కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏడు నకిలీ కుల సర్టిఫికెట్ల వ్యవహారంలో పలువురు అరెస్టు కాగా.. ఇదే తరహా లో మరో 47 కుల ధ్రువీకరణ పత్రాలు కల్లూ రు మండలం కేంద్రం నుంచే జారీ అయినట్లు గుర్తించారు. దీంతో వీటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వీసీ లేఖ రాసిన సం గతి తెలి సిందే. రెండు రోజుల్లో నివేదిక అందనుంది.
ఇతర జిల్లాల వారు కూడా కల్లూరు మండలం నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇవన్నీ కల్లూరు తహసీల్దార్‌గా శివరాముడు పనిచేసిన సమయంలోనే జారీ కావడం గమనార్హం. ఇప్పటికే ఆయనపై కేసు నమోదు కాగా అజ్ఞాతంలో ఉన్నారు.
12 మంది డీసీలతో విచారణ
బోగస్ కుల సర్టిఫికెట్ల వ్యవహారంలో ఇప్పటికే పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అరెస్టై కటకటాల వెనక్కి వెళ్లారు. తాజాగా మరో 47 సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్‌కు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ లేఖ రాశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మొత్తం 12 మంది డిప్యూటీ కలెక్టర్ల(డీసీ)ను విచారణ అధికారులుగా నియమించి రెండు రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పలువురు డీసీలు గురువారం రాత్రే విచారణ ప్రారంభించారు. నకిలీల్లో ఎక్కువ మంది బీసీ-బీ సర్టిఫికెట్లపైనే ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
మరో 47 నకిలీ సర్టిఫికెట్లు!
Published Fri, Oct 30 2015 2:22 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement