82 మంది తహసీల్దార్లకు ప్రమోషన్‌ | promotion to 82 tahsildars in telangana | Sakshi
Sakshi News home page

82 మంది తహసీల్దార్లకు ప్రమోషన్‌

Published Fri, Feb 17 2017 1:48 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

promotion to 82 tahsildars in telangana

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ మండలాల్లో తహసీల్దార్లుగా పనిచేస్తున్న 82 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు పొందిన అధికారులు ఆయా జిల్లాల్లో తాము పని చేస్తున్న మండలాల నుంచి రిలీవై పోస్టింగ్‌ నిమిత్తం ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన వారిలో తెలంగాణ తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, కోశాధికారి చంద్రకళ, ప్రధాన కార్యదర్శి పద్మయ్య, వివిధ జిల్లాల అధ్యక్షులు వంశీమోహన్, అనంతరెడ్డి, వినోద్, రమేశ్, అమరేందర్, జగదీశ్‌రెడ్డి, వెంకారెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement