భూములు తాకట్టుపెట్టి వ్యాపారం చేస్తారా? | Shobhanadrisvara Raos comments on the government | Sakshi
Sakshi News home page

భూములు తాకట్టుపెట్టి వ్యాపారం చేస్తారా?

Published Mon, Oct 17 2016 8:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

Shobhanadrisvara Raos comments on the government

- మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
మచిలీపట్నం

రైతుల నుంచి భూములు గుంజుకుని పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకు ప్రభుత్వం పనిచేయటం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మచిలీపట్నంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎంఏడీఏ కార్యాలయ ప్రారంభోత్సవ సమావేశంలో పాలకులు వాస్తవాలను వక్రీకరించారన్నారు. 1370 ఎకరాలు భూసమీకరణకు వచ్చిందని పాలకులు, అధికారులు చెబుతున్నా ఆ భూమి అంతా అసైన్డ్ భూమేనని భూస్వాములు ఆక్రమించుకున్నదేనన్నారు. ఎలాగూ ఆ భూమి పోతుందని ముందస్తుగానే ఎంఏడీఏకు అప్పగించారన్నారు. బందరు పోర్టు పనులను టెండరు ప్రక్రియ ద్వారా అప్పగించాల్సి ఉండగా 2010 ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో నవయుగ సంస్థకు కట్టబెట్టడం జరిగిందన్నారు. పోర్టు నిర్మాణానికి 4,800 ఎకరాలు కావాలని అడుగుతున్నారని ఆ సంస్థ సీఈవో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపడతారో బహిరంగ చర్చలో వెల్లడించాలన్నారు. ప్రభుత్వం రైతుల భూములను భూసమీకరణ ద్వారా తీసుకుని పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకు ఇంత కసరత్తు చేస్తోందని దీని వెనుక ఎలాంటి మర్మం ఉందోనని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టులో 12 బెర్త్‌ల ద్వారా ఏడాదికి 40 మిలియన్ టన్నుల సరుకుల ఎగుమతులు, దిగుమతులు కూడా చేయటం లేదని, బందరు పోర్టు ద్వారా 2020 నాటికి 100 మిలియన్ టన్నుల సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేస్తామని పోర్టు పనులను దక్కించుకున్న సంస్థ చెప్పటం పచ్చి అబద్ధమన్నారు. గుజరాత్‌లో రిలయన్స్ సంస్థ జామ్‌నగర్‌లో రూ. 1.80 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ రిఫైనరీలో 2,500 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. పోర్టు, పరిశ్రమల నిర్మాణం జరిగితే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారని ఎంత మందికి ఇస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.


ప్లాట్లు కొనే వారేరి :
ఎంఏడీఏ పరిధిలో 12,500 ఎకరాల్లో మెగా టౌన్‌షిప్ నిర్మిస్తామని పాలకులు చెబుతున్నారని ఒక్కొక్క ప్లాటు కోటి రూపాయలు ధర పలుకుతుందని బుకాయిస్తున్నారని ఈ ప్రాంతంలో కోటి రూపాయలకు ఒక్కొక్క ప్లాటు ఎవరు కొంటారని ప్రశ్నించారు. రైతుల నుంచి భూములు తీసుకుని వారిని నిలువునా మోసం చేసేందుకే పాలకులు పన్నాగం పన్నారన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సిన ప్రభుత్వం వారి ఆస్తులను కాజేసి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టి పాలకులు, అధికారులు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించటం బాధాకరమన్నారు. అమరావతి లంకభూముల్లో ఈ భూమి మీది కాదని, ప్రభుత్వం పండించుకునేందుకే ఇచ్చిందని, ప్యాకేజీ రాదని, రకరకాలుగా రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన బడాబాబులు అనంతరం వాటిని ప్రభుత్వానికి అప్పగించి ప్రయోజనం పొందారని చెప్పారు. రైతులతో మచిలీపట్నంలోనూ ఇదే తరహా మైండ్ గేమ్ ఆడుతూ భూములను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎంఏడీఏకు భూములు ఇచ్చేందుకు అంగీకరించే రైతులు తమ భూములను విక్రయించుకుంటే 24 గంటల్లో రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పటం రైతులను ఇబ్బంది పెట్టడమేనన్నారు. ప్రభుత్వ భూమిలోనే పోర్టు, పరిశ్రమలు నిర్మించాలని ఆయన సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement