భూ సమీకరణకు డిప్యూటీ కలెక్టర్ల నియామకం
హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూముల సమీకరణకు 34 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాలలోని 29 గ్రామాలను కలుపుకొని 122 చదరపు కిలోమీటర్ల పరిధిలో నూతన రాజధానిని నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే.
భూ సమీకరణకు నియమితులైన డిప్యూటీ కలెక్టర్లు జనవరి 25వ తేదీలోపల విధులలో చేరాలని ఆ ఉత్తర్వులలో ఆదేశించారు. రాజధానికి కావలసిన భూములను వీరు సమీకరిస్తారు.