district registrar
-
జిల్లా రిజిస్ట్రార్లు లేరు
సాక్షి, హైదరాబాద్: కొన్నినెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచాయి. తిరిగి ప్రారంభమైనా... హైకోర్టు ఆదేశాలతో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ల విధానం పలు మార్పులకు లోనవుతోంది. కొత్త, పాత పద్ధతుల కలబోతతో పలు సమస్యలు, సందేహాలు. కిందిస్థాయి సిబ్బందికి సందేహాల నివృత్తి, మార్గదర్శకత్వం అవసరం. ఇలాంటి కీలక తరుణంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పర్యవేక్షణకు ఉన్నతాధికారుల కొరత కనిపిస్తోంది. శాఖాపరమైన కేటాయింపుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 21 మంది జిల్లా రిజిస్ట్రార్ల (పాత జిల్లాల వారీగా) పోస్టులు ఉండగా, ప్రస్తుతం 8 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చదవండి: (తెలంగాణ: డ్రై రన్ సక్సెస్) వీరిలో ముగ్గురు సెలవుపై వెళ్లిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఐదుగురు జిల్లా రిజిస్ట్రార్లు మాత్రమే విధి నిర్వహణలో ఉన్నారు. రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్లు లేకపోవడంతో ఒక్కో అధికారి మూడు, నాలుగు జిల్లాలకు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పర్యవేక్షణ, సొసైటీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్, చిట్ ఆర్బిట్రేషన్, ఆడిట్ లాంటి అంశాల్లో ఇబ్బందులు వస్తున్నాయని ఆ శాఖ అధికారులే చెపుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై జోరుగా సాగుతున్న సమయంలో కీలకమైన ఈ అధికారులు లేకపోవడం క్షేత్రస్థాయిలో సమస్యగా మారుతోందని, జిల్లా రిజిస్ట్రార్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే అభిప్రాయం ఈ శాఖలో వ్యక్తమవుతోంది. పదోన్నతి ఇచ్చారు... పోస్టింగులు మరిచారు మరో విచిత్రమేమిటంటే... ఏ శాఖలో అయినా ఉద్యోగులు లేక పోస్టులు ఖాళీగా ఉంటాయి. కానీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అర్హత కలిగిన ఉద్యోగులు ఉండి కూడా 13 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. గ్రేడ్–1 సబ్రిజిస్ట్రార్లుగా ఉన్న ఆరుగురు అధికారులకు 2019 జనవరిలో జిల్లా రిజిస్ట్రార్‌గా పదోన్నతి ఇచ్చారు. కానీ, 24 నెలలుగా వారికి పోస్టింగులు ఇవ్వడం లేదు. దీంతో ఈ ఆరుగురు జిల్లా రిజిస్ట్రార్ హోదాలో తమ పాత స్థానాల్లోనే సబ్‌రిజిస్ట్రార్ విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతులు పొందిన వారిని పాత పోస్టుల్లోనే కొనసాగించడం రిజిస్ట్రేషన్ల శాఖలో విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుత కీలక సమయంలోనైనా పదోన్నతులు, పోస్టింగుల విషయాన్ని నాన్చకుండా వెంటనే ఖాళీగా ఉన్న జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. -
విజయవాడ నుంచి స్టాంపుల సరఫరా
– గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గాయి – జిల్లా రిజిస్ట్రార్ ఆనందయ్య కోవెలకుంట్ల: జిల్లాలోని రిజస్టర్ కార్యాలయాల్లో రూ. 10, రూ. 20, రూ. 50 స్టాంపుల కొరత ఉందని, అయితే విజయవాడ నుంచి అవి సరఫరా కావాల్సి ఉందని జిల్లా రిజిస్ట్రార్ ఆనందయ్య చెప్పారు. శనివారం కోవెలకుంట్ల రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కోవెలకుంట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ. 4.50 కోట్లు, ఆళ్లగడ్డకు రూ. 6.67కోట్లు, బనగానపల్లెకు రూ. 6.58కోట్లు, నంద్యాలకు రూ. 29.06కోట్లు, అవుకుకు రూ.2.22కోట్లు, పాణ్యంకు రూ. 2.42 కోట్లు, శిరువెళ్లకు రూ. 4.47కోట్లు, బండి ఆత్మకూరుకు రూ. 2.38కోట్లు, బేతంచెర్లకు రూ. 2.45కోట్లు, ఆత్మకూరుకు రూ. 4.16 కోట్లు రెవెన్యూ రాబడిని లక్ష్యంగా పెట్టినట్లు వెల్లడించారు.మార్చి ఆఖరుకల్లా ఈ లక్ష్యాన్ని అధిగమిస్తామని చెప్పారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్లు తగ్గాయని చెప్పారు. గ్రామకంఠం స్థలాల రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకి తొలగిపోయిందని, ఈ సర్వే నంబర్లలోని స్థలాలను క్రమ విక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల సబ్ రిజిస్టర్ నాగన్న, సీనియర్ అసిస్టెంట్ షంషుద్దీన్ పాల్గొన్నారు. 22కెకెఎల్04: సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా రిజిస్ట్రార్ ఆనందయ్య -
అర్ధరాత్రి రిజిస్ట్రేషన్‌లుండవ్
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయం సాయంత్రం 5 గంటల వరకే చెక్ స్లిప్పులు రిజిస్ట్రేషన్ శాఖలో నేటినుంచి నూతన నిబంధనలు ఏలూరు (ఆర్ఆర్ పేట) : రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రిజిస్ట్రేషన్ విధానంలో బుధవారం నుంచి నూతన నిబంధనల అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా ఇచ్చే చెక్ స్లిప్పులను సాయంత్రం 5 గంటలకే నిలుపుదల చేయాలనేది వీటిలో ప్రధాన నిబంధన కాగా.. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ-చలాన్ విధానాన్ని అమలు చేయాలని రెండో నిబంధనగా విధించారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు అందుకు సంబంధించిన ఫీజును బ్యాంకుల్లోనే చెల్లించాల్సి వచ్చేది. కొత్త నిబంధన ప్రకారం కక్షిదారులు తమ బ్యాంక్ ఖాతాల నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. ఐతే దీని కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రతీ లావాదేవీకి రూ.1,100 అదనంగా చెల్లిం చాల్సి ఉంటుంది. నివేదిక ఇచ్చిన సబ్ రిజిస్ట్రార్ల సంఘం నూతన విధానాలకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ల సంఘం ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే డాక్యుమెంట్ చెక్ స్లిప్పులు ఇవ్వాలని సూచిం చింది. ఆ తరువాత సర్వర్ నిలిపివేయడం ద్వారా తమ శాఖలో జరిగే వైట్ కాలర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని పేర్కొంది. సాయంత్రం 5 గంటలకు సర్వర్లను నిలిపివేస్తే కంప్యూటర్లు డాక్యుమెంట్ చెక్ స్లిప్పులను తీసుకోవని, రిజిస్ట్రేషన్లు మాత్రం రాత్రి 10 గంటల వరకూ చేసుకునే అవకాశం ఉంటుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని బుధవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. సర్వర్‌పైనా ఒత్తిడి తగ్గుతుంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంట్రల్ సర్వర్‌పై రాష్ట్రంలోని 13 జిల్లాల సమాచార భారం ఒకేసారి పడుతుండటంతో కంప్యూటర్లు తరచూ మొరాయిస్తున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే.. సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు తప్ప ఈ ప్రక్రియలో జాప్యానికి తావుండదని చెబుతున్నారు. మరోవైపు సర్వర్ సామ ర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సబ్ రిజిస్ట్రార్లకు తగ్గనున్న పనిభారం జిల్లాలో రెండు జిల్లా రిజిస్ట్రార్ కార్యాల యాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, భీమవరం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిద్వారా ప్రతిరోజూ సుమారు 300 నుంచి 500 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉంటారు. దశమి, ఏకాదశి, కొన్ని పర్వదినాల్లో ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 100 నుంచి 150 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అవుతుం టాయి. దీనిని ఆసరా చేసుకుని కొంతమంది దళారులు సబ్ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తెచ్చి అక్రమాలకు పాల్పడేట్టు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఎక్కు వ రిజిస్ట్రేషన్లు జరిగితే పర్సంటేజీలు భారీగా వస్తాయనే ఆశతో అర్ధరాత్రి వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తుంటారనే అపప్రద కూడా ఉంది. డాక్యుమెంట్లు పూర్తయ్యాక వాటిని పరిశీలించాల్సిన కొం దరు అధికారులు చూసీచూడనట్టు వది లేస్తున్నారు. కీలకం కానున్న డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నిర్లిప్తత కారణంగా రిజిస్ట్రేషన్లలో తప్పులు దొర్లుతున్నాయి. డాక్యుమెంట్ నంబర్లతోపాటు కక్షిదారుల పేర్లలోనూ తప్పులు నమోదవుతున్నాయి. వాటిని సరిచేసుకోవడానికి తిరిగి అదే శాఖకు చార్జీలు చెల్లించి, ఒకటి రెండు వారాలు తిరిగితే గాని పని పూర్తికాని పరిస్థితి నెలకొంది. చెక్ స్లిప్పులను 5 గంటలకే నిలుపుదల చేస్తే వారిపై పని ఒత్తిడి తగ్గి డేటా ఎంట్రీ సక్రమంగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ రోజు దస్తావేజులు ఆ రోజే పని ఒత్తిడి కారణంగా ఇప్పటివరకూ క్రయదారులకు దస్తావేజులను ఇవ్వడానికి దాదాపు మూడు నుంచి వారం రోజులు పట్టేది. కొత్త విధానంతో ఏ రోజు దస్తావేజులు ఆ రోజే క్రయదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సమయ పాలనపై చైతన్యం వస్తుంది. సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పనిభారం తగ్గుతుంది. - పి.విజయలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్, ఏలూరు -
ప్రశాంతంగా గ్రూప్-1
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఫలితాలను త్వరలో ప్రకటిస్తామని టీఎన్పీఎస్సీ చైర్మన్ నవనీత్ కృష్ణన్ వెల్లడించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీగా ఉన్న 8 డెప్యూటీ కలెక్టర్, 7 వాణిజ్యపన్నుల అధికారి, 5 జిల్లా ఉపాధి కల్పనాధికారి, 4 డీఎస్పీ, ఒక జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 16న ప్రిలిమ్స్‌ను టీఎన్పీఎస్సీ నిర్వహించిం ది. రాష్ట్ర వ్యాప్తంగా 75,627 మంది పరీ క్షలు రాశారు. 1372 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఈ మెయిన్స్ పరీక్షలను శుక్రవారం 14 కేంద్రాల్లో నిర్వహించారు. ఎగ్మూర్ బాలికోన్నత పాఠశాల, ట్రిప్లికేన్ ఎన్‌కేడీ ఉన్నతపాఠశాల, సైదాపేట జయగోపాల్ కరోడియా ఉన్నత పాఠశాల తదితర 14 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఎలాంటి అవకతవకలూ చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక అధికారుల బృందం, సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు టీఎన్పీఎస్సీ చైర్మన్ నవనీత్ కృష్ణన్ తెలిపారు. మెయిన్స్ రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తామన్నారు. త్వరలోనే ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.