగి మన విద్యార్థులు ఎంతో మంది డాక్టర్లు కాగలిగారు! ఇప్పుడు నాలుగు కొత్త కాలేజీలకు కూటమి సర్కారు నిర్వాకంతో అనుమతులు రాకపోగా పాడేరులో వచ్చింది 50 సీట్లే! ఎంబీబీఎస్ సీట్లు పెరగకపోవడంతో మనకు ఎంత నష్టం జరిగిందో తొలి దశ కౌన్సెలింగ్‌లోనే స్పష్టంగా కనిపించింది!!గతేడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావడంతో అదనంగా 750 సీట్లు సమకూరి మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలు నెరవేరాయి. ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా దూరదృష్టితో వ్యవహరించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కశాశాలలకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో ఐదు కొత్త కాలేజీలు గతేడాది అందుబాటులోకి రాగా ఈ సంవత్సరం కూడా మరో ఐదు నూతన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైతే తమ కలలు ఫలిస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు! కూటమి సర్కారు ప్రైవేట్ జపం, కొత్త కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఆ ఆశల సౌథాలు కుప్పకూలాయి. ఏడాదంతా లాంగ్ టర్మ్ శిక్షణతో రూ.లక్షలు వెచ్చించి సిద్ధమైన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తొలి దశ కౌన్సెలింగ్‌లోనే సీట్ దొరక్కపోవడంతో ఇక మిగిలిన దశల్లో సీటు లభించే అవకాశాలు తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అప్పు చేసిన మధ్యతరగతి కుటుంబాలు మేనేజ్మెంట్ కోటా సీట్ కొనే పరిస్థితి లేదు. మరోసారి ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్‌కి పంపుదామంటే కూటమి సర్కారు ప్రైవేట్ మోజుతో వచ్చే ఏడాదైనా సీట్లు పెరుగుతాయనే నమ్మకం పోయింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో నీట్ యూజీ విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతో నాలుగు కొత్త కాలేజీలకు అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. కేవలం పాడేరు కళాశాలలో 50 సీట్లకే అనుమతులు లభించాయి. పిల్లల గొంతు కోశారు!ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని.. అది కూడా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే చేసి చూపిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి సర్కారు దాన్ని గాలికి వదిలేసి బేరాలకు తెర తీసింది. వైఎస్సార్ సీపీ హయాంలో తీసుకున్న చర్యల ఫలితంగా గిరిజన ప్రాంతంలోని పాడేరు మెడికల్ కాలేజీకి ఈ ఏడాది అరకొరగానైనా 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా వాటిలో 21 సీట్లను సెల్ఫ్‌ఫైనాన్స్ కోటా కింద తాజాగా అమ్మకానికి పెట్టింది. ఈమేరకు 2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోనిలో ప్రారంభించాల్సిన ఐదు నూతన వైద్య కళాశాలలను కుట్రపూరితంగా అడ్డుకుని ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి పిల్లల భవిష్యత్తును అంధకారంగా మార్చారని మండిపడుతున్నారు. పులివెందుల వైద్య కళాశాలకు అనుమతులు వచ్చినా.. మేం నిర్వహించలేమంటూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్ఎంసీకి కూటమి ప్రభుత్వమే లేఖ రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ పలు సందర్భాల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌కు హామీ గుర్తు లేదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వం.. పేదల పక్షపాత ప్రభుత్వమంటూ తరచూ చెప్పే సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనకు పీ 4 ప్రణాళిక పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించి పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ప్రజా సంఘాలు మండిపతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.రెండేళ్లలో కోల్పోతున్న సీట్లు 1,750టీడీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ వైద్య విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కాకపోవడం దీనికి నిదర్శనం. 2004–09 మధ్య దివంగత వైఎస్సార్ సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో రిమ్స్‌లను నెలకొల్పారు. రాష్ట్ర విభజన అనంతరం వైఎస్సార్ సీపీ హయాంలో జగన్ ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కొత్త వైద్య కళాశాలలు గత ఏడాది ప్రారంభం అయ్యాయి. 750 ఎంబీబీఎస్ సీట్లు ఒక్కసారిగా అదనంగా పెరగడంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి. ఈ విద్యా సంవత్సరంలో కూడా మరో ఐదు కళాశాలలు ప్రారంభించేలా గత ప్రభుత్వం చర్యలు చేపట్టినా కూటమి సర్కారు దాన్ని కొనసాగించలేదు. దీంతో కేవలం 50 సీట్లు సమకూరగా అదనంగా రావాల్సిన 700 సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ఇక వచ్చే ఏడాది ప్రారంభం కావాల్సిన మరో ఏడు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల అదనంగా మరో 1,050 మెడికల్ సీట్లను విద్యార్థులు నష్టపోతున్నారు. వెరసి మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవడం ద్వారా జరుగుతున్న నష్టం ఊహించలేనిది!!.ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ఆప్షన్ల నమోదు ప్రారంభం2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం తొలి దశ కౌన్సెలింగ్‌కు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 19వ తేదీ రాత్రి తొమ్మిది గంటలను ఆప్షన్ల నమోదు చివరి గడువుగా విధించారు. https://drntr.uhsap.in వెబ్సైట్లో విద్యార్థులు ఆప్షన్ నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. గతేడాది ప్రారంభించిన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, ఈ ఏడాది ప్రారంభించనున్న పాడేరు వైద్య కళాశాలలో 240 సెల్ఫ్‌ఫైనాన్స్, 101 ఎన్ఆర్ఐ కోటా (సీ కేటగిరి) సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రైవేట్, మైనార్టీ, స్విమ్స్ కళాశాలల్లో బీ కేటగిరి 1078, సీ కేటగిరి 495 సీట్లున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలుంటే 9000780707, 8008250842 నంబర్లలో విద్యార్థులు సంప్రదించాలని తెలిపారు.ప్రైవేటీకరణ దుర్మార్గంపులివెందుల కళాశాలకు సీట్లను నిరాకరించడమేంటి? సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల రద్దు హామీ ఏమైంది? సీఎం చంద్రబాబుకు ఎస్ఎఫ్ఐ లేఖ విద్యార్ధుల వైద్య విద్య ఆశలను కూటమి ప్రభుత్వం చిద్రం చేస్తోందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) మండిపడింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్‌లు సోమవారం మీడియాకు విడుదల చేశారు. విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యతను విస్మరించి ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కట్టడం దారుణమన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కొత్త కళాశాలలకు అనుమతులు తేవాల్సిన కూటమి ప్రభుత్వం పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూడా వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క పాడేరుకు 50 సీట్లు వచ్చాయని, మిగిలిన నాలుగు కొత్త కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్వోపీ ఇచ్చి ఉంటే అనుమతులు లభించేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు 700 సీట్లు కోల్పోయారన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి విద్యార్ధులు వైద్య విద్యకు దూరం కావడం ఖాయమన్నారు. రిజర్వేషన్ల ఊసే ఉండదని, తద్వారా వెనకబడిన తరగతుల విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పేదలకు ఉచిత వైద్య సేవలు కూడా అందవని ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రద్దు చేస్తామన్న హామీపై ఎందుకు నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. వెంటనే వైద్య విద్య ప్రైవేటీకరణను విరమించుకుని ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.రాయలసీమకు బాబు ద్రోహం మెడికల్ సీట్లు వద్దనడం దారుణం పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దు వైఎస్సార్ సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి టీడీపీ కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోందని వైఎస్సార్ సీపీ పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. వైద్య, ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈమేరకు సోమవారం ఆరు అంశాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్కి లేఖ రాశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల ఈ ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకపోగా ఎన్ఎంసీ పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన 50 సీట్లు కూడా పోయాయని మండిపడ్డారు. ఇది రాయలసీమ ప్రజలకు ద్రోహం చేయడం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్ పులివెందుల మెడికల్ కళాశాలను ఎప్పుడైనా సందర్శించారా? అని నిలదీశారు. ప్రశ్నించారు. రాయల సీమ నుంచి గెలిచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉంటూ ఇలా చేయటం దుర్మార్గం అనిపించటం లేదా? అని దుయ్యబట్టారు. 2023 డిసెంబర్ 15వ తేదీన పులివెందుల మెడికల్ కళాశాల స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీచేసి పోస్టులు భర్తీ చేసి 2023లో మార్చిలో కాలేజీని ప్రారంభించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చిన్న చిన్న ఇబ్బందులుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అండర్ టేకింగ్ లెటర్ ఇస్తే అడ్మిషన్లు నిర్వహించుకోవటానికి ఎంఎన్సీ అనుమతిస్తుందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కేవలం మాజీ సీఎం జగన్ హయాంలో నిర్మాణం, ప్రారంభం అయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక అడ్మిషన్లకు కూటమి ప్రభుత్వం అడ్డుపడిందని విమర్శించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గమని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం అని చంద్రబాబును నిలదీశారు. ‘ఇకనైనా కళ్లు తెరవండి.. వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కు తీసుకోండి. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి’ అని హితవు పలికారు. మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి, పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘మీకు చేతనైనంత మీరు ఖర్చు చేస్తూ వెళ్లండి.. మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తి చేస్తాం. అంతేకానీ ఇలా మెడికల్ కాలేజీల ప్రైవేటుపరం మాటున స్కామ్‌లు చేయడం మానుకోండి. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించుకోండి’ అని చంద్రబాబును హెచ్చరించారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును తూర్పారపడుతూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. బాధ్యతల నుంచి తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అంటారా? ⇒ నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబూ? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా? ⇒ దీన్ని గుర్తించే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీని వల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023–24 సంవత్సరాల్లో ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలా మంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవడం లేదా? ⇒ నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలో మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంచేసే స్కామ్‌లకు ఆలోచన చేయడం ఏంటి? ప్రైవేటు మీద అంతమోజు ఎందుకు? ⇒ కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం రూ.2403 కోట్లు ఖర్చు చేసి, ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి, మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశాం. మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా? ⇒ ఇలా చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా? ప్రైవేటు మీద మీకు అంత మోజు ఎందుకు? ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు? కోవిడ్‌లో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే ⇒ కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు, అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం కలగ కూడదన్న విధానంలో మేం సీట్లను భర్తీ చేస్తే, ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారు. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయట పడ్డారు. ⇒ పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు, సీహెచ్‌సీలకు, పీహెచ్‌సీలకు, విలేజ్ క్లినిక్స్‌కు మార్గదర్శిగా ఉంటుంది. ఆ జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాల్టీ సేవలు కూడా పేదలకు ఉచితంగా అక్కడే లభిస్తాయి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలు కూడా. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా.. ప్రైవేటు ఆస్పత్రుల మధ్య పోటీ లోపించి వైద్యం కోసం వసూలు చేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ⇒ ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంటు పోటీగా ఉంటేనే, రేట్లు రీజనబుల్‌గా ఉంటాయి. కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బ తీస్తుందనడం వాస్తవం కాదా? అటు ప్రజలను, ఇటు పిల్లలను కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబూ? పేదలకు ఉచితంగా మంచి వైద్యం అందకూడదన్నదే మీ విధానమని తెలుస్తోంది. -
తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదం
‘ఏడాదిపాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ యూజీ–2024లో 595 స్కోర్ చేశా. గతేడాదితో పోలిస్తే మెరుగైన స్కోర్ చేసినా కన్వీనర్ కోటాలో సీటు వస్తుందన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది మరో 5 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభిస్తే మనకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరేవి. దీనికి తోడు టీడీపీ తన హామీ మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తే మరో 319 సీట్లు కన్వీనర్ కోటాలో పెరిగేవి. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ అండర్ టేకింగ్ కోరినా ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేస్తే మేం నిర్వహించలేమంటూ ప్రభుత్వమే లేఖ రాసి నాలాంటి విద్యార్థులకు తీవ్ర నష్టం తలపెట్టింది. ఇప్పటికే లాంగ్‌టర్మ్ కోచింగ్ రూపంలో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈసారి కూడా సీటు రాకుంటే నా భవిష్యత్ అంధకారమే. తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు ఈసారి సీట్లు వస్తున్నాయి. అక్కడ 8 వైద్య కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగడమే దీనికి కారణం. ఏపీలో మాత్రం వచ్చిన సీట్లు సైతం వద్దంటూ ప్రభుత్వమే లేఖ రాసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై చిత్తశుద్ధి లేని జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది...!’ విశాఖకు చెందిన నీట్ ర్యాంకర్ సాయి ఆక్రోశం ఇదీ!సాక్షి, అమరావతి: వైద్య విద్యపై ఎంతో ఆశ పెట్టుకుని లాంగ్ టర్మ్ శిక్షణతో ఏడాదంతా సన్నద్ధమై మంచి స్కోర్ సాధించిన పలువురు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కాలేజీలు అందుబాటులోకి రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది 700, వచ్చే ఏడాది 1,050 చొప్పున మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో తమ ఆశలు గల్లంతవుతున్నాయని నీట్ ర్యాంకర్లు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? అని ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే ఇక ‘కోట్లు’న్న వారికే తెల్లకోటు భాగ్యం దక్కుతుందని పేర్కొంటున్నారు.మంచి స్కోరైనా..సీట్ కష్టంనీట్ యూజీలో అర్హత సాధించిన 13,849 మంది ఈసారి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నీట్లో 500–550 స్కోర్ చేసినా రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఓసీ విద్యార్థులైతే దాదాపు 600 స్కోర్ చేసినప్పటికీ అసలు సీటు వస్తుందో? లేదో? అనే ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు దక్కుతున్నాయని, ఏపీలో మాత్రం ప్రతిభ ఉన్నప్పటికీ వైద్య విద్య చదివే అదృష్టం లేదని వాపోతున్నారు. గత పదేళ్లలో తెలంగాణలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు గణనీయంగా పెరగడం, ఈ విద్యా సంవత్సరంలో 8 కళాశాలలకు ఏకంగా 400 సీట్లు అదనంగా మంజూరవడం అక్కడి విద్యార్థులకు కలిసి వస్తోంది.సీట్లు పెరిగింది గత ఐదేళ్లలోనే⇒ ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్‌లను నెలకొల్పడంతో పాటు నెల్లూరు ఎసీఎస్ఆర్ కళాశాల ఏర్పాటుకు బీజం వేశారు. ⇒ 2004కు ముందు, 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కాలేదు. దీంతో వైద్య విద్యపై తీవ్ర ప్రభావం పడింది. ⇒ గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ⇒ వీటిలో ఐదు కొత్త కళాశాలలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరడంతో వైద్య విద్యపై ఆశలు చిగురించాయి. ⇒ ఈ క్రమంలో ఈ ఏడాది మరో ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా వాటిని ప్రైవేట్‌పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.⇒ దీంతో ఈ ఏడాది 750 సీట్లు సమకూరాల్సి ఉండగా కేవలం పాడేరు వైద్య కళాశాలలో కేవలం 50 సీట్లు అది కూడా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు వాటికి అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. ⇒ ఇదే విషయం ఎంఎన్సీ (జాతీయ వైద్య కమిషన్) రాసిన లేఖ ద్వారా ఇప్పటికే బహిర్గతమైన సంగతి తెలిసిందే. ⇒ ఈ ఏడాది మెడికల్ కాలేజీలు పెరిగితే తమ పిల్లలకు కచ్చితంగా సీటు వస్తుందనే అంచనాతో సగటున రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసి నీట్ శిక్షణ ఇప్పించామని, అయితే స్కోర్ 500 దాటినా దక్కని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ⇒ పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేయడం విస్మయం కలిగించిందంటూ ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వమే వ్యాఖ్యానించడంపై నివ్వెరపోతున్నారు.మా ఆశలను కాలరాశారుగతేడాది నీట్లో 515 స్కోర్ చేశా. ఓసీ కేటగిరీలో 543 స్కోర్‌కు కన్వీనర్ కోటాలో చివరి సీట్ వచ్చింది. దీంతో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. ఈసారి 555 స్కోర్ సాధించినా పోటీ తీవ్రంగా ఉంది. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే నాకు సీటు దక్కేది. కనీసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసినా మాకు న్యాయం జరిగేది. ప్రభుత్వమే మా ఆశలను కాలరాసింది. మేనేజ్మెంట్ కోటాలో చేరాలంటే మా తల్లిదండ్రులకు తలకు మించిన భారం. ఇప్పటికే నాతోపాటు మా సోదరుడి లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ. లక్షల్లో ఖర్చు పెట్టారు. – ఎన్. సుచేతన, రాజంపేట, అన్నమయ్య జిల్లాఅప్పుడు అదృష్టం.. ఇప్పుడు!నాకు ఇద్దరు కుమార్తెలు. 2023లో పెద్దమ్మాయి నీట్లో 530 మార్కులు సాధించి ఏలూరు కాలేజీలో సీట్ దక్కించుకుంది. ఆ విద్యా సంవత్సరంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడం, అదనంగా 750 సీట్లు పెరగడం మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు రెండో అమ్మాయి 543 మార్కులు సాధించినా ప్రభుత్వ సీట్ రావటం లేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఐదు కొత్త కళాశాలలు ప్రారంభం అయితే అదృష్టం కలసి వస్తుందని ఆశపడ్డాం. ప్రభుత్వమే వసతులు కల్పించలేమని చేతులెత్తేస్తే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? అదే మా అమ్మాయి పక్క రాష్ట్రంలో ఉంటే మొదటి రౌండ్లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చేది. – సీహెచ్.ఉమామహేశ్వరరావు, పోలాకి మండలం, శ్రీకాకుళంప్రభుత్వమే వ్యాపారం చేస్తానంటే ఎలా?సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ దాన్ని నెరవేర్చకపోగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వం ఉచితంగా వైద్య విద్య అందించడానికి కృషి చేయాలి. అంతేగానీ వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? గతేడాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమై అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రావడంతో ఎంతో సంతోషించాం. ఈ ఏడాది మరో ఐదు కొత్త కాలేజీల ద్వారా అదనంగా 750 సీట్లు వస్తాయని భావిస్తే పీపీపీ విధానం పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురి చేశారు. – జి.ఈశ్వరయ్య, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి -
వైద్య విద్య సీట్లపై ‘ప్రైవేటు’ కన్ను!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పేదలకు అందే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నుతున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలుగా హోదా తెచ్చుకుని.. ప్రభుత్వ నియంత్రణ లేకుండా తమదైన నిబంధనలు అమలు చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడమేకాదు.. ఫీజులను ఇష్టారీతిన పెంచుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం వంటి చర్యల ద్వారా అంతా సొంత రాజ్యాలుగా మార్చుకునేందుకు ఈ మార్గం ఎంచుకుంటున్నాయి. ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)’నుంచి డీమ్డ్ వర్సిటీలుగా అనుమతులు తెచ్చుకుంటాయి. ప్రతిభ ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలలకు ఈ తీరు దెబ్బకొట్టనుంది. ఇప్పటికే రెండు కాలేజీలకు.. ఇటీవలే మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీ హోదాను మంజూరు చేసింది. అపోలో, సీఎంఆర్ మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. మున్ముందు మరికొన్ని కాలేజీలు ఇదే బాటన నడిచేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది. ఈ పరిణామాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా యూజీసీకే దరఖాస్తు చేసుకుంటూ పోతే ఎలాగని.. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఇష్టారాజ్యంగా సీట్ల భర్తీ కోసం.. రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాగా.. 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వంలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా కనీ్వనర్ కోటాలోనే భర్తీ చేస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో సగం కనీ్వనర్ కోటా కింద భర్తీ చేస్తారు. వాటి ఫీజు ఏడాదికి రూ.60 వేలు మాత్రమే. డీమ్డ్ వర్సిటీలుగా మారిన మెడికల్ కాలేజీల్లో ఈ కనీ్వనర్ కోటా సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాలోకి మారిపోతాయి. మొత్తం సీట్లన్నీ కాలేజీల చేతిలోకే వెళ్లిపోతాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లుండగా... అందులో 200 సీట్లు కనీ్వనర్ కోటాలోకి రావాలి.కానీ వాటికి డీమ్డ్ వర్సిటీ హోదా రావడంతో.. అవన్నీ మేనేజ్మెంట్ కోటాలోకే వెళ్లిపోయాయి. ఇక డీమ్డ్ వర్సిటీ కాలేజీల్లో స్థానిక అభ్యర్థులకు కోటా ఉండదు. దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులైనా వచ్చి చేరవచ్చు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉండవు. ఫీజులు నిర్ణయించుకునే అధికారం కూడా యాజమాన్యాలకే ఉంటుంది. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా యాజమాన్యాలే నిర్వహించుకుంటాయి. అంటే ఆ మెడికల్ కాలేజీలు పూర్తిగా యాజమాన్యాల సొంత రాజ్యాలుగా మారిపోతాయి. కనీ్వనర్ కోటా సీట్లలో చాలా వరకు ప్రతిభ ఉన్న పేద విద్యార్థులే దక్కించుకుంటారు. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోతుండటంతో వారికి అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకూ నష్టదాయకమేకావడం ఆందోళనకరం. -
స్థానికత రిజర్వేషన్: సుప్రీంకు తెలంగాణ సర్కార్
ఢిల్లీ: స్థానికత రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రాన స్థానిక రిజర్వేషన్ వర్తించవని ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణలో చదువుకోలేదన్న కారణంతో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ నిరాకరించరాదని స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు తీర్పును తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని తెలంగాణ తరఫు సీనియర్ నాయకుడు గోపాల్ శంకర్ నారాయణ సుప్రీం కోర్టును కోరింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను త్వరలోనే విచారణ జాబితాలో చేరుస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెల్లడించారు.చదవండి: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌పై నీలినీడలు -
కొత్తగా 400 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది అదనంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం 4 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీలకు అనుమతి ఇస్తూ ప్రిన్సిపాళ్లకు లేఖ రాసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 8 కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసింది. వాటిలో నాలుగింటికి గత నెలలో అనుమతులు రాగా, తాజాగా మిగిలిన నాలుగింటి అనుమతులపై స్పష్టత ఇచ్చింది. గత నెలలో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వీటిల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగినట్టు మంత్రి వెల్లడించారు. ముమ్మర ప్రయత్నాలు... ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది. జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమన్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. ఈ అప్పీల్ తర్వాత ములుగు, నర్సంపేట, గద్వాల నారాయణపేట కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్ఎంసీ, మిగిలిన 4 కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. ఈ కాలేజీల అనుమతులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెగ్యులర్‌గా పర్యవేక్షించారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు సిబ్బందిని నియమించారు. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్లలో తొలుత ఆ 4 కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే, మిగిలిన కాలేజీల్లోకి స్టాఫ్‌ను బదిలీ చేశారు. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి ప్రమోషన్లు ఇప్పించారు. కాలేజీ, హాస్పిటల్లో ఉండాల్సిన లేబొరేటరీ, డయాగ్నస్టిక్స్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. ఇలా ఎన్ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు సెకండ్ అప్పీల్ చేశారు. మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశాలతో వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ డాక్టర్ వాణి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ చేయాలని ఎన్ఎంసీని ఆదేశించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఆయన కృషి ఫలితంగా కొత్తగా మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. -
ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు నలుగురు పోటీ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2024–25 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లకు తీవ్ర పోటీ నెలకొంది. కన్వీనర్ కోటాలో మొత్తం 3,856 సీట్లు ఉండగా.. వీటికి 13,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో సీటుకు దాదాపు నలుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారు. యాజమాన్య కోటా (ఎంక్యూ) సీట్లకు కూడా గతంతో పోలిస్తే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత విద్యా సంవత్సరంలో ఎంక్యూ సీట్లకు 3,500 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఈసారి ఇప్పటివరకు 4,136 మంది నమోదు చేసుకున్నారు. సీట్ వస్తుందో.. లేదోనీట్ యూజీలో మంచి స్కోర్ సాధించిన వారికి అఖిల భారత స్థాయిలో ర్యాంక్‌లు పెరిగిపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మంచి స్కోర్ సాధించినప్పటికీ ఎంబీబీఎస్ సీటు వస్తుందో, లేదో అనే సందేహం చాలా మందిని వెంటాడుతోంది. మరోవైపు తెలంగాణ విద్యార్థులకు 15 శాతం కోటా రద్దు, స్థానికతపై తీసుకున్న నిర్ణయం, స్కోర్, ర్యాంక్‌ల తీరు మారడంతో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న సీట్లను రిజర్వేషన్ల వారీగా ప్రకటిస్తే కొంత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కొనసాగుతున్న రెండో విడత పరిశీలన విద్యార్థుల దరఖాస్తులను రెండు విడతల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పరిశీలిస్తారు. అనంతరం మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. ఈ క్రమంలో కన్వీనర్ కోటా దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే తొలి విడత పరిశీలన పూర్తయింది. రెండో విడత కొనసాగుతోంది. ఇది కూడా పూర్తయ్యాక రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 9 నుంచి కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా 16తో గడువు ముగిసింది. భారీగా పెరిగిన కటాఫ్.. ఇప్పటికే అఖిల భారత కోటా (ఏఐక్యూ) తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. విద్యార్థులకు సీట్లు కూడా కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి తొలి విడత కౌన్సెలింగ్‌లో భారీగా కటాఫ్ స్కోర్లు పెరిగాయి. దీంతో రాష్ట్ర కోటాలో పోటీ పడుతున్న విద్యార్థులు తాము సాధించిన మార్కులకు సీటు వస్తుందో, రాదోననే ఆందోళనలో ఉన్నారు. గతేడాది ఏఐక్యూ తొలి విడత కౌన్సెలింగ్‌లో అన్ రిజర్వుడ్ విభాగంలో 618 స్కోర్ వరకు సీటు లభించింది. ఈ ఏడాది కటాఫ్ స్కోర్ 42 పెరిగి 660 స్కోర్‌కు చివరి సీటు వచ్చింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో గతేడాది 613 మార్కులకు సీటు వస్తే ఈసారి 654 మార్కులు వచ్చినవారికి చివరి సీటు దక్కింది. వాస్తవానికి రాష్ట్రంలో 600 స్కోర్‌కు పైన చేసిన విద్యార్థుల్లో చాలా మంది అఖిల భారత కోటాలో సీట్లు పొందుతుంటారు. దీంతో రాష్ట్ర వాటా సీట్లలో కొత్త వారికి అవకాశం లభించేది. అయితే ఏఐక్యూ కటాఫ్ గణనీయంగా పెరగడం చూసి.. రాష్ట్రంలో కూడా ఇవే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
వైఎస్ జగన్ హయాంలో మెడిసిన్‌కు మహర్దశ
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అందులో భాగంగా వైద్య రంగాన్ని విస్తృతం చేశారు. మారుమూల ప్రజలకు కూడా అత్యాధునిక వసతులతో స్పెషాలిటీ వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. ఒక్క ప్రభుత్వ రంగంలోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 5 వైద్య కళాశాలల్లో తరగతుల, వైద్యం ప్రారంభం కాగా, ఈ ఏడాది మరో ఐదు కళాశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. తద్వారా ప్రజలకు అధునాతన వైద్య సేవలు చేరువవడమే కాకుండా, వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు కూడా భారీగా పెరిగాయి. ఒక్కడ 2023–24 విద్యా సంవత్సరంలోనే కొత్తగా ఏర్పాటైన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ కాలేజీల ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంమీద 2019–20 నుంచి 2023–24 సంవత్సరాల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 1,585 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా లోక్ సభలో వెల్లడించింది. 2018–19లో (నాటి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సీట్లు 4,900 మాత్రమే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా లోక్‌సభలో తెలిపారు. ఆ తర్వాతి ఐదేళ్లలో (వైఎస్ జగన్ హయాంలో) 1,585 సీట్లు పెరిగి 6,485కు చేరినట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లు గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో కొత్త కళాశాలలను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మూడు దశల్లో దేశవ్యాప్తంగా 157 కాలేజీలను మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. -
విద్యార్థుల ఆశలపై నీళ్లు
సాక్షి, అమరావతి: అనుకున్నంతా అయింది.. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించాల్సి ఉన్న ఐదు కొత్త ప్రభుత్వ కళాశాలల ప్రారంభంపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నీళ్లుజల్లింది. ఈ ఏడు తరగతులు ప్రారంభించుకునేందుకు అనుమతివ్వలేదు. దీంతో వీటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వీటికి అనుమతులు సాధించడంలో టీడీపీ–జనసేన–బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టకపోవడమే కారణమని వైద్యశాఖ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.ఉద్దేశపూర్వకంగానే ఈ కొత్త కళాశాలల ప్రారంభానికి చంద్రబాబు మోకాలడ్డారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి.. 2024–25 విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరులలో ఈ కళాశాలలు ప్రారంభించడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాటలు వేసింది. ఇందులో భాగంగా.. ఈ ఐదుచోట్ల ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, వైద్య కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా పోస్టులను మంజూరుచేసి భర్తీ ప్రక్రియ చేపట్టింది. కానీ, ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదు. కనీసం చర్చించని బాబు సర్కారు.. గత నెల 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 25న వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికంటే ముందే సీఎస్ నియామకం, ఇతర అధికారుల మార్పు చేపట్టారు. ఈ అంశాలపై ఫోకస్ పెట్టిన బాబు అండ్ కో ప్రజల భవిష్యత్తు వైద్య అవసరాలు, విద్యార్థుల ఆకాంక్షలతో ముడిపడి ఉన్న వైద్య కళాశాలల ప్రారంభంపై మాత్రం దృష్టిపెట్టలేదు. పైగా.. సీఎం హోదాలో ఈనెల 3న వైద్యశాఖపై బాబు తొలి సమీక్ష నిర్వహించారు.ఇందులో కూడా వైద్య కళాశాలల అంశాన్ని చర్చించలేదు. మరోవైపు.. తనిఖీల అనంతరం కళాశాలలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించిన ఎన్ఎంసీ పలు లోపాలపై రాష్ట్ర అధికారుల నుంచి వివరణ కోరింది. అడ్మిషన్లు ప్రారంభించే నాటికి తొలి ఏడాది విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి వీలుగా కళాశాలల్లో ల్యాబ్, లెక్చర్ హాల్, హాస్టళ్లు అందుబాటులో ఉంటే సరిపోతుంది. ఐదుచోట్ల 80 శాతం మేర ఈ సదుపాయాలున్నాయి. ఇంటీరియర్ పనులు, పలు పరికరాలను సమకూరిస్తే సరిపోతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశమున్నందున ఈలోపు వసతులను కలి్పంచడానికి వీలుంటుంది.కానీ, ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేయలేదు. పైగా.. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మరోవైపు.. ఈ కళాశాలల్లో పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించడానికి సీఎం జగన్ ప్రభుత్వం పలు దఫాలుగా నోటిఫికేషన్లు ఇచి్చంది. నగరాలకు దూరంగా ఉన్న క్రమంలో పలు స్పెషాలిటీల్లో వైద్యులు ముందుకు రానందున ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామని కూడా ప్రకటించింది.ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మూడు వారాలు.. సీఎం ప్రమాణ స్వీకారం అయ్యాక రెండు వారాల పాటు సమయం ఉన్నప్పటికీ ఈ కొత్త వైద్య కళాశాలల ప్రారంభం గురించి పైస్థాయిలో ఏమాత్రం చర్చించలేదు. అలా చర్చించి అనుమతులు రాబట్టడానికి ఫ్యాకల్టీ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువ చేయడంతో పాటు, విద్యార్థులకు వైద్య విద్యావకాశాలను పెంచడమే లక్ష్యంగా రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓ వైపు కళాశాలల నిర్మాణం చేపడుతూనే విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను గత విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లను సమకూర్చింది. ఈ ఏడాది ఐదు కళాశాలలను, మిగిలిన ఏడు కళాశాలలను 2025–26లో ప్రారంభించేలా ప్రణాళిక రచించింది. అనుమతులు వస్తే 500 సీట్లు..ఇదిలా ఉంటే.. ఐదు కళాశాలలకు అనుమతులు లభిస్తే ఒక్కోచోట 100 చొప్పున 500 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా సమకూరేవి. 10 లక్షల జనాభాకు వంద సీట్లు అనే నిబంధనను గత ఏడాది ఎన్ఎంసీ ప్రవేశపెట్టింది. అలాగే, కళాశాలలకు అనుమతులు మంజూరు కోసం కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. దీంతో రాష్ట్రం నుంచి ఐదు వైద్య కళాశాలలకు దరఖాస్తు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొనడంతో అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి, నిబంధనల నుంచి మినహాయింపు తెచ్చుకుని దరఖాస్తు చేసింది.అదే విధంగా.. 2023–24లో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ప్రారంభ సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి, వంద శాతం 750కు గాను 750 ఎంబీబీఎస్ సీట్లను రాబట్టింది. తొలివిడత తనిఖీల్లో విజయనగరం మినహా, మిగిలిన నాలుగు కళాశాలలకు అప్పట్లో అనుమతులు రాలేదు. భవనాలు, హాస్టళ్లు సిద్ధంగా లేకపోవడంతో పాటు, పలు అంశాల్లో కొరత ఉందని నిరాకరించారు. కానీ, అడ్మిషన్లు ప్రారంభమయ్యే నాటికి అన్ని వసతులు కలి్పస్తామని ఎన్ఎంసీకి హామీ ఇవ్వడం ద్వారా రెండో విడత తనిఖీల్లో అనుమతులను రాబట్టారు. ప్రస్తుతం కూడా అనుమతుల నిరాకరణపై అప్పీల్‌కు అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోతే విద్యార్థులకు తీవ్రనష్టం జరిగే అవకాశముంది. -
సిద్ధార్థ కళాశాల సీట్లన్నీ ఏపీవారికే కేటాయించాలి
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే కేటాయించాలని కోరుతూ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బాబ్జీకి ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, కోశాధికారి నరసింహారావు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల వరకూ తెలంగాణ విద్యార్థులకు 36 శాతం సీట్లు కేటాయించాలని చట్టంలో ఉందన్నారు. పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ 36 శాతం సీట్లు కూడా మన విద్యార్థులకే కేటాయించాలని కోరారు. అదే విధంగా కొత్త వైద్య కళా శాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని రద్దు చేయాలని కోరా రు. తాము అధికారంలోకి వస్తే సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల వాగ్ధానం చేసిందని పేర్కొన్నారు. -
అన్ని వైద్య కళాశాలల్లోఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లలో 10 శాతం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని (మైనారిటీ కాలేజీలు మినహా) సగం కనీ్వనర్ కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కేటాయించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ మేరకు అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 7 కాలేజీల్లోనే.. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. హైదరాబాద్‌లోని గాందీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఎన్ఎంసీ అనుమతి మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గతేడాది వరకు ఆయా కాలేజీల్లో 103 ఎంబీబీఎస్ సీట్లు ఈ కోటా కింద అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చారు. కాగా ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను అమలు చేస్తే మరో 350 వరకు ఎంబీబీఎస్ సీట్లు అగ్రవర్ణ పేదలకు దక్కే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత, అడ్మిషన్ నోటిఫికేషన్ కంటే ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జనరల్ కోటా సీట్లకు గండిరాష్ట్రంలో గతేడాది వరకు 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అయితే ఇప్పటివరకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు గాను అంతే మొత్తంలో సీట్లను ఆయా మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ మంజూరు చేసింది. దీనివల్ల ఇతర రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కానీ, జనరల్ కేటగిరీ కోటా సీట్లకు కానీ కోత పడేది కాదు. కానీ తాజాగా ఎన్ఎంసీ అదనపు సీట్లు మంజూరు చేయడం కుదరదని, ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి కోత ఉండదని అంటున్నారు. అంటే జనరల్ కేటగిరీ సీట్లకు కోత పెట్టి వాటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు కేటాయిస్తారు. అలాగైనా తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అంటున్నారు. జనరల్ కేటగిరీలోనూ తమకు ప్రతిభ ప్రకారం రావాల్సిన సీట్లకు గండి పడుతుందని, దీనివల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలంటే ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలున్నాయి. అన్ని మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యే పక్షంలో ఈ మేరకు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. -
మరో ఐదు మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. ఈ దిశగా సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) త్వరలో ఐదు చోట్ల ఇన్స్పెక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం ఆయా కళాశాలలకు అనుమతులు మంజరు కానున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2023–24లో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం వైద్య కళాశాలలను ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు.ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగాఐదు చోట్ల ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు నర్సింగ్, మెడికల్, నాన్ మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులను మంజూరు చేసి భర్తీ కూడా చేపట్టారు. ఈ కళాశాలలన్నీ మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నందున పోస్టులన్నీ భర్తీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ప్రారంభించే 7 వైద్య కళాశాలలకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యాకల్టీకి అదనపు ప్రోత్సాహకాలు కల్పించారు. పాడేరు, మార్కాపురం, పార్వతీపురం, పిడుగురాళ్ల, పెనుకొండ కాలేజీల్లో ఫ్యాకల్టీకి బేసిక్‌పై 50 శాతం ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లోని పులివెందుల, మదనపల్లె, ఆదోని, అమలాపురం, బాపట్ల, పాలకొండ, నర్సీపట్నం కళాశాలల్లో బేసిక్‌పై 30 శాతం ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. రూ.8,480 కోట్లతో మెడికల్ కాలేజీలువైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసింది. ఇందులో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు ఏడు చోట్ల ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు వీలుగా పడకల సంఖ్య పెంచుతూ వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. -
ఎంబీబీఎస్ సీట్లలో ఉమ్మడి కోటా రద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి కోటా కింద ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎంబీబీఎస్‌లో సీట్ల కేటాయింపునకు స్వస్తి పలకాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు ఆదేశాల మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైపోతున్న సందర్భంగా జూన్ 2వ తేదీ తర్వాత నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లుగా అన్ని రకాల విద్యా సంస్థల్లో 15 శాతం కన్వీనర్ కోటా సీట్లను ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తున్నారు.రెండు రాష్ట్రాల విద్యార్థుల్లో ఎవరికి మెరిట్ ఉంటే వారికి సీట్లు కేటాయిస్తున్నారు. గత పదేళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. ఏపీలో కాలేజీల్లో కూడా ఇదే విధంగా ఉమ్మడి కోటా అమలవుతోంది. అయితే మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడి విద్యార్థులు అక్కడ దరఖాస్తు చేసుకోవడం తక్కువ. కానీ ఏపీ విద్యార్థులు మాత్రం ఉమ్మడి కోటాను ఉపయోగించుకుని ఇక్కడ సీట్లు పొందుతున్నారు. విభజన చట్టం జూన్ రెండో తేదీతో ముగిసిపోనుంది.దీంతో ప్రభుత్వం కూడా ఏపీతో ముడిపడి ఉన్న అంశాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లలో ఉమ్మడి కోటాను రద్దు చేస్తే, ఇక నుంచి అన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులకే వస్తాయి. పీజీ మెడికల్‌లోనూ ఇదే పద్ధతి పాటిస్తారు. ఆ ప్రకారం రానున్న కౌన్సెలింగ్‌లో నిబంధనలు మార్చాలని, ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. విభజనకు ముందున్న కాలేజీల్లోనే అమలైన కోటారాష్ట్రంలో ప్రస్తుతం 26 ప్రభుత్వ, 27 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2022 వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఉమ్మడి కోటా అమలైంది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై విమర్శలు రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. కొత్తగా ఏర్పడిన కాలేజీల్లో ఉమ్మడి కోటాను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది.ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే కోటా అమలు చేసింది. ఈ 20 కా>లేజీల్లో కలిపి 1,950 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం అంటే 292 సీట్లను ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఇందులో 200కు పైగా సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కుతున్నాయి. ఉమ్మడి కోటా రద్దు చేస్తే ఇక నుంచి ఆ 200 సీట్లు తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి వస్తాయి.తప్పనిసరిగా రద్దు చేయాలనే రూల్ లేదా?మరోవైపు విభజన చట్టం పదేళ్లతో ముగిసినా ఉమ్మడి కోటాను తప్పనిసరిగా రద్దు చేయాల్సిన రూలేమీ లేదని అధికారులు అంటున్నారు. ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఇలాంటి ప్రతిపాదనలపై అసలు చర్చే జరగడం లేదని చెప్పడం గమనార్హం. -
నేడు నీట్ యూజీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ యూజీ–2024)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.పెన్ అండ్ పేపర్ మోడ్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది, నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు, పలు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.24 లక్షల మందికి పైగా..ఈ ఏడాది దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ యూజీ రాయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. అయితే గతేడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 42,836 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది 70 వేల మందికిపైగా పరీక్ష రాసే అవకాశం ఉంది. 706 కళాశాలల్లో లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లునీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 706 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ కళాశాలల్లో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 5,360 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, పాడేరుల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మరో 500 సీట్లు కొత్తగా సమకూరనున్నాయి.విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు∗ పెన్ను, అడ్మిట్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీసుకెళ్లాలి.∗ ఆధార్, పాన్, ఓటరు ఐడీ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తీసుకెళ్లాలి.∗ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.∗ ఉంగరాలు, చెవి పోగులు, నగలు, ఆభరణాలు వంటివి ధరించకూడదు. -
చంద్రబాబు పేదల ద్రోహి
సాక్షి, అమరావతి: నాటి చంద్రబాబు ప్రభుత్వ పెత్తందారు పోకడలకు కామినేని వ్యాఖ్యలు అద్దంపట్టాయి. విద్య, వైద్యం ఈ రెండింటినీ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తేనే పేదలకు ప్రయోజనం. ఇందుకోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాథమిక సూత్రానికి తిలోదకాలు వదిలి.. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలకు కొమ్ముకాశారు చంద్రబాబు. ఫలితంగా ఆయన జమానాలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుకాకపోవడం, ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు కొనలేక వేల మంది పేద విద్యార్థుల వైద్యవిద్య కల కలగానే మిగిలిపోయింది. బాబు సీఎంగా ఉన్న రోజుల్లో ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుపై చూపిన శ్రద్ధ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుపై ఏనాడు చూపలేదు. ఫలితంగా ఆయన పేదల ద్రోహిగా మిగిలిపోయారు. బాబు చూపిన చొరవ శూన్యం.. ‘40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేశా. దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు ఎవరూలేరు’.. అని తరచూ చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటారు. ఇంత డబ్బా కొట్టుకునే పెద్దమనిషి రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో వైద్య కళాశాలల ఏర్పాటులో చూపెట్టిన శ్రద్ధ మాత్రం గుండుసున్నా. నిజానికి.. 2019లో బాబు దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 11 కళాశాలలు ఉండగా.. ఆంధ్ర, గుంటూరు వైద్య కళాశాలలు స్వాతంత్య్రానికి ముందే ఏర్పాటయ్యాయి. టీడీపీ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు, కాకినాడ రంగరాయ, తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలు ఏర్పడ్డాయి. అంటే.. టీడీపీ ఆవిర్భవించి ఎన్టీఆర్ సీఎం అయ్యే నాటికే రాష్ట్రంలో ఐదు వైద్య కళాశాలలున్నాయి. 1986లో సిద్ధార్థ వైద్య కళాశాలను ఎన్టీఆర్ ప్రభుత్వంలోకి మార్చారు. ఇలా మొత్తంగా 2004 నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏడు కళాశాలలు ఉన్నాయి. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ రంగంలో వైద్యసేవలను బలోపేతం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా కడప, శ్రీకాకుళం, ఒంగోలు రిమ్స్‌లు ఏర్పాటుచేశారు. నెల్లూరులో ఏసీఎస్సార్ కళాశాల ఏర్పాటుకు వైఎస్సార్ సానుకూలంగా స్పందించగా, ఆయన అకాల మరణం అనంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కళాశాలను ప్రారంభించింది. ఈ లెక్కన పరిశీలిస్తే మూడుసార్లు సీఎంగా పనిచేసిన బాబు తన జమానాలో ప్రభుత్వ రంగంలో వైద్యవిద్య బలోపేతంపై ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. ఇక 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో టీడీపీ గెలుపొందింది. కేంద్రంలో భాగస్వామిగా కూడా కొనసాగింది. అప్పుడు కూడా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేయలేదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ సాకులు చెప్పి ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులిచ్చి తన వాళ్ల జేబులు నింపడానికే శ్రద్ధ చూపారు. పేదలకు ద్రోహం చేస్తూ విద్య, వైద్య రంగాలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో పెట్టారు. దీంతో.. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవ్వక మన విద్యార్థులు వైద్యవిద్య కోసం వలసలు వెళ్తున్నా.. చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు లేక ప్రజలు విలవిల్లాడుతున్నా రాజగురువు, రామోజీ ఫిల్మ్‌సిటీ జమిందారు రామోజీ మాత్రం చూసిచూడనట్లు వ్యవహరించారు. సువర్ణాధ్యాయం లిఖించిన సీఎం జగన్ 2019లో సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ప్రభుత్వ రంగంలో ఏకంగా రూ.8వేల కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటుచేయాలని సంకల్పించారు. తద్వారా ఆంధ్ర రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. ఇందులో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25 విద్యా సంవత్సరంలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరు కళాశాలలను ప్రారంభించబోతున్నారు. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించనున్నారు. వీటి ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో కొత్తగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ సమకూరుస్తున్నారు. వాస్తవానికి.. 2019 నాటికి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. కానీ, వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించడానికి చర్యలు తీసుకున్న ఏకైక ప్రభుత్వంగా కూడా సీఎం జగన్ ప్రభుత్వం రికార్డుకెక్కింది. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ వంటి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి సీఎం జగన్ వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెంచడంతో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడానికి కృషిచేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటైన ప్రైవేట్ వైద్య కళాశాలలు.. -
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 112 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు సంబంధించిన దరఖాస్తులను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పరిశీలించింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం 112, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు 58 దరఖాస్తులు వచి్చనట్టు వెల్లడించింది. కాగా, ఏపీలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ఐదు దరఖాస్తులు అందినట్టు తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను 2023–24 విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచి్చంది. కాగా వచ్చే విద్యా సంవత్సరం (2024–25)లో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరుల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు వైద్య శాఖ దరఖాస్తు చేసింది. అలాగే మరో ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి వీలుగా బోధనాస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొత్తం 17 వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకు 2,550 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెస్తోంది. తద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను వారికి చేరువ చేస్తోంది. ఐదు దశల్లో అనుమతుల ప్రక్రియ కొత్త కళాశాలలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను ఎన్ఎంసీ ఐదు దశల్లో చేపడుతోంది. తొలి దశలో దరఖాస్తుల పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలు సమరి్పంచని, బోధనాస్పత్రుల్లో పడకలు, ఫ్యాకలీ్ట, ఇతర అంశాల్లో లోటుపాట్లు ఉన్న కళాశాలలకు నోటీసులు జారీ చేస్తోంది. వివరణ ఇవ్వడానికి కళాశాలలకు గడువు విధించింది. ఈ ప్రక్రియ ముగిశాక రెండో దశలో ఫ్యాకల్టీ ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్) నమోదు చేపట్టనుంది. ఈ రెండు దశల ప్రక్రియ ముగియడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. అనంతరం మూడో దశలో కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఎన్ఎంసీ తనిఖీలు చేపట్టనుంది. నాలుగో దశలో కళాశాలలపై సమీక్ష చేపడుతుంది. ఐదో దశలో అనుమతులు జారీ చేస్తుంది. -
రెండు దరఖాస్తులు చాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో వైద్య విద్య కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సరళతరం చేసింది. ఎయిమ్స్ వంటి జాతీయస్థాయి మెడికల్ కాలేజీలతోపాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జరిగే కౌన్సెలింగ్లకు పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లకు కేవలం రెండు దరఖాస్తులతో పోటీపడొచ్చు. ఇందులో ప్రైవేటు కాలేజీల కోసం ఒకటి, ప్రభుత్వ కాలేజీల కోసం మరో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సీటు వస్తే అక్కడ చేరవచ్చు. విద్యార్థి కోరుకున్నచోట సీటు రాకుంటే.. తదుపరి కౌన్సెలింగ్‌లలో పాల్గొనవచ్చు. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నాయని ఎన్ఎంసీ వర్గాలు తెలిపాయి. 2024–25 వైద్య విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రానుందని వెల్లడించాయి. జాతీయ స్థాయి మెరిట్ అయినా వేర్వేరుగా..: దేశవ్యాప్తంగా 681 మెడికల్ కాలేజీల్లో 1.04 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్, ఎండీ, డీఎన్బీ ఇలా 67,802 పీజీ మెడికల్ సీట్లున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి రెండింటిలోనూ సీట్లను నీట్ ప్రవేశపరీక్ష ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం అఖిల భారత ర్యాంకు ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తున్నారు. అభ్యర్థులు తమ రాష్ట్ర పరిధిలో దరఖాస్తు చేసుకున్నప్పుడు.. వారిని రాష్ట్ర కేటగిరీగా గుర్తించి, తదనుగుణంగా మెరిట్ జాబితాలను తయారు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజీల్లోని 15శాతం ఆలిండియా కోటా సీట్లకు, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ నిర్వహించేది. అభ్యర్థులెవరైనా ఈ 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్లకోసం అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాల్లోని కాలేజీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ అధికారులు కూడా.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లకు ఆలిండియా ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితాలు తయారు చేసి అడ్మిషన్లు చేస్తారు. ప్రైవేట్ సీట్లకూ జాతీయస్థాయి కౌన్సెలింగ్ ప్రస్తుతం రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లకు ఆయా రాష్ట్రాల్లోనే కౌన్సెలింగ్ జరుగుతోంది. వాటిలో కనీ్వనర్ కోటాకు వేరుగా, బీ కేటగిరీ, ఎన్నారై కోటాల సీట్లకు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వీటిలోని ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కౌన్సెలింగ్ కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తోంది. ఎన్ఎంసీ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని వివిధ కేటగిరీల సీట్లకు ఒకే దరఖాస్తు సరిపోతుంది, ఒకేసారి కౌన్సెలింగ్ జరుగుతుంది. ► ఉదాహరణకు తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్న బీ కేటగిరీ సీట్లలో 85శాతం స్థానికులకు కేటాయించగా, మిగతా 15శాతం ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఏ రాష్ట్రం వారైనా పోటీపడొచ్చు. ఈ ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. ఒకే దరఖాస్తు ద్వారా ఆయా రాష్ట్రాల్లోని కాలేజీల్లో ఎక్కడో ఒకచోట సీటు పొందవచ్చు. నచ్చినచోట చేరవచ్చని, లేకుంటే తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ఎన్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ► గత ఏడాది దేశవ్యాప్తంగా 20.87 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. మొత్తం 11,45,976 మంది అర్హత సాధించగా.. అందులో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది ఉన్నారు. ఒకేసారి విస్తృతంగా కౌన్సెలింగ్ ప్రస్తుత నిబంధనల మేరకు అభ్యర్థులు జాతీయ స్థాయి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. డీమ్డ్ వర్సిటీల్లోని కాలేజీలకు వేరుగా, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇలా పదుల సంఖ్యలో, కొందరైతే 50 నుంచి 60 దరఖాస్తులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రాల్లోని కాలేజీల్లో 15% జాతీయ స్థాయి ఓపెన్ కోటాకు ఏ రాష్ట్రంవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీటికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ జరిగేది. ఆ కౌన్సెలింగ్ పూర్తయ్యాక రాష్ట్రాల్లోని మిగతా కనీ్వనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరిపేవారు. ఈ ఏడాది నుంచి జాతీయ, రాష్ట్రస్థాయి సీట్లన్నింటికీ ఒకేసారి.. అంటే ఒకే తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.