
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పీజీ వైద్య డిగ్రీ, పీజీ డిప్లొమా సీట్ల భర్తీకి కేంద్రం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల పరిధిలో మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు జాతీయ కోటాలో ఉంటాయి. ఈ సీట్లకు ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని షెడ్యూల్‌లో పేర్కొంది. మొత్తం మూడు రౌండ్లలో సీట్ల భర్తీ జరగనుంది. మూడు రౌండ్లలో చివరిదైన మాప్ అప్ రౌండ్ తర్వాత మే 27లోగా సీట్లలో చేరకపోతే వాటిని ఖాళీ సీట్లుగా గుర్తించి మే 31లోగా భర్తీ చేస్తారు. మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 930 సీట్ల వరకూ పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా సీట్లున్నాయి. వీటిలో 465 సీట్లు జాతీయ కోటాలో ఉంటాయి. వివరాలకు www. mcc. nic. in చూడొచ్చు.
సీట్ల భర్తీకి షెడ్యూల్ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment