డిసెంబర్ 5న పుష్ప-2 రిలీజ్.. ప్రమోషన్లలోనూ తగ్గేదేలే! | Allu Arjun Pushpa 2 The Rule Movie Promotions In Mumbai Metro Goes Viral | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: పుష్ప-2 ది రూల్ రిలీజ్.. ప్రమోషన్స్‌ వేరే లెవెల్!

Published Mon, Dec 2 2024 4:18 PM | Last Updated on Mon, Dec 2 2024 4:41 PM

Allu Arjun Pushpa 2 The Rule Movie Promotions In Mumbai Metro Goes Viral

ఎన్నో రోజులుగా నిరీక్షణకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 ది రూల్ ఈ గురువారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఓవర్‌సీస్‌ ఫ్యాన్స్‌కైతే ఒక రోజు ముందుగానే పుష్ప-2 రిలీజవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా చిత్రబృందం ఇవాళ తెలంగాణలో భారీ ఈవెంట్ నిర్వహించనుంది. యూసుఫ్‍గూడలోని పోలీస్‌గ్రౌండ్స్‌లో పెద్దఎత్తను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు.

అయితే ఇటీవల ముంబయిలోనూ పుష్ప-2 మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో సరికొత్త పంథాలో దూసుకెళ్తోంది పుష్ప టీమ్. ముంబయిలోని మెట్రో రైళ్లకు ఎక్కడ చూసినా పుష్ప-2 పోస్టర్స్‌ దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా- బిగ్గెస్ట్ ప్రమోషన్స్‌ అంటూ పుష్ప టీమ్ ఈ వీడియోను షేర్ చేసింది.

కాగా.. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 2021లో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద  బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా నటించింది. మరోసారి శ్రీవల్లిగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డులు సృష్టిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement