సూర్యాపేట, సాక్షి: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లేని భూమిని ఉన్నట్లు చూపించి పాస్ పుస్తకాలు ఎమ్మార్వో జయశ్రీ సృష్టించారు. ఈ కుంభకోణానికి ధరణి ఆపరేటర్ జగదీష్ సహకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తహసీల్దారు జయశ్రీ, ధరణీ ఆపరేటర్ జగదీష్‌ను అరెస్ట్ చేశారు. గోప్యంగా 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
కనీసం అరెస్ట్ వివరాలు కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన వైనం. గతంలో హుజూర్‌నగర్ తహసీల్దార్‌గా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హుజూర్ నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులును స్వాహా చేశారు. రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు తహసీల్దార్, ధరణి ఆపరేటర్ పక్కదారి పట్టించారు.
ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు తహసీల్దార్ జయశ్రీ జారీ చేశారు. తహసీల్దార్, ధరణి ఆపరేటర్ జగదీష్ చెరిసగం చొప్పున రైతుబంధు నదులు పంచుకున్నారు. తహసీల్దార్ పై 420, 406, 409, 120(b), 468, 467 IPC సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేవారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్‌గా జయశ్రీ పనిచేస్తున్నారు. గోప్యంగా రిమాండ్‌కు తరలించడమేంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment