Deputy collectors
-
కావాల్సిన వారికే కీలక పోస్టులు!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే... అన్నచందంగా మారింది పరిపాలనలో కీలకమైన డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారం. ముఖ్య నేత ఆశీస్సులు పొందిన వారికి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యులకు ముడుపులు సమర్పించుకున్న వారికి పనితీరు, సీనియారిటీతో సంబంధం లేకుండా మంచి పోస్టులు కట్టబెడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మిగిలిన వారికి అప్రాధాన్య పోస్టులు ఇవ్వడం... లేదా జీఏడీకి కేటాయించి ఏ పనీ చెప్పకుండా కూర్చోబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం సోమవారం రాత్రి డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించి బదిలీలు, పోస్టింగ్‌లపై రెండు జీవోలు జారీ చేసింది. అందులో సిఫారసులు చేయించినవారికి, కాసులిచ్చిన వారికి మంచి పోస్టింగ్‌లు ఇచ్చారని తెలుస్తోంది. మిగిలిన వారికి పనిష్మెంట్ పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆర్డీవోలుగా పనిచేసిన ఏడుగురు అధికారులకు ఇటీవల పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టిన కూటమి సర్కారు... ఇప్పుడు వారిని సీఆర్డీఏకి కేటాయించడం గమనార్హం.వంద మందికి పైగా జీఏడీకి: గత నెల 24వ తేదీన 30 మందికిపైగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయగా, వారిలో 11 మందికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోసారి 70 మందికిపైగా ఆర్డీవోలు, ఇతర కీలక స్థానాల్లో ఉన్న వారిని బదిలీ చేసినప్పుడు సుమారు 30 మందిని జీఏడీకి ఎటాచ్ చేసింది. వీరందరినీ జీఏడీకి పంపడానికి రాజకీయ కారణాలే తప్ప... మరే ఇతర కారణాలు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం 100 మందికిపైగా డిప్యూటీ కలెక్టర్లు జీఏడీకి ఎటాచ్ అయి ఉన్నారు. వారి సేవలు ఉపయోగించుకోకుండా, కావాలని రాజకీయ ముద్ర వేసి పక్కనపెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. సిఫారసులు, కాసులతోనే: మరోవైపు సీనియారిటీ, పనితీరుతో సంబంధం లేకుండా కొందరు ముఖ్య నేతను ప్రసన్నం చేసుకుని పోస్టింగ్‌లు దక్కించుకుంటున్నారు. ఇప్పటివరకు ఎక్కడో లూప్ లైన్లో ఉండి హఠాత్తుగా మంచి పోస్టింగ్‌లు దక్కించుకోవడానికి అదే కారణంగా కనిపిస్తోంది. ముఖ్య నేతను కలిసి భారీగా సమర్పించుకున్న వారికి కీలక పోస్టులు దక్కాయి. జిల్లా కేంద్రాల్లోని ఆర్డీవో పోస్టుల కోసం రూ.30 లక్షలకుపైగా కొందరు ఖర్చు చేసి పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. కొన్ని కీలకమైన ఆర్డీవో సీట్లకు అయితే ఏకంగా రూ.కోటి నుంచి రూ.మూడు కోట్లు కూడా ఖర్చు పెట్టి పోస్టింగ్‌లు దక్కించుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో కీలకమైన ఆర్డీవో, ఇతర ముఖ్యమైన పోస్టింగుల్లో డిప్యూటీ కలెక్టర్లను నియమించడానికి భారీగా డబ్బు తీసుకుని సిఫారసులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కొత్తగా 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు కొత్త పోస్టుల మంజూరుతో వీఆర్ఏల నుంచి తహశీల్దార్ల వరకు పదోన్నతులు దక్కుతున్నాయి. తాజాగా రెవెన్యూ శాఖలో కొత్తగా 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 973 జారీ చేసింది. దీంతో అతి త్వరలో రాష్ట్రంలో 44 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించనుంది. ఆరు నెలల క్రితం కూడా 63 డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు 63 మంది తహశీల్దార్లు పదోన్నతి పొందారు. వీరంతా ఆయా శాఖల్లో పనిచేస్తున్నారు. అంటే.. 6 నెలల కాలంలోనే ప్రభుత్వం 107 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని మంజూరు చేసింది. పోస్టులను మంజూరు చేయడంతోపాటు పదోన్నతుల అంశంలో ఇదొక రికార్డుని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారుల అవసరం ఎక్కువ ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ల అవసరం ఉందని, వారిని తమకు డిప్యుటేషన్‌పై పంపించాలని వివిధ శాఖలు గత ప్రభుత్వాన్ని కోరాయి. అదే సమయంలో చాలామంది అధికారులు పదవీ విరమణ చేయడంతో డిప్యూటీ కలెక్టర్ల కొరత ఇంకా ఎక్కువైంది. దీంతో రెవెన్యూ శాఖ గత ప్రభుత్వాన్ని పదే పదే కోరడంతో నామమాత్రంగా కొన్ని పోస్టులు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. దీంతో ఆయా శాఖల్లో అవసరాల మేరకు అధికారులు లేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు మూడు విడతల్లో మంజూరు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివిధ ప్రభుత్వ శాఖల వినతులను పరిగణనలోకి తీసుకుని ఇప్పటివరకు మూడు విడతల్లో కొత్తగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే మొదట 20, ఈ ఏడాది రెండు విడతలుగా 107 పోస్టుల్ని మంజూరు చేసింది. తాజాగా మంజూరైన 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సంబంధించి సీనియారిటీ జాబితా కూడా సిద్ధమైంది. త్వరలో దాన్ని విడుదల చేయనున్నారు. ఈసారి 44 మంది (మంజూరైన పోస్టులకి 10 శాతం అదనంగా నియమిస్తారు) తహశీల్దార్లు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందనున్నారు. ఉద్యోగుల సర్వీస్ అంశాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనంత మేలును ఈ ప్రభుత్వం చేసిందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కొనియాడారు. వేలాది పోస్టుల మంజూరుతోపాటు పదోన్నతులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విడతల వారీగా 370 తహశీల్దార్ పోస్టులు కొత్తగా మంజూరయ్యాయి. దీంతో అంతే సంఖ్యలో డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. అలాగే వెయ్యి మందికిపైగా సీనియర్ అసిసెంట్లు.. డిప్యూటీ తహశీల్దార్లు అయ్యారు. అదేవిధంగా 670 మంది కంప్యూటర్ అసిస్టెంట్లను రెవెన్యూ శాఖలో కొత్తగా నియమించారు. సీనియర్ అసిస్టెంట్ల కోసం నిర్వహించిన పదోన్నతుల్లో వీఆర్వోలకు 40 శాతం కేటాయించడంతో వేలాది మంది వీఆర్వోలకు లబ్ధి చేకూరింది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో 3,600 మంది వీఆర్ఏలు వీఆర్వోలు అయ్యారు. సర్వే సెటిల్మెంట్, భూరికార్డుల శాఖలోనూ 30 ఏళ్ల తర్వాత అవకాశం కల్పించడంతో వందలాది మందికి లబ్ధి కలిగింది. కొత్త పోస్టుల మంజూరు, పదోన్నతుల విషయంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా రెవెన్యూ శాఖను ప్రభుత్వం బలోపేతం చేసింది. -
31 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కోర్టు కేసులున్నందున తుదితీర్పునకు లోబడి ఈ పదోన్నతులుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందినవారిలో ఆర్.డి.మాధురి, బి.రోహిత్‌సింగ్, ఎ.పద్మశ్రీ, గుగులోతు లింగ్యానాయక్, మహ్మద్ అసదుల్లా, కె.వి.వి.రవికుమార్, డి.రాజ్యలక్ష్మి, కనకం స్వర్ణలత, జి.వెంకటేశ్వర్లు, వి.భుజంగరావు, డి.వెంకటమాధవరావు, ఎం.వెంకటభూపాల్‌రెడ్డి, చీర్ల శ్రీనివాసులు, ఎస్.తిరుపతిరావు, చీమలపాటి మహేందర్‌జీ, కె.గంగాధర్, బి.కిషన్‌రావు, ఎస్.సూరజ్‌కుమార్, ఇ.వెంకటాచారి, వి.విక్టర్, ఎల్.కిశోర్‌కు మార్, పి.అశోక్‌కుమార్, ఎం.విజయలక్ష్మి, జె.శ్రీనివాస్, డి.విజేందర్‌రెడ్డి, కె.శ్యామలాదేవి, కె.వీరబ్రహ్మచారి, జె.ఎల్.బి.హరిప్రియ, కె.లక్ష్మి కిరణ్, డి.వేణు, టి.ఎల్.సంగీత ఉన్నారు. కాగా, డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్, తహసీల్దార్ల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కు కృతజ్ఞతలు తెలిపాయి. -
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు సువర్ణావకాశం
కర్నూలు(సెంట్రల్): కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (ఎస్డీసీలు)/రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) స్థాయి అధికారులకు సువర్ణావకాశం లభించింది. గతంలో అన్ని అర్హతలు ఉన్నా వారు లూప్‌లైన్ పోస్టుల్లో పనిచేయాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కోరుకున్న పోస్టులు దక్కడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు వరకు రాష్ట్రంలో 13 జిల్లాలు, 51 రెవెన్యూ డివిజన్లు ఉండేవి. అందులో 13 కలెక్టరేట్లకు 13 మంది జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వోలు), 51 డివిజన్లకు 51 మంది ఆర్డీవోలు ఉండేవారు. ఇక మిగిలినవారు అదే క్యాడర్లో ఉన్నా లూప్‌లైన్ పోస్టుల్లో పనిచేస్తుండేవారు. లూప్‌లైన్ పోస్టులు అంటే.. వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, జాతీయ రహదారులు తదితర విభాగాలకు ఎస్డీసీలుగా పనిచేయడం. సాధారణంగా రెవెన్యూ డివిజన్‌కు ఆర్డీవోగా పనిచేయడానికి అధికారులు ఎక్కువ మక్కువ చూపుతారు. అదే సమయంలో డీఆర్వోలుగా పనిచేయడానికి ఇష్టపడతారు. అయితే ఆ అవకాశం కొందరికే వస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలు, 21 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడంతో ఎంతోమంది అధికారులు తాము కోరుకున్న పోస్టులను దక్కించుకోగలిగారు. 13 జిల్లాలకు 13 మందికి డీఆర్వోలుగా, 21 రెవెన్యూ డివిజన్లకు 21 మందికి ఆర్డీవోలుగా పోస్టింగ్‌లు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఒకటి, రెండేళ్లలో పదవీ విరమణ చేసేవారు కూడా ఉన్నారు. అలాంటివారు తమకు డీఆర్వో, ఆర్డీవో స్థాయి క్యాడర్ రాదనుకొని నిరాశలో ఉన్న సమయంలో మంచి పోస్టులు దక్కడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
11 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్స్ వివరాలు.. ► కాగజ్ నగర్ ఆర్డీఓగా ఆర్.ఎస్.చిత్రు ► ఆదిలాబాద్ ఆర్డీఓగా జె. రాజేశ్వర్ ► తాండూరు ఆర్డీఓగా పి.అశోక్ కుమార్ ► మంచిర్యాల ఆర్డీఓగా ఎల్.రమేష్ ► నిజామాబాద్ ఆర్డీఓగా టి.రవి ► దేవరకొండ ఆర్డీఓగా కె.గోపీరాం ► బోధన్ ఆర్డీఓగా కె.రాజేశ్వర్ ► సూర్యాపేట ఆర్డీఓగా కె.రాజేంద్రకుమార్ ► హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీఓ ఎన్. ప్రసూనాంబ బదిలీ అయ్యారు. మరో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు ఎస్.మోహన్ రావు, జి.లింగ్యానాయక్‌లను రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. -
మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్న డిప్యూటీ కలెక్టర్స్
-
‘ఆర్వోలను బాధ్యుల్ని చేయవద్దు’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదిని ఏపీ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ సభ్యులు గురువారం కలిశారు. ఎన్నికల నిర్వహణలో ఆర్వోలను బాధ్యులను చేస్తూ నిర్ణయాలు తీసుకోవద్దని సీఈఓని సభ్యులు కోరారు. ద్వివేదిని కలిసిన అనంతరం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ పి.బాబూ రావు విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ఓట్ల పోలింగ్ శాతం పెరగడానికి సీఈఓ ద్వివేదీ బాగా కృషి చేశారని కొనియాడారు. ఓట్లు మిస్ అయ్యాయని ఫిర్యాదులు లేవు..ఒత్తిడి ఉన్నా బాగా పని చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ర్పాట్లు సరిగా లేవని కొన్ని ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన మాట నిజమేనన్నారు. కింద స్థాయి సిబ్బందిలో కొందరికి ఎన్నికల నిర్వహణా అనుభవం లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ తప్పుచేయలేదని, వాటికి ఆర్వోలను బాధ్యులు చేస్తూ చర్యలు తీసుకోవద్దని ద్వివేదీని కోరామని తెలిపారు. విచారణ చేసి ఎవరు పొరపాటు చేశారో వారిపైనే చర్యలు తీసుకోవాలని ద్వివేదిని కోరినట్లు వెల్లడించారు. ద్వివేదీని కలసిన నూజివీడు రైతులు వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీని నూజివీడు రైతులు కలిశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక చెక్కుల పంపిణీ అధికారులు మాత్రమే చేయాలి..కానీ టీడీపీకి ఓటు వేస్తేనే చెక్కులు ఇస్తామని నిలిపివేశారని ద్వివేదీకి నాగిరెడ్డి వివరించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. -
మరో 10 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం 10 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులోఐదుగురికి జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) పోస్టింగులిచ్చారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. జి.భాస్కరరావు(ఎస్జీడీసీ)ని నిర్మల్ డీఆర్వోగా బదిలీ చేస్తూ గురువారం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి ఆయనను పాత స్థానంలోనే (సీసీఎల్ఏ కార్యాలయంలో సహాయ కార్యదర్శి) కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతావారి బదిలీల వివరాలు... అధికారి పేరు హోదా ప్రస్తుత స్థానం బదిలీ స్థానం 1. టి.పూర్ణచంద్ర ఎస్జీడీసీ ఆర్డీవో, ఖమ్మం డీఆర్వో, హైదరాబాద్ 2. పి.చంద్రయ్య ఎస్జీడీసీ వెయిటింగ్ డీఆర్వో, సూర్యాపేట 3. బి.బిక్ష డిప్యూటీ కలెక్టర్ వెయిటింగ్ డీఆర్వో, కరీంనగర్ 4. ఎం.వి.రవీంద్రనాథ్ డిప్యూటీ కలెక్టర్ వెయిటింగ్ డీఆర్వో, నల్లగొండ 5. కె. మధుకర్‌రెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఆర్డీవో, ఇబ్రహీంపట్నం డీఆర్వో, మేడ్చల్ 6. ఆర్.పాండు డిప్యూటీ కలెక్టర్ ట్రెయినింగ్ ఆర్డీవో, అచ్చంపేట 7. సి.అమరేందర్ డిప్యూటీ కలెక్టర్ ఆర్డీవో, అచ్చంపేట ఆర్డీవో, ఇబ్రహీంపట్నం 8. ఎం.వాసుచంద్ర డిప్యూటీ కలెక్టర్ జీఏడీ డీసీ, శేరిలింగంపల్లి 9. ఎస్.తిరుపతిరావు డిప్యూటీ కలెక్టర్ డీసీ, శేరిలింగంపల్లి రిపోర్ట్ చేయాలి -
10 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మరో 10 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు లభించాయి. హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, మైనార్టీ వెల్ఫేర్ శాఖలతోపాటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెక్రటేరియట్లో పనిచేస్తున్న 10 మంది అధికారులకు ఆర్డీవో హోదా కల్పిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి బి.ఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) డిప్యూటీ సీఎం మహ మూద్ అలీకి కృతజ్ఞతలు తెలిపింది. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి, అధ్యక్షుడు కె.గౌతంకుమార్ తదితరులున్నారు. డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన వారు.. ఎస్.రాజేశ్వరి , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హెచ్ఎండీఏ; బి.అపర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హెచ్ఎండీఏ; బి.అరుణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మైనార్టీ వెల్ఫేర్; ఎం.విజయకుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మైనార్టీ వెల్ఫేర్; ఎం.వాసుచంద్ర, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హెచ్ఎండీఏ; కె.గోపీరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హెచ్ఎండీఏ; ఎం.సూర్యప్రకాశ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పంచాయతీరాజ్; కె.వి.ఉపేందర్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పంచాయతీరాజ్; ఎస్.మాలతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్; పి.సత్యనారాయణరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జీఏడీ, సెక్రటేరియట్. -
82 మంది తహసీల్దార్లకు ప్రమోషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ మండలాల్లో తహసీల్దార్లుగా పనిచేస్తున్న 82 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు పొందిన అధికారులు ఆయా జిల్లాల్లో తాము పని చేస్తున్న మండలాల నుంచి రిలీవై పోస్టింగ్ నిమిత్తం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన వారిలో తెలంగాణ తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, కోశాధికారి చంద్రకళ, ప్రధాన కార్యదర్శి పద్మయ్య, వివిధ జిల్లాల అధ్యక్షులు వంశీమోహన్, అనంతరెడ్డి, వినోద్, రమేశ్, అమరేందర్, జగదీశ్‌రెడ్డి, వెంకారెడ్డి తదితరులున్నారు. -
మరో 47 నకిలీ సర్టిఫికెట్లు!
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏడు నకిలీ కుల సర్టిఫికెట్ల వ్యవహారంలో పలువురు అరెస్టు కాగా.. ఇదే తరహా లో మరో 47 కుల ధ్రువీకరణ పత్రాలు కల్లూ రు మండలం కేంద్రం నుంచే జారీ అయినట్లు గుర్తించారు. దీంతో వీటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వీసీ లేఖ రాసిన సం గతి తెలి సిందే. రెండు రోజుల్లో నివేదిక అందనుంది. ఇతర జిల్లాల వారు కూడా కల్లూరు మండలం నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇవన్నీ కల్లూరు తహసీల్దార్‌గా శివరాముడు పనిచేసిన సమయంలోనే జారీ కావడం గమనార్హం. ఇప్పటికే ఆయనపై కేసు నమోదు కాగా అజ్ఞాతంలో ఉన్నారు. 12 మంది డీసీలతో విచారణ బోగస్ కుల సర్టిఫికెట్ల వ్యవహారంలో ఇప్పటికే పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అరెస్టై కటకటాల వెనక్కి వెళ్లారు. తాజాగా మరో 47 సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్‌కు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ లేఖ రాశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మొత్తం 12 మంది డిప్యూటీ కలెక్టర్ల(డీసీ)ను విచారణ అధికారులుగా నియమించి రెండు రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పలువురు డీసీలు గురువారం రాత్రే విచారణ ప్రారంభించారు. నకిలీల్లో ఎక్కువ మంది బీసీ-బీ సర్టిఫికెట్లపైనే ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. -
భూ సమీకరణకు డిప్యూటీ కలెక్టర్ల నియామకం
హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూముల సమీకరణకు 34 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాలలోని 29 గ్రామాలను కలుపుకొని 122 చదరపు కిలోమీటర్ల పరిధిలో నూతన రాజధానిని నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. భూ సమీకరణకు నియమితులైన డిప్యూటీ కలెక్టర్లు జనవరి 25వ తేదీలోపల విధులలో చేరాలని ఆ ఉత్తర్వులలో ఆదేశించారు. రాజధానికి కావలసిన భూములను వీరు సమీకరిస్తారు. -
భూసేకరణకు ఇద్దరు డెప్యూటీ కలెక్టర్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలంగాణ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాజీ పడే ప్రసక్తే లేదని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు స్పష్టం చేశారు. అనివార్యకారణాల వల్ల ప్రస్తుతానికి పనులు మందకొడిగా సాగుతున్నా.. ఇకపై వేగవంతం చేస్తామని.. ప్రత్యేక పాలనకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు మండలాల ప్రజల సమస్యలపై ‘సాక్షి’ సోమవారం సంచికలో ‘మమేకమైనా మారని పాలకులు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై జేసీ స్పందించారు. ఆ కథనంతో క్షేత్రస్థాయి సమస్యలు, అక్కడి వాస్తవ పరిస్థితి, ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాలపై స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు. ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు భూ సేకరణను వేగవంతం చేయడానికి కుకునూరులో ఇందిరాసాగర్ ప్రాజెక్టు కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రెండు మండలాలకూ ఇద్దరు డెప్యూటీ కలెక్టర్లను నియమించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తామని జేసీ వెల్లడించారు. తద్వారా భూసేకరణ వేగవంతం అవుతుందని, క్షేత్రస్థాయిలో రైతులు వారి భూములకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వెం టనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతి సోమవారం మండల కార్యాల యాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని ఇకపై ఆ రెండు మండలాల్లోనూ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్వీ సూర్యనారాయణ ప్రతి సోమవారం ఉదయం కుకునూరులో, సాయంత్రం వేలేరుపాడులో ప్రజావాణి నిర్వహిస్తారని చెప్పారు. అక్కడి ప్రజలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. పునరావాస పనులను వేగవంతం చేస్తామని, ఇందుకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కేవలం మండల కేంద్రాలకు పరిమితమవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి ఇకపై గ్రామాల్లో పర్యటించాల్సిందిగా సూచనలు చేస్తామన్నారు. సంక్షేమ హాస్టళ్లకు ప్రతినెలా బియ్యం సరఫరా అయ్యే లా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని శాఖల జీతాలు ఇంకా తెలంగాణ సర్కారు నుంచే వస్తు న్న మాట వాస్తవమేనని, ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని జేసీ చెప్పారు. పోలీస్‌పరంగా ఇబ్బందులు లేవు : ఎస్పీ రఘురామ్ విలీన మండలాల్లో పోలీస్‌పరంగా ఎటువంటి ఇబ్బం దులు లేవని జిల్లా ఎస్పీ డాక్టర్ కె.రఘురామ్‌రెడ్డి తెలి పారు. కుకునూరు ఎస్సైగా ఎం.సుబ్రహ్మణ్యం, వేలేరుపాడు ఎస్సైగా సీహెచ్.రామచంద్రరావులను ఇప్పటికే నియమించామని చెప్పారు. అక్కడి పోలీస్ స్టేషన్లలో ఇంకా పనిచేస్తున్న ఎస్సైలను తెలంగాణ సర్కారు బదిలీ చేయకపోవడంతో పాలనాపరంగా ఒకింత ఇబ్బంది ఎదురవుతోందన్నారు. అయినా మన ఎస్సైలు ఆ పోలీస్ స్టేషన్లలోనే విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాల్లో ఇప్పటికే పర్యటించానని, త్వరలోనే ఆ మండలాలకు వెళ్లి పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తానని ఎస్పీ చెప్పారు. అధికారులంతా వెళ్లాల్సిందే : కలెక్టర్ కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు బూర్గం పహాడ్ మండలంలోని 6 రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కలెక్టర్ కె.భాస్కర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయా మండలాలకు తహసిల్దార్లను, ఎంపీడీవోలను నియమించామన్నారు. తహసిల్దార్లు బాధ్యతలు స్వీకరించగా, ఎంపీడీవోలు విధుల్లో చేరాల్సి ఉం దన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సూచనలు ఇచ్చామని చెప్పారు. -
తెలంగాణలో ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
హైదరాబాద్: తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లను భారీ సంఖ్యలో బదిలీ చేశారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి ఆర్డీవో ధర్మారావును బదిలీ రంగారెడ్డి ఆర్డీవోగా మధుకర్‌రెడ్డి తార్నాక స్పెషల్ కలెక్టర్ సురేందర్ రంగారెడ్డికి బదిలీ రాజేంద్రనగర్ ఆర్డీవోగా వెంకటేశ్వర్లు హెచ్ఎండీఏలో జోనల్ కమిషనర్ టి.సురేష్ రాజేంద్రనగర్ ఆర్డీవోగా నియామకం హైదరాబాద్ ఆర్డీవో బి.నవయా బదిలీ హైదరాబాద్ ఆర్డీవోగా కె.నిఖిల సికింద్రాబాద్ ఆర్డీవోగా రఘురామశర్మ చేవెళ్ల ఆర్డీవో చంద్రశేఖరరెడ్డి బదిలీ చేవెళ్ల ఆర్డీవోగా రవీంద్రనాథ్ భువనగిరి ఆర్డీవోగా మధుసూధన్ హైదరాబాద్ లా ఆఫీసర్‌గా భూపాల్‌రెడ్డి నియామకం రంగారెడ్డి లా ఆఫీసర్‌గా వి.విక్టర్ బాలానగర్ డిప్యూటీ కలెక్టర్‌గా నరసింహారెడ్డి శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌గా కె.విద్యాసాగర్ సరూర్‌నగర్ డిప్యూటీ కలెక్టర్‌గా జి.వెంకటేశ్వర్లు రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్‌గా వి.చంద్రశేఖర్ కుత్బుల్లాపూర్ డిప్యూటీ కలెక్టర్‌గా కృష్ణ ప్రాణహిత-చేవెళ్ల సిద్దిపేట డివిజన్... డిప్యూటీ కలెక్టర్‌గా వి.లక్ష్మీనారాయణ హయత్‌నగర్ డిప్యూటీ కలెక్టర్‌గా జె.శ్రీనివాస్ హైదరాబాద్ లాండ్ ప్రొటెక్షన్ సెల్... స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా శేఖరరెడ్డి -
ఎన్నికల దిశగా అడుగులు
సాక్షి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల హడావిడి మొదలైంది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఎన్నికల నోటిఫికేషన్ గురించే చర్చ. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. పకడ్బందీ ఏర్పాట్లు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తోంది. స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా, పౌరులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25,26 తేదీల్లో లేదా వచ్చేనెల మొదటి వారంలో ఎన్నికల నగారా మోగనున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ వెలువడేలోగా ఎన్నికల నిర్వహ ణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని యంత్రాంగం భావించింది. ఆ దిశగా కార్యరంగంలోకి దిగింది. బదిలీలు కొలిక్కి.... ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో బదిలీలు దాదాపు పూర్తయ్యాయి. మూడేళ్లుగా ఒకే స్టేషన్‌ను అంటిపెట్టుకున్న వారికే కాకుండా దాదాపు ఎస్‌ఐలందరికీ స్థాన చలనం కలిగింది. అలాగే తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. వీరి స్థానాల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇటీవలే 48మంది తహసీల్దార్లకు పోస్టింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేడో రేపో సీఐల బదిలీలూ జరగనున్నాయని వినికిడి. వీరి తుది జాబితా రూపకల్పనలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా ఆయా పోస్టులు నోటిఫై అయ్యాయి. ఈ పోస్టుల్లో చేరిన నూతన అధికారులు ఆయా నియోజకవర్గాలకు బాధ్యులుగా వ్యవహరించాల్సి ఉంది. ఎన్నికల అబ్జర్వర్లుగా 60 నుంచి 70 మంది అధికారులను గుర్తించినట్లు సమచారం. వీరి జాబితా సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ఎంపీడీఓలను కూడా ఈ సారి బదిలీ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే, దీన్ని ఎంపీడీఓలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు ఎన్నికల విధులకు ఎటువంటి సంబంధం లేదని, ఇటువంటి తమను ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై వారు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు తర్వాత వీరి బదిలీలు ఉన్నాయా? లేవా? అన్నది తేలనుంది. పోలీసుల ఆరా.... నేరచరితులు, వివాదాస్పద వ్యక్తుల వివరాలన్నింటినీ సేకరించాలని, వీరి కదలికలపై నిఘా ఉంచాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు అందాయి. వీరిని బైండోవర్ చేసేందుకు కిందిస్థాయిలో ఆదేశాలివ్వాలని సూచనలు అందాయి. సహజంగా ఇదంతా జరగాల్సింది ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాతే. అయితే జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే గ్రామాల్లో బైండోవర్లు మొదలయ్యాయి. మునగాల మండలంలోని పలు గ్రామాల్లో బైండోవర్లు కొనసాగుతున్నాయి. గ్రామ పోలీస్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఘర్షణ వాతావరణం ఉందని గుర్తించిన గ్రామాల్లో నిఘా మరింత పటిష్టం చేస్తున్నారు. వారంలో ప్రీ పోలింగ్.... ఓటింగ్‌కు వినియోగించాల్సిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం)లో క లెక్టరేట్‌లో కొన్నే ఉన్నాయి. జిల్లాలో ఉన్న ఈవీఎంలను అక్కడి ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్, ఒరిస్సాలకు పంపారు. ఎన్నికల సంఘం జిల్లాకు 8వేల ఈవీఎంలను కేటాయించిందని సమాచారం. ఇవన్నీ జిల్లా కేంద్రానికి త్వరలో చేరుకోనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఈవీఎంల పనితీరు అధికారులు తెలుసుకుంటారు. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీల నాయకులను సమావేశ పరిచి ఈవీఎంలపై అవగాహన కల్పిస్తారు. ఓటింగ్ విధానాన్ని చూపిస్తారు. దీనికోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
బదిలీల కాలం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: బదిలీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా ఎన్నికలతో సంబంధం కలిగిన అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ ఏడాది ఎంపీడీవోలను సైతం సొంత జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు పంపాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ముఖ్యంగా రెవెన్యూ శాఖలోని అధికారులకే ఎన్నికలతో సంబంధం అధికంగా ఉంటోంది. ప్రస్తుతం వీఆర్వో మొదలుకొని అన్ని స్థాయిల అధికారులు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ నెల 31వ తేదీతో ప్రక్రియ పూర్తి కానుండటంతో అప్పటి వరకు ఎవరినీ కదిలించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 1 తర్వాత రెవెన్యూ శాఖలో ఎన్నికలతో సంబంధం ఉన్న తహశీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు.. పంచాయతీరాజ్‌లో ఎంపీడీవోలు.. హోమ్ శాఖలో ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు స్థానచలనం కలగనుంది. వీరి స్థానంలో అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన అధికారులు రానున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో దాదాపు 10 మండలాల తహశీల్దార్లు బదిలీ కానున్నారు. జిల్లాలో ముగ్గురు ఆర్డీఓలు పని చేస్తుండగా.. వీరి పదవీ కాలం ఆయా ప్రాంతాల్లో మూడేళ్లు పూర్తి కానందున బదిలీ అయ్యే అవకాశం లేదు. శ్రీశైలం స్పెషల్ కలెక్టర్ రహంతుల్లా కూడా ఇటీవలనే జిల్లాకు రావడంతో ఆయన కూడా బదిలీ పరిధిలోకి రారని తెలుస్తోంది. ఇక జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు కూడా మూడేళ్ల పదవీకాలం పూర్తి కానందున వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. అయితే రిటర్నింగ్ అధికారులుగా పనిచేసే డిప్యూటీ కలెక్టర్లు దాదాపు బదిలీ కానున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓలు దాదాపుగా బదిలీ కావచ్చని సమాచారం. మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న దృష్ట్యా జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ వెంకటృష్ణుడులను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంది. ఇదిలాఉండగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 30వ తేదీలోగా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. -
ప్రశాంతంగా గ్రూప్-1
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఫలితాలను త్వరలో ప్రకటిస్తామని టీఎన్పీఎస్సీ చైర్మన్ నవనీత్ కృష్ణన్ వెల్లడించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీగా ఉన్న 8 డెప్యూటీ కలెక్టర్, 7 వాణిజ్యపన్నుల అధికారి, 5 జిల్లా ఉపాధి కల్పనాధికారి, 4 డీఎస్పీ, ఒక జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 16న ప్రిలిమ్స్‌ను టీఎన్పీఎస్సీ నిర్వహించిం ది. రాష్ట్ర వ్యాప్తంగా 75,627 మంది పరీ క్షలు రాశారు. 1372 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఈ మెయిన్స్ పరీక్షలను శుక్రవారం 14 కేంద్రాల్లో నిర్వహించారు. ఎగ్మూర్ బాలికోన్నత పాఠశాల, ట్రిప్లికేన్ ఎన్‌కేడీ ఉన్నతపాఠశాల, సైదాపేట జయగోపాల్ కరోడియా ఉన్నత పాఠశాల తదితర 14 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఎలాంటి అవకతవకలూ చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక అధికారుల బృందం, సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు టీఎన్పీఎస్సీ చైర్మన్ నవనీత్ కృష్ణన్ తెలిపారు. మెయిన్స్ రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తామన్నారు. త్వరలోనే ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. -
ఈ ఒక్క వారమైనా డ్యూటీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి పొంచి ఉన్న తుపాను నేపథ్యంలో సమైక్య సమ్మెకు కొంత విరామం ప్రకటించి ఈ ఒక్క వారమైనా పూర్తిస్థాయి విధుల్లోకి రావాలని డిప్యూటీ కలెక్టర్లకు సర్కారు విజ్ఞప్తి చేసింది. సమ్మె చేస్తూనే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవ చేస్తామన్న డిప్యూటీ కలెక్టర్ల సంఘం వాదనతో ప్రభుత్వం ఏకీభవించలేదు. సమ్మెలో ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టడం కష్టమని, ఆయా కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది కనుక, సమ్మె చేస్తూ ఆర్థిక పరమైన అంశాల జోలికి పోరాదని పేర్కొంటూ ఈ వారం రోజులు విధుల్లో చేరాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా బుధవారం విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సంఘం గురువారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇదిలావుంటే, సంఘం ప్రతినిధు లు బుధవారం సీఎంతో భేటీ అయ్యారు. సమైక్య రాష్ట్రంపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ సమ్మె విరమించేది లేదని సంఘం అధ్యక్షుడు పిడుగు బాబూరావు, ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర నాయుడు స్పష్టం చేశారు. -
ముంపు గ్రామాలు ఖాళీ చేయాలి
కడప సిటీ, న్యూస్‌లైన్ : గండికోట జలాశయంలో ఐదు టీఎంసీల కృష్ణా జలాలను నిల్వ చేస్తున్నామని, ముంపు గ్రామాల్లోని నిర్వాసితులు ఖాళీ చేసి తరలి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. కృష్ణా జలాలను గండికోటలో నింపడం ద్వారా ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను వచ్చేనెల 31వ తేదీలోగా ఖాళీ చేసి వెళ్లాలన్నారు. కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం జాయింట్ కలెక్టర్నిర్మల, నీటిపారుదలశాఖ ఇంజనీర్లు, జమ్మలమడుగు ఆర్డీఓ రఘునాథరెడ్డి, జీఎన్ఎస్ఎస్ స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రోహిణి, సిద్దిరాముడు, ప్రకాశ్, రాధాకృష్ణయ్య, ఎస్ఈలు శ్రీనివాసులు, రమణమూర్తి, ఆర్అండ్బీ ఎస్ఈ మనోహర్‌రెడ్డి, ఈఈ రామచంద్రారెడ్డిలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వర్షపు నీటి ప్రవాహం మైలవరం, గండికోట జలాశయాల స్థితిగతులపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మైలవరం జలాశయంలో ఎంతమేర నీటి నిల్వలు ఉన్నాయి? ఎన్ని క్యూసెక్కుల నీరు కర్నూలుజిల్లా అవుకు నుంచి వస్తోంది? అన్న విషయాలను తెలుసుకున్నారు. కొండాపురం మండలం గండికోట జలాశయం నీటి నిల్వ సామర్థ్యం, నీటిని నిల్వ చేస్తే పరిస్థితులు ఏమిటి? అన్న విషయాలను ప్రాజెక్టుల ముఖ్య ఇంజనీరు రవిశంకర్‌ను అడిగి తెలుసుకున్నారు. అందుకు ఆయన సమాధానమిస్తూ మైలవరం జలాశయంలోకి అవుకు నుంచి 720 క్యూసెక్కుల నీరు వస్తోందని, ఇప్పటికీ 1.07 టీఎంసీల నీరు నిల్వ ఉందని, గండికోట నీటి నిల్వ సామర్థ్యం 26.8 టీఎంసీలుగా తెలిపారు. అవుకు నుంచి గండికోటకు శనివారం నీటిని మళ్లిస్తే నవంబరు నెలకు ఐదు టీఎంసీల నీరు చేరుతుందని, 204 కాంటూరు కింద ఓబన్నపేట, గండ్లూరు, సీతాపురం, కె.బొమ్మేపల్లె గ్రామాలు తొలి దశలో ముంపునకు గురవుతారని వివరించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు గ్రామాల్లోని ప్రజలను వచ్చేనెల 31వ తేదీలోగా ఖాళీ చేయిం చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ ప్రాంత ప్రజలను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పునరావాస కాలనీల్లో అన్ని మౌళిక వసతులు కల్పించాలన్నారు.