
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మరో 10 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు లభించాయి. హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్, మైనార్టీ వెల్ఫేర్ శాఖలతోపాటు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న 10 మంది అధికారులకు ఆర్డీవో హోదా కల్పిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి బి.ఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) డిప్యూటీ సీఎం మహ మూద్ అలీకి కృతజ్ఞతలు తెలిపింది. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి, అధ్యక్షుడు కె.గౌతంకుమార్ తదితరులున్నారు.
డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన వారు..
ఎస్.రాజేశ్వరి , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హెచ్‌ఎండీఏ; బి.అపర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హెచ్‌ఎండీఏ; బి.అరుణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మైనార్టీ వెల్ఫేర్; ఎం.విజయకుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మైనార్టీ వెల్ఫేర్; ఎం.వాసుచంద్ర, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హెచ్‌ఎండీఏ; కె.గోపీరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, హెచ్‌ఎండీఏ; ఎం.సూర్యప్రకాశ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పంచాయతీరాజ్; కె.వి.ఉపేందర్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పంచాయతీరాజ్; ఎస్.మాలతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్; పి.సత్యనారాయణరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జీఏడీ, సెక్రటేరియట్.
Comments
Please login to add a commentAdd a comment