land equation
-
పారదర్శకంగా భూ సమీకరణ..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో భూ సమీకరణ పారదర్శకంగా జరుగుతోందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు జిల్లాలో ఆరు వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో సెంట్ల భూమిని ఇళ్లు నిర్మాణం కోసం అర్హులైన పేదలకు కేటాయిస్తున్నట్లు వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూ సేకరణ చేస్తున్నామని అదంతా పూర్తిగా ప్రభుత్వ భూమిలో మాత్రమే జరుగుతోందన్నారు. దీనికోసం నిర్దిష్టమైన లే అవుట్లు కూడా రూపొందించడమే కాకుండా మార్చి 10 నాటికి పూర్తిస్థాయిలో ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులకు నష్టం కలిగించం.. ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న వ్యక్తులు కూడా నిర్దిష్టమైన ఆధారాలను బట్టి అభివృద్ధి చేసిన లే అవుట్లలో 900, 450 గజాల చొప్పున కేటాయించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ సిటీ లో ఇళ్ల కోసం రూ. 25 వేలు చొప్పున నగదు డిపాజిట్ చేసిన లబ్ధిదారులకు కేటాయింపు జరుగుతుందని వివరించారు. ఎక్కడ ప్రైవేట్ భూములు తీసుకోవడం కానీ, రైతులకు నష్టం కలిగించే రీతిలో భూ సేకరణ గాని సమీకరణ గాని ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ సమీకరణ కోసం రూ.1300 కోట్లు.. గిరిజన ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు వచ్చాయని ఆయా ప్రాంతాల్లో వారికి భూములు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా ఏజెన్సీలో పాడేరు ప్రాంతంలో ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉండడంతో ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కేటాయింపు జరుగుతుందన్నారు. పినగాడి లో పేదల కోసం రూపొందిస్తున్న లే అవుట్ లో మా భూమి పూర్తిగా ప్రభుత్వ ఖాళీ స్థలం గా చెప్పారు. రైతులకు ఇబ్బంది కలిగించే రీతిలో ఎక్కడ భూమి తీసుకోవడం లేదన్నారు. రైతులకు భూ సమీకరణ కింద ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా వారి ఖాతాలోనే వేస్తున్నామ ని చెప్పారు.. భూసమీకరణ కోసం రూ. 1300 కోట్లు ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ వెల్లడించారు. -
రాజధాని రైతులకు బాబు శఠగోపం
సాక్షి, అమరావతి : రాజధాని రైతుల్ని అన్ని విధాలుగా మోసం చేసిన గత టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ వారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. మాయమాటలు చెప్పి రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో వారికిచ్చిన హామీల్లో ఒక్కదాన్నీ నెరవేర్చలేదు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన 28,054 మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలను అప్పటి ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా సేకరించింది. ఈ భూమికి బదులు మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇస్తామని, వీటి విలువ ఇచ్చిన భూమి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మించింది. అయితే నాలుగేళ్ల తర్వాత రైతులకు భౌతికంగా ప్లాట్లు అప్పగించకుండా కేవలం కాగితాల్లోనే పంపిణీ చేసింది. రైతులిచ్చిన భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో తమకిస్తామని చెప్పిన ప్లాట్లలో పిచ్చి మొక్కలు మొలిచి, బీళ్లుగా మారాయని.. వాటి పక్కనే అపార్ట్మెంట్లు నిర్మించి వేరే వాళ్లకి అమ్మడం ఎంతవరకు సమంజసమని రైతులు వాపోయినా పట్టించుకోలేదు. కాగితాలపై మాత్రమే అద్భుతాలు 29 గ్రామాల్లో రైతుల వాటాగా ఇవ్వాల్సిన ప్లాట్ల లేఅవుట్లను 13 జోన్లుగా విభజించి వాటిలో రోడ్లు, డ్రెయిన్లు, మురుగు నీటి పారుదల, తాగునీటి సరఫరా, విద్యుదీకరణ, భూగర్భ డ్రైనేజీ వంటి సకల సౌకర్యాలు కల్పిస్తామని సీఆర్డీఏ ప్రకటించింది. కమిషన్ల కోసం తాత్కాలిక నిర్మాణాలు మొదలు పెట్టినా ఐదేళ్లలో ఒక్క జోన్లో కూడా పనులు పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం లేక తమకు తిరిగి ఇచ్చిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రైతులు ముందుకు రాలేదు. మ్యాపులు, కాగితాల్లో మాత్రం అద్భుతమైన ప్లాట్లు ఇస్తున్నట్లు చిత్రాలతో చూపి, వాటిని సంబంధిత రైతులకు కేటాయించినట్లు ప్రచారం చేశారు. లేఅవుట్లకు వెళ్లేందుకు రోడ్లు కూడా లేవు. లోపల అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు, వీధిలైట్లు వంటి కనీస సదుపాయాలు లేవు. కార్పొరేట్ సంస్థలు, వారికి నచ్చిన వారికి కారుచౌకగా కట్టబెట్టిన భూముల్లో మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించారు. విట్, ఎస్ఆర్ఎం, బీఆర్ శెట్టి వంటి సంస్థలకు ఎకరం రూ.50 లక్షలకు కట్టబెట్టగా ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులకు ఏకంగా ఎకరం రూ.4 కోట్లకు విక్రయించారు. ఇంతా చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి జరగడం లేదని గగ్గోలు పెడుతుండడం చూసి రైతులు విస్తుపోతున్నారు. -
భూములు తాకట్టుపెట్టి వ్యాపారం చేస్తారా?
- మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మచిలీపట్నం రైతుల నుంచి భూములు గుంజుకుని పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకు ప్రభుత్వం పనిచేయటం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మచిలీపట్నంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎంఏడీఏ కార్యాలయ ప్రారంభోత్సవ సమావేశంలో పాలకులు వాస్తవాలను వక్రీకరించారన్నారు. 1370 ఎకరాలు భూసమీకరణకు వచ్చిందని పాలకులు, అధికారులు చెబుతున్నా ఆ భూమి అంతా అసైన్డ్ భూమేనని భూస్వాములు ఆక్రమించుకున్నదేనన్నారు. ఎలాగూ ఆ భూమి పోతుందని ముందస్తుగానే ఎంఏడీఏకు అప్పగించారన్నారు. బందరు పోర్టు పనులను టెండరు ప్రక్రియ ద్వారా అప్పగించాల్సి ఉండగా 2010 ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో నవయుగ సంస్థకు కట్టబెట్టడం జరిగిందన్నారు. పోర్టు నిర్మాణానికి 4,800 ఎకరాలు కావాలని అడుగుతున్నారని ఆ సంస్థ సీఈవో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపడతారో బహిరంగ చర్చలో వెల్లడించాలన్నారు. ప్రభుత్వం రైతుల భూములను భూసమీకరణ ద్వారా తీసుకుని పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకు ఇంత కసరత్తు చేస్తోందని దీని వెనుక ఎలాంటి మర్మం ఉందోనని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టులో 12 బెర్త్‌ల ద్వారా ఏడాదికి 40 మిలియన్ టన్నుల సరుకుల ఎగుమతులు, దిగుమతులు కూడా చేయటం లేదని, బందరు పోర్టు ద్వారా 2020 నాటికి 100 మిలియన్ టన్నుల సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేస్తామని పోర్టు పనులను దక్కించుకున్న సంస్థ చెప్పటం పచ్చి అబద్ధమన్నారు. గుజరాత్లో రిలయన్స్ సంస్థ జామ్‌నగర్‌లో రూ. 1.80 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ రిఫైనరీలో 2,500 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. పోర్టు, పరిశ్రమల నిర్మాణం జరిగితే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారని ఎంత మందికి ఇస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్లాట్లు కొనే వారేరి : ఎంఏడీఏ పరిధిలో 12,500 ఎకరాల్లో మెగా టౌన్షిప్ నిర్మిస్తామని పాలకులు చెబుతున్నారని ఒక్కొక్క ప్లాటు కోటి రూపాయలు ధర పలుకుతుందని బుకాయిస్తున్నారని ఈ ప్రాంతంలో కోటి రూపాయలకు ఒక్కొక్క ప్లాటు ఎవరు కొంటారని ప్రశ్నించారు. రైతుల నుంచి భూములు తీసుకుని వారిని నిలువునా మోసం చేసేందుకే పాలకులు పన్నాగం పన్నారన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సిన ప్రభుత్వం వారి ఆస్తులను కాజేసి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టి పాలకులు, అధికారులు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించటం బాధాకరమన్నారు. అమరావతి లంకభూముల్లో ఈ భూమి మీది కాదని, ప్రభుత్వం పండించుకునేందుకే ఇచ్చిందని, ప్యాకేజీ రాదని, రకరకాలుగా రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన బడాబాబులు అనంతరం వాటిని ప్రభుత్వానికి అప్పగించి ప్రయోజనం పొందారని చెప్పారు. రైతులతో మచిలీపట్నంలోనూ ఇదే తరహా మైండ్ గేమ్ ఆడుతూ భూములను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎంఏడీఏకు భూములు ఇచ్చేందుకు అంగీకరించే రైతులు తమ భూములను విక్రయించుకుంటే 24 గంటల్లో రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పటం రైతులను ఇబ్బంది పెట్టడమేనన్నారు. ప్రభుత్వ భూమిలోనే పోర్టు, పరిశ్రమలు నిర్మించాలని ఆయన సూచించారు. -
ఆ జీవోను ఉపసంహరించాలి: సీపీఎం మధు
సాక్షి, విజయవాడ బ్యూరో : బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఏకపక్షంగా జారీచేసిన భూ సమీకరణ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పోర్టుపేరుతో సుమారు లక్ష ఎకరాల భూమిని బలవంతంగా తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1800 ఎకరాల భూమి సరిపోతుందని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నించడం ప్రజలను మోసగించడమేనన్నారు. -
రాజధానిలో భూముల...కొనుగోలుపై అప్రమత్తం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో నకిలీ పత్రాలతో భూముల క్రమవిక్రయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఆర్డీఏ శనివారం ఒక ప్రకటనలో అప్రమత్తం చేసింది. ముసాయిదా భూసమీకరణ పథకం నోటిఫికేషన్ ఇప్పటి వరకూ నేలపాడు గ్రామానికే ఇచ్చామని పేర్కొంది. 30 రోజుల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత రైతులు తమ వాటా ప్లాట్ల కోసం ఒక్కరిగా 9.18ఏ, ఉమ్మడిగా 9.18బీ దరఖాస్తు ఫారాల్లో కోరుకున్న స్థలాలు లాటరీ ద్వారా నిర్ణయించి భూసమీకరణ యాజమాన్య పత్రం రిజిష్ట్రేషన్ చేస్తామని వివరించింది. అలా రిజిష్ట్రేషన్ పొందిన భూ యజమానికి మాత్రమే దానిపై అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు పేదల ఆక్రమణలో ఉన్న భూములు, అసైన్డ్ పట్టాలు, లంక భూములను అనధికారికంగా కొనుగోలు చేసి..లబ్ధిదారునికి ధ్రువీకరణ పత్రం వచ్చాక రిజిష్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేసే అవకాశముందని పేర్కొంది. అలాంటి భూములను కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో భూసమీకరణ యాజమాన్య ధ్రువపత్రాలు ఇవ్వలేదని, ఈ పత్రంపై సీఆర్డీఏ కమిషనర్ సంతకం ఉండదని పేర్కొంది. కాంపిటెంట్ అథారిటీ, రిజిష్ట్రేషన్ శాఖ, మండల కార్యాలయాలను సంప్రదించి సంబంధించి ప్లాటును చూసి, దాని నంబరు, కొలతలు, జీపీఎస్ రీడింగ్‌లు తెలుసుకుని కొనుగోలు చేయాలని తెలిపింది. -
‘భూ’ ప్రకంపనలు
► సంచలనం సృష్టిస్త్తున్న ‘సాక్షి’ కథనాలు ► ఎక్కడ చూసినా ‘రాజధాని దురాక్రమణ’పైనే చర్చ ► రాజకీయ, అధికారవర్గాల్లోనూ కలకలం ► ఎవరి బండారం బయటపడుతుందోనని గుబులు ► మంత్రులు, టీడీపీ నేతల భూ బాగోతంపై జనాగ్రహం ► కడుపులు కొట్టి భూములు మింగారని ఆందోళన ► అన్యాయం చేసిన వారి పాపం ఊరికే పోదని శాపనార్థాలు ఊళ్లల్లో తిరుగుతూ హడావుడి చేసిన మంత్రి నారాయణ మూడు వేల ఎకరాలు కొనేశాడా..! ఓ రైతు ఆశ్చర్యం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పి ప్రపంచ స్థాయి భూ కుంభకోణానికి తెరతీశారా..! మరొకరి అనుమానం ‘సాక్షి’లో సాక్ష్యాధారాలతో సహా వచ్చాయిగా ఇంకా సందేహమెందుకు..? ఇంకొకరి సమర్థన ...రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ‘దేశం’ దురాక్రమణ’పైనే చర్చ సాక్షి, విజయవాడ బ్యూరో/మంగళగిరి : రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ చేసిన అడ్డగోలుLand exploitation,పై ‘సాక్షి’ దినపత్రికలో ‘రాజధాని దురాక్రమణ’ పేరుతో వచ్చిన కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయ, అధికార వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపాయి. ప్రధానంగా రాజధాని ప్రాంతాలైన మంగళగిరి, తుళ్లూరు, అమరావతి మండలాల్లో ఈ కథనాలు ప్రకంపనలు సృష్టించాయి. దురాక్రమణలో టీడీపీ నేతల నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో రేపటి కథనాల్లో ఎవరి బండారం బయటపడుతుందోనని అధికార పార్టీ నేతలు గుబులు చెందుతున్నారు. భూముల క్రయ విక్రయాల్లో అధికార పార్టీ నేతలకు సహకరించిన రియల్ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో నేతలకు సహకరించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పక్కా సాక్ష్యాధారాలతో ప్రచురితం అవుతున్న కథనాలపై పోలీస్, ఇంటిలిజెన్స్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ విచారణకు దిగారు. కడుపు కొట్టారంటూ కూలీల ఆవేదన.. రాజధాని పేరుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని రైతులు, కూలీలు ప్రభుత్వ తీరును ఎండగడుతు న్నారు. ముఖ్యమంత్రి కుటుంబం, మంత్రులు, టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు లాక్కుని రాజధాని కడతారనుకుంటే వాటిని స్వాధీనం చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. వ్యవసాయం లేకుండా పోయి నానా బాధలు పడుతున్నామని రైతులు, పనులు లేకుండా రోడ్డున పడ్డామని కూలీలు ఆందోళన చెందుతున్నారు. భూములు లాక్కుని తమ కడుపులు కొట్టారని వెంకటపాలెం రైతు పి.శేఖర్ ఆవేదనగా చెప్పాడు. రాజధాని పేరుతో తమ ప్రాంతాన్ని సర్వ నాశనం చేశారని, టీడీపీ తమను నట్టేట ముంచిందని తాళ్లాయపాలెంలో ఏసోబు అనే కార్మికుడు ఆవేదనగా చెప్పాడు. చుకుంటే ఏమీ మిగలదని చెప్పడంతో చాలా తక్కువ రేటుకు తన భూమి అమ్మేశానని మందడం గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు తెలిపాడు. తమకు అన్యాయం చేసిన వాళ్ల పాపం ఊరికే పోదని శాపనార్ధాలు పెడుతున్నారు. కొమ్మాలపాటి కుచ్చుటోపీపై తీవ్ర చర్చ... పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నిర్వహిస్తున్న అభినందన హౌసింగ్ సంస్థ రాజధాని గ్రామమైన యర్రబాలెంలో 42 ఎకరాలు కొనుగోలు చేసి వాయిదాల పద్ధతిలో ప్లాట్లు విక్రయించింది. రాజధాని ప్రకటన తర్వాత కొందరు ఖాతాదారులకు ఇక్కడ కాకుండా వేరేవెంచర్లలో ప్లాట్లు కేటాయించింది. మరి కొందరికి నగదు తిరిగి చెల్లించింది. ఇంకా 500కు పైగా ఖాతాదారులు తమకు అక్కడే ప్లాట్లు కేటాయించాలని తిరుగుతుండగా అనుమతులు రావంటూ భయపెట్టి, ఆ భూములను భూ సమీకరణకు కూడా ఇవ్వకుండా మెగా సిటీ నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నారని వచ్చిన కథనం ఖాతాదారు ల్లో ఆగ్రహాన్ని రగిల్చినట్లు సమాచారం. దీంతో కొందరు ఖాతాదారులు కలిసి సంఘంగా ఏర్పడి తమకు ప్లాట్లు అక్కడే కేటాయించే విధంగా సంస్థపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు ఓ ఖాతాదారుడు తెలిపారు. ఖాతాదారుల్లో ఉలికిపాటు.. రాజధాని భూ దురాక్రమణ కథనాల్లో భాగంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని రామ కృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్లో 194 ఎకరాల్లో 54 ఎకరాలు అసైన్డు భూములున్నాయని రావడం యాజమాన్యంతో పాటు అధికార వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తించింది. కొందరు ఖాతాదారులు తాము కొనుగోలు చేసిన ప్లాట్లలో ఏవైనా అసైన్డు భూములు ఉన్నాయా.. అని ఆరాలు తీయడం ప్రారంభించారు. దీనిపై యాజమాన్యం ముందు జాగ్రత్తగా వచ్చిన వినియోగదారులను విజయవాడ కార్యాలయానికి పిలిపించి, ఆందోళన చెందాల్సిన పనిలేదని నచ్చజెప్పి పంపినట్లు సమాచారం. బెదిరించి దోచుకున్నారు.. పేపర్లో కొన్ని భూములే వచ్చాయి. అన్ని ఊళ్లలోనూ నాయకులు భూములు కొన్నారు. కూలి చేసుకునే వాళ్లం మేం ఏం చేయగలం. ఏదైనా మాట్లాడితే బెదిరిస్తున్నారు. -దార్ల విజయ్‌కుమార్ రాయపూడి రైతుల్ని నట్టేట ముంచారు మా భూములన్నీ కొల్లగొట్టి వాటితో ఇప్పుడు వ్యాపారం చేసుకుంటున్నారు. సాగు భూములన్నీ బీళ్లయిపోయాయి. రాజధాని సంగతేమో కాని మమ్మల్ని నట్టేట ముంచేశారు. -పి.శేఖర్, వెంకటపాలెం మాకు మట్టిదిబ్బలు మిగిల్చారు.. టీడీపీ నాయకులు మొదట్లో కార్లేసుకుని మా ఊళ్లలో తిరిగారు. తక్కువ రేటుకు భూములు కొనేశారు. వాళ్ల స్వార్థం చూసుకుని మాకు మట్టిదిబ్బలు మిగిల్చారు. - ఆర్ ముక్కంటి, తాళ్లాయపాలెం -
జూన్ 1 భూ సమీకరణ పూర్తి చేయాలి
►పూర్తయిన గ్రామాల్లో రెండో పంట వేయకుండా జాగ్రత్త పడాలి ►భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి ►ఈ నెల 25కు రాజధాని మాస్టర్‌ప్లాన్ సిద్ధం.. ►న్యాయ వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోండి ►స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల సమావేశంలో ►జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ గుంటూరు ఎడ్యుకేషన్ : రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సమీకరణ ప్రక్రియ జూన్ ఒకటో తేదీకి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో భూ సమీకరణ విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి నిర్ధేశించుకున్న 32,783 ఎకరాల్లో ఇప్పటికి 29 వేల ఎకరాలు సమీకరించిన దృష్ట్యా మిగిలిన భూములను నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నూరుశాతం భూ సమీకరణ పూర్తయిన తుళ్లూరు, మందడం గ్రామాల్లో రెండో పంట వేయకుండా జాగ్రత్త పడాలని ఆదేశించారు. రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి ... గుర్తించిన భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన అన్ని పత్రాలను భద్రపర్చాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధితోపాటు ఆయా కుటుంబాల్లో విద్యావంతులకు సాంకేతిక శిక్షణ కల్పించే విధానంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో రూ. 30 వేల కోట్లు వెచ్చించనున్న దృష్ట్యా నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉంటాయని, ఈ దిశగా రైతులను చైతన్యవంతులను చేసి వారికి ఆసక్తి గల రంగంలో ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 25కు మాస్టర్‌ప్లాన్ సిద్ధం సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణ మాస్టర్‌ప్లాన్ బ్లూ ప్రింట్ ఈనెల 25వ తేదీకి సిద్ధం కానున్న దృష్ట్యా సమీకరించిన భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఆర్డీఏ పరిధిలో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని, ఇప్పటికే చేపట్టిన అనధికార నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. సామాజిక ఆర్థిక సర్వేను త్వరగా పూర్తి చేసి భూములకు సంబంధించిన అన్ని వివరాలు సక్రమంలా ఉండే విధంగా చూడాలన్నారు. కోర్టుల్లో ఉన్న న్యాయ వివాదాలకు సంబంధించి సీనియర్ న్యాయవాదులను నియమించుకుని త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చి భూములను స్వాధీనం చేయని రైతులకు నోటీసులు జారీ చేసి, వారిని పిలిచి మాట్లాడాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ భూములను సమీకరించడం ఎంత ముఖ్యమో సమీకరించిన భూములకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను భద్ర పర్చడం అంతే ముఖ్యమన్నారు. ప్రతి ఒక్క రైతుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టా, పట్టాదారు పాసు పుస్తకంతో పాటు ఆధార్, రేషన్ కార్డు తదితర పత్రాలను సేకరించి వాటిని ఫైళ్లలో భద్రపర్చాలన్నారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. -
రైతుల్నే కాదు... రాముణ్ణీ వదల్లేదు...
♦ రాజధానిలో సీతారాముల భూములు తీసుకున్న ప్రభుత్వం ♦ పోరాటం చేస్తున్న గ్రామస్తులు, పాలకవర్గం ♦ విచారణ చేపట్టిన ఏమ్మార్వో తాడేపల్లిరూరల్ : రాజధాని నిర్మాణం పేరిట భూసమీకరణ ప్రారంభించిన రాష్ట్రప్రభుత్వం సీతారాములను సైతం నిరాశ్రయులను చేసింది. భూసమీకరణకు సీతారాముల భూముల్ని దేవదాయ శాఖ అధికారులు అప్పగించారు. కనీసం గుడివైపు కన్నెత్తి చూడని ఆ శాఖ అధికారులు భూమికి సంబంధించిన ఒరిజినల్ దస్తావేజులు లేకుండానే మెప్పు కోసం అప్పగించేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంలో బ్రిటిష్ కాలంలో గ్రామస్తులు నిర్మించుకున్న సీతారాముల దేవాలయం ఎంతో పేరుగాంచింది. దేవుడు మాన్యంగా కొంత భూమి అలనాటి నుంచి ధూపదీప నైవేద్యాలకు వినియోగిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరిట చేపట్టిన భూసమీకరణకు దేవాదాయ శాఖాధికారులు తమ శాఖ పరిధిలోనిదే అని పేర్కొంటూ అప్పనంగా భూమిని ఇచ్చేశారు. ఇది తెలిసిన గ్రామస్తులు ఆలయ భూములకు సంబంధించిన రికార్డులను తిరగవేసి, ఆ భూమి దేవాదాయశాఖది కాదని, గుడిసైతం దేవదాయ పరిధిలో లేదని తెలియచేస్తూ వారికి వినతి పత్రం అందించారు. అయినప్పటికీ దేవదాయ శాఖ వారు స్పందించకపోవడంతో, గతంలో ఆ భూమి తమ్మా సుబ్బారెడ్డి అనే పేరు మీద ఉన్నదని, దేవాదాయ శాఖ పొరపాటు పడిందనీ ఆలయ కమిటీ వివరించింది. 104 2సిలో61 సెంట్లు, 104 2ఎ 8 సెంట్లు 130లో 44సెంట్లు మొత్తం 113 సెంట్ల భూమి ఉండవల్లి రామాలయం పేరిట ఉన్నదని, వారు జిల్లా కలెక్టర్‌కు, స్థానిక తహాశీల్దారుకు తెలియజేశారు. దీంతో శనివారం ఈ విషయమై తహశీల్దారు వెంకటేశ్వర్లు రామాలయం వద్ద గ్రామ సభ ఏర్పాటు చేసి విచారణ నిర్విహంచారు. ఈ సంధర్భంగా ఆలయ కమిటీ, గ్రామస్తులు ముక్తకంఠంతో ఆ భూమి రామాలయానికి చెందినదనీ, సీతారాములు దేవుడి మాన్యమనీ తెలిపారు. ఆ భూములు ఇచ్చేది లేదని వారు తేల్చి చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తానని తహశీల్దార్ తెలిపారు. -
ఇదే చాన్స్...దోచేయ్
► సీఆర్డీఏ కార్యాలయాల్లో దళారుల తిష్ట ► రైతుల నుంచి అంగీకార పత్రాలు ఇప్పిస్తూ ► సొమ్ము చేసుకుంటున్న వైనం ► రికార్డుల్లో అవకతవకలు సరిచేసేందుకు ధర నిర్ణయించి వసూలు మంగళగిరి : ఇదే చాన్స్...దోచేయ్ అనే విధంగా రాజధాని భూ సమీకరణ గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాలు అవినీతి నిలయాలుగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ దళారులు కార్యాలయాల్లో తిష్టవేసి ఇప్పటికీ భూ అంగీకారపత్రాలు (9.3 ఫారాలు) ఇప్పిస్తున్నారనీ, వారికి అధికారులు సర్వేయర్లు సహకరిస్తూ సంపాదనలో పడ్డారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇవ్వని వారిని సర్వేయర్లు గుర్తించి దళారులకు సమాచారమిస్తున్నారు. దళారులు సదరు రైతులను భయపెట్టి భూసమీకరణకు ఒప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వివాదాల్లో ఉన్నవి, రికార్డులు సరిగ్గా లేని భూములను దళారులు గుర్తించి మరీ తక్కువ ధరలకు కొనుగోలు చేయించి సర్వేయర్లకు లంచాలు ఇచ్చి అప్పటికప్పుడు అంగీకారపత్రాలు ఇప్పిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రికార్డులు సరిచేయాలంటే అడంగల్, సర్వే ఇలా ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మండలంలోని నిడమర్రు, కురగల్లు, బేతపూడి, నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాలతో పాటు కృష్ణా కరకట్ట వెంబడి వున్న గ్రామాల రైతులు తొలి నుంచి భూ సమీకరణను వ్యతి రేకిస్తున్నారు. చివరి గడువు ఫిబ్రవరి 28 నాటికి అధికారపార్టీ నేతలు, మంత్రులు సమీకరణకు ఇవ్వని వారి భూములను సేకరిస్తామని భయపెట్టడంతో రైతులు అంగీకారపత్రాలు ఇచ్చారు. మరో వైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అండగా నిలవడంతో నిడమర్రు, కురగల్లుతో పాటు చాలా గ్రామాల్లో రైతులు అంగీకారపత్రాలు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో రెవెన్యూ అధికారులు దళారులను రంగ ప్రవేశం చేయించి రైతుల నుంచి అంగీకారపత్రాలు తీసుకుంటున్నారు. గత నెలలో నిడమర్రు, కురగల్లు గ్రామాలలోనే సుమారు 50 ఎకరాలకు పైగా అంగీకారపత్రాలు తీసుకోవడం విశేషం. అయితే అంగీకారపత్రాలు పాత తేదీలతోనే తీసుకున్నట్టు సమాచారం. -
ఎయిర్‌పోర్టు.. రైతుల భూములు హాంఫట్
► భూ సమీకరణకు రంగం సిద్ధం ► నాటకీయంగా ముగిసిన చిట్టచివరి సమావేశం ► పది రోజుల్లో భూములు స్వాధీనానికి చర్యలు విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చే రైతులకు నిబంధనల ప్రకారమే పరిహారం ఇస్తామని, లేకుంటే పూలింగ్‌కు సిద్ధం కావాలని కలెక్టర్ బాబు.ఎ స్పష్టం చేశారు. విజయవాడ : ఐదారు మాసాలుగా ఎడతెరిపి లేకుండా నెలవారీ సమావేశాలు, చర్చలు నిర్వహిస్తున్న అధికారులు ఎయిర్‌పోర్టు భూ సమీకరణకు ఇచ్చే పరిహారం విషయమై చివరకు తుస్సుమనిపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు భూమికి పరిహారం ఇస్తామని, లేకుంటే ల్యాండ్‌పూలింగ్‌కు సిద్ధం కావాలని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. బుధవారం నాటకీయంగా ముగిసిన సమావేశంలో రైతుల నిరసనల మధ్యే భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని కలెక్టర్ బాబు.ఏ ప్రకటించారు. రైతులు, రైతు నాయకులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణకు కసరత్తు చేస్తోంది. మొదటి దశలో 417.26 ఎకరాల ప్రైవేటు భూమిని రైతుల నుంచి సమీకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. కేసరపల్లి గ్రామంలో 114.06ఎకరాలు, అజ్జంపూడిలో 106.64 ఎకరాలు భూ సమీకరణకు అధికారులు కొద్దిమాసాల క్రితం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. కేసరపల్లిలో 64 మంది రైతులు, అజ్జంపూడిలో 61మంది, బుద్ధవరంలో 280 మంది రైతుల ప్రైవేటు భూములను సమీకరించేందుకు అధికారులు ప్రణాళిక పూర్తిచేశారు. రైతుల నిరసనల మధ్య అవార్డు ప్రకటించిన కలెక్టర్ రైతులతో జరిపిన తుది విడత చర్చలలో కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ పది రోజుల్లో భూ సమీకరణ చేస్తామన్నారు. అజ్జంపూడిలో రూ. 46 లక్షలు, బుద్ధవరంలో రూ.57 లక్షలు, కేసరపల్లిలో రూ. 97 లక్షల చొప్పున ఒక్కో ఎకరానికి పరిహారం ఇస్తామని ప్రకటించారు. ల్యాండ్ ఎక్విజేషన్ కాకపోతే ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరిస్తే తుళ్లూర ప్రాంతంలో ఒక ఎకరానికి 1000 చదరపు అడుగుల నివాశస్థలం, 450 చదరపు అడుగుల కమర్షియల్ స్థలం ఇస్తామని పేర్కొన్నారు. ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులకు పరిహారం చెల్లించేందుకు రూ. 576 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. 10 రోజుల్లో డబ్బు చెల్లించి భూమలు సమీకరిస్తామని చెప్పారు. బుద్ధవరంలో 200మంది ఇళ్లు కోల్పోకుండా ఎయిర్‌పోర్టు రన్‌వే అలైన్‌మెంటును మార్పు చేశామన్నారు. దావాజీగూడెంలో ఇళ్లు కోల్పోతున్న 100 కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా వేరొకచోట ఇళ్లు కటి ్టఇస్తామని చెప్పారు. పరిహారం విషయంలో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మూడు గ్రామాలకు కలిపి ఒకే విధమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదే తుది నిర్ణయమని కలెక్టర్ సమావేశాన్ని ముగించేశారు. ఎమ్మెల్యే వంశీమోహన్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, నూజివీడు ఆర్డీవో రంగయ్య, గన్నవరం తహశీల్దార్ మాధురి, రైతు నాయకులు కడియాల రాఘవరావు, వై.నరసింహారావు పాల్గొన్నారు. నేటినుంచి రైతులకు అవార్డు పాస్ గన్నవరం : విమానాశ్రయ విస్తరణలో భూములు కొల్పోతున్న రైతులకు ఈ నెలఖరు వరకు అవార్డు పాస్ చేసే కార్యక్రమం జరుగుతుందని నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక తహశీల్దారు కార్యాలయంలో గురువారం నుంచి ఈనెల 30 వరకు అవార్డు పాస్ చేసేందుకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. రైతులకు ఏమైన సందేహాలు ఉంటే సదరు భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్స్‌తో తహశీల్దారును సంప్రదించాలని సూచించారు. అధికారులు అందుబాటులో ఉండి రైతుల సందేహాలను నివృత్తి చేసి అవార్డు పాస్ చేసేందుకు చర్యలు తీసుకుంటారని వివరించారు. ప్రాణాలిస్తాం.. భూములివ్వం భూములు కాపాడుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తాం. భూములు మాత్రం ఇచ్చేది లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తున్నారు. అనవసరంగా భూములు లాక్కుంటున్నారు. న్యాయమైన పరిహారం ఇవ్వకుండా సన్నచిన్నకారు రైతులను నిలువునా ముంచేశారు. ప్రైవేటు మార్కెట్ విలువ ఎకరం మూడు కోట్ల ధర పలుకుతుండగా కేవలం రూ.50లేదా, రూ.60 లక్షలకు భూములు లాక్కునేందుకు ప్రభుత్వం చూస్తోంది. రైతుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. నాయిని శ్రీనివాసరావు, రైతు, బుద్ధవరం న్యాయపోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు భూ సమీకరణ విషయంలో మెండివైఖరి అవలంబిస్తోంది. రైతులకు అన్యాయం చేసింది. భూ సేకరణ చట్టం 26బి క్లాజ్‌లో చుట్టుపక్కల గ్రామాల్లో అధికంగా ఉన్న ప్రభుత్వ భూమి విలువ ప్రకారం మార్కెట్ ధర కేటాయించాలి. మూడు గ్రామాల్లో ఒకే రేటును పరిహారంగా ఇవ్వాలి. ఇప్పటికే కోర్టులో కేసు జడ్జిమెంటు రిజర్వ్‌లో ఉంది. పరిహారంపై న్యాయపోరాటం చేస్తాం. చింతపల్లి సీతారామయ్య, బుద్ధవరం -
భూ సమీకరణకు డిప్యూటీ కలెక్టర్ల నియామకం
హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూముల సమీకరణకు 34 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాలలోని 29 గ్రామాలను కలుపుకొని 122 చదరపు కిలోమీటర్ల పరిధిలో నూతన రాజధానిని నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. భూ సమీకరణకు నియమితులైన డిప్యూటీ కలెక్టర్లు జనవరి 25వ తేదీలోపల విధులలో చేరాలని ఆ ఉత్తర్వులలో ఆదేశించారు. రాజధానికి కావలసిన భూములను వీరు సమీకరిస్తారు.