Government medical colleges
-
మందుల సరఫరాలో మతలబు!
సాక్షి, అమరావతి : ఓ వైపు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను తన వాళ్లకు ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతూనే మరోవైపు బీమా పథకం పేరిట ప్రభుత్వ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మళ్లించి దోపిడీకి కార్యాచరణ సిద్ధంచేశారు. ఇదే తరహాలో ప్రభు త్వా స్పత్రులకు మందుల సరఫరా వ్యవహారంలోనూ కూటమి ప్రభుత్వం అవినీతికి తెరలేపింది. బోధనా స్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా కోసం తిరుపతికి చెందిన సంస్థతో ఓ మంత్రి డీల్ కుదు ర్చుకున్నట్లు తెలిసింది. ఆ సంస్థతోనే బోధనాస్ప త్రుల సూపరింటెండెంట్లు ఒప్పందం (ఎంఓయూ) చేసుకునేలా లిఖితపూర్వక ఆదేశాలివ్వా లని వైద్యశాఖ అధికారులపై మంత్రి కార్యాలయం ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.మా కోసమే ఆ ఉత్తర్వులు..ఇదిలా ఉంటే.. జన్ ఔషధి మందుల కొనుగోలుపై వైద్యశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశా రు. దీంతో మంత్రితో డీల్ కుదుర్చుకున్న మందుల సరఫరా సంస్థ ప్రతినిధులు కొద్దిరోజులుగా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను సంప్రదిస్తున్నారు. ‘మేం మంత్రి తాలూకా.. మా కోసమే జన్ ఔషధి ఉత్తర్వులిచ్చారు. మా సంస్థతో ఎంఓయూ చేసు కోవాలి’ అని కోరినట్లు తెలిసింది. అయితే, ఫలాన సంస్థతోనే ఎంఓయూ కుదుర్చుకోవాలని తమకెక్కడా రాతపూర్వక ఆదేశాల్లేవని సూపరింటెండెంట్లు చెబుతుండడంతో సంస్థ ప్రతినిధులకు నోట్లో పచ్చి వెలక్కాయపడినట్లయింది. దీంతో.. నేరుగా సదరు సంస్థతోనే ఎంఓయూ చేసుకోవాలని అంద రు సూపరింటెండెంట్లను ఒప్పించడానికి మంత్రి కా ర్యాలయం కిందామీదా పడుతున్నట్లు తెలుస్తోంది.డీల్‌లో భాగంగానే తెరపైకి జన్ ఔషధీ..సాధారణంగా బోధనాస్పత్రులకు మందుల కొనుగోలుకు కేటాయించే మొత్తం బడ్జెట్లో 80 శాతం మేర మందులను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేస్తుంది. మిగిలిన 20 శాతం బడ్జెట్‌తో ఆస్పత్రులు అత్యవసర మందులను స్థానికంగానే కొనుగోలు చేస్తుంటాయి. గత ప్రభుత్వంలో ఈ మందులను సైతం కేంద్రీకృత విధానంలోనే సరఫరా చేశారు. ఈ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా సరఫరా కాని, ఇతర అత్యవసర మందులను పీఎంబీజేకే–జన్ ఔష«ధి కేంద్రాల్లోనే కొనుగోలు చేయాలనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కేంద్రాల్లో అందుబాటులో లేని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో కొనుగోలు చేసేలా మార్గదర్శకాలిచ్చింది. మంత్రి డీల్ మేరకు జన్ఔషధీ విధానం తెరపైకి వచ్చిందని వైద్యశాఖలో చర్చ జరుగుతోంది. ఈ సంస్థకు రాయలసీమతో పాటు, మరికొన్ని జిల్లాల్లో జన్ ఔషధీ మందుల కేంద్రాలున్నాయి. -
బీడీఎస్ కన్వినర్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ వైద్య కళాశాలల్లో యూజీ డెంటల్ కోర్సుల్లో (బీడీఎస్) మొదటి ఏడాది ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) శనివారం విడుదల చేసింది. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వర్సిటీ వెల్లడించింది. tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. సీటు పొందిన అభ్యర్థులు వర్సిటీ ఫీజు రూ.12 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీకి ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.10 వేలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.45 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 డెంటల్ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. -
కాలేజీలపై 'చంద్రబాబు' కత్తి!
ఆశలు నీరు గార్చారుప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటై కొత్తగా సీట్లు వస్తే నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు మేలు కలుగుతుంది. కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం సబబు కాదు. ఈ ఏడాది సీట్లు పెరుగుతాయని ఎంతో మంది ఆశ పెట్టుకున్నాం. మా ఆశలను ప్రభుత్వం నీరు గార్చింది. – పూర్ణిమ, నీట్ విద్యార్థిని, చిత్తూరు జిల్లాసాక్షి, అమరావతి: ‘‘కొత్తగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటై అదనంగా సీట్లు వస్తే ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. నూతన వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం సబబు కాదు. మా ఆశలను ప్రభుత్వం నీరు గార్చింది. లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయింది. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామన్న హామీకి టీడీపీ తిలోదకాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం పేద బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తోంది..’’ ఇదీ వైద్య విద్యపై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన. ప్రభుత్వ రంగంలో మనకు అదనంగా మెడికల్ సీట్లు సమకూరుతుంటే ఏ రాష్ట్రమైనా వద్దనుకుంటుందా? కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాసిన ఉదంతం ఎక్కడైనా ఉందా? కాలేజీల్లో మౌలిక వసతులు, సదుపాయాలు పూర్తి స్థాయిలో సమకూర్చుకునేందుకు మరికొంత సమయం తీసుకోవాలని కేంద్రం ఉదారంగా ఆఫర్ ఇస్తే ఎవరైనా తిరస్కరిస్తారా? సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేట్ మోజుతో అలాగే వ్యవహరిస్తున్నారు. మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం (పీ–4) అని నమ్మబలుకుతూ ప్రభుత్వ వ్యవస్థలను తెగనమ్మేందుకు సన్నద్ధమయ్యారు. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం ద్వారా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసినప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వ్యవహరించని విధంగా ఆ సీట్లు మాకొద్దంటూ కూటమి సర్కారు లేఖ రాసి దుర్మారంగా అనుమతులను రద్దు చేయించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరి తమకు తెల్ల కోటు ధరించే అవకాశం దక్కుతుందని ఆశపడ్డ వారంతా సర్కారు తీరుపై నివ్వెరపోతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేస్తామని హామీలిచ్చిన టీడీపీ ఇప్పుడు ఏకంగా వాటికి బేరం పెట్టి తీరని ద్రోహం తల పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలనూ నిలిపివేయడంతో రాష్ట్రం మరో 1,050 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగి తమకు వైద్య విద్య చదివే అవకాశం దక్కుతుందనే ఆశతో రూ.లక్షలు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్‌లు తీసుకున్న విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. ఈ నిర్వాకం ఖరీదు.. 1,750 సీట్లు వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరుల్లో ఒక్కో చోట 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా రాష్ట్రానికి సమకూరాల్సి ఉండగా కూటమి సర్కారు నిర్వాకంతో కేవలం పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లే సమకూరాయి. గతేడాది వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ఈ ఏడాదీ అదే మాదిరిగా మరో 750 సీట్లు పెరిగి తమకు ఎంబీబీఎస్ సీట్ లభిస్తుందని నీట్ రాసి అర్హత సాధించిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కారు నిర్వాకం కారణంగా ఈ ఏడాది 700 మంది, వచ్చే ఏడాది 1,750 మంది విద్యార్థులు వైద్య విద్య అవకాశాన్ని కోల్పోనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 750 సీట్లకు అనుమతులు వచ్చి ఉంటే అందులో 112 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన సీట్లన్నింటిలో మన విద్యార్థులకే అవకాశం లభించేది. ఆల్ ఇండియా కోటా సీట్లలో కూడా మన రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులు సీటు సాధించే వీలుండేది. ముఖ్యంగా ఇప్పుడు ప్రారంభం కావాల్సిన వాటిల్లో నాలుగు కళాశాలలు వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే ఉన్నాయి. తమ పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పలువురు రూ.లక్షల్లో అప్పులు చేసి విజయవాడలో ఇంటర్‌తోపాటు నీట్ యూజీ కోచింగ్‌లలో చేరి్పంచారు. గతంలో చివరి కటాఫ్ ర్యాంక్ వరకూ వచ్చి అవకాశం దూరమైన విద్యార్థులు ఈసారి సీట్లు పెరుగుతాయనే నమ్మకంతో విలువైన సమయాన్ని, డబ్బులను వెచ్చించి లాంగ్‌టర్మ్ కోచింగ్‌లు తీసుకున్నారు. ఇంత అనుకూల పరిస్థితులున్నా.. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, సీఎంలు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రత్యేకంగా కలిసి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసి మరీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు, అదనపు ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రయత్నిస్తుంటే ఏపీలో మాత్రం వింత పరిస్థితులు నెలకొన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వైరల్ అవుతున్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. బీజేపీకి చెందిన సత్యకుమార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభించి వంద శాతం సీట్లకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి.. ఎన్ఎంసీ మంజూరు చేసిన సీట్లను కూడా మాకొద్దని లేఖ రాయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2014–19 మధ్య కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగినప్పుడు కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బూచిగా చూపిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు నిరాకరించటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తొలి నుంచి ప్రైవేట్ వైద్య విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేట్‌కు కట్టబెట్టే తంతుకు తెర తీశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బుకాయించి.. బుక్ అయిన ప్రభుత్వంఐదు కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టేలా చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వం కచిన వసతుల ఆధారంగా ఎన్ఎంసీ పాడేరు కాలేజీకి 50 సీట్లకు అనుమతులు మంజూరు చేసింది. ఆ కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నందున గత్యంతరం లేక చంద్రబాబు సర్కారు మిన్నకుంది. అంతకంటే ముందు పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగా 50 సీట్లకు ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్ఓపీ) మంజూరు చేసింది. అయితే ఎల్‌ఓపీని తొక్కిపెడుతూ మీరు అనుమతులు ఇచ్చినా మేం కళాశాలను నిర్వహించలేమంటూ గుట్టు చప్పుడు కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింది. బయటకేమో ఎల్ఓపీ రాలేదని బుకాయిస్తూ వచ్చింది. ఎల్లో మీడియాలో సైతం అదే తరహాలో వార్తలు రాయించారు. ప్రభుత్వం గుట్టుగా లేఖ రాసిన విషయాన్ని ‘సాక్షి’ బట్ట బయలు చేసింది. ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతోనే ఎల్‌ఓపీని రద్దు చేస్తున్నట్లు స్వయంగా ఎన్ఎంసీ కూడా ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లూ ఎల్ఓపీ రాలేదని బుకాయించిన కూటమి సర్కార్ మోసాలు బహిర్గతమయ్యాయి.మోసం చేశారు.. ఈ ప్రభుత్వం పేద బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తోంది. ఈ ఏడాది 750 సీట్లు అదనంగా సమకూరి ఉంటే కాస్త ర్యాంకు తగ్గినా అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగేది. నా బిడ్డ నీట్ రాసింది. ఐదు కొత్త కళాశాలలు ప్రారంభమైతే సీట్ వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి? సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామన్న హామీకి టీడీపీ తిలోదకాలు ఇచ్చింది. యాజమాన్య కోటా కింద సీట్ కొనే స్థోమత మాకు లేదు. మాలాంటి వాళ్లను మోసం చేశారు. – నెహేమియా, నెల్లూరు, నీట్ రాసిన విద్యార్థి తండ్రి తప్పుడు నిర్ణయాలతో గందరగోళం ఏడాది లాంగ్‌టర్మ్ కోచింగ్ తర్వాత మా అబ్బాయి 541 స్కోర్ సాధించాడు. బీసీ–డీ రిజర్వేషన్ కింద గతేడాది 497 స్కోర్‌కు ప్రైవేట్‌లో చివరి సీట్ వచ్చింది. ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. కొత్త కళాశాలలకు అనుమతులు వస్తే మా అబ్బాయికి సీట్ వస్తుందనే ఆశ ఉండేది. ఎస్వీ రీజియన్‌లోనే మూడు కళాశాలల ఏర్పాటుతో 450 సీట్లు సమకూరేవి. లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయింది. మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనే స్థోమత లేదు. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మా బాబు భవిష్యత్ గందరగోళంగా మారింది. – కోడూరు పెంచలయ్య, అన్నమయ్య జిల్లా తల్లిదండ్రుల ఆశలతో ఆడుకోవద్దు నా కుమార్తె రష్యాలోని కజికిస్తాన్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. స్థానికంగానే మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రావడం ఎంతో శుభపరిణామం. అలాంటిది ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం చాలా బాధ కలిగించింది. పులివెందులకు వచ్చిన సీట్లనూ వద్దనుకుంది. ఈ చర్య ముమ్మాటికీ తల్లిదండ్రుల ఆశలతో ఆడుకోవటమే. స్థానికంగానే మెడికల్ సీట్లు లభిస్తే నాలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు వ్యయ ప్రయాసల కోర్చి పిల్లలను విదేశాలకు పంపే అవసరం ఉండదు. – ఎం.చెన్నయ్య, వైద్య విద్యార్థిని అమూల్య తండ్రి, ఆదోని ఉచిత వైద్యం దూరం చేసే కుట్ర మెడికల్ కాలేజీలతో పిల్లలకు ఎంబీబీఎస్ విద్యనే కాదు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ ఏర్పాటైతే దానికి అనుబంధంగా ఆస్పత్రి వస్తుంది. దాంట్లో అనుభవజు్ఞలైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. వసతులు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే వైద్యం కోసం పేదలు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. – నూర్జహాన్, వేముల, వైఎస్సార్ జిల్లా -
వైద్య విద్య కల ఛిద్రం.. ఇక ప్రైవేట్ ‘మెడిసిన్’!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేసింది. ‘పీ 4’ జపం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రకు తెర తీసింది. అందులో భాగంగానే ఐదు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాకుండా తాజాగా అడ్డుపడింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే తమకు వైద్య విద్య చదివే అవకాశం లభిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. సాధారణంగా ముఖ్యమంత్రులంతా కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టి విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. ఎన్ఎంసీ సీట్లు ఇస్తామన్నప్పటికీ మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొంది. గత ప్రభుత్వం తలపెట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ పీపీపీ మోడల్లో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు వైద్య కళాశాలలకు కుట్రపూరితంగా ప్రభుత్వమే పొగ పెట్టింది. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఇప్పటికే ప్రభుత్వం అటకెక్కించింది. వీటి ద్వారా వచ్చే ఏడాది అందుబాటులోకి రావాల్సిన వెయ్యికి పైగా ఎంబీబీఎస్ సీట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగుపడటంతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని గత ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మరింత మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయి. బోధనాస్పత్రులకు వచ్చే రోగులకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రైవేట్ రంగంలో కూడా వైద్య చికిత్స వ్యయం తగ్గుతుంది. అయితే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కారు ప్రైవేట్ పాట పాడుతోంది.సర్వం సిద్ధం చేసినా ససేమిరా..2024–25 విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించేలా వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషి చేశారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ఐదు చోట్ల బోధనాస్పత్రులను అభివృద్ధి చేశారు. కళాశాల, బోధనాస్పత్రుల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేసి ఎన్నికలు ముగిసే నాటికి 70–80 శాతం పోస్టుల భర్తీ చేపట్టారు. తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో సెమినార్ హాల్, ల్యాబొరేటరీ, లైబ్రరీ, హాస్టళ్ల నిర్మాణాలు 80 శాతం పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేట్‌పరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పొగ పెట్టింది.వద్దని ప్రభుత్వమే లేఖ..కొత్త కాలేజీల్లో తొలి విడత తనిఖీల అనంతరం ఐదు చోట్ల స్వల్పంగా వనరుల కొరత ఉందని పేర్కొంటూ ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. ఎన్ఎంసీ గుర్తించిన అంశాలను మెరుగు పరచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండానే మొక్కుబడిగా చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. అయినప్పటికీ గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగానే పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లను మంజూరు చేస్తూ ఈ నెల 6వ తేదీన ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) ఇచ్చింది. అయితే ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ 50 సీట్లతో కళాశాలలను ప్రారంభించేందుకు మనస్కరించలేదు. దీంతో 50 సీట్లు మంజూరు చేసినప్పటికీ కళాశాలలో మేం వసతులు కల్పించలేమని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ఫలితంగా చేసేదేమీ లేక 50 సీట్లతో ఇచ్చిన ఎల్‌ఓపీని విత్‌డ్రా చేసినట్టు ఎన్ఎంసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనుమతులు రద్దు చేసినట్టు స్పష్టం చేసింది.ఉసూరుమన్న విద్యార్థులు, తల్లిదండ్రులుపులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించిన అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా ఆప్షన్ల నమోదు గడువును పొడిగించింది. బుధవారం (11వ తేదీ) రాత్రితో గడువు ముగిసింది. దీంతో కొత్తగా మంజూరైన పులివెందుల కాలేజీలో ప్రవేశాలు పొందవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశ పడ్డారు. అయితే ఆ కళాశాల ఆప్షన్లలో కనిపించకపోవడంతో ఉసూరుమన్నారు.అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే..సాధారణంగా వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ తొలి విడత తనిఖీల అనంతరం వసతుల కొరత ఉంటే అనుమతులివ్వదు. ఆ లోపాలను సవరించుకుని అప్పీల్‌కు వెళితే రెండో విడత తనిఖీలు చేసి అనుమతులిస్తారు. అదే ప్రభుత్వ కళాశాలలైతే తరగతులు ప్రారంభం అయ్యే నాటికి వసతుల కల్పన చేపడతామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే ఎన్ఎంసీ ఎల్ఓపీ ఇచ్చేస్తుంది. గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలకు అండర్ టేకింగ్ ఇచ్చి వంద శాతం సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం రాబట్టింది. అదే తరహాలో ప్రస్తుతం కూటమి సర్కారు కూడా అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే వంద శాతం సీట్లకు అనుమతులు లభించి ఉండేవన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నిర్మాణాల నిలుపుదలప్రై వేట్‌పరం చేయడంలో భాగంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను సైతం కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు కళాశాలలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కళాశాలల నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లనుందని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదోని, పెనుకొండ కళాశాలల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిపివేయాలని కర్నూలు సర్కిల్ ఏపీఎంఎస్ఐడీసీ ఎస్ఈ లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా..2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు.మోసం చేశారు..నీట్ యూజీలో నేను 593, నా సోదరి 555 స్కోర్ చేశాం. గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్లు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా సీట్ రావడం కష్టంగా ఉంది. గతేడాది ఏపీకి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఈసారి కూడా 750 సీట్లు అదనంగా వస్తే వైద్య విద్య అవకాశాలు పెరిగి మా కల నెరవేరుతుందని భావించాం. కానీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాలేదు. పులివెందుల కాలేజీకి 50 సీట్లతో అనుమతులు వచ్చాయని ఎన్ఎంసీ ప్రకటించినా కౌన్సెలింగ్‌లో చూపించడం లేదు. దీనివల్ల నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ మాట నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేసింది.– నల్లగట్ల సుధీష్ రెడ్డి, రాజంపేట, అన్నమయ్య జిల్లా -
వైద్య కళాశాలలపై చంద్రబాబు శాడిజం..
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలకు వైఎస్సార్ పేరును తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 8500 కోట్లతో 17 కొత్త మెడికల్ కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత ఏడాది విజయనగరం, ఏలూరు,రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కళాశాలలను ఆయన ప్రారంభించారు. కొత్త మెడికల్ కళాశాలలకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. దశాబ్దాలగా ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్యకి వైఎస్ జగన్ ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం లభించింది.రూ. 750 కోట్లతో ఉద్దానం వాసులకి శాశ్వత మంచినీటి పథకంతో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను కూడా వైఎస్ జగన్ సర్కార్ నిర్మించింది. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కళాశాలలకు చంద్రబాబు సర్కార్ అనుమతి సాధించలేకపోయింది. కానీ కొత్త మెడికల్ కళాశాలకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ పేరు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జారీ చేసింది.2023-24లో ప్రారంభమైన ఐదు, 2024-25 లో ప్రారంభం కావాల్సిన మరో ఐదు వైద్య కళాశాలలు పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, కడపలోని క్యాన్సర్ ఆసుపత్రికీ వైఎస్సార్ పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. -
ఇది జగన్ మోడల్.. ఇదేమో బాబు మోసం
-
కక్ష జనంపైనా.. జగన్‌పైనా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభంపై చంద్రబాబు ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంచడంతో పాటు, నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఏకంగా రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటిలో ఐదు వైద్య కళాశాలలను గత ఏడాది ప్రారంభించగా, మరో ఐదు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు కళాశాలల్లో ఒక్కో చోట 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కళాశాలలను ప్రారంభిస్తే వైఎస్ జగన్‌కు క్రెడిట్ దక్కుతుందని కూటమి ప్రభుత్వం.. అనుమతులు రాబట్టడంలో చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం లేదు. మొక్కుబడిగా అప్పీల్ వైద్య కళాశాలలు ప్రారంభించడం కోసం ఐదు చోట్ల సెకండరీ కేర్ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టులను గత ప్రభుత్వంలోనే మంజూరు చేశారు. మెజార్టీ శాతం పోస్టుల భర్తీ చేపట్టారు. మిగిలిన పోస్టులు కూడా భర్తీ చేసే క్రమంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మరోవైపు మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం లెక్చర్ హాల్, ల్యాబ్, వసతి కోసం హాస్టల్స్, క్యాంటిన్ ఇలా వివిధ నిర్మాణాలు చేపట్టింది. ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి 80 శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జూన్ 24న ఎన్ఎంసీ బృందాలు ఈ ఐదు కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాయి. మదనపల్లెలో 12 శాతం, పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోనీల్లో స్వల్ప స్థాయిలో ఫ్యాకల్టీ కొరత ఉందని, కళాశాలల్లో కొన్ని వసతులను మెరుగుపరుచుకోవాలని అనుమతులను నిరాకరిస్తూ జూలై 6న కళాశాలలకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో మిగిలిన కొద్ది పోస్టులను భర్తీ చేయడంతో పాటు, కళాశాలలు, హాస్టల్స్‌లో ఫర్నీచర్ సమకూర్చడంతో పాటు, తుది దశ పనులను పూర్తి చేస్తే రెండో దశ తనిఖీల్లో వంద శాతం సీట్లకు అనుమతులు వస్తాయి. అప్పీల్‌కు వెళ్లడానికి చివరి వరకూ నాన్చి.. నాన్చి.. గడువు ముగిసే ముందు రోజు వైద్య శాఖకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇదిలా ఉంటే ఎన్ఎంసీ రెండో విడత తనిఖీలు నిర్వహించే నాటికి వసతులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన కల్పించాల్సి ఉండగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం పులివెందుల కళాశాలలో వర్చువల్‌గా ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. తొలి దశ తనిఖీలప్పుడు ఉన్న పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయని గుర్తించినట్టు సమాచారం. ఉద్దేశ పూర్వకం.. ఇదే నిదర్శనం » ఈ ఐదు వైద్య కళాశాలల కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం 250కి పైగా వైద్యుల పోస్టులు, దాదాపు సరిపడా సంఖ్యలో సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఇంకా ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా మరో 380 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. ఇంతలో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో వీటిని భర్తీ చేయాలని తొలి సమీక్షలోనే వైద్య శాఖ సీఎం దృష్టికి తీసుకెళ్లినా అనుమతులు ఇవ్వలేదు.» పలు స్పెషాలిటీల్లో ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా వైద్యులు రావడం లేదని గిరిజన ప్రాంతాల్లో 50 శాతం, గ్రామీణ ప్రాంతంలో 30 శాతం అదనపు ప్రోత్సహం ఇవ్వడంతో పాటు, కాంట్రాక్ట్ విధానంలో ప్రొఫెసర్, అసోసియేట్లను తీసుకోవాలని గతంలోనే నిర్ణయించారు. వీటిని కొనసాగించకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంది. కాగా కొన్ని స్పెషాలిటీలలో దేశ వ్యాప్తంగా వైద్యుల కొరత ఉన్నప్పటికీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చొరవ వల్ల ఎన్ఎంసీ అనుమతులు వస్తున్నాయి.» 313 స్టాఫ్ నర్సుల పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా ప్రకటించి, వారికి పోస్టింగ్‌లు ఇచ్చే సమయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఉత్తర్వులు ఇవ్వకుండా నిలిపి వేశారు. స్టాఫ్ నర్సులు లేక ఆయా బోధనాస్పత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం పడుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటేపేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చిత్తశుద్ధితో అడుగులు వేశారు. గత ఏడాది విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల్లో తొలి విడత తనిఖీల్లో ఒక్క విజయనగరానికి మాత్రమే అనుమతులు లభించాయి. రెండో విడత తనిఖీల్లో అనుమతులు రాబట్టడం కోసం చిత్తశుద్ధితో అప్పట్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వానికి కూడా పేదల ఆరోగ్యం, విద్యార్థుల ఆకాంక్షల పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే అదే తరహాలో చర్యలు తీసుకుని ఉండేదని వైద్య వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఐదు వైద్య కళాశాలలకు అనుమతులు రావడం కష్టమేననే భావన వ్యక్తమవుతోంది. -
చంద్రబాబు పేదల ద్రోహి
సాక్షి, అమరావతి: నాటి చంద్రబాబు ప్రభుత్వ పెత్తందారు పోకడలకు కామినేని వ్యాఖ్యలు అద్దంపట్టాయి. విద్య, వైద్యం ఈ రెండింటినీ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తేనే పేదలకు ప్రయోజనం. ఇందుకోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాథమిక సూత్రానికి తిలోదకాలు వదిలి.. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలకు కొమ్ముకాశారు చంద్రబాబు. ఫలితంగా ఆయన జమానాలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుకాకపోవడం, ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు కొనలేక వేల మంది పేద విద్యార్థుల వైద్యవిద్య కల కలగానే మిగిలిపోయింది. బాబు సీఎంగా ఉన్న రోజుల్లో ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుపై చూపిన శ్రద్ధ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుపై ఏనాడు చూపలేదు. ఫలితంగా ఆయన పేదల ద్రోహిగా మిగిలిపోయారు. బాబు చూపిన చొరవ శూన్యం.. ‘40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేశా. దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు ఎవరూలేరు’.. అని తరచూ చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటారు. ఇంత డబ్బా కొట్టుకునే పెద్దమనిషి రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో వైద్య కళాశాలల ఏర్పాటులో చూపెట్టిన శ్రద్ధ మాత్రం గుండుసున్నా. నిజానికి.. 2019లో బాబు దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 11 కళాశాలలు ఉండగా.. ఆంధ్ర, గుంటూరు వైద్య కళాశాలలు స్వాతంత్య్రానికి ముందే ఏర్పాటయ్యాయి. టీడీపీ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు, కాకినాడ రంగరాయ, తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలు ఏర్పడ్డాయి. అంటే.. టీడీపీ ఆవిర్భవించి ఎన్టీఆర్ సీఎం అయ్యే నాటికే రాష్ట్రంలో ఐదు వైద్య కళాశాలలున్నాయి. 1986లో సిద్ధార్థ వైద్య కళాశాలను ఎన్టీఆర్ ప్రభుత్వంలోకి మార్చారు. ఇలా మొత్తంగా 2004 నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏడు కళాశాలలు ఉన్నాయి. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ రంగంలో వైద్యసేవలను బలోపేతం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా కడప, శ్రీకాకుళం, ఒంగోలు రిమ్స్‌లు ఏర్పాటుచేశారు. నెల్లూరులో ఏసీఎస్సార్ కళాశాల ఏర్పాటుకు వైఎస్సార్ సానుకూలంగా స్పందించగా, ఆయన అకాల మరణం అనంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కళాశాలను ప్రారంభించింది. ఈ లెక్కన పరిశీలిస్తే మూడుసార్లు సీఎంగా పనిచేసిన బాబు తన జమానాలో ప్రభుత్వ రంగంలో వైద్యవిద్య బలోపేతంపై ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. ఇక 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో టీడీపీ గెలుపొందింది. కేంద్రంలో భాగస్వామిగా కూడా కొనసాగింది. అప్పుడు కూడా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేయలేదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ సాకులు చెప్పి ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులిచ్చి తన వాళ్ల జేబులు నింపడానికే శ్రద్ధ చూపారు. పేదలకు ద్రోహం చేస్తూ విద్య, వైద్య రంగాలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో పెట్టారు. దీంతో.. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవ్వక మన విద్యార్థులు వైద్యవిద్య కోసం వలసలు వెళ్తున్నా.. చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు లేక ప్రజలు విలవిల్లాడుతున్నా రాజగురువు, రామోజీ ఫిల్మ్‌సిటీ జమిందారు రామోజీ మాత్రం చూసిచూడనట్లు వ్యవహరించారు. సువర్ణాధ్యాయం లిఖించిన సీఎం జగన్ 2019లో సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ప్రభుత్వ రంగంలో ఏకంగా రూ.8వేల కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటుచేయాలని సంకల్పించారు. తద్వారా ఆంధ్ర రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. ఇందులో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25 విద్యా సంవత్సరంలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరు కళాశాలలను ప్రారంభించబోతున్నారు. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించనున్నారు. వీటి ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో కొత్తగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ సమకూరుస్తున్నారు. వాస్తవానికి.. 2019 నాటికి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. కానీ, వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించడానికి చర్యలు తీసుకున్న ఏకైక ప్రభుత్వంగా కూడా సీఎం జగన్ ప్రభుత్వం రికార్డుకెక్కింది. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ వంటి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి సీఎం జగన్ వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెంచడంతో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడానికి కృషిచేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటైన ప్రైవేట్ వైద్య కళాశాలలు.. -
వైద్య కాలేజీల్లో 4,356 అధ్యాపక పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,356 అధ్యాపక పోస్టులను కాంట్రాక్టు, గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 3,155 పోస్టులను కాంట్రాక్టు, 1,201 పోస్టులను గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయనుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్ 412, సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 1,201 భర్తీ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అంటే ఏడాది కాలానికి వీరిని నియమిస్తారు. మెడికల్ కాలేజీల్లో జాతీ య మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు చేయనున్నందున పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించారు. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయా లజీ, ఫోరెన్సిక్ మెడిసిన్,కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, ఆర్ధోపెడిక్స్, గైనకాలజీ, రేడియాలజీ, అనెస్థీషియా, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. స్థానికులకు ప్రాధాన్యత ఈ నెల 16వ తేదీన ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ప్రొఫెసర్ పోస్టుకు 8 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెల వేతనం రూ.1.90 లక్షలు కాగా, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు, సీనియర్ రెసిడెంట్‌కు రూ.92,575, ట్యూటర్కు రూ.55 వేలు ఇవ్వనున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు. అయితే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. స్థానికులు లేనప్పుడు ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయస్సు ఈ నెల 31వ తేదీ నాటికి 69 ఏళ్లకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాహసోపేత నిర్ణయం: మంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, సిబ్బంది కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏటా రూ.634 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. -
AP: మరో 5 మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కళాశాలల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కి ఆ కళాశాలల ప్రిన్సిపల్స్ దరఖాస్తు చేశారు. పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో ఈ కళాశాలలు నిర్మిస్తున్నారు. ఒక్కో కాలేజిలో 150 సీట్లతో 2024–25 విద్యా సంవత్సరం నుంచి అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించడానికి దరఖాస్తు చేశారు. అంటే మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వీటిలో ఒక్కో కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున మొత్తం 3,530 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టులను భర్తీ చేసి, కళాశాలలకు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. ఈ ఐదు చోట్ల ఉన్న ఏపీవీవీపీ ఆస్పత్రులను ప్రభుత్వం 330 పడకల బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేస్తోంది. వీటిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభానికి వీలుగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ వంటి వివిధ విభాగాలను ఏర్పాటు చేసింది. రూ.8,480 కోట్లతో 17 కళాశాలలు ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య వసతులు సమకూర్చడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రూ.16వేల కోట్లకు పైగా ఖర్చుతో నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలేజీల ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీవలే సీఎం వైఎస్ జగన్ నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలను ప్రారంభించారు. వీటి ద్వారా 750 సీట్లు అదనంగా వచ్చాయి. ఈ కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ఐదు కొత్త కాలేజీల ద్వారా మరో 750 సీట్లు సమకూరనున్నాయి. ఇక మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్నారు. అన్ని వనరులతో వైద్య కళాశాలలు కొత్తగా ప్రారంభించే వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలు ప్రారంభించడానికి ఎన్ఎంసీకి దరఖాస్తు చేశాం. అదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించిన ఐదు కళాశాలలకు ఫస్ట్ రెన్యువల్‌కు దరఖాస్తు చేశాం. – డాక్టర్ నరసింహం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ -
Live: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
-
ఒకే రోజు 9 కొత్త మెడికల్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఒకేసారి వీటిని ప్రారంభించనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను వెంటనే సమకూర్చాలని సూచించారు. గురువారం ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాకో కాలేజీ ఏర్పాటులో భాగంగా.. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. గతేడాది ఒకే వేదిక నుంచి ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కొత్త మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అందుబాటులో ఉండి, అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ అంశంపై శుక్రవారం మరోసారి సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ, వైద్య విద్య సంచాలకులను మంత్రి ఆదేశించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణలో కేవలం ఐదే మెడికల్ కాలేజీలు ఉండేవని, అందులోనూ మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఉన్నాయని హరీశ్ చెప్పారు. అదే ఇప్పుడు కొత్తవి కలిపి మొత్తం 26 కాలేజీకు చేరాయన్నారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కలిపి 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఏకంగా 3,915 సీట్లకు పెరిగాయని వివరించారు. మహిళల ఆరోగ్యం కోసం.. రాష్ట్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం కొత్తగా మరో వంద ఆరోగ్య మహిళ కేంద్రాలను ఈ నెల 12వ తేదీన ప్రారంభిస్తున్నట్టు మంత్రి హరీశ్ తెలిపారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఆరోగ్య మహిళా కేంద్రాల సంఖ్య 372కు చేరుతోందన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,78,317 మందికి స్క్రీనింగ్ నిర్వహించి, వివిధ సమస్యలున్న 13,673 మంది మహిళలను ఆస్పత్రులకు రిఫర్ చేశామని చెప్పారు. 5,204 స్టాఫ్ నర్స్ రిక్రూట్ మెంట్ ఫలితాలను త్వరగా విడుదల చేయాలని.. ఏఎన్ఎంల పీఆర్సీ, ఎరియర్స్ వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
మరో 5 వైద్య కళాశాలల ప్రారంభానికి కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2024–25)లో మరో 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి సిద్ధమవుతోంది. వీటిలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి నిర్ణయించింది. ఈమేరకు కొత్త పోస్టులను కూడా మంజూరు చేసింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా ప్రభుత్వం రూ.8480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కళాశాలల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభిస్తున్నారు. ఆ కళాశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కళాశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. 3530 పోస్టుల సృష్టి ఈ ఐదు కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా కొత్త పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే సృష్టించింది. ఒక్కో వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేసింది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ ఇలా వివిధ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు, నర్సింగ్, మెడికల్, నాన్‌మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులను మంజూరు చేసింది. వైద్య పోస్టుల భర్తీకి ఇప్పటికే మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. ఈ ఐదు చోట్ల ఏపీవీవీపీ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేస్తున్నారు. సమకూరనున్న మరో 750 ఎంబీబీఎస్ సీట్లు 17 కొత్త వైద్య కళాశాలల ద్వారా ఏకంగా 2550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఈ విద్యా సంవత్సరంలో ఐదు కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే 5 కాలేజీల్లో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు వస్తాయి. మిగిలిన ఏడు కళాశాలలను 2025–26లో ప్రారంభించేలా ప్రణాళిక రచించారు. వేగంగా నిర్మాణాలు ఐదు చోట్ల వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల నిర్మాణం వేగంగా సాగుతోంది. 2024–25 సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల అనుమతులకు ఎన్ఎంసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే పోస్టులు మంజూరు చేసింది. ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల నియామకం జరిగింది. ఇతర వైద్యులు, సిబ్బంది నియామకాలు వేగంగా పూర్తి చేసి ఐదు కళాశాలలు ప్రారంభించడానికి ఎల్వోపీ కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేస్తాం. 2023–24 విద్యా సంవత్సరానికి 5 కళాశాలలకు అనుమతులు తెచ్చిన అనుభవం ఈ సారి సులువుగా పనులు పూర్తి చేయడానికి దోహద పడుతుంది. – ఎం.టి. కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల భర్తీకి ఓకే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ (బీ కేటగిరీ 35 శాతం), ఎన్ఆర్ఐ (సీ కేటగిరీ 15%) కోటా సీట్లను భర్తీ చేయకుండా ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సీట్ల భర్తీ ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని తెలిపింది. అయితే సీట్ల భర్తీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య కమిషనర్ తదితరులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సదుపాయాలతో ధీటుగా నిర్వహించేలా విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల జిల్లాల్లో నెలకొల్పిన ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో సీట్లను జనరల్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటాగా విభజిస్తూ ప్రభుత్వం గత నెలలో జీవోలు 107, 108 జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన కోయ శిరీష, ఏలూరుకు చెందిన జతిన్ రాయ్, ఆత్మకూరుకు చెందిన వీణా జ్యోతిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రైవేట్‌కు ధీటుగా అభివృద్ధి చేసేందుకే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ధీటుగా నూతన వైద్య కళాశాలలను నిలబెట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థల నుంచి రూ.వేల కోట్లను సమీకరించి మరీ నూతన వైద్య కళాశాలలను నిర్మించిందన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటాల కింద అందిన ఫీజులను ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్లో జమ చేసి ఆ మొత్తాలతో ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను అత్యుత్తమంగా నిర్వహిస్తామన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లను తీసుకురావడం ఇదే తొలిసారి కాదని, 2017 నుంచి ఇది అమలవుతోందన్నారు. ఇప్పటికే రాజస్థాన్, హరియాణ, గుజరాత్లో విజయవంతంగా అమలు చేస్తున్నారని శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు వైద్య కళాశాలల్లో 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇందులో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద కేంద్రానికి వెళతాయన్నారు. మిగిలిన 85 శాతం సీట్లలో 50 శాతం సీట్లను జనరల్ కేటగిరీలో ప్రతిభ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తూ భర్తీ చేస్తామని వివరించారు. ఇవి పోగా మిగిలిన 50 శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తామన్నారు. వీటికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదన్నారు. నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తే అది క్యాపిటేషన్ ఫీజుల కిందకు వస్తుందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని అభ్యర్ధించారు. ఎన్ఎంసీ అనుమతి లేకుండానే వర్గీకరించారు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఠాకూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ సీట్లను మూడు కేటగిరీలుగా విభజించడం అంటే బహిరంగంగా వేలం వేయడమేనన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటాలు తీసుకొచ్చిందన్నారు. దీని వల్ల రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. జాతీయ వైద్య కమిషన్ అనుమతి లేకుండా ప్రభుత్వం 3 కేటగిరీలను తీసుకొచ్చిందన్నారు. జనరల్ విభాగంలో ఏడాదికి రూ.15 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్‌లో రూ.12 లక్షలు, ఎన్ఆర్ఐ విభాగంలో రూ.20 లక్షలను ఫీజుగా నిర్ణయించారన్నారు. కొత్త విధానంలో సీట్లను భర్తీ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది. -
పెత్తందారులకు ‘ప్రైవేట్’ జబ్బు!
చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రోత్సహించి జేబులు నింపుకొనేందుకే తపించారు. ఒక్కటైనా ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్పలేదు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను గాలికి వదిలేశారు. మన విద్యార్థులు వైద్య విద్య కోసం ఖండాతరాలు దాటి వెళ్తుంటే నాడు రాజ గురివింద నోరెత్తిన పాపాన పోలేదు!! ఇప్పుడు వైద్య రంగం బలం పుంజుకుంది. దాదాపు రూ.9 వేల కోట్ల వ్యయంతో కొత్తగా 17 వైద్య కళాశాలలు సమకూరుతున్నాయి. మన విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశాలు పెరిగాయి. సామాన్యుడికి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు మరింత మెరుగ్గా అన్ని చోట్లా అందుబాటులోకి వస్తాయి. దీంతో గుండెలదిరిన ఫిలింసిటీ పెత్తందారు యథాప్రకారం చంద్రబాబుకు కొమ్ము కాసేందుకు ఆరాటపడ్డారు!! సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీ నిర్వహణ ఆషామాషీ కాదు! వసతులు, సిబ్బంది విషయంలో తేడావస్తే ఆ ప్రభావం సీట్ల సంఖ్యపై పడుతుంది! వాటిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించాలనే సదుద్దేశంతో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని తెస్తుంటే వైద్య రంగాన్ని తెగనమ్మేస్తున్నట్లు రామోజీ కన్నీళ్లు కార్చారు! ఈ ఏడాది మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాలలో ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. ఒక్కోదానిలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ఒక్కో వైద్య కళాశాలకు బోధన, నర్సింగ్, పారామెడికల్, ఇతర సహాయ సిబ్బందితో కలిపి 1,013 మంది ఉద్యోగులు అవసరం. కళాశాల నిర్వహణకు ఏటా రూ.225 కోట్లు కావాలి. మొత్తంగా 17 మెడికల్ కాలేజీల కోసం ఏడాదికి రూ.3,825 కోట్లు వ్యయం అవుతుంది. ప్రభుత్వం కట్టేవేమీ కామినేని, నారాయణ మెడికల్ కాలేజీలు కావు! కొత్త కాలేజీల్లో యాభై శాతం సీట్లు జనరల్ కేటగిరీలోనే ఉంటాయి. మిగిలినవి మాత్రమే బీ, సీ కేటగిరీల్లోకి వెళ్తాయి. అయినా ఆ డబ్బేమీ ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్లదు. పలు కేటగిరీల ద్వారా వచ్చే డబ్బు ఆయా కాలేజీలకే చెందుతుంది. వాటితో సంబంధిత మెడికల్ కాలేజీ బాగోగులను చూసుకుంటూ సమర్థంగా నిర్వహిస్తారు. అంతిమంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అదనంగా అందుబాటులోకి వస్తాయి. ♦ ఈ ఏడాది కొత్తగా వచ్చే ఐదు కాలేజీల్లో 113 సీట్లు (15 శాతం) ఆల్ ఇండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన 637 సీట్లలో 319 సీట్లను (50 శాతం) జనరల్ కోటాలో భర్తీ చేస్తారు. 35 శాతం అంటే 223 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో, 15 శాతం అంటే 95 సీట్లను ఎన్నారై కోటా కింద భర్తీ చేస్తారు. కేవలం కొత్త కళాశాలలకే ఈ విధానాన్ని వర్తింపచేస్తున్నారు. ♦ ఇప్పటివరకు ఉన్న 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 2,360 సీట్లు ఉండగా కొత్తగా ఏర్పాటయ్యే 17 కాలేజీల ద్వారా మరో 2,550 సీట్లు పెరుగుతాయి. అంటే రెట్టింపు దాటి పెరుగుతున్నాయి. ప్రభుత్వం రంగంలో 29 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడం ద్వారా ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 4,910కి పెరుగుతాయి. అప్పుడు మన విద్యార్థులకు మంచి జరుగుతున్నట్లే కదా? ప్రభుత్వ వైద్యం బలోపేతం ఇలా ♦ నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 51 వేల వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసేలా ఆదేశాలు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. ♦ గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే సేవలు. ♦ దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు 2 సార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ఇప్పటివరకూ 1.70 కోట్లమందికి సొంతూళ్లలోనే వైద్యం. ♦ వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం. ♦ 108, 104 అంబులెన్స్‌ల సేవలు బలోపేతం. కొత్తగా 768 అంబులెన్స్‌ల సేవలు అందుబాటులోకి. 2020 జూలై నుంచి 33.35 లక్షలకు పైగా అత్యవసర కేసుల్లో సేవలందించిన అంబులెన్స్‌లు. ♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు. -
మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024–25 వైద్య విద్యా సంవత్సరంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్అర్బన్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఈ కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అంటే కొత్తగా 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ ఎనిమిది కూడా అందుబాటులోకి వస్తే.. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకున్నట్టు అవుతుంది. వీటితో కలిపి రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరుతుంది. అంతేకాదు.. దేశంలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పనుంది. భారీగా పెరిగిన వైద్య సీట్లు తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వైద్య కళాశాలలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు గణనీయంగా పెరిగాయి. 2014లో ప్రభుత్వ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. ఈ ఏడాది నాటికి 3,790కి పెరిగాయి. కొత్తగా రానున్న 8 మెడికల్ కాలేజీల్లో మరో 800 మెడికల్ సీట్లు ఉంటాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,590 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి చూస్తే.. 2014కు ముందు రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ ఏడాది ఆ సంఖ్య 56కు చేరుకుంది. ఇదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,850 నుంచి 8,340కు చేరింది. కొత్త మెడికల్ కాలేజీల సీట్లనూ కలిపితే 9,140 సీట్లకు చేరుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు మెడికల్ కాలేజీల ద్వారా మరికొన్ని సీట్లు రానున్నాయి. అంటే తెలంగాణలో మొత్తంగా 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండగా.. సగటున 7.5 పీజీ సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 2023–24లో దేశవ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన 2,118 మెడికల్ సీట్లలో ఒక్క తెలంగాణలోనివే 900 (43 శాతం) కావడం గమనార్హం. ‘జిల్లాకో మెడికల్ కాలేజీ’ ఇలా.. ► 2014కు ముందు రాష్ట్రంలో గాంధీ (1954), ఉస్మానియా (1946), కాకతీయ (1959), రిమ్స్ ఆదిలాబాద్, నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఉన్నాయి. ► 2016–17లో మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో, 2018–19లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కాలేజీలు ఏర్పాటయ్యాయి. ► గత ఏడాది (2022–23)లో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ► ఈ ఏడాది (2023–24) కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. ► వచ్చే ఏడాది (2024–25)లో జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, అనతి కాలంలోనే మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యను, పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేశారు. కొత్త మెడికల్ కాలేజీలు, లోకల్ రిజర్వేషన్ వల్ల డాక్టర్ కావాలనుకునే తెలంగాణ విద్యార్థులకు అపార అవకాశాలు అందుతున్నాయి. విద్యార్థులు వీటిని సది్వనియోగం చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరిస్తుందనే నినాదానికి ఇదో నిదర్శనం. – హరీశ్‌రావు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి -
ఆకలికి వైద్యం అన్నం పొట్లం
హాస్పిటల్‌లోని పేషెంట్లకు వైద్యులు వైద్యం చేస్తారు. కాని వారి ఆకలికి ఎవరు వైద్యం చేస్తారు? కేరళలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పేషెంట్ల కోసం, వారిని చూసుకుంటూ ఉండిపోయిన బంధువుల కోసం ఎందరో గృహిణులు వంట చేస్తారు. ‘అన్నం పొట్లం’ కట్టి అందిస్తారు. ఇలా దాదాపు రోజూ 40 వేల అన్నం పొట్లాలు అక్కడి యూత్ ఫెడరేషన్ ద్వారా నిత్యం సరఫరా అవుతూనే ఉంటాయి. ఉదయాన్నే లేచిన సౌమ్య ఆఫీసుకు వెళ్లే భర్త కోసం క్యారేజీ కట్టే హడావిడిలో ఉంది. అలాగే పిల్లలకు కూడా లంచ్ బాక్సులు కట్టాలి. ఒకటిన్నర గ్లాసుల బియ్యం పడేస్తే సరిపోతాయి. కాని ఆమె ఆ రోజు రెండు గ్లాసులకు పైనే వండింది. భర్తకు, పిల్లలకు కట్టగా తను తినాల్సింది గిన్నెలో పెట్టి మిగిలింది పొట్లంగా కట్టింది. అన్నంతో పాటు పప్పు, పచ్చడి, తాలింపు, ఒక ఆమ్లెట్టు... చక్కగా అరిటాకులో వేసి న్యూస్పేపర్లో చుట్టింది. ఆ పొట్లాన్ని కాసేపటికి ఒక కార్యకర్త వచ్చి సేకరించుకుని వెళ్లాడు. అలా ఆ కార్యకర్త ఆ వీధిలో అన్నం పొట్లం కట్టమని చెప్పిన ఇళ్లన్నింటికీ వెళ్లి అన్నం పొట్లాలను సేకరించాడు. ఇలా సేకరించినవి మధ్యాహ్నానికి ఊళ్లోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుతాయి. లోపల ఉన్న పేద పేషెంట్లకూ వారి కోసం బయట కాచుకుని ఉన్న అటెండర్ల కోసం పంచుతారు. ‘ఏ తల్లి కట్టిచ్చిన అన్నమో’ అని తిన్నవారు ఆ గృహిణులను ఆశీర్వదిస్తారు. ఇలా కేరళలో గృహిణుల వల్ల గత నాలుగేళ్లుగా రోగుల ఆకలి తీరుతోంది. వారి ఆరోగ్యం బాగుపడుతోంది. ఇంటి నుంచి ఆస్పత్రికి కేరళలోని డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) 2017లో 300 అన్నం పొట్లాలు సేకరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉండే పెద్దాస్పత్రులకు పంచే కార్యక్రమం మొదలు పెట్టింది. దీనికి వారు పెట్టిన పేరు ‘హృదయపూర్వం పొత్తిచోరు’. అంటే ‘హృదయపూర్వకంగా అన్నం పొట్లం’. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు అన్నం కొనుక్కునే స్తోమత అన్ని వేళలా ఉండదు. అలాగే వారిని చూసుకోవడానికి వచ్చే బంధువులు కూడా అన్నం కొనుక్కోలేరు. పేదవారు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా అని డివైఎఫ్ఐ కార్యకర్తలకు అనిపించింది. ‘ప్రతి ఇంట్లోనూ ఓ అమ్మ అన్నం వండుతుంది. ఒక గుప్పెడు అదనంగా వండమని కోరుదాం. ఒకరికి భోజనం పొట్లం కట్టి ఇవ్వమని అడుగుదాం. ఇస్తారు’ అని స్త్రీల కరుణ మీద ఉండే విశ్వాసంతో ధైర్యంగా రంగంలోకి దిగారు. కార్యక్రమ ప్రారంభం రోజున 300 అన్నం పొట్లాలు వచ్చాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 40,000 అన్నం పొట్లాలు పంపిణీ అవుతున్నాయి. పకడ్బందీగా సేకరణ కేరళ అంతా డివైఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నారు. వారు తమ తమ ఊళ్లలో ఎన్ని అన్నం పొట్లాలు అవసరమో లెక్కించి తమ ఏరియాలో ఉన్న గృహిణులను ముందు రోజే రిక్వెస్ట్ చేస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం అన్నం పొట్లం ఇవ్వమంటారు. అలా ఒకోరోజు ఒక ఏరియాలో కొన్ని ఇళ్లను ఎంపిక చేసుకుని అడుగుతారు. మళ్లీ ఆ ఇళ్లలోని గృహిణులను అడగడానికి వారం పదిరోజులు పట్టొచ్చు. అందుకని స్త్రీలు సంతోషంగా అన్నం పొట్లం కట్టి ఇస్తారు. కొందరు స్త్రీలు రెండు మూడు పొట్లాలు కట్టిచ్చి సంతోష పడతారు. సారీ అంకుల్! ఈ అన్నం పొట్లాల పంపిణిలో ఎన్నో ప్రేమమయ సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకరోజు ఒక రోగికి తన వంతుగా అందిన అన్నం పొట్లంలో చిన్న చీటీ కనిపించింది. అందులో ఇలా ఉంది. ‘అంకుల్.. అమ్మకు వీలు కాలేదు. నేనే స్కూల్‌కు వెళ్లే హడావిడిలో వంట చేశాను. అంత రుచిగా లేవు. క్షమించండి. మీరు తొందరగా కోలుకోండి’ అని ఒక అమ్మాయి రాసింది. దానిని అందుకుని ఆ రోగి ఆ చీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ‘బంగారుతల్లీ... నువ్వు పంపిన భోజనం ఎంతో రుచిగా ఉంది. మెతుకు మెతుకులో నీ ప్రేమ ఉంది’ అని రాశాడు. అన్నం పొట్లం కట్టివ్వడానికి అమ్మలాంటి స్త్రీలు ఎందరో ఉంటారు. చేయవలసిందల్లా ప్రయత్నమే. -
రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వానికి తెలియజేసింది. మరో 7 వైద్య కళాశాలల అనుమతుల ప్రక్రియ వివిధ స్థాయిల్లో ఉంది. 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఆ రెండు కళాశాలల్లో 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి వచ్చినట్లయింది. మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, బోధన అధ్యాపకులను పూర్తిస్థాయిలో నియమించుకోవాలని నేషనల్ మెడికల్ కమిషన్ కోరింది. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్లు ఎక్కడైనా రుజువైతే అనుమతి రద్దవుతుందని హెచ్చరించింది. కాగా ఆయా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు, వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడం తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. కోర్సులు, అందుబాటులో ఉన్న అధ్యాపకులు, వారి 5 ఏళ్ల అనుభవం, విద్యార్థులు చేరిన అనుబంధ విశ్వవిద్యాలయం మొత్తం సమాచారాన్ని ప్రదర్శించడం తప్పనిసరి చేయాలని పేర్కొంది. ప్రతి స్పెషాలిటీలో అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పరికరాలను కూడా ప్రదర్శించాలని సూచించింది. రెండు వైద్య కళాశాలలకు అనుమతి రావడంపై వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. -
విజయనగరం వైద్య కళాశాలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్యలో సువర్ణాధ్యాయం లిఖించేలా కీలక ముందడుగు పడింది. విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు నిర్వహించేలా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్ఎంసీ నుంచి వైద్య శాఖకు మంగళవారం ఉత్తర్వులు అందాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా 17 వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐదుచోట్ల జిల్లా ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన బోధనాస్పత్రులుగా తీర్చిదిద్దడంతోపాటు ఒక్కోచోట 150 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లకు అనుమతులు కోరుతూ ఎన్‌ఎంసీకీ గత ఏడాది దరఖాస్తు చేసింది. దీంతో ఈ నెల మొదటి వారంలో 5చోట్ల ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అనంతరం విజయనగరం వైద్య కళాశాలలో అడ్మిషన్లకు ఆమోదం లభించింది. మిగిలిన నాలుగు కళాశాలలకు ఆమోదం లభించాల్సి ఉంది. వీటికి కూడా ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరుతాయి. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో చివరిసారిగా 2014లో నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. ఈ కళాశాల ఏర్పాటుకు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే అడుగులు పడ్డాయి. అనంతరం టీడీపీ హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కాలేదు. అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఏర్పాటుకు కృషి చేసిన దాఖలాలు లేవు. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుకు కొమ్ముకాసింది. సీఎం వైఎస్ జగన్ కృషితో తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటైంది. వైద్య రంగంలో మరో మైలురాయి విజయనగరం వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ఇచ్చేందుకు ఎన్ఎంసీ ఆమోదం ఇవ్వడం శుభపరిణామం. దీంతో రాష్ట్ర వైద్య రంగంలో మరో మైలురాయి వచ్చి చేరింది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో తొలుత విజయనగరం కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు లభించాయి. విజయనగరం వైద్య కళాశాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సంరక్షణ సమకూరుతుంది. మరో 4 కళాశాలలకు కూడా అనుమతులు లభిస్తాయని దృఢ నిశ్చయంతో ఉన్నాం. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో ఆ సీట్లను 1,249 కు పెంచుకోగలిగాం. మరో 637 సీట్ల పెంపుదల కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఇప్పటివరకు 90 సీట్లను అదనంగా సాధించగలిగాం. – విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి -
మెడికల్ కాలేజీల్లో 147 ప్రొఫెసర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 147 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. జాతీయ మెడికల్ కమి షన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల మేరకు.. 69 ఏళ్ల వయసున్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి నోటిఫికే షన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అదే రోజున తుది జాబితా ప్రకటిస్తారు. ఎంపికైనవారు ఈ నెల 23వ తేదీ నాటికి ఆయా చోట్ల చేరాల్సి ఉంటుంది. ఏడాది పాటు ఆయా కాలేజీలు, ఆస్పత్రుల్లో ప్రొఫె సర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికలో తెలంగాణకు చెందినవారికి ప్రాధాన్యమిస్తారు. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థుల వయసు 69 ఏళ్లు దాటకూడదు. రూ. లక్షా 90 వేల వరకు వేతనం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు రూ.50 వేలు వేత నం ఇస్తారు. మిగతా విభాగాల అసోసియేట్ ప్రొఫె సర్లకు రూ.లక్షన్నర, ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు ఇస్తారు. ఇవి కాంట్రాక్టు నియామకాలు కావడం వల్ల.. ఆయా పోస్టులకు ప్రమోషన్లు, రెగ్యులర్ నియామకాలు జరిగితే వీరిని తొలగిస్తారు. అనాట మీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున భర్తీ చేస్తారు. ఫిజియాలజీలో 9 ప్రొఫె సర్, ఏడు అసోసియేట్ ప్రొఫెసర్.. బయోకెమి స్ట్రీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున.. ఫార్మకాలజీలో ఏడు అసోసియేట్, పాథాలజీలో 9 అసోసియేట్, మైక్రోబయాలజీలో ఏడు అసోసియేట్, జనరల్ మెడిసిన్‌లో 9 ప్రొఫె సర్, డెర్మటాలజీలో 4 అసోసియేట్, సైకియాట్రీలో 9 అసోసియేట్, రెస్పిరేటరీ మెడిసిన్‌లో ఐదు అసోసియేట్, జనరల్ సర్జరీలో 9 ప్రొఫెసర్, ఆర్థోపెడిక్స్‌లో 9 అసోసియేట్, గైనకాలజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 9 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. -
