రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీగా ఉన్న 8 డెప్యూటీ కలెక్టర్, 7 వాణిజ్యపన్నుల అధికారి, 5 జిల్లా ఉపాధి కల్పనాధికారి, 4 డీఎస్పీ, ఒక జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 16న ప్రిలిమ్స్‌ను టీఎన్‌పీఎస్‌సీ నిర్వహించిం ది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఫలితాలను త్వరలో
ప్రకటిస్తామని టీఎన్‌పీఎస్‌సీ చైర్మన్ నవనీత్ కృష్ణన్ వెల్లడించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీగా ఉన్న 8 డెప్యూటీ కలెక్టర్, 7 వాణిజ్యపన్నుల అధికారి, 5 జిల్లా ఉపాధి కల్పనాధికారి, 4 డీఎస్పీ, ఒక జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 16న ప్రిలిమ్స్‌ను టీఎన్‌పీఎస్‌సీ నిర్వహించిం ది. రాష్ట్ర వ్యాప్తంగా 75,627 మంది పరీ క్షలు రాశారు. 1372 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఈ మెయిన్స్ పరీక్షలను శుక్రవారం 14 కేంద్రాల్లో నిర్వహించారు.
ఎగ్మూర్ బాలికోన్నత పాఠశాల, ట్రిప్లికేన్ ఎన్‌కేడీ ఉన్నతపాఠశాల, సైదాపేట జయగోపాల్ కరోడియా ఉన్నత పాఠశాల తదితర 14 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఎలాంటి అవకతవకలూ చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక అధికారుల బృందం, సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు టీఎన్‌పీఎస్‌సీ చైర్మన్ నవనీత్ కృష్ణన్ తెలిపారు. మెయిన్స్ రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తామన్నారు. త్వరలోనే ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.