సాక్షి, అమరావతి: నాటి చంద్రబాబు ప్రభుత్వ పెత్తందారు పోకడలకు కామినేని వ్యాఖ్యలు అద్దంపట్టాయి. విద్య, వైద్యం ఈ రెండింటినీ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తేనే పేదలకు ప్రయోజనం. ఇందుకోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాథమిక సూత్రానికి తిలోదకాలు వదిలి.. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలకు కొమ్ముకాశారు చంద్రబాబు.
ఫలితంగా ఆయన జమానాలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుకాకపోవడం, ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు కొనలేక వేల మంది పేద విద్యార్థుల వైద్యవిద్య కల కలగానే మిగిలిపోయింది. బాబు సీఎంగా ఉన్న రోజుల్లో ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుపై చూపిన శ్రద్ధ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుపై ఏనాడు చూపలేదు. ఫలితంగా ఆయన పేదల ద్రోహిగా మిగిలిపోయారు.
బాబు చూపిన చొరవ శూన్యం..
‘40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేశా. దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు ఎవరూలేరు’.. అని తరచూ చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటారు. ఇంత డబ్బా కొట్టుకునే పెద్దమనిషి రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో వైద్య కళాశాలల ఏర్పాటులో చూపెట్టిన శ్రద్ధ మాత్రం గుండుసున్నా. నిజానికి.. 2019లో బాబు దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 11 కళాశాలలు ఉండగా.. ఆంధ్ర, గుంటూరు వైద్య కళాశాలలు స్వాతంత్య్రానికి ముందే ఏర్పాటయ్యాయి.
టీడీపీ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు, కాకినాడ రంగరాయ, తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలు ఏర్పడ్డాయి. అంటే.. టీడీపీ ఆవిర్భవించి ఎన్టీఆర్ సీఎం అయ్యే నాటికే రాష్ట్రంలో ఐదు వైద్య కళాశాలలున్నాయి. 1986లో సిద్ధార్థ వైద్య కళాశాలను ఎన్టీఆర్ ప్రభుత్వంలోకి మార్చారు. ఇలా మొత్తంగా 2004 నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏడు కళాశాలలు ఉన్నాయి. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ రంగంలో వైద్యసేవలను బలోపేతం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
ఇందులో భాగంగా కడప, శ్రీకాకుళం, ఒంగోలు రిమ్స్‌లు ఏర్పాటుచేశారు. నెల్లూరులో ఏసీఎస్సార్ కళాశాల ఏర్పాటుకు వైఎస్సార్ సానుకూలంగా స్పందించగా, ఆయన అకాల మరణం అనంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కళాశాలను ప్రారంభించింది. ఈ లెక్కన పరిశీలిస్తే మూడుసార్లు సీఎంగా పనిచేసిన బాబు తన జమానాలో ప్రభుత్వ రంగంలో వైద్యవిద్య బలోపేతంపై ఏమాత్రం పట్టించుకోలేదు.
కేంద్రంలో భాగస్వామిగా ఉండి..
ఇక 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో టీడీపీ గెలుపొందింది. కేంద్రంలో భాగస్వామిగా కూడా కొనసాగింది. అప్పుడు కూడా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేయలేదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ సాకులు చెప్పి ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులిచ్చి తన వాళ్ల జేబులు నింపడానికే శ్రద్ధ చూపారు.
పేదలకు ద్రోహం చేస్తూ విద్య, వైద్య రంగాలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో పెట్టారు. దీంతో.. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవ్వక మన విద్యార్థులు వైద్యవిద్య కోసం వలసలు వెళ్తున్నా.. చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు లేక ప్రజలు విలవిల్లాడుతున్నా రాజగురువు, రామోజీ ఫిల్మ్‌సిటీ జమిందారు రామోజీ మాత్రం చూసిచూడనట్లు వ్యవహరించారు.
సువర్ణాధ్యాయం లిఖించిన సీఎం జగన్
2019లో సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ప్రభుత్వ రంగంలో ఏకంగా రూ.8వేల కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటుచేయాలని సంకల్పించారు. తద్వారా ఆంధ్ర రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. ఇందులో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు.
2024–25 విద్యా సంవత్సరంలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరు కళాశాలలను ప్రారంభించబోతున్నారు. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించనున్నారు. వీటి ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో కొత్తగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ సమకూరుస్తున్నారు. వాస్తవానికి.. 2019 నాటికి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి.
కానీ, వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించడానికి చర్యలు తీసుకున్న ఏకైక ప్రభుత్వంగా కూడా సీఎం జగన్ ప్రభుత్వం రికార్డుకెక్కింది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వంటి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి సీఎం జగన్ వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెంచడంతో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడానికి కృషిచేశారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటైన ప్రైవేట్ వైద్య కళాశాలలు..
Comments
Please login to add a commentAdd a comment