1,458 ‘సీనియర్ రెసిడెంట్’ల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధనాస్పత్రుల్లో 1,458 సీనియర్ రెసిడెంట్ (ఎస్ఆర్) డాక్టర్ల నియామకానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ రాత్రి 12 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 45 ఏళ్ల లోపు వయసుండి, ప్రభుత్వ మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. http://dme.ap.nic.in వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఎస్ఆర్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.85 వేలు, స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.70 వేలు, సీనియర్ రెసిడెంట్(పీజీ)కు రూ.65 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుంది. పీజీ తుది పరీక్షల్లో వచ్చిన (థియరీ, ప్రాక్టికల్స్)మార్కుల్లో మెరిట్ ప్రామాణికంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపికలు చేపడతారు. అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 144, జనరల్ మెడిసిన్‌లో 101, జనరల్ సర్జరీ విభాగంలో 101 ఖాళీలున్నాయి. పాథాలజీలో 88, అనాటమీలో 85, ఫార్మకాలజీలో 80, గైనకాలజీలో 69, అనస్థీషియాలో 56, పీడియాట్రిక్స్‌లో 56, ఆప్తమాలజీలో 56 ఖాళీలున్నాయి. ఇలా మొత్తంగా 49 విభాగాల్లో 1,458 ఎస్ఆర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ప్రభుత్వం 46 వేల పోస్టులను భర్తీ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వారికే.. ఎస్ఆర్ పోస్టుల నియామకంలో తమకు అవకాశం కల్పించాలని కొందరు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ చేసిన వైద్యులు సంప్రదిస్తున్నారు. అయితే నేషన్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అడ్మిషన్ నిబంధనల మేరకు కళాశాలల్లోని ప్రతి విభాగంలో ఎస్ఆర్ పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఈ క్రమంలో కేవలం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వారికే అవకాశం కల్పిస్తున్నాం. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదివిన వారు తాము చదివిన కళాశాలల్లో ఎస్ఆర్లుగా పనిచేసేందుకు ఆయా కళాశాలల యాజమాన్యాలను సంప్రదించాలి. – డాక్టర్ వినోద్‌కుమార్, డీఎంఈ -
ఎన్టీఆర్ గొప్పతనాన్ని సంపూర్ణంగా నమ్ముతున్నాం
ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. వీటిలో 8 కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపే, అంటే 1983 కంటే ముందే వచ్చాయి. మిగతా 3 మెడికల్ కాలేజీలు శ్రీకాకుళం, ఒంగోలు, కడపలో వైఎస్సార్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. మొత్తం 28 మెడికల్ కాలేజీలలో 20 కాలేజీలు వైఎస్సార్ హయాంలోను, ఆయన తనయుడి హయాంలోను ఏర్పాటవుతున్నాయి. ఈ పరిస్థితిలో హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం ఏ రీతిన చూసినా న్యాయమే కదా? – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్‌ను గౌరవించే విషయంలో ఎక్కడా మనసులో మాకు కల్మషం లేదు. ఆయన గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి అని సంపూర్ణంగా నమ్ముతున్నాం. నేను పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పాను. ఎవరూ అడగకపోయినా ఆ మాట నిలబెట్టుకునేలా విజయవాడ జిల్లాకు ఆయన పేరు పెట్టాం. ఇంకా ఎక్కడైనా ఆయన హయాంలో కానీ, టీడీపీ హయాంలో కానీ ఏమైనా కట్టి ఉంటే.. వాటికి ఆయన పేరు పెట్టాలని వాళ్ల నుంచి ప్రతిపాదన ఉంటే ఇవ్వమనండి. కచ్చితంగా చేస్తాం. కానీ క్రెడిట్ రావాల్సిన వ్యక్తికి, క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మం, న్యాయం కాదని అందరూ గుర్తించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ అంటే చంద్రబాబునాయుడి కంటే తనకే ఎక్కువ గౌరవమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఆయనంటే తనకు ఎటువంటి కోపమూ లేదన్నారు. గతంలో కూడా ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదన్నారు. టీడీపీ హయాంలో 1983 నుంచి 2019 వరకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ రంగంలో కట్టలేదని చెప్పారు. వీళ్లు కట్టకపోయినా, అధికారం ఉందని చెప్పి బలవంతంగా వాళ్లకు కావాల్సిన పేరు వాళ్లు పెట్టుకుని ఆ పేరే కొనసాగించాలని అడగడం ధర్మమేనా? అని అందరూ ఆలోచించాలన్నారు. ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు దగ్గరగా, వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహా శిఖరం వైఎస్సార్ అని, ఆయన పేరు హెల్త్ వర్సిటీకి పెట్టడం సమంజసమని చెప్పారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పుకు సంబంధించిన సవరణ బిల్లుపై అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘చంద్రబాబు వాళ్లతో గొడవ చేయించడం, వాళ్లు గొడవ చేసి సస్పెండై వెళ్లిపోవాలనే ఉద్దేశంతో రావడం చూశాం. ఈ చర్చలో వాళ్లు కూడా పాలుపంచుకుని ఉంటే బాగుండేది. ప్రభుత్వం చేస్తున్న దానికి కారణాలు వాళ్లు కూడా తెలుసుకుంటే బాగుండేది. నాకు ఎన్టీఆర్ మీద ప్రేమ తప్ప ఆయన్ను అగౌరవపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు. నందమూరి తారక రామారావు అనే పేరు మనం పలికితే చంద్రబాబునాయుడికి నచ్చదు. చంద్రబాబు.. ఎన్టీ రామారావు పేరు పలికితే పైనున్న ఎన్టీ రామారావుకు నచ్చదు. ఎన్టీఆర్ గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి అని చెప్పని వాళ్లు ఎవరూ ఉండరు. ముఖ్యమంత్రిగా దాదాపు 7 ఏళ్లు పరిపాలన చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే బహుశా ఇంకా చాలా కాలంపాటు బతికుండేవారు. ముఖ్యమంత్రిగా కచ్చితంగా రెండో దఫా పూర్తి చేసి ఉండేవారు. ఆయన బతికి ఉంటే, చంద్రబాబు ఎప్పటికీ సీఎం అయ్యి ఉండేవాడు కాదు’ అని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మానసిక క్షోభతోనే అకాల మరణం ► 1995లో సొంత అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు, ఈనాడు రామోజీరావు పథక రచన, మరో జర్నలిస్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డబ్బుల సంచులు మోయడం వంటి వాటివల్ల మానసిక క్షోభకు గురైన ఎన్టీఆర్ అకాల మరణం చెందారు. ► 2019 ఎన్నికలకు వెళ్లేటప్పుడు చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలు.. ఎన్టీ రామారావు పేరే లేకుండా చేయాలని మాట్లాడుకున్న మాటలు విన్నాం.. చూశాం. ఎన్టీఆర్ అంటే ఏమాత్రం గౌరవం లేకుండా వాడు, వీడు అని సంబోధించడం వారి మాటల్లో విన్నాం. చంద్రబాబుకు ఎన్టీఆర్ తన కూతురుని బహుమతిగా ఇస్తే, చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటును రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ► ఎన్టీఆర్‌ను మానసికంగా దెబ్బ తీసి, ఆయన ఆరోగ్యాన్ని పాడయ్యేలా చేసి, ఆయన మరణానికి కారణమైన వారు ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అంటూ నినాదాలు చేయడమంటే ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? వైద్య రంగంలో విప్లవం ► ఈ రోజు వైద్య రంగంలో రాష్ట్రంలో ఎక్కడా, ఎప్పుడూ చూడని మార్పులు జరుగుతున్నాయి. విప్లవం చోటు చేసుకుంటోంది. నాన్న ఒక అడుగు ముందుకువేస్తే ఆయన కొడుకుగా జగన్ నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నాడు. మన ప్రభుత్వం రానంత వరకు ఆరోగ్య శ్రీలో 1059 ప్రొసీజర్స్ మాత్రమే ఉంటే.. ఇప్పటికే 2400కు పైగా ప్రొసీజర్స్‌ను పథకంలో చేర్చాం. వచ్చే అక్టోబర్ 5వ తేదీ (విజయదశమి) నుంచి ఏకంగా 3,118 ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీలోకి తీసుకు వస్తున్నాం. ఆరోగ్యశ్రీ రూపురేఖలు మారుస్తున్నాం. ► ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ఇస్తున్నాం. శిథిలమైన పరిస్థితులలో ఉన్న ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి. ఫోన్ కొడితే రాని 108, 104 పరిస్థితి నుంచి ఏకంగా 1088.. 108, 104 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇంకా 104 అంబులెన్స్‌లు అదనంగా రాబోతున్నాయి. ► 10 వేలకు పైగా గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు రాబోతున్నాయి. ప్రై మరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల నుంచి, జిల్లా ఆసుపత్రులతో కలుపుకుని బోధనాసుపత్రుల వరకు అన్నీ రూపురేఖలు మారిపోతున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రతినెలా బిల్లులు ఇస్తున్నాం. ► ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో 40,500 పోస్టులలో నియామకాలు చేశాం. అక్టోబరు 15 కల్లా మరో 4 వేల మంది నియామకాలు పూర్తవుతాయి. ఇన్ని విప్లవాత్మక మార్పులు జరుగుతున్నప్పుడు.. ఇదే వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఇదే యూనివర్సిటీకి ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం సమంజసమని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఇది ఎవ్వరినీ అగౌరవ పరిచే కార్యక్రమం కానే కాదు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం.. ► వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు బిల్లుపై బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు మనం చేస్తున్నది కరెక్టేనా? అని నన్ను నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నా. ఇది కరెక్ట్ అనిపించిన తర్వాతే అడుగులు ముందుకు వేశాం. ► డాక్టర్ వైఎస్సార్ అందరికీ చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి పథకాలన్నింటి సృష్టికర్త ఆయనే. చదువు రీత్యా ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన ప్రారంభంలో పులివెందుల నియోజకవర్గంలో ఆస్పత్రి పెట్టి డాక్టర్‌గా పని చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించ లేదు? ► చంద్రబాబు ఆనేకసార్లు తాను కేంద్రంలో చక్రం తిప్పేసినట్టు చెప్పుకుంటారు. తిప్పేసిన రోజులు మనందరికీ గుర్తుకు రావాలని ఆయనంతట ఆయనే జ్ఞాపకం చేసుకుని మనకు చెబుతుంటారు. ఎంతో మందిని రాష్ట్రపతులను చేశానని, ఎంతో మందిని ప్రధాన మంత్రులను చేశానని, మోదీ కూడా తనకన్నా జూనియర్ అని బాబు చాలా సార్లు చెప్పారు. ► ఇన్ని గొప్ప పనులు చేశానని చెబుతున్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయాడో మాత్రం చెప్పనే చెప్పడు. అధికారంలో లేనప్పుడు మాత్రమే ఆయనకు ఎన్టీ ఆర్ గుర్తుకు వస్తారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి సహకరించిన ఈనాడు రామోజీరావు వంటి వారికి కేంద్రం నుంచి ఈయన అవార్డులు ఇప్పిస్తాడు. కానీ ఎన్టీఆర్‌కి మాత్రం భారతరత్న అవార్డు రాదు. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరో రకంగా ప్రవర్తించే రాజకీయ నాయకుల మధ్య రాజకీయాలు నలుగుతున్నాయి. -
కొత్త మెడికల్ కాలేజీల్లో 200 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేయడానికి 200 వైద్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం మెడికల్ కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది కాలానికి నియమిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి కోరారు. అభ్యర్థులు నిర్దేశిత రూపంలో తమ దరఖాస్తులను ఈ నెల 28లోగా ఆన్లైన్లో సమర్పించాలని కోరారు. అర్హత కలిగిన అభ్యర్థుల తుది జాబితాను 31వ తేదీన ప్రకటిస్తారు. వచ్చేనెల 7లోగా విధుల్లోకి చేరాలి ఎంపికైన అభ్యర్థులు నిర్దేశిత కాలేజీల్లో వచ్చే నెల ఏడో తేదీలోగా చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్లకు నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు రూ. 1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు రూ. 1.25 లక్షలు వేతనంగా చెల్లిస్తామని రమేశ్‌రెడ్డి తెలిపారు. అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పెథాలజీ, మైక్రోబయోలజీ, ఫొరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్, అనెస్థిసియోలజీ, రేడియోడయాగ్నసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. -
ప్రొఫెసర్లుగా 80 మంది వైద్యులు
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వైద్యుల కల ఎట్టకేలకు ఫలించింది. ఒకే దఫాలో 80మందికి పైగా అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసే వైద్యులకు ప్రొఫెసర్లు కావడమనేది అత్యున్నత పోస్టు. దీనికోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తుంటారు. గత ప్రభుత్వాల హయాంలో అర్హత ఉన్నా.. సకాలంలో పదోన్నతులు ఇవ్వలేదు. తాజాగా క్లినికల్ విభాగంలో 80 మందికి పైగా వైద్యులు ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందారు. వీరికి నేడో రేపో జూమ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. వీరితో పాటు నాన్క్లినికల్ అంటే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్ ఇలా రకరకాల విభాగాల్లో పనిచేసే వారి పదోన్నతుల జాబితా రెడీ చేశారు. ఈ వారంలో వీళ్లకూ ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. నెల రోజుల క్రితమే ఏడుగురు ప్రొఫెసర్లకు అదనపు సంచాలకులుగా పదోన్నతులిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 2006 తర్వాత టీచింగ్ విభాగంలో పనిచేస్తున్న వైద్యులందరికీ 2020లోనే పీఆర్సీ వచ్చింది. 2016లోనే అప్పటి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వేతన సవరణ చేయడంతో ఎంతోమంది వైద్యులకు ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. ప్రధానంగా సర్వీసు 10 ఏళ్లు దాటిన వైద్యులకు రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం పెరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సైతం భారీగా వేతనాలు పెరిగాయి. -
త్వరలో 8 మెడికల్ కాలేజీలకు దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైద్య ఆరోగ్యశాఖ వచ్చే నెల 20 తర్వాత దరఖాస్తు చేయనుంది. ఆ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, కొత్తగూడెం, మంచిర్యాలలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రామగుండంలో ఏర్పాటు చేసే సింగరేణి మెడికల్ కాలేజీకి కూడా త్వరలోనే అనుమతి వచ్చే అవకాశాలున్నాయి. దీనికీ అనుమతులు రాగానే మొత్తం ఎనిమిది కళాశాలలకు ఒకేసారి ఆన్లైన్లో జాతీయ వైద్య కమిషన్‌కు దరఖాస్తు చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తుంది. అందుకు సంబంధించి ఉన్నతస్థాయిలో సమీక్ష జరిగింది. వచ్చే నెల 26 వరకు దరఖాస్తుకు గడువు ఉండటంతో ఆలోపు చేయాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీకి కేంద్రం నుంచి అనుమతి రావాలంటే వాటికి అనుబంధంగా కచ్చితంగా 300 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండాలి. అయితే కొన్నింటికి వందా రెండొందలు మాత్రమే పడకలున్నాయి. దీంతో తక్కువ ఉన్న వాటికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుత ఆసుపత్రి భవనాల్లోనే పైభాగంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లేబొరేటరీలు, వైద్యపరికరాలు, ఫర్నీచర్ కొనుగోలుకు టెండరు ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని టెండర్ ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రానికి దరఖాస్తు చేశాక అక్కడి నుంచి ఉన్నతస్థాయి తనిఖీ బృందం ఏడాది చివరికల్లా రాష్ట్రానికి వచ్చే అవకాశముంది. వారు తనిఖీలకు వచ్చేనాటికి ఒక్కో మెడికల్ కాలేజీలో 97 మంది పోస్టులను భర్తీ చేయాలి. నూతన నియామకాలను ఈసారి అఖిల భారత స్థాయిలో చేపట్టాలని నిర్ణయించారు. -
‘ఆర్అండ్బీ’కి మెడికల్ ప్రాజెక్టులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మాణంలో తలమునకలై ఉన్న రోడ్లు, భవనాల శాఖ త్వరలో ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్ట నుంది. నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రు లు, ఏడు మెడికల్ కాలేజీలు, 13 నర్సింగ్ కాలే జీలను నిర్మించాలని ఇటీవలే కేబినెట్ నిర్ణయిం చిన విషయం తెలిసిందే. వీటి నిర్మాణానికి దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మెడికల్ ప్రాజెక్టుకు సంబంధించి త్వర లో ఆర్ అండ్ బీ స్థలాల పరిశీలన ప్రారంభించ నుంది. ఆ తర్వాత డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లు పిలవనుంది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే మెడికల్ ప్రాజెక్టు పూర్తి కోసం ఖాళీలు భర్తీ చేయాలని ఆర్అండ్బీ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. పలు కేటగిరీలకు చెందిన 200 ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదించింది. నిర్మించాల్సిన కొత్త మెడికల్ కాలేజీలు.. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు కొత్త నర్సింగ్ కళాశాలలు: సంగారెడ్డి, మహబూ బాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్త గూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట కొత్త సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు: వరంగల్, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి, కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలం, అల్వాల్–ఓఆర్ఆర్ మధ్య. -
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 145 పీజీ సీట్ల పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. ఇటీవలే 700 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, తాజాగా అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు తదితర చర్యలతో ఎండీ, ఎంఎస్ వంటి పీజీ సీట్లకు అర్హత వచ్చింది. దీంతో పలు కాలేజీల్లో వివిధ పీజీ కోర్సులకు దరఖాస్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు కళాశాలల్లో దరఖాస్తు చేసిన సీట్లకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు జారీ చేసింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో సుమారు ఐదు విభాగాల్లో 28 సీట్లు రానున్నాయి. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో గైనకాలజీ సీట్లు, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ సీట్లకు దరఖాస్తు చేశారు. కాకినాడలోని వైద్య కళాశాలకు భారీగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. సీట్లు పెరగడం వల్ల పేదలకు భారీ లబ్ధి జరగనుంది. కర్నూలు, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం కాలేజీల్లో కూడా భారీగా పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంచేందుకు దరఖాస్తు చేశారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ కలిపి ఒకేసారి 145 సీట్లు పెరగడం ఇదే మొదటిసారి. ఈ సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. సీట్లతో పాటు మౌలిక వసతుల కల్పన వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరగడమంటే కేవలం వైద్య విద్యార్థులు చదువుకోవడమే కాకుండా, దీనికి సంబంధించి భారీ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి విభాగంలోనూ యూనిట్లు పెంచాలి. ఒక్కో యూనిట్‌కు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్లు, ఒక ప్రొఫెసర్ ఉండాలి. స్టాఫ్ నర్సులు, ఆపరేషన్ థియేటర్లు పెరుగుతాయి. ఇంటెన్సివ్ కేర్, ఆక్సిజన్ బెడ్స్ విధిగా అందుబాటులోకి తీసుకురావాలి. ఇలా ఒక పీజీ సీటు పెరిగిందంటే చాలా రకాల మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, వైద్యులు పెరిగితే ఆటోమేటిగ్గా ఎక్కువ మంది పేషెంట్లకు స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అందువల్ల త్వరలో పెరగనున్న పీజీ సీట్లతో భారీగా వసతులు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు బలోపేతం జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల మేరకు సీట్లు పెంచుతున్నాం. అదనపు సీట్లతో భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఆయా సీట్లకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు జారీ చేసింది. సీట్లకు సరిపడా ప్రొఫెసర్ల కోసం అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాలలు భారీగా బలోపేతం కానున్నాయి. – డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు -
బోధనాస్పత్రులు మరింత పటిష్టం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీఎత్తున పోస్టులను భర్తీచేయనుంది. ఇప్పటికే 695 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేసిన సర్కారు త్వరలో మరో 355 మందిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకోనుంది. ఇవన్నీ కొత్తగా మంజూరు చేసిన పోస్టులు కావడం గమనార్హం. వీటితో పాటు సుమారు 900 మంది వైద్యేతర అంటే పారా మెడికల్ పోస్టులను కూడా భర్తీ చేయనుంది. దీంతో డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందితో బోధనాసుపత్రులు మరింత పటిష్టం కానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు అస్సలు చేపట్టకపోవడం.. సేవలన్నీ పీపీపీ (ప్రైవేటు, ప్రభుత్వ, భాగస్వామ్యం) పద్ధతిలో ఉండటంతో బోధనాస్పత్రులను పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లేవు. వైద్యుల కొరత ఇక ఉండదు ఇప్పటివరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రధాన లోపం వైద్యుల కొరతే. ఇకపై ఈ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, కొత్తగా ఏర్పాటుచేస్తున్న క్యాన్సర్ బ్లాకులకూ వైద్యులను నియమించనున్నారు. ఇలా పెరుగుతున్న పడకలు, యూనిట్లకు అనుగుణంగా 355 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి వెళ్లింది. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వైద్యవిద్యా వర్గాలు తెలిపాయి. పదోన్నతుల నిరీక్షణకు స్వస్తి ఇదిలా ఉంటే.. కొత్త నియామకాలు లేకపోవడంతో ఏళ్ల తరబడి పనిచేసినా పదోన్నతులు వచ్చేవి కావు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాగానే పాత వారికి వెంటనే అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి వస్తుంది. అలాగే, అసోసియేట్లుగా ఉన్న వారందరికీ ప్రొఫెసర్లుగా పదోన్నతి రానుంది. గతంలో లాగా పదోన్నతుల కోసం దశాబ్దాల తరబడి వేచిచూసే పరిస్థితి ఉండదు. -
3 ఏళ్లు ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేయాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు, కోర్సు పూర్తయ్యాక మూడేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సిందే. దీనికోసం కోర్సులో చేరే సమయంలోనే రూ.50 లక్షల పూచీకత్తు బాండును సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకులు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70వరకూ వివిధ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులున్నాయి. ఈ విద్యార్థుల కోసం సర్కారు భారీగా వ్యయం చేస్తోంది. కనుక పేద ప్రజలకు సేవలందించడంలో భాగంగా సూపర్ స్పెషాలిటీ పూర్తయ్యాక మూడేళ్లపాటు ఇక్కడే సేవలు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి విధానం ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమలు జరుగుతోంది. అడ్మిషన్ సమయంలోనే వైద్యవిద్యార్థుల నుంచి ఆమోదపత్రం తీసుకునే సీటు ఇస్తారు. -
కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది కొత్తగా 56 పీజీ వైద్యసీట్లు మంజూరయ్యాయి. 2020–21 విద్యా సంవత్సరం నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో ఒక్కో సీటు కోట్లు పలుకుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ వైద్య కాలేజీల్లో పీజీ వైద్య సీట్లు పెంచడంపై వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పీజీ వైద్య సీట్లు పెరగాలంటే వసతులు కల్పిస్తేగానీ భారతీయ వైద్య మండలి మంజూరు చేసే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురం మెడికల్ కాలేజీకి 41 సీట్లు మంజూరయ్యాయి. మరో 13 సీట్లు ఎస్వీ మెడికల్ కాలేజీ (తిరుపతికి)కి, మరో 2 సీట్లు గుంటూరు మెడికల్ కాలేజీకి మంజూరయ్యాయి. వీటిలో ఎక్కువ సీట్లు జనరల్ మెడిసిన్ కేటగిరీలో వచ్చాయి. వచ్చే ఏడాది మరో 120 సీట్లు 2021–22కి మరో 120 సీట్లకు దరఖాస్తు చేస్తున్నట్లు వైద్య విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ సీట్ల పెంపునకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వ్యయం చేస్తాయన్నారు. వివిధ కాలేజీల్లో స్పెషాలిటీ కోర్సుల కొరతను బట్టి సీట్లకు దరఖాస్తు చేస్తున్నామన్నారు. పీజీ వైద్య సీట్లు పెరగడంవల్ల వసతులతో పాటు, మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. -
పేదలకు సూపర్ సేవలు
సాక్షి, అమరావతి: పేదలు, సామాన్యులు పైసా ఖర్చు చేయకుండా స్పెషాలిటీ వైద్యసేవలు పొందడం, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పనిలేకుండా సర్కారు ఆస్పత్రులకు జవసత్వాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బోధనాసుపత్రులను ఉన్నతీకరించడం, కొత్త వైద్యకళాశాలలను నిర్మించడం ప్రధాన లక్ష్యంగా భారీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రథమ, ద్వితీయ చికిత్సలకు మాత్రమే అవకాశం ఉంది. పెద్ద ఆపరేషన్లు, చికిత్సలు చేయాలంటే మనకున్న అతిపెద్ద వైద్యవ్యవస్థ బోధనాసుపత్రులే. ఈ నేపథ్యంలో రూ.వేల కోట్లతో వీÐవీటి అభివృద్ధి పనులు టెండర్ల దశకు చేరుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మందులు లేక, ఆస్పత్రుల లేక, వైద్యులు లేక రోగులు బోధనాసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడే రోజుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రులపై భరోసా కల్పిస్తోంది. రాష్ట్రంలో వైద్యవిద్య, బోధనాసుపత్రుల్లో జరుగుతున్న పనులు పరిశీలిస్తే... ► గతంలో ఎసెన్షియల్ మందుల జాబితాలో ఉన్నవి సంపూర్తిగా ఏనాడూ ఇవ్వలేదు. కేవలం 230 రకాల మందులు మాత్రమే దిక్కు. తాజాగా 510 రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర మందులు అందుబాటులో లేవు అన్న మాటే వినిపించకుండా చర్యలు చేపట్టారు. ► అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్పెషలిస్టు డాక్టర్లు లేక పేషెంట్లకు, వైద్య విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తిన పరిస్థితులు ఇక ఉండవు. అన్ని వైద్య కళాశాలలకు 755 అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్యుల నియామకానికి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఏ కాలేజీలోనూ కొరత ఉండదు. స్పెషాలిటీ సేవలు మెరుగుపడతాయి. వైద్యులే కాకుండా 389 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టింది. బోధనాసుపత్రులకు మంచిరోజులు రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. వీటిని నాడు–నేడు కింద రూ.6,100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీంతో వీటికి అనుబంధంగా ఉండే బోధనాసుపత్రులు అభివృద్ధి బాటలో పయనించనున్నాయి. స్పెషాలిటీ ఆస్పత్రులు.. ► రూ.175 కోట్లతో ఏజన్సీలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ► రూ.50 కోట్లతో శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కిడ్నీ రీసెర్చ్ మరియు డయాలసిస్ ఆస్పత్రి ఏర్పాటు ► కడపలో సైకియాట్రీ, క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ బ్లాకుల ఏర్పాటు ► కర్నూలులో ప్రాంతీయ క్యాన్సర్ స్పెషాలిటీ ఆస్పత్రి ► ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కొత్త విభాగాలు ► ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య ఉపకరణాలు కొనుగోలు చేస్తున్నారు ఒకేసారి 16 కాలేజీలు.. చరిత్రలో మొదటిసారి గత సర్కారు ఉన్న ఆస్పత్రులనే ప్రైవేటుకు అప్పజెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ప్రభుత్వాసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టింది. 2007లో ఒకేసారి 4 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిన చరిత్ర §దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిది కాగా.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 16 కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గానికో వైద్య కళాశాల ఉండేలా చర్యలు తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు మొదలు కానున్నాయి. ఈ కళాశాలలను మచిలీపట్నం, అరకు, విజయనగరం, పులివెందుల, అనకాపల్లి, నరసాపురం, రాజమండ్రి, బాపట్ల, రాజంపేట, మార్కాపురం, నంద్యాల, ఏలూరు, గురజాల, హిందూపురం, అమలాపురం, ఆదోనిల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కళాశాలకు సుమారు రూ.400 కోట్లు వ్యయం చేస్తున్నారు. 120 పీజీ వైద్య సీట్లు పెరుగుదల గత ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 120 పీజీ వైద్యసీట్లు పెరిగాయి. ఎక్కువగా జనరల్ మెడిసిన్, గైనకాలజీ సీట్లు పెరిగాయి. ఆర్థోపెడిక్, రేడియాలజీ సీట్లు పెరిగాయి. కర్నూలులో రెండు ¯నియోనెటాలజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు వచ్చాయి. మరిన్ని సీట్లు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. విజయవాడ, అనంతలో సూపర్ స్పెషాలిటీ సేవలు విజయవాడ, అనంతపురం బోధనాసుపత్రుల్లో పీఎంఎస్ఎస్వై కింద రూ.150 కోట్లతో పనులు పూర్తయ్యాయి. రాష్ట్రవాటా చెల్లించకపోవడంతో గతంలో ఈ ఆస్పత్రుల్లో వైద్య ఉపకరణాలు రాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించి ఎక్విప్మెంటు తీసుకొస్తోంది. కోవిడ్ కారణంగా జాప్యం జరిగింది. లేదంటే ఇప్పటికే అమల్లోకి వచ్చేవి. భావి తరాలకు బంగారు బాట... కొత్తగా ఒకేసారి 16 వైద్య కళాశాలలు ఏర్పాటు కానుండటం సాధారణ విషయం కాదు. మూడేళ్లలో ఈ కళాశాలలు పూర్తయితే సుమారు 2వేల సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో వైద్యకళాశాలలో రోజుకు 1,000 మంది ఔట్పేషెంట్ల లెక్కన అదనంగా 16వేల మందికి స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్ తరాలకు ఇది బంగారు బాటే. –డా.కె.వెంకటేష్, వైద్య విద్యా సంచాలకులు -
బోధనాసుపత్రుల్లో పూర్తిస్థాయి వైద్య సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాస్పత్రులు, స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలను పునరుద్ధరించాలని వైద్య విద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఎలెక్టివ్ సర్జికల్ సేవలతో సహా ఆస్పత్రుల్లోని అన్ని సేవలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్క్‌లను ఉపయోగించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి సిబ్బంది సరైన భద్రత చర్యలు తీసుకుని వైద్య సేవలందించాలని కోరారు. రోగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వార్డుల్లో రద్దీ లేకుండా చూడాలని, పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరైనా రోగి కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వస్తే, వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచాలని తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఛాతి ఆస్పత్రులు కరోనా నోడల్ కేంద్రాలుగా ఉంటాయని, సరోజినీ కంటి ఆస్పత్రిలో కొంత భాగం ఐసోలేషన్ సెంటర్‌గా ఉంటుందని వెల్లడించారు. -
మూడు వైద్య కళాశాలలకు కేంద్రం అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మూడు కాలేజీలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్ బిశ్వాస్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించారు. పాడేరు, గురజాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు అనుమతించారు. ఒక్కో కళాశాలకు రూ. 325 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తుంది. ఈ లెక్కన ఒక్కో కళాశాలకు కేంద్రం నుంచి రూ. 195 కోట్ల నిధులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ. 130 కోట్లు వ్యయం చేస్తుంది. త్వరలోనే ఈ మూడు వైద్య కళాశాలలకు సంబంధించి కేంద్రంతో అవగాహనా ఒప్పందం చేసుకుంటామని వైద్య విద్యా సంచాలకులు డా.వెంకటేష్ సాక్షితో అన్నారు. -
పీజీ వైద్య సీట్ల భర్తీకి షెడ్యూల్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పీజీ వైద్య డిగ్రీ, పీజీ డిప్లొమా సీట్ల భర్తీకి కేంద్రం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల పరిధిలో మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు జాతీయ కోటాలో ఉంటాయి. ఈ సీట్లకు ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని షెడ్యూల్లో పేర్కొంది. మొత్తం మూడు రౌండ్లలో సీట్ల భర్తీ జరగనుంది. మూడు రౌండ్లలో చివరిదైన మాప్ అప్ రౌండ్ తర్వాత మే 27లోగా సీట్లలో చేరకపోతే వాటిని ఖాళీ సీట్లుగా గుర్తించి మే 31లోగా భర్తీ చేస్తారు. మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 930 సీట్ల వరకూ పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా సీట్లున్నాయి. వీటిలో 465 సీట్లు జాతీయ కోటాలో ఉంటాయి. వివరాలకు www. mcc. nic. in చూడొచ్చు. సీట్ల భర్తీకి షెడ్యూల్ ఇలా.. -
ఏపీలో మరో 8 వైద్య కళాశాలలు
-
మరో 8 మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే 7 నూతన మెడికల్ కాలేజీలకు డీపీఆర్‌లు సిద్ధం కావడం, శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతుండటం తెలిసిందే. అయితే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక ప్రభుత్వ వైద్యకళాశాల, అనుబంధంగా బోధనాసుపత్రి ఉండాలనే లక్ష్యంతో మరో 8 వైద్య కళాశాలల ఏర్పాటు కోసం భూసేకరణ జరుగుతోంది. 9 నెలల్లో 15 మెడికల్ కాలేజీలు! రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్ నియోజక వర్గాలుండగా ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్యకళాశాలలు మాత్రమే ఉన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే 7 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి గతంలోనే అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా మరో 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో తొమ్మిది నెలల వ్యవధిలోనే 15 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్లైంది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం వైద్య కాలేజీల సంఖ్య 26కి చేరనుంది. 8 నూతన వైద్య కళాశాలలకు భూమి సమకూర్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2014–19 మధ్య రాష్ట్రంలో ఒక్కటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కాకపోవడంతో బోధనాసుపత్రులకు రోగుల తాకిడి తీవ్రంగా పెరిగింది. ఆస్పత్రులను ఉన్నతీకరించి కొత్తవి ఏర్పాటు కొత్త వైద్యకళాశాలలు ఏర్పాటయ్యే చోట ప్రస్తుతం ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. వీటిని 500 పడకల ఆస్పత్రుల స్థాయికి మార్చి ఉన్నతీకరిస్తారు. ఒక్కో వైద్య కళాశాలకు కనీసం 40 – 50 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రోజుకు 1,000 – 1,500 మంది ఔట్పేషెంట్లు వచ్చినా ఇబ్బంది లేకుండా వైద్యసేవలు అందేలా చర్యలు చేపడుతున్నారు. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ వార్డులు తదితరాలు ఏర్పాటవుతాయి. ఒక్కో కళాశాలకు కనీసం 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యేలా అధ్యాపకులు, మౌలిక వసతులను కల్పిస్తారు. ఇప్పటికే 7 వైద్య కళాశాలలకు అనుమతులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే రాష్ట్రంలో కొత్తగా 7 ప్రభుత్వ వైద్యకళాశాలలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీటికి ఇప్పటికే అనుమతులు కూడా మంజూరు చేసింది. గిరిజన ప్రాంతమైన పాడేరుతో పాటు పులివెందుల, గురజాల, మార్కాపురం, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరులో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. గురజాల, మార్కాపురం లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. మార్కాపురం పరిసరాల్లో కిడ్నీ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుకు పీఎంఎస్ఎస్వై (ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన) కింద సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కళాశాల ఏర్పాటు వ్యయంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం ఖర్చు భరిస్తాయి. ఎక్కువ జిల్లాలతో తమిళనాడుకు లబ్ధి తమిళనాడులో ఎక్కువగా జిల్లాలు ఉండటంతో ఆ రాష్ట్రానికి భారీగా లబ్ధి చేకూరింది. తమిళనాడులో 22 ప్రభుత్వ వైద్యకళాశాలలుండగా మన రాష్ట్రంలో 11 మాత్రమే ఉన్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో పద్మావతి మెడికల్ కాలేజీ కొనసాగుతోంది. మన రాష్ట్రం విస్తీర్ణం 160,205 చదరపు కిలోమీటర్లు ఉండగా, తమిళనాడు 130,060 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. -
‘ఈడబ్ల్యూఎస్’కు నేడు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్ లాంటి ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఎట్టకేలకు ఫలించింది. కేంద్రం ప్రవేశపెట్టిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కోటా కింద వైద్య సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లో మార్గం సుగమమైంది. ఈ మేరకు కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఈడబ్ల్యూఎస్ కింద రాష్ట్రానికి పెరిగిన 360 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 29న (సోమవారం) నోటిఫికేషన్ జారీ చేయనుంది. వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారు. సాధారణంగా రిజర్వేషన్ పరిధిలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాలకు ఈ సీట్లు వర్తించవు. కేవలం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికోసమే ఈ సీట్లు కేటాయిస్తారు. కేంద్రం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం తహసీల్దార్ కార్యాలయాల నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కచ్చితంగా పొంది ఉంటేనే సీటుకు అర్హులవుతారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద వరం.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఒక్కసారిగా రాష్ట్రంలో 360 సీట్లు పెరగడం సాధారణ విషయం కాదని, ఇది నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద వరమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా, అందులో 10 కాలేజీలకు సీట్లు పెరిగాయి. ఆంధ్రా మెడికల్ కళాశాల, గుంటూరు మెడికల్ కళాశాల, రంగరాయ మెడికల్ కళాశాల, కర్నూలు మెడికల్ కాలేజీల్లో అత్యధికంగా 50 చొప్పున సీట్లు పెరిగాయి. ఈ సీట్లకు ఇప్పటికే భారతీయ వైద్య మండలి అనుమతి కూడా లభించింది. ఇదివరకే 14 వేల మంది మొత్తం అభ్యర్థులు ఈ ఏడాది సీట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఎవరైనా ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన విద్యార్థులు సాధారణ మెడికల్ కాలేజీలలో ఓపెన్ కేటగిరీ కింద సీటు తీసుకుని ఉన్నా సరే మంచి కాలేజీకి మారవచ్చు. ఇందుకోసం ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మళ్లీ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంబీబీఎస్ సీటు తృటిలో అవకాశం కోల్పోయిన చాలా మంది విద్యార్థులకు ఇప్పుడు సీటు దక్కే అవకాశం ఉంటుంది. వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి ప్రభుత్వం నుంచి ఈడబ్ల్యూఎస్ సీట్ల భర్తీకి ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఈ ప్రక్రియ మొత్తం వారం రోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఈ కోటాలో ఉన్న సీట్లను వారితోనే భర్తీ చేస్తాం. అత్యంత పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. – డా. సీవీ రావు, వైస్ చాన్సలర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
..ఇదీ మెడి‘సీన్’
సాక్షి, హైదరాబాద్ : మెడికల్ కాలేజీల్లో కొత్త విద్యాసంవత్సరం మొదలుకాబోతోంది. ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. కాలేజీలకు వచ్చేందుకు విద్యార్థులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ తరగతులు కచ్చితంగా ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభించాల్సిందే. ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో కొత్తగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు చదువు చెప్పేదెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేటల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అయితే ఆ కాలేజీలకు సంబంధించి పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందే కానీ వాటిని భర్తీ చేయలేదు. మిగిలిన కాలేజీల్లో ఉన్న ఖాళీలను పూరించలేదు. కొత్త కాలేజీల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగకుండా తరగతులు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. ఆ రెండు చోట్లే 1,036 పోస్టులు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2019–20 వైద్య విద్యా సంవత్సరానికి మొత్తంగా 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇవిగాక 10 ప్రైవేటు, ఒక ఆర్మీ, మరో ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 1,106 డెంటల్ సీట్లున్నాయి. గతేడాది కంటే ఈసారి ఏకంగా వెయ్యి ఎంబీబీఎస్ సీట్లు పెరగడం గమనార్హం. ప్రభుత్వంలోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. మూడో విడతలో కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లతోపాటు అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేటాయించిన 190 సీట్లను భర్తీ చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై నీలినీడలు అలుముకున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, నల్లగొండల్లో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం ఇటీవల 1,036 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా, 904 పారామెడికల్, నాన్–మెడికల్ గెజిటెడ్ పోస్టులున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో వైద్య విద్య సంచాలకులు వీటిని భర్తీ చేయాల్సిఉంది. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ మొదలే కాలేదు. దీంతో ఆయా కాలేజీల్లో తరగతులను ఎలా నిర్వహిస్తారన్న దానిపై ఆందోళన నెలకొంది. ఎంహెచ్ఆర్బీ ఉనికిలోకే.. 2017లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా సుమారు 500 డాక్టర్ పోస్టులు, 3,300 స్టాఫ్ నర్సు పోస్టులు, మరో 1,000 పారా మెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా ఆ భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. దీంతో లాభం లేదనుకొని తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ నియామకాలను వేగంగా పూర్తి చేసేందుకు ‘మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఆర్బీ)’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై గతేడాది సెప్టెంబర్‌లోనే జీవో జారీచేశారు. 10నెలలు కావస్తున్నా.. ఇప్పటిదాకా ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఖాళీలు పెరిగిపోతున్నాయి. సరిపడా డాక్టర్లు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పెరుగుతోంది. వేగంగా పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే ఎంహెచ్ఆర్బీని ఏర్పాటు చేసినా.. ఆలస్యం తప్పడంలేదు. బోర్డు చైర్మన్‌గా వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మెంబర్ సెక్రటరీగా, జాయింట్ డైరెక్టర్ హోదా ఉన్న అధికారి సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోర్డులో డిప్యూటీ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, లీగల్ ఆఫీసర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకూ అందరినీ డిప్యుటేషన్‌పై ఇతర శాఖల నుంచి తీసుకోవాలని జీవో సూచించింది. అయినా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరో నాలుగు నెలల వరకు భర్తీ ప్రక్రియ జరిపే అవకాశాలు కనిపించడంలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయంటే అధికార యంత్రాంగ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇదే జరిగితే మెడికల్ కాలేజీలు అధ్యాపకులు లేక వైద్య విద్యా వ్యవస్థ కుంటుపడే ప్రమాదముంది. దీనిపై వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేష్‌రెడ్డి వివరణ కోరగా, బోర్డు ద్వారానే భర్తీల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. -
ఈడబ్ల్యూఎస్ మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణ పేదలకు కేటాయించిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నిర్ణయించింది. మూడో విడత కన్వీనర్ కోటా సీట్లతోపాటే వీటికి కౌన్సెలింగ్ నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లుగా అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల అమలుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడిందని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా ప్రభుత్వంలోని సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్‌తోపాటే అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్ అమలుచేయాల్సి ఉంది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా జరిగాయి. అప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) 190 సీట్లు అదనంగా కేటాయించింది. అంతలోనే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని, ఆ మేరకు సంబంధిత కాలేజీలు అదనపు సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంసీఐ ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈడబ్ల్యూఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాలం గడుస్తున్నా ప్రైవేటు కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లపై ఎంసీఐ స్పష్టత ఇవ్వలేదు. అయితే అప్పటికే వైద్య విద్య ప్రవేశాల గడువు ఆలస్యమైంది. అందువల్ల ప్రభుత్వంలోని ఈడబ్ల్యూఎస్ సీట్లను కూడా పక్కనపెట్టి, మిగిలిన కన్వీనర్ కోటా సీట్లకు ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. ఇప్పుడు ప్రైవేటు మేనేజ్మెంట్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఇంత జరిగినా ఎంసీఐ నుంచి ప్రైవేటు మెడికల్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు, సీట్ల కేటాయింపుపై స్పష్టత రాలేదు. వస్తాయన్న నమ్మకం లేకపోయినా ఎందుకైనా మంచిదని ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటివరకు వేచిచూసింది. అయితే తాజాగా శుక్రవారం శాసనమండలిలో సభ్యులు ఈడబ్ల్యూఎస్ కోటాపై ప్రశ్న సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఎంసీఐ అదనపు సీట్లకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 190 సీట్లకు మూడో విడత కన్వీనర్ కోటా సీట్లతో కలిపి కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. ఆగస్టు మొదటి వారంలో వీటికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. -
ప్రైవేటు వైద్యవిద్యలోనూ ఈడబ్ల్యూఎస్
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణ పేద (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం 10% రిజర్వేషన్లు అమలు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు బుధవారం లేఖ రాసింది. దీనికోసం ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పంపించాలని ఆదేశించింది. అయితే నీట్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15% సీట్లను ఆలిండియా కోటాలో కేంద్రం భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా తమ కన్వీనర్ కోటాలోని ఎంబీబీఎస్ సీట్లలో 15% ఆలిండియా కోటాకు ఇవ్వాలని, అప్పుడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఇదిలావుండగా తెలంగాణలోని కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం 10% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించుకుని ఈ మేరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతంలోనే ఎంసీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అప్పట్లో దీనిపై ఎంసీఐ నిర్ణయం తీసుకోలేదు. దీంతో తాజాగా మరోసారి ఆయా ప్రైవేటు మెడికల్ కాలేజీలతోపాటు ఇతర ప్రైవేటు మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోటాలో పెరగనున్న 281 సీట్లు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2019–20 విద్యాసంవత్సరానికి మొత్తంగా 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఎస్ఐ మెడికల్ కాలేజీతో కలిపి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇటీవల ఎంసీఐ అదనంగా 190 ఎంబీబీఎస్ సీట్లను పెంచింది. ఇక 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4 మైనారిటీ కాలేజీలకు, 2 కొత్త మెడికల్ కాలేజీలకు ఈ కోటా వర్తించదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. అంటే అవి పోగా 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 2,250 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో సగం అంటే 1125 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. వాటిని ఆధారం చేసుకొని 25% సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటా కింద పెంచాల్సి ఉంటుంది. అంటే 281 ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశముంది. అయితే వీటికోసం ఎన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్ జారీచేసింది. ఆ సీట్లకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 28వ తేదీన ముగుస్తుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు ఎలాగన్నదానిపై చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే 11 వేల మంది విద్యార్థులు కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఉన్నవారు సహజంగానే ప్రైవేటులో వచ్చే ఈ కోటా సీట్లకు అర్హులేనని విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి స్పష్టంచేశారు. నోటిఫికేషన్లలోనూ ఆ మేరకు వెసులుబాటుందన్నారు. ముందుకొచ్చే కాలేజీలెన్ని? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకోసం అసలు ఎన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ముందుకు వస్తాయన్నదే అసలైన ప్రశ్న. ఒకవైపు ఆలిండియా కోటాకు 15% సీట్లు ఇవ్వాలన్న షరతు, పైపెచ్చు కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఫీజు ఏడాదికి రూ.60వేలు మాత్రమే కావడంతో తమకేంలాభమన్న వాదన ప్రైవేటు యాజమాన్యాల్లో వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక కాలేజీకి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 25 సీట్లు పెరిగితే వచ్చే ఫీజు ఏడాదికి రూ.15 లక్షలు మాత్రమే. అందుకోసం సీట్లు పెంచుకుని లాభమేంటని వారంటున్నారు. అయితే అదనంగా సీట్లు పెరగడం వల్ల అదే స్థాయిలో పీజీ మెడికల్ సీట్లు కూడా పెరుగుతాయని, కాబట్టి అది ఆయా యాజమాన్యాలకు ప్రయోజనకరంగా ఉంటుం దని వైద్యాధికారులంటున్నారు. ఈ రెండు అంశాలను బేరీజు వేసుకొని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ముందుకు వెళ్లే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. -
అగ్రవర్ణ పేదలకు ‘మెడికల్’లో రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2019–20 వైద్య విద్యా సంవత్సరంలో భర్తీ చేయబోయే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తారు. దీనికి సంబంధించి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, అందుకు అవసరమైన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినందున ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లల్లో అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేకంగా మంజూరయ్యే సీట్లలోనే అమలు చేస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ ఆర్మీ, ఎన్సీసీ, దివ్యాంగులు, మహిళలకు కూడా కోటా కల్పిస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలను కేవలం తెలంగాణలోనే ఉన్న కులాలకే అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంసీఐకి ప్రతిపాదించింది. కానీ దానిపై స్పష్టత రాకపోవడంతో కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లోనే అమలు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. 200 సీట్లు అదనంగా పెరిగే అవకాశం... వాస్తవంగా తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,550 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. పది శాతం రిజర్వేషన్ల అమలుకు ఇతర రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండాలంటే 25 శాతం అదనంగా సీట్లు పెంచాలి. ఆ ప్రకారం తెలంగాణలో ఏకంగా 387 సీట్లు పెరగాలి. కానీ ఉస్మానియా మెడికల్ కాలేజీలో 250 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, అది గరిష్ట పరిమితి వరకు ఉండటంతో అక్కడ మాత్రం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కాదని అంటున్నారు. ఇక ఈఎస్ఐలోని సీట్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోవి కాబట్టి వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం ఇక్కడి ప్రభుత్వానికి లేదు. ఇక నల్లగొండ, సూర్యాపేటలో ఈ ఏడాది నుంచి ప్రారంభం కాబోయే మెడికల్ కాలేజీలకు కూడా ఈడబ్ల్యూఎస్ సీట్లకు అనుమతి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే అక్కడ మంజూరైన సీట్ల మేరకు కూడా ఫ్యాకల్టీ లేదు. ఈ నేపథ్యంలో అదనపు సీట్లకు అనుమతి రావడం కష్టమని అంటున్నారు. అంటే మిగిలిన కాలేజీల్లోని సీట్ల ఆధారంగా చూస్తే అదనపు సీట్లు వచ్చే అవకాశముంది. ఆ ప్రకారం దాదాపు 200 ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఐదెకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉంటే రిజర్వేషన్ వర్తించదు... ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రకులాల్లోని పేదల ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి. ఇక ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంటే అటువంటి వారికి ఈ రిజర్వేషన్ వర్తించదు. ఇంటి స్థలం వెయ్యి చదరపు అడుగులున్నా, నిర్దారించిన మున్సిపాలిటీల్లో 200 చదరపు గజాల స్థలమున్నా అనర్హులే. ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జారీచేయాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వీటికి కూడా ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. -
సీఎం ఆమోద ముద్ర
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10% రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అనంతరం సంబంధిత ఫైలుపై ఉన్నతాధికారుల సంతకం కూడా పూర్తయింది. ఆ ఫైలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతకం తీసుకొని తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి. 2019–20 వైద్య విద్యా ఏడాదిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. 10% రిజర్వేషన్ల అమలుకు 25% సీట్ల పెంపు తప్పనిసరి కావడంతో ఆ మేరకు ప్రతిపాదలను పంపాలని కోరింది. దీంతో రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దాదాపు 312 ఎంబీబీఎస్ అదనపు సీట్లకు ప్రతిపాదనలు పంపారు. ఈ సీట్ల పెంపునకు కూడా ఎంసీఐ తాజాగా సుము ఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆరోగ్య వర్సిటీ ఎదురుచూపు.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వారం కిందటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది. ఆ మేరకు సన్నాహాలు జరిగాయి. కానీ వివిధ కారణాలతో అప్పుడు ఉత్తర్వులు జారీకాలేదు. నీట్ ఫలితాలు వచ్చి అఖిల భారత కోటా సీట్లకు కౌన్సెలింగ్ కూడా బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా విద్యార్థుల చేతికి వచ్చాయి. దీంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాల్సిన ఆరోగ్య వర్సిటీ ప్రభుత్వ ఉత్తర్వుల కోసమే ఎదురుచూస్తోంది. ఉత్తర్వులు రాకుండా నోటిఫికేషన్ జారీచేస్తే రిజర్వేషన్లు ఈ ఏడాదికి అమలు కాకుండా పోతాయి. వైద్య ఆరోగ్యశాఖలో కొందరు అధికారుల తీరువల్ల ఉత్తర్వుల జారీ కాస్తంత ఆలస్యమైందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సీఎం ఆమోదం తెలపడంతో ఉత్తర్వులు రానున్నాయి. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ.. ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులో ప్రధానంగా అమలుతీరుపైనే మార్గదర్శకాలు ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉంటుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఈ మేరకు ఆదేశాలిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అఖిల భారత సీట్లలో చేరే విద్యార్థుల కోసం ఈడబ్ల్యూఎస్ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీ సీట్ల భర్తీకి తాజాగా ధ్రువీకరణ పత్రాలు జారీచేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వమూ రూ.8 లక్షల లోపు ఆదాయమే నిర్ణయిస్తే, ఇప్పటికే కేంద్ర సీట్ల కోసం తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు అవుతాయా లేదా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను ఎలా ఇవ్వాలి.. ఎవరు ఇవ్వాలి.. అనే అంశాలపైనా మార్గదర్శకాల్లో సర్కారు స్పష్టత ఇచ్చే అవకాశముంది. -
బోధన వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు శుభవార్త. వారికి ఇక నుంచి నిర్ణీతకాలంలో పదోన్నతులు లభిస్తాయి. దీనికి సంబంధించి సవరణ ఉత్తర్వులను వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం జారీ చేశారు. వాస్తవంగా గతేడాదే ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా.. సాంకేతిక కారణాల వల్ల అది అమలుకాలేదు. ఆ తర్వాత వరుసగా ఎన్నికలు రావడంతో ఇప్పటివరకు ఆ ఉత్తర్వులు సవరణకు నోచుకోలేదు. సవరణలు కోరుతూ వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం (సీఏఎస్) కింద దీన్ని అమలు చేస్తారు. 2006 నవంబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అప్పటినుంచి సర్వీసును మాత్రమే లెక్కలోకి తీసుకుంటామని, అయితే ఆర్థికపరంగా ఎలాంటి ప్రయోజనం కల్పించబోమని స్పష్టం చేశారు. కేవలం గతేడాది ఉత్తర్వులు విడుదలైన తేదీ అంటే సెప్టెంబర్ 5 నుంచి మాత్రమే ఆర్థికపరమైన ప్రయోజనాలు అందుతాయి. 2006 నుంచి అమలు చేయడమంటే అప్పటినుంచి సర్వీసులో ఉన్న బోధనా వైద్యులకు పదోన్నతులు మాత్రం అమల్లోకి వస్తాయన్నమాట. తాజా నిర్ణయం ప్రకారం బోధనాసుపత్రుల్లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీసు నాలుగేళ్లు నిండితే యథావిధిగా వారికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆరేళ్లు సర్వీసు నిండితే యథావిధిగా వారికి ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లకు మూడేళ్లు నిండాక వారికి స్కేల్లో మార్పు తీసుకొస్తారు. అంటే వారికి మధ్యలో ఒక ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు. పదోన్నతుల కోసం ఎదురుచూపు.. ప్రస్తుతం పదోన్నతులు అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైర్ అయ్యాకే పదోన్నతులు లభిస్తున్నాయి. దీనివల్ల ఖాళీలు కొన్నే ఉంటే కొందరికి అవకాశమున్నా మరికొందరికి పదోన్నతులు లభించవు. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వచ్చినవారు కూడా ఉన్నారు. మరికొందరికైతే 20 ఏళ్లకు గాని పదోన్నతి వచ్చిన పరిస్థితి లేదు. ఇది వైద్యుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలుచేస్తున్నాయి. తాజా నిర్ణయంతో బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది వైద్యులకు ప్రయోజనం కలుగనుందని సమాచారం. అంతేకాదు వారికి పదోన్నతి వచ్చిన ప్రతీసారి కూడా స్కేల్స్‌లోనూ మార్పులుంటాయి. అంటే ఆర్థికంగా వారికి మరింత ప్రయోజనం కలగనుంది. 65 ఏళ్ల విరమణపై ఆర్డినెన్స్‌కు కసరత్తు.. బోధనా వైద్యులకు విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న సర్కారు నిర్ణయం అమలుకు సంబంధించి శరవేగంగా ఆర్డినెన్స్ జారీచేసే పని జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో ఆర్డినెన్స్ వస్తుందని ఉన్నతాధికారులు అంటున్నారు. కొందరైతే దీనికి సంబంధించి గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ఫైలు వెళ్లిందని చెబుతున్నారు. అయితే అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు పొక్కడంలేదు. విరమణ వయసు పెంపును వ్యతిరేకిస్తూ ఇప్పటికే జూడాలు, కొందరు డాక్టర్లు, ప్రభుత్వ వైద్యుల సంఘాల్లో కొన్ని ఇప్పటికే నిరసనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు ఆర్డినెన్స్ తెస్తుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. మార్పు హోదాలోనే.. పనిలో కాదు ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా మధ్యమధ్యలో స్కేల్స్‌లోనూ నిర్ణీత సమయం ప్రకారం మార్పులు జరుగుతుంటాయి. ఇక వైద్యులకు ఖాళీలు లేకపోయినా నిర్ణీత కాలంలో పదోన్నతులు ఇవ్వడం వల్ల ఒక్కోసారి వారి హోదా మారుతుందే కానీ పనిలో మార్పు ఉండదు. ఖాళీలు ఏర్పడ్డాకే వారు భౌతికంగా ఇతర పోస్టులకు మారతారు. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఖాళీలు లేకపోయినా నాలుగేళ్లకు అసోసియేట్‌గా పదోన్నతి లభిస్తే, అతను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానే విధులు నిర్వహిస్తారు. అక్కడ ఖాళీ ఏర్పడితేనే అతని విధులు మారుతాయి. -
బోధనాస్పత్రుల్లో వైద్యుల వయోపరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోని అధ్యాపకులు, అనుబంధ ఆస్పత్రిలోని వైద్యుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచాలని సర్కారు నిర్ణయించింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా 58 ఏళ్లు మాత్రమే వయో పరిమితిగా ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరి వ యోపరిమితిని 65 ఏళ్లకు పెంచాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తర్వాత దాని అమ లు ఆలస్యం కావడం, ఈలోగా ఎన్నికలకు వెళ్లడంతో వయోపరిమితి పెంపు నిలిచిపోయింది. ఈ నేపథ్యం లో గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని వైద్యులు ఒత్తిడి చేస్తున్నారు. పైగా బోధనాస్పత్రుల్లో ఏటా రిటైరయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది 57 మంది సీనియర్ అధ్యాపకులు రిటైర్ అవుతున్నారు. అందుకు తగినట్టుగా అధ్యాపకుల భర్తీ జరగకపోవడంతో వైద్య విద్య సంకటంలో పడింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తనిఖీలకు వచ్చినపుడు బోధనా సిబ్బంది లేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీట్లు కోల్పోయిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో వారికి వయోపరిమితిని 65కు పెంచాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపాయి. -
నేడే ‘నీట్’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనుంది. ఫలితాలు https://ntaneet.nic.in/,https://www.mcc.nic.in/లో పొందవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2019–20 విద్య సంవత్సరంలో ప్రవేశాలకు మే 5న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జనరల్ కేటగిరీకి 50%, ఎస్సీ, ఎస్టీ 40% పర్సంటైల్, దివ్యాంగులకు 45% పర్సంటైల్‌ను అర్హత మార్కులుగా నిర్ణయించామని తెలిపింది. నీట్ అర్హత అనంతరం కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తారు. నీట్లో అర్హత సాధించిన వారి లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించారు. రాష్ట్రంలో 1,550 ఎంబీబీఎస్ సీట్లు.. అఖిల భారత స్థాయిలో ఫలితాల వెల్లడి అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను రాష్ట్రాలకు పంపిస్తారు. జాతీయ ర్యాంకుల ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థులకు అఖిల భారత ఉమ్మడి కోటాలో ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అనంతరం కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో సీట్ల భర్తీ జరుగుతుంది. విద్యార్థులు అఖిల భారత ఉమ్మడి కోటాకు, రాష్ట్ర స్థాయి ప్రవేశాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లకూ నీట్ ర్యాంకులే ఆధారం. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,550 ఎంబీబీఎస్ సీట్లుండగా.. వీటిల్లో 15 శాతం సీట్లను ఉమ్మడి కోటాకు కేటాయించాలి. అఖిల భారత ఉమ్మడి కోటా ప్రవేశాల ప్రక్రియ ఈ నెల రెండో వారం ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ప్రవేశాలను నిర్వహిస్తారు. ఈసారి నీట్ ప్రవేశ పరీక్ష సులువుగా ఉండటంతో అర్హత మార్కులు కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు అంటున్నారు. గతేడాదితో పోలిస్తే 20 నుంచి 25 వరకు అర్హత మార్కులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. 720 నీట్ మార్కులకు గాను, గతేడాది జనరల్ కేటగిరీలో అర్హత మార్కు 105గా ఉంది. ఈసారి 125 నుంచి 130 మార్కుల వరకు పెరిగే అవకాశముందని అంటున్నారు. అలాగే ఆలిండియా టాప్ వెయ్యి ర్యాంకులు సాధించిన విద్యార్థుల మార్కులు 650పైనే ఉండేది. అదీ ఈసారి పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. -
ఎంబీబీఎస్ సీట్లల్లో ఈడబ్ల్యూఎస్ కోటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ల కోటా అమలుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఈ నెల ఆరో తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని కోరింది. ఈడబ్ల్యూఎస్ కోటాను ఈ వైద్య విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ల భర్తీలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలు చేయాలంటే 25 శాతం ఎంబీబీఎస్ సీట్లను పెంచాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినకుండా కోటా నీట్ రాసి ఫలితాలకోసం ఎదురుచూస్తున్న అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్‌తో ఎంతో ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరగగా, మరో 387 సీట్లు కూడా వాటికి తోడు కానున్నాయి. ఈ రిజర్వేషన్లు కల్పించాలంటే సీట్ల సంఖ్య పెంపు తప్పనిసరి. జనరల్ కోటా సీట్లు తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,550 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో పదిశాతం సీట్లు అంటే 155 సీట్లు పెంచితే సరిపోతుంది అనుకుంటాం. కానీ మొత్తం సీట్ల సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పాటించాలన్న మరో నిబంధన ఉంది. లెక్క ప్రకారం 49 శాతం సీట్లు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్‌లోకి వెళ్లాలి. ఇలాగాకుండా ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం సీట్లు వదిలేసి, మిగతా 90 శాతం సీట్లలో 49 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేస్తే వారికి సీట్లు తగ్గుతాయి. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం. రిజర్వేషన్ల స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేయాల్సి ఉంది. -
దేశవ్యాప్తంగా నేడు నీట్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్)ను నేడు (ఆదివారం) నిర్వహించనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, రాజమండ్రిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 49,210 మంది, తెలంగాణలో 50,856 మంది నీట్ రాస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల లోపలికి ఉదయం 7.30 నుంచి 9.30 గంటల్లోపు చేరుకోవాలి. ఆ తర్వాత వచ్చినవారిని లోపలికి అనుమతించరు. దేశవ్యాప్తంగా దాదాపు 13,26,725 మంది పరీక్షకు హాజరవుతున్నారని సీబీఎస్ఈ తెలిపింది. నిబంధనలివే.. నేడు నిర్వహించనున్న నీట్‌కు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా, పొరపాట్లకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు అభ్యర్థులు ఎలాంటి ఆభరణాలు ధరించకూడదని, రింగులు, చైన్లు, వాచీలు నిషిద్ధమని చెప్పారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువు (ఫోన్లు, ట్యాబ్‌లు, బ్లూటూత్‌లు, కాలిక్యులేటర్లు)లను అనుమతించబోమని వెల్లడించారు. అమ్మాయిలు జడ వేసుకుని పరీక్షకు రావాలని పేర్కొన్నారు. అబ్బాయిలు ఫార్మల్ డ్రెస్‌లో రావాలని బిగుతుగా ఉన్న జీన్స్ ధరించకూడదన్నారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా బూట్లు ధరించి పరీక్షకు రాకూడదని తెలిపారు. పరీక్ష రాయడానికి పెన్ను, పెన్సిల్‌ను కూడా నిర్వాహకులే ఇస్తారని చెప్పారు. ఈ ఏడాది జాతీయ పూల్‌లో.. ఈ ఏడాది ఒక్క జమ్మూకశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలు జాతీయ పూల్‌లోకి వచ్చాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం జాతీయ పూల్‌కు ఇస్తే.. మిగతా రాష్ట్రాలు ఇచ్చే సీట్లలో మనమూ పోటీ పడొచ్చు. మన రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో 1900 సీట్లు, ప్రైవేటులో 2200కు పైగా సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 1900 సీట్లలో 15 శాతం సీట్లు జాతీయ పూల్ కోటా కింద ఇస్తారు. దేశవ్యాప్తంగా 52,105 ఎంబీబీఎస్ సీట్లుండగా అందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 27,710 సీట్లున్నాయి. ఇందులో 15 శాతం అంటే 4,157 సీట్లు వస్తాయి. ఏపీ నుంచి మరో 285 సీట్లు కలిపితే మొత్తం 4,442 సీట్లు అందుబాటులో ఉంటాయి. -
‘నెక్ట్స్’ పరీక్ష అవసరం లేదు!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికి జాతీయ స్థారుులో ‘నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్)’ పేరిట మరో అర్హత పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ‘నెక్ట్స్’లో ఉత్తీర్ణులైతేనే వారు ప్రాక్టీస్ చేసేం దుకు అనుమతించే (రిజిస్ట్రేషన్ చేసే) అంశం ఏమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది. దానివల్ల జాతీయ స్థారుులో వైద్య విద్య నిర్వహణపై ప్రజలకు నమ్మకం పోతుందని పేర్కొంది. వైద్య విద్యకు సంబంధించి పలు ప్రతిపాదనలు రూపొందించిన కేంద్రం... వాటిపై రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ ఇటీవల చెక్ లిస్ట్ పంపిన సంగతి తెలిసిందే. ఈ చెక్లిస్టులపై కేంద్రం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరె న్స కూడా నిర్వహించింది. ఇందులో తెలంగాణ వైద్యాధికారులు కేంద్రానికి తమ అభిప్రాయాలను వివరించారు. ఎంబీబీఎస్ పరీక్ష పత్రాలను ఆరోగ్య విశ్వవిద్యాలయమే తయారు చేసి పరీక్ష నిర్వహిస్తుందని, అనంతరం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోనే మూల్యాంకనం చేస్తారని... ఇంత పకడ్బందీగా పరీక్ష జరుగుతున్నప్పుడు ‘నెక్ట్స్’ అవసరం ఏముంటుందని రాష్ట్ర అధికారులు ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ‘నెక్ట్స్’ను కచ్చితంగా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. విరమణ వయసుపై అస్పష్టత ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు సహా ఇతర వైద్య అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 70 ఏళ్లకు పెంచే విషయంపై కేంద్రం అభిప్రాయం కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని తెలియజేయలేదు. తదుపరి జరిగే సమావేశంలో దీనిపై అభిప్రాయం వెల్లడిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలు వైద్య అధ్యాపకుల విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు అమలు చేస్తున్నారుు. రాష్ట్రంలో మాత్రం ఇది 58 ఏళ్లుగా మాత్రమే ఉంది. దీనిపై రాష్ట్ర వైద్య వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. అరుుతే వైద్య అధ్యాపకుల విరమణ వయసు పెంచితే ఇతర ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తుందన్న భయంలో తెలంగాణ సర్కారు ఉంది. వైద్య విద్యకు సంబంధించి కేంద్రం తదుపరి ఢిల్లీలో ఒక వర్క్‌షాప్ నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రచించనుంది. వైద్య ప్రవేశాలకు ఒకే కౌన్సెలింగ్ ‘నీట్’ పరీక్ష తదనంతరం రాష్ట్ర స్థారుులో ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాల కోసం ఒకే కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ఈ ఏడాది నుంచి నీట్ ద్వారా ప్రవేశాలు ప్రారంభమైనా కౌన్సెలింగ్‌లు మాత్రం వేర్వేరుగా జరిగారుు. బీ కేటగిరీ సీట్లకు నాన్ మైనారిటీ కాలేజీలు ప్రత్యేకంగా ఒక కౌన్సెలింగ్ నిర్వహించగా.. మైనారిటీ కాలేజీలు మరో కౌన్సెలింగ్ నిర్వహించారుు. అలాగే ఎంసెట్ ఆధారంగా ఈసారి ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లకు మరో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇలా వేర్వేరుగా కాకుండా ఒకే కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్యాధికారులు కేంద్రాన్ని కోరారు. అలాగే నీట్ పరీక్షను తెలుగు మీడియంలోనూ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. -
నేటి నుంచి ‘మెడికల్’ తరగతులు
* మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు దక్కిన విద్యార్థులు హాజరు * నేడు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ తొలి ఏడాది తరగతులు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో ఎంపికైన వారికి కాలేజీల వారీగా సీట్లు కేటాయించిన అధికారులు తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కానున్న మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనూ తరగతులు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటులోని కన్వీనర్ కోటాలో ఉన్న 2,075 ఎంబీబీఎస్ సీట్లకు, అలాగే 12 డెంటల్ కాలేజీల్లోని 606 సీట్లను (స్పోర్ట్స్, ఎన్సీసీ, మిలటరీ కోటా మినహాయించి) విద్యార్థులకు కేటాయించారు. వీటిల్లో 70 ఎంబీబీఎస్, 200 బీడీఎస్ సీట్లల్లో విద్యార్థులు చేరనందున మిగిలాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వాటికి రెండో విడత వెబ్‌కౌన్సెలింగ్ సోమవారం నిర్వహించి, 27న సీట్ల కేటాయింపు చేస్తామన్నారు. కాగా, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. వాటిల్లో అన్ని ఎంబీబీఎస్ సీట్లు భర్తీ కాగా.. 92 బీడీఎస్ సీట్లు మిగిలినట్లు కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా వైద్య అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
నేటి నుంచి ‘మెడికల్’ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను గురువారం విద్యార్థులకు కేటాయించారు. రెండ్రోజులపాటు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లను ఎంచుకున్న విద్యార్థులకు సీటు పొందిన కాలేజీ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలిపారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్సైట్లో కాలేజీలు, సీట్ల జాబితా వివరాలు అందుబాటులో ఉంచారు. 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటులోని కన్వీనర్ కోటాలో ఉన్న 2,075 ఎంబీబీఎస్ సీట్లను, అలాగే 12 డెంటల్ కాలేజీల్లోని 606 సీట్లను (స్పోర్ట్స్, ఎన్సీసీ, మిలటరీ కోటా మినహా) భర్తీ చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు శుక్రవారం నుంచి ఈ నెల 25 మధ్యాహ్నం 2 గంటల వరకు కాలేజీల్లో చేరవచ్చని, మరుసటి రోజు నుంచే (26వ తేదీ) తరగతులు ప్రారంభమవుతాయని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్, మిలటరీకి ఒక శాతం, ఎన్సీసీకి 0.5 శాతం సీట్ల కేటాయింపు చేయాల్సి ఉందని.. ఆ ప్రక్రియ కొద్దిగా ఆలస్యమవుతుందని వెల్లడించారు. ఎంసెట్-3లో మొదటి ర్యాంకర్ రేగళ్ల ప్రపుళ్ల మానస ఉస్మానియా మెడికల్ కాలేజీలో, రెండో ర్యాంకర్ పి.శ్రీహారిక గాంధీ మెడికల్ కాలేజీలో, మూడో ర్యాంకర్ తప్పెట తేజస్విని, నాలుగో ర్యాంకర్ జీషాన్ అహ్మద్ జలీలి, ఐదో ర్యాంకర్ ఇక్రమ్ ఖాన్లు ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు పొందారన్నారు. ఆరో ర్యాంకర్ అడ్ల శ్రీకంఠేశ్వర్రెడ్డి గాంధీ మెడికల్ కాలేజీ, ఏడో ర్యాంకర్ మిట్టపల్లి అలేఖ్య, ఎనిమిదో ర్యాంకర్ నుజాత్ ఫాతిమా ఉస్మానియా మెడికల్ కాలేజీ, తొమ్మిదో ర్యాంకర్ కావ్య బలుసు, పదో ర్యాంకర్ వెంపటి రూపీష్ గాంధీలో సీటు పొందారు. ఓపెన్‌లో కటాఫ్ 1,205, ఎస్సీలో 7,125 రెండ్రోజులపాటు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్‌లో 11,866 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆప్షన్లు ఇచ్చిన వారి వివరాలను పరిశీలించిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు గురువారం కట్ ఆఫ్ ర్యాంకు వివరాలు ప్రకటించారు. ఓపెన్ కేటగిరీలో 1,205 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 7,125 ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. ఎస్టీ కేటగిరీలో 5,582, బీసీ ‘ఎ’లో 5,765, బీసీ ‘బి’లో 2,359, బీసీ ‘సి’లో 3,582, బీసీ ‘డి’లో 2,477, బీసీ ‘ఇ’లో 2,582 ర్యాంకుల వరకు కట్ ఆఫ్ వచ్చింది. ‘ఉస్మానియా’లో బీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ రాష్ట్రంలోని 14 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,050 ఎంబీబీఎస్ సీట్లుండగా అందులో 713 బీ కేటగిరీ సీట్లు ఉన్నాయి. వాటికి ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. శుక్ర, శనివారాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దూర విద్యా కేంద్రం లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి రోజు 9 గంటలకు 1 నుంచి 500 సీరియల్ నంబరు గల విద్యార్థులు, మధ్యాహ్నం 2 గం. నుంచి 500-1,000 నంబర్ విద్యార్థులు హాజరు కావాలని ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తెలిపాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి 1,001-2,000 నంబర్ విద్యార్థులు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 2,001-4,101 నంబర్ విద్యార్థులు హాజరుకావాలని పేర్కొన్నాయి. -
వైద్య విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ రవిరాజ్ విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించడంతోపాటు విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేయాలన్న నిర్ణయానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలి 220వ సమావేశం మంగళవారమిక్కడ జరిగింది. వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాల కొండయ్య, డీఎంఈ టి.వేణుగోపాలరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ సోమరాజు పాల్గొన్నారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. వైద్యవిద్యకు సంబంధించిన కోర్సును లోడు చేసిన ట్యాబ్‌లను ఫస్టియర్ నుంచి థర్డ్ ఇయర్ విద్యార్థులకు అందజేయాలని నిర్ణయించామన్నారు. అన్ని వైద్య కళాశాలల్లో వైఫై సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వర్సిటీ రిజిస్ట్రార్ నియామకంపై చర్చించామని, తుది నిర్ణయాన్ని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ పోస్టుకు పదిమంది దరఖాస్తు చేసుకోగా, నలుగురికి తగిన అర్హతలున్నట్లు వెల్లడించారు. -
స్పెషలిస్టు వైద్యుల భర్తీ
వారంలోగా నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: వారంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, వైద్య విధాన పరిషత్‌లోని ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలకానుంది. 80 శాతం వైద్య కళాశాలల్లో 30 శాతం అధ్యాపకుల కొరత ఉన్నట్టు తేలింది. దీంతో ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణ(రెన్యువల్) ప్రక్రియకు ఎంసీఐ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వారంలో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు వైద్య విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. 340 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. ఈ కళాశాలల్లో 340 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను గుర్తించారు. వివిధ విభాగాల్లో పీజీ పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులు. ఒక్కో అభ్యర్థి నుంచీ దరఖాస్తుకు రూ.1000 వసూలు చేస్తారు. వైద్య విధానపరిషత్, డెరైక్టర్ ఆఫ్ హెల్త్ విభాగాల్లో పనిచేస్తూ పీజీ వైద్య విద్య పూర్తిచేసిన 250 మందిని లాటరల్ ఎంట్రీ పేరుతో ఇన్‌సర్వీస్ అభ్యర్థులను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ ఇస్తున్నది కేవలం కొత్త అభ్యర్థులకు మాత్రమే. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 8 వేల మంది పీజీ చేసి నిరుద్యోగులుగా ఉన్నట్టు అంచనా. 200 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్న ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో 200కు పైగా సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) పోస్టులను నియమించాలని నిర్ణయించారు. తొలిసారి ఆన్లైన్లో భర్తీ గతంలో జరిగిన అక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ మారు వైద్య విద్యాశాఖ ఆన్లైన్లో పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్) ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. -
ప్రైవేట్‌కే వైద్యకళాశాల
సాక్షి ప్రతినిధి, విజయనగరం :రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళిని విజ్ఞప్తిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామం త్రి కామినేని శ్రీనివాసరావు పట్టించుకోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయాలన్న జిల్లా మంత్రి విన్నపాన్ని నిర్మొహమాటంగా తోసిపుచ్చా రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోఏర్పాటు చేయలేమని, జిల్లాలో విద్యాపరంగా విశేష సేవలందిస్తున్న మాన్సా న్ ట్రస్టుకు మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇస్తామని తెగేసి చెప్పేశారు. భవి ష్యత్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని దాట వేశారు. ఇందుకు జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన ప్రెస్‌మీట్ వేదికైంది. జిల్లా కు ఒకటిచొప్పున విజయనగరంలో కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వా త ఆమాట నిలబెట్టుకుంటుందని జిల్లా ప్రజలు ఆశిం చారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృణాళిని కూడా డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు రిప్రజెంటేషన్ ఇచ్చా రు. డీఎంఈ అధికారులు కూడా పతిపాదనలు రూ పొందించారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు సరిపడా 25 ఎకరాల భూమి విజయనగరం ఘోషా ఆస్పత్రి, పెదాస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఉందని, రూ.400 కోట్ల మేర నిధులు మంజూరు చేస్తే సరిపోతుందని ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ సర్కార్ సానుకూలత కనబరచలేదు. ప్రభుత్వంకన్నా ప్రైవేటే ముద్దు అని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కానీ ప్రభుత్వం పునరాలోచనచేస్తుందని జిల్లాప్రజలతో పాటు టీడీపీ ప్రజా ప్రతినిధులు కూడా ఆశించారు. అయితే, గురువారం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసరా వు చేసిన ప్రకటనతో ఆ ఆశలు పటాపంచలయ్యాయి. ఎలాగైనా ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయించాలన్న లక్ష్యంతో అడుగులేసిన జిల్లా మంత్రి మృణాళినికి ప్రతికూల పరిస్థితి ఎదురైంది. ప్రైవేటు కన్న ప్రభుత్వ వైద్య కళాశాలైతే మంచిదని, నిధులు కూడా ఒక్కసారి విడుదల చేయనక్కర్లేదని, దశల వారీగా మంజూరు చేస్తే అంచలంచెలుగా మెడికల్ కళాశాల జిల్లా ప్రజలకు చేరువవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి విజ్ఞప్తి పూర్వకంగా జిల్లా మంత్రి మృణాళిని కోరారు. కానీ ఆ పరిస్థితి లేదని, రూ.400కోట్లు వెచ్చించలేమని, ప్రైవేటు వైద్య కళాశాల ఏర్పాటుకు ముందుకొచ్చిన మాన్సాస్ ట్రస్టుకు అనుమతిస్తామని వైద్య మంత్రి తెగేసి చెప్పేశారు. దీంతో మంత్రి మృణాళినితో పాటు జిల్లా ప్రజలు నిరాశకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. పేద విద్యార్థులకు అందని ద్రాక్షే! మాన్సాస్ ట్రస్టు విద్యా పరంగా మెరుగైన సేవలే అంది స్తోంది. కాకపోతే ప్రైవేటు యాజమాన్యం కావడంతో ఇందులో చదవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక స్థోమత కలిగి ఉండాలి. అలాగే, రోగులు కూడా వైద్యం కోసం ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తుంది. అంతేకాకుం డా జిల్లాలో ఇప్పటికే ఒక ప్రైవేటు వైద్యకళాశాల ఉంది. తాజాగా వస్తున్న రెండోది ప్రైవేటుకే కట్టబెడుతుండటంతో సర్కార్ కళాశాలకు జిల్లా దూరమయ్యే పరిస్థితి ఏర్పడనుంది. అలాగే సర్కార్ కళాశాలలో రూ.10వేల ఫీజుకే వైద్య విద్యను చదువుకోవచ్చు. ప్రైవేటు కళాశాలైతే ఏ కేటగిరీలో రూ.60వేలు, బీ కేటగిరిలో రూ.2.40లక్షలు, సీ కేటగిరిలో రూ.5.50లక్షలు వరకు ఫీజులు చెల్లిం చవలసి వస్తుంది. ఇక యాజమాన్యం కోటా కిందైతే చెప్పనక్కర్లేదు. వారి ఇష్టానుసారం ఫీజు పెంచుకుని పోతారు. మొత్తానికి పక్కనున్న శ్రీకాకుళంలోనూ, పొ రుగునున్న విశాఖలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలుం టే మన జిల్లాలో ప్రైవేటే దిక్కయ్యే దుస్థితి ఏర్పడింది. -
త్వరలో ఆన్లైన్ ఆపరేషన్
దేశంలో టెలిమెడిసిన్ ప్రాజెక్టు 35 వైద్య కళాశాలల్లో ఏర్పాటు తొలిదశలో ఏపీలో ఎస్వీ, రంగరాయ కళాశాలలు రెండో దశలో ఉస్మానియా హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తొలిసారిగా టెలిమెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. అన్ని ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటినీ అనుసంధానించాలని నిర్ణయించింది. తొలి దశలో సుమారు 13 రాష్ట్రాల్లోని 35 కళాశాలలను టెలి మెడిసిన్ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. నేషనల్ మెడికల్ కాలేజెస్ నెట్వర్క్ (ఎన్ఎంసీఎన్) కింద ఈ కళాశాలలన్నీ పనిచేస్తాయి. తొలి దశ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా మెడికల్ కళాశాల, కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. రెండో దశలో తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కళాశాలను అనుసంధానిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన రెండు కళాశాలలకు ఇద్దరు నోడల్ అధికారులను నియమిస్తారు. వైద్య విద్య సంచాలకుల కార్యాలయం నుంచి రాష్ట్రస్థాయి నోడల్ అధికారిగా ఒకరు ఉంటారు. రాష్ట్రస్థాయి అధికారి టెలి మెడిసిన్‌ను పర్యవేక్షిస్తారు. దీనికి సంబంధించిన సాంకేతిక సంపత్తిని రెండు నెలల్లోగా ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి టెలిమెడిసిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. టెలిమెడిసిన్ ఉపయోగాలివీ.. ► ఒక్కో కళాశాలలో ఒక్కో విధమైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇకపై మెరుగైన వైద్య ఫలితాలు వచ్చిన కళాశాలల్లో అమలవుతున్న విధానాలను టెలి మెడిసిన్ ద్వారా మిగతా కళాశాలలకు వివరిస్తారు ► కొన్ని కళాశాలల్లో నిపుణులైన వైద్యులున్నారు. వీరిలో చాలామంది వారి నైపుణ్యాన్ని ఉపయోగించి సూక్ష్మ పద్ధతిలో శస్త్రచికిత్సలు చేస్తారు. ఇలాంటి పద్ధతులను నెట్‌వర్క్‌కు అనుసంధానించి వాటిని అన్ని కళాశాలల్లో అవలంబించేలా చేస్తారు. ఉదాహరణకు రాజస్థాన్‌లో ఓ రోగికి శస్త్రచికిత్స చేసేందుకు హైదరాబాద్‌లో ఉన్న వైద్యులు టెలి మెడిసిన్ ద్వారా సూచనలిస్తారు. ఈ సూచనలను అనుసరించి అక్కడి వైద్యులు లైవ్‌లో ఆపరేషన్ నిర్వహించేందుకు వీలుంటుంది. ► చాలా చోట్ల క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా చేస్తున్నారు. అయితే, అవి ఆ ఆస్పత్రికో, ఆ ప్రాంతానికో పరిమితమవుతున్నాయి. ఇదే విధమైన వ్యాధులకు మిగతా చోట్ల ఈ తరహా శస్త్రచికిత్సలు అందడంలేదు. దీంతో రోగులు ఇబ్బంది పడటమో, ఇతర ఆస్పత్రులకు వెళ్లడమో జరుగుతోంది. ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా క్లిష్టమైన శస్త్రచికిత్సలు జరుగుతున్న సమయంలో టెలిమెడిసిన్ ద్వారా ఆయా వైద్య కళాశాలలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. తద్వారా ఇదే విధమైన శస్త్ర చికిత్సలు అన్ని ఆస్పత్రులకు అందుబాటులోకి వస్తాయి. ► ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్ తదితర పరీక్షల నిర్ధారణలో ఒక కళాశాల అనుసరిస్తున్న తీరును ఇతర కళాశాలలకు వివరిస్తారు. ► ప్రస్తుతం ఒకే వ్యాధికి ఒక్కో పేషెంటుకు వైద్యులు ఒక్కో రకమైన వైద్యం చేస్తున్నారు. అలా కాకుండా స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ (ఎస్జీటీ)ని టెలి మెడిసిన్ ద్వారా అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. -
ఉస్మానియాకు అదనంగా 50 ఎంబీబీఎస్ సీట్లు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగాయి. హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలకు అదనంగా 50 ఎంబీబీఎస్ సీట్లను భారత వైద్య మండలి (ఎంసీఐ) కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఉస్మానియా వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ సీట్లు 200 నుంచి 250కి పెరిగాయి. సీట్ల పెంపుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మెడిసిన్ సీట్లకు ‘గ్రాంట్’ మెలిక!
సాక్షి, హైదరాబాద్: కొత్తగా పది వేల ఎంబీబీఎస్ సీట్లు.. వైద్య విద్యార్థుల్లో ఎన్నో ఆశలు రేపిన కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఇదీ. అయితే ఇందులో మన రాష్ట్రానికి వచ్చే సీట్లపై అప్పుడే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటే కీలకం. అయితే గతంలో మన సర్కారు వ్యవహార శైలి తాజా అనుమానాలకు కారణమవుతోంది. దేశంలో వైద్యుల కొరత తీర్చేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పది వేల ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తామని గురువారం కేంద్రం ప్రకటించింది. ఇందులో మన రాష్ట్రానికి కనీసం 700 సీట్లు వచ్చే అవకాశముంది. కానీ, ఇన్ని సీట్లను మన రాష్ట్రం సాధించుకోగలదా? ఇందుకు అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వగలదా? అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2010లో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు సరళతరం చేస్తూ రాష్ట్రానికి 500 పీజీ సీట్లు కేటాయించింది. దీంతో పాటు రూ.182.46 కోట్లను మంజూరు చేసింది. తొలి విడతగా 2011లో రూ. 60 కోట్లు మంజూరు చేసింది. దీనికి మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్రం రూ. 15 కోట్లు ఇవ్వాలి. అయితే ఈ నిధులను విడుదల చేయలేదు. అంతేకాక కేంద్రం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయకపోవడంతో తొలి, రెండు విడతల్లో రాష్ట్రానికొచ్చిన సుమారు రూ. 90 కోట్లు వెనక్కు వెళ్లిపోయాయి. ఫలితంగా పీజీ సీట్లు కేటాయించినా తగిన వసతులు కల్పించకపోవడంతో వాటికి గుర్తింపు దక్కలేదు. దీంతో పీజీ వైద్య విద్య పూర్తి చేసిన సుమారు 300 మంది భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ఎంబీబీఎస్ సీట్ల విషయంలోనూ ఇదే పునరావృతం అవుతుందేమోననే అనుమానాలు వెంటాడుతున్నాయి. 700 ఎంబీబీఎస్ సీట్లంటే సుమారు రూ. 850 కోట్లు ఖర్చవుతుందని అంచనా. వీటిలో 30 శాతం మ్యాచింగ్ గ్రాంట్ అంటే రూ. 250 కోట్లు రాష్ట్రం భరించాలి. అది కూడా ఎంసీఐ తనిఖీలకు వచ్చే నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఖర్చు చేసి, విద్యార్థి చదువుకు అనుకూలమైన మౌలిక వసతులు కల్పిస్తేనే ఆ సీట్లకు మోక్షం లభిస్తుంది. లేదంటే ఆ సీట్లకు గుర్తింపు దక్కదు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 మెడికల్ కళాశాలలున్నాయి. నెల్లూరులో రూ. 310 కోట్లతో 150 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో కొత్త కళాశాలను నిర్మిస్తున్నారు. అనంతపురం, విజయవాడ, కర్నూలు జిల్లాలో ఉన్న వైద్య కళాశాలలతో పాటు నాలుగు రిమ్స్ల్లో కనీస వసతులు కూడా లేని పరిస్థితి. మౌలిక వసతులను అభివృద్ధి పరిస్తేనే కొత్త సీట్లకు మోక్షం కలుగుతుందని వైద్య రంగ నిపుణులు చెపుతున్నారు. -
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 10వేల ఎంబీబీఎస్ సీట్ల పెంపు
-
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 10,000 ఎంబీబీఎస్ సీట్ల పెంపు
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్ల పెంపునకు కేంద్రం పచ్చజెండా సీట్ల పెంపు కోసం ప్రభుత్వ వైద్య కాలేజీలను కేంద్ర ప్రాయోజిత పథకంతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందుకోసం రూ.10 వేల కోట్లు వ్యయమవుతుంది. సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 10 వేల ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు పచ్చజెండా ఊపింది. సీట్ల పెంపు నిమిత్తం ప్రస్తుతమున్న రాష్ట్ర ప్రభుత్వ/కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను అప్‌గ్రేడ్ చేయాలన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన కింద దేశంలోని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను పెంచడానికి ఆయా కాలేజీలను కేంద్ర ప్రాయోజిత పథకంతో అప్‌గ్రేడ్ చేస్తారు. సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం కాగల ఈ పథకం అమలుతో దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల సీట్లు పెరుగుతాయి. పథకం అమలుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడిగా భరిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ పథకం కోసం కేంద్రం రూ.7,500 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని, రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు మిగతా రూ.2,500 కోట్ల వ్యయాన్ని భరిస్తాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పథకం అమలుకు అయ్యే వ్యయాన్ని భరించే విషయంలో రాష్ట్రాల కేటగిరీలవారీగా వ్యత్యాసముంది. ఈశాన్య రాష్ట్రాలు, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో నిధులను ఖర్చు చేస్తాయి. ఇతర రాష్ట్రాల విషయానికొస్తే కేంద్రం, రాష్ట్రాలు 70:30 నిష్పత్తిలో ఖర్చును భరిస్తాయి. మొత్తమ్మీద చూస్తే దాదాపు 10,000 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నందున ఒక్కో సీటు కోసం సగటున రూ.1.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. దేశంలో ప్రస్తుతం 381 మెడికల్ కాలేజీలు ఉండగా అందులో 49,918 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కేంద్రం నిర్ణయంతో డాక్టర్-పేషెంట్ నిష్పత్తి ప్రస్తుతమున్న 1:2000 నుంచి 1:1000కు తగ్గనుంది. రాష్ట్రాల్లో మరో 58 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతోపాటు జిల్లా ఆస్పత్రుల అప్‌గ్రెడేషన్‌కు కేంద్రం గత వారం ఆమోదం తెలపడం తెలిసిందే. దీనివల్ల మరో 5,800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.