PG Medical
-
మెదడుపై డెంగీ దాడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ప్రజలు ఓవైపు సీజనల్ జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగా మరోవైపు డెంగీ వ్యాధిలో తీవ్రమైన, అరుదైన రకానికి చెందిన డెంగీ ఎన్సెఫలైటిస్ వ్యాధి (రోగి మెదడును దెబ్బతీయడం ఈ వ్యాధికారక వైరస్ లక్షణం) బారినపడి ఏకంగా ఒక పీజీ వైద్య విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. నగరంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో 3వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతున్న డాక్టర్ గోపికి ఈ నెల 24న డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని జీడిమెట్లలోని మల్లారెడ్డి నారాయణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ శనివారం పరిస్థితి విషమించడంతో డాక్టర్ గోపి మృతి చెందారు. వెయ్యి మందిలో ఒక్కరిలోనే... డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డ రోగులు కోలుకొనే అవకాశాలు అత్యంత తక్కువని వైద్యులు అంటున్నారు. సాధారణ డెంగీ సోకిన ప్రతి 1,000 మంది రోగుల్లో కేవలం ఒక్కరిలోనే డెంగీ వైరస్ మెదడు దాకా విస్తరించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘డెంగీ వైరస్‌తో బ్రెయిన్లోని ప్రధాన భాగాలు వాచిపోతాయి. దీంతో రోగులు బ్రతికే అవకాశాలు దాదాపుగా శూన్యం’అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (తెలంగాణ) సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాదల చెప్పారు. వైద్యుల్లో ఆందోళన..: నగరంలో సీజనల్‌గా ప్రభావం చూపే డెంగీ వ్యాధి ఈ ఏడాది ఆలస్యంగా ప్రతాపం చూపడం ప్రారంభించింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా దీంతోపాటు పలు రకాల ఫ్లూ జ్వరాలు, శ్వాసకోస వ్యాధులు నగరవాసుల్ని ఆసుపత్రుల బాట పట్టిస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఆసుపత్రిలోనూ వైరల్ ఫీవర్ సంబంధిత కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏకంగా ఒక వైద్య విద్యార్ధి సైతం డెంగీ ఎన్‌సెఫలైటిస్‌తో మృతి చెందడం నగరంలోని వైద్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది తొలి కేసు కాదని, ఇప్పటికే కనీసం అరడజను మంది వైద్యులు డెంగీబారిన పడ్డారని వైద్య విద్యార్థులు అంటున్నారు. ‘మన ఆసుపత్రుల్లో ప్రత్యేక డెంగీ వార్డులు లేవు. అలాగే దోమ తెరలు సైతం ఉండవు. ఈ విషయంలో అనుసరించాల్సిన ప్రొటోకాల్‌ను ఆసుపత్రుల్లో పాటించడం లేదు’అని ఓ వైద్య విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల్లో అపరిశుభ్ర పరి స్థితులు దోమల విజృంభణ, డెంగీ వ్యాప్తికి అను కూలంగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అటువంటి పరిస్థితుల్లో పనిచేసే వైద్య విద్యార్థులే డెంగీ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ ని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో సైతం దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
రోగాలను బట్టి పీజీ మెడికల్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మేరకు కొత్త పీజీ మెడికల్ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్ పేషెంట్ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీకి రెండు పీడియాట్రిక్ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి. ఒక ఆపరేషన్ థియేటర్ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి ఎన్ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు. ఐసీఎంఆర్ ఆన్లైన్ కోర్సులు చదవాలి ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపె ట్టింది. అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్ నెఫ్రాలజీ, రీనాల్ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈ ఎన్టీ, స్పైన్ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే ఆన్ లైన్ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు. ఇలా అయితేనే ఉపయోగం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్లకు మరోసారి కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రివైజ్డ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం మళ్లీ వెబ్ఆప్షన్లు స్వీకరిస్తూ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమో దు చేసుకోవాలని సూచించింది. అనివార్య కారణాలతో ఎవరైనా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు వారు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట శాంతీరామ్, జీఎస్ఎల్, మహారాజా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు వెలువడిన నేపథ్యంలో తొలుత నిర్వహించిన కౌన్సెలింగ్‌ను యూనివర్సిటీ రద్దు చేసి, రివైజ్డ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత రాజమండ్రి జీఎస్ఎల్ కళాశాలలో రేడియో డయగ్నోసిస్‌లో 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మరో రెండు సీట్లకు నకిలీ అనుమతులు వచ్చినట్లు గురువారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్–1 కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. -
పీజీ వైద్య సీట్లపై ఎందుకీ ఫీట్లు?
-
పీజీ వైద్య సీట్లపై ఎందుకీ ఫీట్లు?
సాక్షి, అమరావతి: ఉల్లిపాయను ఎంత ఉడకబెట్టినా దాని కంపు పోదు.. చింతకాయను ఎంత చితక్కొట్టినా దాని పులుపు పోదు.. అలాగే, రామోజీ రాతల రంకు రోజూ బయటపడుతున్నా ఆయన సిగ్గుపడడు. ఎందుకంటే ఆయన రామోజీ కనుక. ప్రభుత్వంపై బురద జల్లడం, నిందలు ఆపాదించడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. ఆ లక్షణంతోనే ఆయన కళ్లు మూసుకుని నిజానిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా ఏదిపడితే అది రాసిపారేస్తున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి వైద్య కళాశాలలకు అదనపు పీజీ సీట్ల మంజూరులో జరిగిన అవకతవకల్లో రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడు. ‘పీజీ వైద్య సీట్ల కోసం అక్రమాల దందా’ అంటూ ఈనాడు పత్రికలో ఆదివారం కథనం రాసుకొచ్చారు. ఈ సీట్ల పెంపుపై ఎన్ఎంసీ నుంచి నకిలీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ)లు సృష్టించారు. ఈ వ్యవహారంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కళ్లు మూసుకుందని.. రాష్ట్ర ప్రభుత్వంపై మరో మచ్చ పడిందని రామోజీరావు తెగ గగ్గోలు పెట్టారు. ఢిల్లీలో కేంద్రం అజమాయిషీలో పనిచేసే ఎన్ఎంసీ పేరిట నకిలీ ఎల్‌ఓపీలు వస్తే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై మచ్చ పడటం ఏమిటి?.. అసలు రామోజీరావుకు ఏమైంది..? మరీ ఇంతలా ఎందుకు దిగజారుతున్నారని మేధావులు సైతం మండిపడుతున్నారు. ఈ విషయంలో రామోజీ రాతల వెనుక వాస్తవాలను పరిశీలిస్తే.. ఎన్‌ఎంసీనే అప్రమత్తం చేసిన ప్రభుత్వం 2023–24 విద్యా సంవత్సరంలో పీజీ సీట్ల పెంపుదలకు సంబంధించి నంద్యాల జిల్లా శాంతిరాం వైద్య కళాశాల సమర్పించిన ఎల్ఓపీ నకిలీదని ఆగస్టు 29న ఎన్ఎంసీ ఆరోగ్య విశ్వవిద్యాలయం దృష్టికి తీసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు అప్పటివరకూ నిర్వహించిన పీజీ అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేశారు. శాంతిరాంలో 25 సీట్లు కాగా, అదనంగా మరో 74 సీట్లకు ఎల్‌ఓపీలు జారీ అయినట్లు గుర్తించారు. వెంటనే రాష్ట్రంలో ఇతర వైద్య కళాశాలలు సమర్పించిన ఎల్ఓపీలను నిశితంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి జీఎస్ఎల్, విజయనగరం మహారాజా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో కూడా ఇలాంటి తతంగమే చోటుచేసుకుందని గుర్తించారు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే నకిలీ అనుమతుల వ్యవహారంపై ఎన్ఎంసీకి లేఖ రాయాలని ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టాలంటూ ఎన్ఎంసీని కోరాలని, విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని అందించాలని సూచించారు. దీంతో గత నెల 31న వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్ఎంసీకి లేఖ రాశారు. దీన్నిబట్టి చూస్తే.. కాస్త ఇంగితం ఉన్న ఎవ్వరికైనా ప్రభుత్వమే ఎన్ఎంసీని అప్రమత్తం చేసిందని అర్థమవుతుంది. వాస్తవాలకు పాతరేయడమే రామోజీ లక్ష్యం.. ఇలా నకిలీ పీజీ సీట్ల అనుమతుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, మన విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు చేపడితే ఆ విషయాలను కప్పిపుచ్చి ఏదోకలా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా రామోజీ కుట్రచేశారు. మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంగా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్లో లోపంగా చూపించేందుకు వాస్తవాలను వక్రీకరించేందుకు తెగ తాపత్రయపడ్డారు. పైగా రాజకీయాలను ఆపాదిస్తూ ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారు. శాంతిరాం కళాశాల యజమాని వైఎస్సార్సీపీలో ఇటీవలే చేరారని, అందుకనే ఇది జరిగిందన్నట్లుగా ఈనాడు ఒక ముద్రవేసే ప్రయత్నం చేసింది. శాంతిరాం కళాశాల యజమాని ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన మాట వాస్తవమే. కానీ, కొద్దిరోజుల కిందటి వరకూ ఆయన ఏ పార్టీలో ఉన్నారన్న విషయాన్ని రామోజీ ఎందుకు దాచిపెట్టారు?. నాటి లోకేశ్ ట్వీట్ ఊసెత్తని రామోజీ.. 2019లో ఐటీ శాఖ తమ మద్దతుదారుడైన శాంతిరాంపై సోదాలు చేస్తోందని, మోడీ తీరును ఖండిస్తున్నామంటూ అప్పట్లో చంద్రబాబు తనయుడు లోకేశ్ చేసిన ట్వీట్లోని అంశాలను విస్మరించి రాతలు రాయడం రామోజీరావు నిస్సిగ్గుతనానికి నిదర్శనం. నిజానికి.. ఎల్ఓపీల జారీలో గోల్మాల్ జరిగింది ఢిల్లీలోని ఎన్ఎంసీలో.. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ కాదని రాజగురువింద రామోజీకి తెలీదా? దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆపాదించడం ఎంతవరకు సబబని వైద్య వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కాలేజీలో తప్పు జరిగిందని తెలిసిన వెంటనే మిగిలిన కళాశాలలను పరిశీలించి స్వయంగా ప్రభుత్వమే ఎన్ఎంసీని అప్రమత్తం చేస్తే సక్రమంగా పనిచేసినట్లు కాదా రామోజీ? నకిలీల వ్యవహారంపై పూర్తిగా విచారణకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీచేస్తే, ఈనాడు మాత్రం ఇక్కడే ఏదో జరిగిపోయినట్లు వక్రీకరణలు చేయడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనం. అలాగే, ఏపీతోపాటు తమిళనాడులోనూ ఇదే తరహా వ్యవహారం వెలుగుచూసిన విషయం రామోజీ మరిచినట్లున్నారు? -
త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మెడికల్ తదితర వైద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కసరత్తు పూర్తి చేసింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఫీజులను సవరించనుంది. ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సహా ఇతర కోర్సుల ఫీజులను మూడేళ్లకోసారి సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఏడాదికోసారి 5 శాతం చొప్పున సవరించాలన్న నిర్ణయాన్ని మార్పు చేశారు. ఆ ప్రకారం ఈ సారి తప్పనిసరిగా ఫీజుల సవరణ జరుగుతుందని హెల్త్ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రైవేటు కాలేజీ ల్లో మెడికల్ కోర్సుల ఫీజులు రూ. లక్షల్లో ఉండగా త్వర లో అంతకు మించి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో మెడికల్ కాలేజీకి ఒక్కో ఫీజు... ఇప్పటివరకు రాష్ట్రంలో మెడికల్ కోర్సుల ఫీజులు ఒకే రీతిన ఉన్నాయి. ఇకపై ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజు ఉండనుంది. ఆ ప్రకారమే ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సహా ఇతర వైద్య కోర్సుల ఫీజులుంటాయి. అందుకు అనుగుణంగానే కాలేజీలవారీగా ఆడిట్ రిపోర్టులను టీఏఎఫ్ఆర్సీ తీసుకుంది. వాటి ఆధారంగానే ఫీజుల సవరణ చేయనుంది. ఇందులో కాలేజీల నిర్వహణ ఖర్చులు మొదలు, బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, ల్యాబ్‌ల నిర్వహణ తదితర పూర్తిస్థాయి సమాచారం సేకరించారు. ఈ ఖర్చులు గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఒక రకంగా ఉంటే పట్టణ ప్రాంతాల్లోని కాలేజీల్లో మరో రకంగా ఉంటాయి. ఈ దిశగా కాలేజీవారీగా ఆడిట్ నివేదికలు పరిశీలించిన టీఏఎఫ్ఆర్సీ ఫీజుల సవరణపై ఒక అంచనాకు వచ్చింది. కాలేజీలవారీగా ఫీజుల పెంపు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమరి్పంచినట్లు తెలిసింది. దీంతో ఫీజుల పెంపు వ్యవహారంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కొన్ని కాలేజీల్లో 20 శాతం వరకు పెరిగే అవకాశం.. ప్రస్తుతమున్న ఫీజులను కొన్ని కాలేజీలు 20 శాతం వరకు పెంచాలని కోరగా మరికొన్ని 10 శాతం, కొన్ని 5 శాతం, ఇంకొన్ని యథాతథంగా ఉంచాలని కోరినట్లు సమాచారం. ప్రైవేటు కాలేజీల్లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఏ–కేటగిరీ (కన్వినర్) ఫీజు రూ. 60 వేలు ఉండగా బీ–కేటగిరీ ఫీజు రూ. 11.55 లక్షలుగా ఉంది. ఇక సీ–కేటగిరీ (ఎన్ఆర్ఐ) అడ్మిషన్ ఫీజు బీ–కేటగిరీకి రెట్టింపు అంటే రూ. 23.10 లక్షల వరకు వసూలు చేసుకొనే వీలుంది. ఇక పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏ–కేటగిరీ ఫీజు రూ. 7.5 లక్షలు, బీ–కేటగిరీ రూ. 28 లక్షల నుంచి రూ. 30 లక్షల చొప్పున ఉన్నాయి. బీడీఎస్ కోర్సులకు సంబంధించి ఏ–కేటగిరీ ఫీజు రూ. 45 వేలు ఉండగా బీ–కేటగిరీ ఫీజు రూ. 4.2 లక్షలు, ఇక సీ–కేటగిరీ ఫీజు బీ–కేటగిరీ కంటే రెట్టింపు వసూలు చేసుకోవచ్చు. వాటితోపాటు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, హోమియోపతి, పారామెడికల్ కోర్సులకు సంబంధించిన ఫీజులు కూడా కాలేజీలవారీగా భిన్నంగా ఉన్నాయి. -
నీట్ మెడికల్ పీజీ స్టేట్ ర్యాంక్‌లు విడుదల
సాక్షి, హైదరాబాద్: నీట్ పీజీ మెడికల్, నీట్ ఎండీఎస్ రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలైన మూడు నెలల తర్వాత రాష్ట్రస్థాయి డేటాను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. ఎన్ఎంసీ నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలు అందినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయిN. నీట్ పీజీలో రాష్ట్రం నుంచి దాదాపు 12 వేల మంది పరీక్ష రాయగా 5,690 మంది అర్హత పొందారు. నీట్ ఎండీఎస్‌లో 602 మంది అర్హత సాధించినట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. పీజీ మెడికల్ పరీక్ష మార్చి 5వ తేదీన జరిగింది. ఆ తర్వాత పది రోజులకు ఫలితాలు వచ్చాయి. వచ్చిన మార్కులు, జాతీయ స్థాయి ర్యాంకులను బట్టి విద్యార్థుల క్రమ సంఖ్య ఆధారంగా స్టేట్ ర్యాంకులు నిర్ధారించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది కేవలం జాతీయస్థాయి ర్యాంకుల ఆధారంగా తయారు చేసిందేనని, మెరిట్ జాబితా కాదని కాళోజీ వర్సిటీ తెలిపింది. నీట్ పీజీ మెడికల్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి పది స్థానాల్లో వి.వి.కౌశిక్ అల్వార్, వేణు మాధవ్ పిన్నింటి, నంబూరి కృష్ణశ్రీ, జి.పవిత్ర, జీశన్ అహ్మద్ జాలీలి, రెగోటి అశ్రిత, తంగెడ కౌశిక్, కనుమిల్లి ప్రదీప్, బైరోజు శివ సాయితేజ, గడ్డం నిఖిత ఉన్నారు. నీట్ ఎండీఎస్ మొదటి పది స్థానాల్లో వర్ణిక పారుపల్లి, దుంప తేజస్వి, జె.కుసుమ, రుంజాల సుసన్ దైసీ క్రిస్, ముత్యాల శ్రీసాయి సుఖేష్ రొంపికుంట్ల శాలిని, మనీష కుమారి, సోమ చాణక్య, చర్క సౌమేశ్వరి, అక్షయ్ కులకర్ణి ఉన్నారు. 2,300కు పైగా క్లినికల్ సీట్లు.. రాష్ట్రవ్యాప్తంగా 32 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2,722 పీజీ మెడికల్ సీట్లున్నాయి. అందులో దాదాపు 400 నాన్ క్లినికల్ సీట్లు పోగా, మిగిలినవి క్లినికల్ సీట్లు ఉంటాయని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ కాలేజీల్లోని 15% సీట్లను జాతీయ స్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని రాష్ట్ర కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. అయితే ఈసారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఏకీకృత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశముంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కాళోజీ వర్గాలు తెలిపాయి. కాగా వచ్చే నెలలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎంబీబీఎస్ ఇంటర్న్íÙప్ పూర్తి కాకపోవడం వల్ల ఈ ఆలస్యం జరుగుతోంది. కాగా పీజీ మెడికల్ క్లినికల్ సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కోట్లు ఖర్చు చేసి మరీ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఆ సీట్లలో చేరుతుంటారు. ఒక్క సీటు కూడా మిగలదు. సీట్లు పొందినవారు స్పెషలిస్టు వైద్యులుగా తమ కెరీర్‌ను మలుచుకుంటారు. ఇక నాన్ క్లినికల్ పీజీ సీట్లను పట్టించుకునే వారే ఉండరు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉండే కన్వీనర్ కోటా సీట్లలోనూ విద్యార్థులు చేరడం లేదంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. క్లినికల్ విభాగంలో మొత్తం 14 సబ్జెక్టులుండగా..నాన్ క్లినికల్‌లో 9 సబ్జెక్టులు ఉన్నాయి. -
నాన్ క్లినికల్ పీజీ... నాట్ ఇంట్రెస్టెడ్!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్ పీజీ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. తద్వారా స్పెషలిస్టు వైద్యులుగా తమ కెరీర్‌ను మలుచుకుంటారు. అందువల్ల క్లినికల్ విభాగంలోని సీట్లకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కోట్లు ఖర్చు చేసి వాటిల్లో చేరుతుంటారు. ఒక్క సీటు కూడా మిగలదు. కానీ నాన్ క్లినికల్ పీజీ సీట్ల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ సీట్లను పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉండే కన్వీనర్ కోటా సీట్లలోనూ విద్యార్థులు చేరడంలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సాధారణ ఫీజు చెల్లిస్తే చాలనీ, డొనేషన్ కూడా వద్దని, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. క్లినికల్ సీట్లపైనే అందరి దృష్టి... క్లినికల్ విభాగంలోని సబ్జెక్టులన్నింటికీ భారీగా డిమాండ్ ఉండగా, నాన్క్లినికల్ సబ్జెక్టులకు డిమాండ్ ఉండటం లేదు. నాన్క్లినికల్లో అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ, మైక్రో బయోలజీ, ఎస్పీఎం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి సబ్జెక్టులున్నాయి. ఇవి చేసిన వారికి ప్రధానంగా మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా చేయడానికి వీలుంటుంది. ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి వాటికి ఇతరత్రా అవకాశాలుంటాయి. కానీ క్లినికల్ కోర్సుల మాదిరి నాన్ క్లినికల్ సబ్జెక్టులకు డిమాండ్ ఉండదు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నాన్క్లినికల్ అధ్యాపక ఖాళీలను భర్తీ చేయడంలేదు. దీంతో ఈ కోర్సులు చేసినవాళ్లు చాలామంది ఖాళీగా ఉంటున్నారు. నాన్ క్లినికల్ కోర్సులు చేసినవారి సంఖ్య పెరగడంతో ప్రైవేటు కాలేజీల్లోనూ అవకాశాలు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఒకప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో రూ. లక్షకు పైగా జీతాలు తీసుకున్నవారు, ఇప్పుడు రూ. 40–50 వేలకే పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కొన్నిసార్లు ఆ మేరకైనా అవకాశాలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు నాన్ క్లినికల్ విభాగాల్లో చేరడానికి ఆసక్తి చూపడంలేదు. క్లినికల్ విభాగాలైన జనరల్ మెడిసిన్, రేడియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో, ఆర్థో, గైనిక్ తదితర కీలకమైన వాటిపైనే దృష్టిసారిస్తున్నారు. బయట ప్రాక్టీస్ చేయడానికి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీ జీతాలు పొందడానికి క్లినికల్ మెడికల్ కోర్సులే ఉపయోగపడతాయి. క్లినికల్ సీట్లనైనా పెంచితే... మెడికల్ కాలేజీల్లో నాన్ క్లినికల్ పీజీ వైద్య సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతుండటంపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సీట్లుండీ మిగిలిపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోతోందని అంటున్నాయి. ఇన్ సర్వీస్ కోటా కింద భర్తీ చేసుకోవడానికి వీలు కల్పించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు గతంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు లేఖ రాశాయి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ‘నీట్’పరీక్ష తప్పనిసరి కాబట్టి తామేమీ చేయలేమని ఎన్ఎంసీకి చెందిన కొందరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాన్ క్లినికల్ సీట్లను తగ్గించి క్లినికల్ సీట్లనైనా పెంచితే బాగుంటుందని ఎంబీబీఎస్ విద్యార్థులు కోరుతున్నారు. -
1,458 ‘సీనియర్ రెసిడెంట్’ల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధనాస్పత్రుల్లో 1,458 సీనియర్ రెసిడెంట్ (ఎస్ఆర్) డాక్టర్ల నియామకానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ రాత్రి 12 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 45 ఏళ్ల లోపు వయసుండి, ప్రభుత్వ మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. http://dme.ap.nic.in వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఎస్ఆర్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.85 వేలు, స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.70 వేలు, సీనియర్ రెసిడెంట్(పీజీ)కు రూ.65 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుంది. పీజీ తుది పరీక్షల్లో వచ్చిన (థియరీ, ప్రాక్టికల్స్)మార్కుల్లో మెరిట్ ప్రామాణికంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపికలు చేపడతారు. అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 144, జనరల్ మెడిసిన్‌లో 101, జనరల్ సర్జరీ విభాగంలో 101 ఖాళీలున్నాయి. పాథాలజీలో 88, అనాటమీలో 85, ఫార్మకాలజీలో 80, గైనకాలజీలో 69, అనస్థీషియాలో 56, పీడియాట్రిక్స్‌లో 56, ఆప్తమాలజీలో 56 ఖాళీలున్నాయి. ఇలా మొత్తంగా 49 విభాగాల్లో 1,458 ఎస్ఆర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ప్రభుత్వం 46 వేల పోస్టులను భర్తీ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వారికే.. ఎస్ఆర్ పోస్టుల నియామకంలో తమకు అవకాశం కల్పించాలని కొందరు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ చేసిన వైద్యులు సంప్రదిస్తున్నారు. అయితే నేషన్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అడ్మిషన్ నిబంధనల మేరకు కళాశాలల్లోని ప్రతి విభాగంలో ఎస్ఆర్ పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఈ క్రమంలో కేవలం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వారికే అవకాశం కల్పిస్తున్నాం. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదివిన వారు తాము చదివిన కళాశాలల్లో ఎస్ఆర్లుగా పనిచేసేందుకు ఆయా కళాశాలల యాజమాన్యాలను సంప్రదించాలి. – డాక్టర్ వినోద్‌కుమార్, డీఎంఈ -
పీజీ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య ప్రవే శాల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖా స్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్)– 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 24న ఉదయం 8 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. యూనివర్సిటీ పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను ప్రకటి స్తుంది. దరఖాస్తులను https://tspgmed. tsche.in దరఖాస్తు ఫారం నింపే సమయంలో సాంకేతిక సమస్యలకు 93926 85856, 78425 42216, 90596 72216 నంబర్లకు, నిబంధనల కోసం 94905 85796, 85006 46769 నంబర్లకు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఫోన్ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం www. knruhs.telangana.gov.inను సంప్రదించాలని తెలిపింది. -
మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల బ్లాకింగ్.. దందాలో పెద్దలు?
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ దందా మరింతగా రాజుకుంటోంది. ప్రైవేటు కాలేజీలు ఇతరరాష్ట్రాల విద్యా ర్థుల సాయంతో ఇక్కడ సీట్లను బ్లాక్ చేసి, తర్వాత కోట్ల రూపాయలకు అమ్ముకుంటు న్న వ్యవహారంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. బ్లాక్ దందా వెనుక కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నా రన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీట్ల బ్లాకింగ్‌కు పాల్పడిన మెడికల్ కాలేజీల్లో కొన్ని కీలక స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులవని సమాచారం. అంతేకాదు ఇక్కడ సీట్లకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇస్తన్న వివరణలు, అధికారుల హడావుడిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికార యంత్రాంగం సహకారం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. 34 అనుమానాస్పద దరఖాస్తుల్లో.. పీజీ వైద్య సీట్లకు ఇప్పటివరకు మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా.. సుమారు 34 మంది దరఖాస్తులు అనుమానాస్పదం గా ఉన్నట్టు కాళోజీ యూనివర్సిటీ గుర్తించింది. ఈ 34 మంది కూడా మంచి ర్యాంకులు సాధించనవారే కావడం, వారి సొంత రాష్ట్రాల్లోనే సీటు పొందే అవకాశమున్నా.. ఇక్కడ యాజమాన్య కోటాలో దరఖాస్తు చేసుకోవడాన్ని సందేహించింది. వారందరికీ లేఖ రాసి వివరణ అడిగింది. వీరిలో 18 మంది రాష్ట్ర కాలేజీల్లో అడ్మిషన్ తీసుకున్నారు. మిగతా 16 మందిలో.. తొమ్మిది మంది ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, మరో ఏడుగురు తాము దరఖాస్తే చేయలేదని చెప్పారు. దీనిపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆ ఏడుగురు అభ్యర్థులకు తెలియకుండానే.. వేరే ఎవరో పీజీ మెడికల్ సీటుకు దరఖాస్తు చేసినా గుర్తించే పరిస్థితి లేదంటే ఏమనుకోవాలన్న సందేహాలు వస్తున్నాయి. సదరు ర్యాంకర్లు, తాము కలిసి చేసిన అక్రమాలు బయటికి రాకుండా కాలేజీల యాజమాన్యాలు నాటకం ఆడుతున్నాయా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. లొసుగును అడ్డుపెట్టుకుని.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తం 2,300 వరకు పీజీ మెడికల్ సీట్లున్నాయి. ఇందులో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సీట్లు 1,400. ఇందులో 50శాతం అంటే.. 700 సీట్లను కన్వీనర్ కోటా కింద నేరుగా భర్తీ చేస్తారు. మిగతా 50శాతం (700) సీట్లు మేనేజ్మెంట్ కోటాలో మూడు కేటగిరీలుగా (బీ కేటగిరీలో 25 శాతం, ఎన్నారై కోటాలో 15 శాతం, ఇనిస్టిట్యూషనల్ కోటాలో 10 శాతం) ఉంటాయి. నిబంధనల ప్రకారం.. ఏదైనా కేటగిరీలో సీట్లు నిండకపోయినా, ప్రవేశాలు జరిగాక ఖాళీ అయినా.. సదరు కాలేజీలు వాటిని ఎన్నారై కోటా కింద భర్తీ చేసుకోవచ్చు. అందువల్ల బీ కేటగిరీ సీట్లను ‘బ్లాక్’ చేసి, ఎన్నారై కేటగిరీగా మార్చుకునేలా కాలేజీలు పన్నాగం పన్నాయి. ఆ సీట్లను భారీ రేటుకు అమ్ముకునేలా ప్లాన్ వేశాయి. గవర్నర్ జోక్యంతో హడావుడి పీజీ వైద్య సీట్ల బ్లాకింగ్‌పై గవర్నర్ జోక్యం చేసుకోవడం, కీలక ప్రజాప్రతినిధుల కళాశాలల్లోనూ ఈ వ్యవహారం జరిగిందన్న ప్రచారంతో.. ఈ దందాపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) కూడా ఈ బ్లాక్ దందాపై ఆరా తీసింది. మరోవైపు ఈ అంశాన్ని సీబీసీఐడీ దర్యాప్తునకు అప్పగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దందా వ్యవహారాన్ని ఎలాగోలా కప్పిపెట్టాలని అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విద్యార్థులకు బెదిరింపులు? వైద్య విద్య పీజీ సీటు బ్లాకింగ్ కోసం కొందరు విద్యార్థులను ప్రలోభపెట్టి, చేర్పించుకున్న కొన్ని ప్రైవేట్ కాలేజీలు, ఏజెన్సీలు.. ఇప్పుడా విద్యార్థులను భయపెడుతున్నట్టు సమాచారం. ఏమీ తెలియదని చెప్పాలని, ఎవరు దరఖాస్తు చేశారో కూడా తెలియదని చెప్పాలని వారిని బెదిరిస్తున్నట్టు తెలిసింది. తద్వారా బ్లాక్ దందా అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వీటికి బదులేవి ► రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు, కాళోజీ యూనివర్సిటీ అధికారులు చెప్తున్న దానికి, వాస్తవ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోందని విద్యార్థులు అంటున్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ► ప్రస్తుతం మేనేజ్మెంట్ సీట్ల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఎన్ని సీట్లు మిగులుతాయో, ఎందరు మానేస్తారో, ఎన్నిసీట్లు ఎన్నారై కేటగిరీగా మారుతాయో తెలియదని.. అలాంటిది సీట్ల బ్లాకింగ్ జరగలేదని ఇప్పుడే ఎలా చెప్తున్నారని ప్రశ్నలు వస్తున్నాయి. ► అధికారులు ఒకవైపు కేవలం అనుమానం అంటున్నారని.. మరోవైపు విచారణ అంటూ హడావుడి చేయడం ఏమిటని విద్యార్థులు పేర్కొంటున్నారు. ► ఏడుగురు నకిలీ అభ్యర్థులు ఇతరుల సర్టిఫికెట్లతో దరఖాస్తు చేశారని చెప్తున్నారని.. టెన్త్ సర్టిఫికెట్ నుంచి ఆధార్ దాకా అన్ని సర్టిఫికెట్లు, ఫొటోలు, సంతకాలు అన్నీ ఎలా తేగలరని ప్రశ్నిస్తున్నారు. ► సొంత రాష్ట్రాల్లోనే కన్వీనర్ కోటా సీటు దొరికే స్థాయిలో ర్యాంకు వచ్చినవారు.. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో దరఖాస్తు చేసినప్పుడు.. ఆయా విద్యార్థుల రాష్ట్రాల్లో వెంటనే ఎందుకు విచారణ చేయలేదని నిలదీస్తున్నారు. -
నీట్ పీజీ కటాఫ్‌లో...15 పర్సంటైల్ తగ్గింపు
న్యూఢిల్లీ: పీజీ మెడికల్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 నీట్–పీజీలో అన్ని కేటగిరీల్లోనూ కటాఫ్‌ను 15 పర్సంటైల్ మేరకు తగ్గించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను ఆదేశించింది. ఎన్బీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మినూ బాజ్‌పాయ్‌కి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సభ్య కార్యదర్శి బి.శ్రీనివాస్ ఈ మేరకు లేఖ రాశారు. అన్ని అంశాలనూ చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ మేరకు క్వాలిఫయింగ్ కటాఫ్ జనరల్ కేటగిరీకి 35వ పర్సెంటైల్‌కు, ఫిజికలీ హాండీక్యాప్డ్ (జనరల్)కు 30కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వుడ్ కేటగిరీలకు 25 పర్సెంటైల్‌కు తగ్గించాలని పేర్కొన్నారు. ఆలిండియా, రాష్ట్రాల కోటాల్లో రెండేసి రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత కూడా దాదాపు 8,000 సీట్లు మిగిలిపోనున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ మెడికల్ కమిషన్‌తో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ‘‘దీనివల్ల సీట్ల వృథాకు అడ్డుకట్ట పడుతుంది. తాజా నిర్ణయం వల్ల కనీసం మరో 25 వేల మంది అభ్యర్థులు ప్రస్తుత కౌన్సెలింగ్‌లో మాప్ రౌండ్లో పాల్గొనగలరు’’ అని చెప్పారు. (చదవండి: భారత్‌లో చదువుతామంటూ...‘ఉక్రెయిన్’ విద్యార్థుల పిటిషన్) -
వృద్ధుల కోసం.. జీరియాట్రిక్స్
సాక్షి, హైదరాబాద్: చిన్న పిల్లలకు పీడియాట్రిక్స్ స్పెషలైజేషన్‌లాగే... వృద్ధులకు ప్రత్యేకంగా వైద్యం అందించేలా పీజీ మెడికల్‌లో జీరియాట్రిక్స్ స్పెషలైజేషన్ కోర్సును కేంద్ర ప్రభుత్వం పరిచయం చేయనుంది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా ప్రకటించింది. దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతుండటం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వృద్ధులు జీవితాంతం నాణ్యమైన జీవితాన్ని గడిపేలా ఈ కోర్సును తీర్చిదిద్దుతారు. ప్రస్తుతం పీజీ ఎండీ, ఎంఎస్‌లలో 32 కోర్సు లున్నాయి. వీటిల్లో కొత్తగా 4 కోర్సులను ప్రారంభిస్తారు. సూపర్ స్పెషాలిటీలో ప్రస్తుతం 38 కోర్సు లున్నాయి. ఈ కేటగిరీలో కొత్తగా 8 కోర్సులను ప్రారంభించాలని ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. వైద్య రంగంలో నైతిక విలువలు... వైద్యరంగంలో నైతిక విలువలపై ప్రత్యేకంగా ఎటువంటి కోర్సు లేదు. కానీ రాబోయే రోజుల్లో పీజీ మెడికల్‌లో ఐసీఎంఆర్ నిర్వహించే మెడికల్ ఎథిక్స్ అనే సర్టిఫికెట్ కోర్సును తప్పనిసరిగా చదవాలి. మొదటి ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తి చేయాలి. దాన్ని రాయకుంటే ఫైనలియర్ పరీక్ష రాయడానికి వీలుండదు. ఒక డాక్టర్ వేరే డాక్టర్ గురించి చెడుగా చెప్పకూడదు.. కమీషన్ల కోసం ఇతర ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేయకూడదు.. డాక్టర్, రోగుల మధ్య సంబంధాలపై మానవీయ కోణాన్ని పెంపొందించడానికి ఈ కోర్సును ఉద్దేశించారు. మరికొన్ని అంశాలు... ►పీజీ మెడికల్‌లో మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే బేసిక్ బయో మెడికల్ రీసెర్చి కోర్సును ఆన్లైన్లో చదివి రాయాల్సి ఉంటుంది. వైద్య విద్యార్థుల్లో పరిశోధనను పెంపొందించాల్సి ఉంది. ఎలాంటి అంశాలపై చేయవచ్చు అన్న దానిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ►బేసిక్ లైఫ్ సపోర్టుపై అన్ని స్పెషలైజేషన్ కోర్సు ల వైద్య విద్యార్థులకు తప్పనిసరి చేశారు. అత్యవసర వైద్యాన్ని అందరూ నేర్చుకోవాలి. ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. ►గతంలో పీజీ మెడికల్‌లో మొదటి ఏడాది, చివరి ఏడాది మాత్రమే పరీక్ష ఉండేది. ఇప్పుడు కోర్సును 50 మాడ్యూల్స్‌గా విభజిస్తారు. దాని ప్రకారం వాళ్లకి శిక్షణ ఇచ్చి, అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. మాడ్యూల్స్ పూర్తి కాగానే పరీక్ష నిర్వహిస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్ పరీక్షలే. ►పీజీ మెడికల్ విద్యార్థులు జిల్లా ఆసుపత్రిలో కోర్సు పీరియడ్‌లో తప్పనిసరిగా 3 నెలలు పనిచేయాలి. దీనివల్ల జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు మెరుగుపడతాయి. జాతీయ ఆరోగ్య పథకాలు, స్థానిక జబ్బులపై అవగాహన కల్పించడానికి దీన్ని ఉద్దేశించారు. ►అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల అనుభవం, పరిశోధనల ఆధారంగా పీజీ సీట్లను ఆయా కాలేజీలకు అనుమతిస్తారు. ప్రస్తుతం ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌కు 2, ప్రొఫెసర్‌కు 3 సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తోంది. ప్రొఫెసర్ల సామర్థ్యం సరిగా లేకుంటే అటువంటి కాలేజీలకు ప్రొఫెసర్‌కు ఒక సీటునే మంజూరు చేస్తారు. ►ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులను ప్రారంభించాలంటే తప్పనిసరిగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు ఉండాలన్నది నిబంధన. ఎంవోయూ లేదా ఔట్సోర్సింగ్ పద్ధతిలో బయ ట సమకూర్చుకోవడాన్ని అనుమతించరు. కొత్త కోర్సులు... మెడికల్ పీజీలో (ఎండీ, ఎంఎస్) ►ఏరోస్పేస్ మెడిసిన్ ►మెరైన్ మెడిసిన్ ►ట్రమటాలజీ అండ్ సర్జరీ... ►జీరియాట్రిక్ సూపర్ స్పెషాలిటీలు... ►మెడికల్ జెనెటిక్స్ ►వైరాలజీ మెడిసిన్ ►చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ►జీరియాట్రిక్ మెంటల్ హెల్త్ ►హెపటాలజీ (లివర్) ►ఎంసీహెచ్ ఎండోక్రైన్ సర్జరీ ►హెపటో పాంకీయాట్రో బిలియరీ సర్జరీ ►రీప్రొడెక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ 20 ఏళ్ల తర్వాత మార్పులు 20 ఏళ్ల తర్వాత పీజీ మెడికల్‌లో పలు కీలకమైన మార్పులు చేశారు. ప్రస్తుతం తీసుకొచ్చిన కోర్సులు శాస్త్రీయంగా, సామాజిక అవసరాలకు తగినట్లుగా ఉన్నాయి. మెడికల్ కాలేజీల్లో వైద్య పరిశోధనకు ఊపు తీసుకురావాలని ఎన్ఎంసీ నిర్ణయించడం ముదావహం. నియమాలు ఒకవైపు సరళతరం చేస్తూనే మరోవైపు కొన్ని కొత్త మార్పులు సూచించారు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
బ్రేకింగ్: నీట్ పీజీ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు 10,12 తరగతలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘ నీట్ పీజీ పరీక్షను దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. ఈ ఏడాది ఆగస్ట్ 31న పరీక్ష నిర్వహించలేము. ఎగ్జామ్ డేట్ ప్రకటించిన తర్వాత విద్యార్థులకు ఒక నెల రోజులు వ్యవధి ఇస్తాం. ఆ తర్వత పరీక్ష నిర్వహిస్తాం. ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది క్వాలిఫైడ్ డాక్టర్లు కోవిడ్ విధి నిర్వహణలో పాల్గొనే అవకాశం లభిస్తుంది’’ అన్నారు. కరోనా కట్టడికి తగినంత మంది వైద్యుల లభ్యత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని.. దీనివల్ల కోవిడ్ డ్యూటీ నిర్వహించే వైద్య సిబ్బంది లభ్యత గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయం వల్ల పీజీ విద్యార్థుల కొత్త బ్యాచ్ ప్రారంభం అయ్యేవరకు చివరి సంవత్సరం పీజీ విద్యార్థుల (విస్తృత మరియు సూపర్-స్పెషాలిటీలు) సేవలను ఉపయోగించుకోవడానికి ఇది దోహదపడుతుందన్నారు అధికారులు. "ఇంటర్న్‌షిప్ రొటేషన్‌లో భాగంగా కోవిడ్ మేనేజ్మెంట్ విధుల్లో మెడికల్ ఇంటర్న్‌లను వారి అధ్యాపకుల పర్యవేక్షణలో మోహరించడానికి అనుమతించాలని నిర్ణయించాము’’ అని తెలిపారు అధికారులు. తాజా నిర్ణయం ఇప్పటికే కోవిడ్ విధుల్లో నిమగ్నమైన వైద్యులపై పడుతున్న పని భారాన్ని తగ్గిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఆన్లైన్ పాఠాలు అర్థం కావట్లేదు -
పీజీ ప్రవేశాల్లో ప్రభుత్వ డాక్టర్లకు కోటా!
న్యూఢిల్లీ: మారుమూలప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లకు పీజీ కోర్సుల అడ్మిషన్లలో రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు ఉన్న రిజర్వేషన్లలో ప్రత్యేక ప్రొవిజన్లు చేర్చుకునే చట్టబద్ధత రాష్ట్రాలకు ఉందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి ప్రత్యేక కోటా ఇవ్వకూడదన్న ఎంసీఐ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ డాక్టర్లకు రిజర్వేషన్ సౌకర్యంపై తమిళనాడు మెడికల్ ఆఫీసర్ల సంఘం వేసిన దావాలో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. (జేఈఈ మెయిన్ ఫలితాలు 11న) -
పీజీ మెడికల్ ఫీజుల పెంపుపై హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్, దంత వైద్య ఫీజుల పెంపు జీవోపై తాజాగా తెలంగాణ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పీజీ మెడికల్, దంతవైద్య ఫీజులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఏ కేటగిరీ విద్యార్థులకు ఫీజుల్లో యాభై శాతం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. (ఏడు ఆస్పత్రుల నుంచే పరిహారం) అంతేగాక బి కేటగిరీ విద్యార్థులు ఫీజులో 60 శాతం చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. మిగతా ఫీజుకు విద్యార్థులు బాండు రాసివ్వాలని విద్యార్థులకు కోర్టు ఆదేశించింది. ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఇక ఫీజు చెల్లింపులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. 4 వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని టీఏఎఫ్ఆర్సీ, వైద్య కళాశాలలకు హైకోర్టు ఆదేశించింది. కరోనా సంక్షోభంలో ఫీజుల పెంపు విద్యార్థులకు భారమేనని హైకోర్టు విచారణలో వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 4 వారాలకు కోర్టు వాయిదా వేసింది. (హైకోర్టులో డాక్టర్ సుధాకర్ కేసు విచారణ) -
తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యకు సంబంధించి పీజీ డిప్లొమా సీట్లను సరెండర్ చేయడం ద్వారా పీజీ డిగ్రీ సీట్లకు అనుమతి పొందే ప్రక్రియను తెలంగాణ హైకోర్టు నిలిపివేయగా.. సుప్రీంకోర్టు ఆ నిర్ణయంపై స్టే ఇస్తూ ప్రతి వాదులకు నోటీసులు జారీచేసింది. పిటిషనర్లు కామినేని వైద్య కళాశాల, ఎం.ఎన్.ఆర్. వైద్య కళాశాల, ప్రతిమా వైద్య కళాశాలల తరపున సీనియ ర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్, న్యాయవాది అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. జస్టిస్ మోహన్ ఎం.శంతనగౌడర్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జూలై 12, 2018న భారత వైద్య మండలి ఇచ్చిన అను మతి ఆధారంగా తెలంగాణలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 18 పీజీ డిప్లొమా సీట్లను సరెండర్ చేసి వాటికి బదులుగా పీజీ డిగ్రీ సీట్లకు అనుమతి తెచ్చుకున్నాయి. అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసి, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన పీజీ డిప్లొమా ఆశావహ అభ్యర్థి ఒకరు గత నెల 22 న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఈ పీజీ డిప్లొమా సీట్ల మార్పిడిని సవాలు చేశారు. దీని వల్ల పీజీ డిప్లొమా సీటు పొందడంలో తన అవకాశాలు సన్నగిల్లాయని, నిమ్స్‌లోగానీ, బసవతారకం కాలేజీల్లో గానీ తన కు రేడియాలజీలో డిప్లొమా సీటు దక్కాల్సి ఉందని పిటిషన్ వేశారు. ఇం దులో తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని, నిమ్స్, బసవతారకం తదితర వైద్య కాలేజీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ నే పథ్యంలో హైకోర్టు ఈ సీట్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే హైకోర్టు విచారించిన పిటిషన్లో తాము భాగస్వాములుగా లేమని, అప్పటికే సీట్ల మార్పిడి పూర్తయిందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. తదుపరి విచారణ జూన్ 1కి వాయిదాపడింది. -
రెండింటిలోనూ అమ్మాయిలే ఫస్ట్..
సాక్షి, విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ (మెడికల్, డెంటల్) నీట్–2020లో అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.శ్యాంప్రసాద్ విడుదల చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తో కలిసి ఆయన ఫలితాలు వెల్లడించారు. పీజీ మెడికల్ నీట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 11,635 మంది హాజరుకాగా, 6,600 మంది అర్హత పొందారని తెలిపారు. పీజీ డెంటల్ (ఎండీఎస్)కు ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరైన 924 మందిలో 538 మంది అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరతామన్నారు. అనంతరం ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి తుది మెరిట్‌లిస్టు వెల్లడిస్తామన్నారు. ఇందుకు సంబంధించి వచ్చేవారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. కాగా, మెడికల్ కౌన్సెలింగ్లకు జీవో నెంబర్లు 550, 43 పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన దృష్ట్యా, కౌన్సెలింగ్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని వీసీ తెలిపారు. కమిటీæ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియ విధివిధానాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. మెడికల్, డెంటల్ రెండింటిలోనూ అమ్మాయిలే ఫస్ట్ కాగా జాతీయ స్థాయిలో నీట్లో మెడికల్, డెంటల్ రెండు విభాగాల్లోనూ రాష్ట్రంలో అమ్మాయిలే మొదటి స్థానం సాధించారు. మెడికల్‌లో చప్పా ప్రవల్లిక (రోల్ నెం: 2066161932) 41వ ర్యాంకు కైవసం చేసుకుంది. పీజీ డెంటల్ నీట్లో మెలేటి వెంకటసౌమ్య (1955226759) రెండవ ర్యాంకు కైవసం చేసుకుంది. (చదవండి: సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం) -
పీజీ వైద్య సీట్ల భర్తీకి షెడ్యూల్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పీజీ వైద్య డిగ్రీ, పీజీ డిప్లొమా సీట్ల భర్తీకి కేంద్రం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల పరిధిలో మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు జాతీయ కోటాలో ఉంటాయి. ఈ సీట్లకు ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని షెడ్యూల్లో పేర్కొంది. మొత్తం మూడు రౌండ్లలో సీట్ల భర్తీ జరగనుంది. మూడు రౌండ్లలో చివరిదైన మాప్ అప్ రౌండ్ తర్వాత మే 27లోగా సీట్లలో చేరకపోతే వాటిని ఖాళీ సీట్లుగా గుర్తించి మే 31లోగా భర్తీ చేస్తారు. మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 930 సీట్ల వరకూ పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా సీట్లున్నాయి. వీటిలో 465 సీట్లు జాతీయ కోటాలో ఉంటాయి. వివరాలకు www. mcc. nic. in చూడొచ్చు. సీట్ల భర్తీకి షెడ్యూల్ ఇలా.. -
పీజీ మెడికల్‌లో ‘ఇన్ సర్వీస్’ రద్దు సబబే
సాక్షి, హైదరాబాద్ : పీజీ మెడికల్ డిగ్రీ కోర్సులో ఇన్ సర్వీస్ కోటా రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. భారత వైద్య మండలి (ఎంసీఏ) నిబంధన 9(4) ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించిన వారు ఇకపై వెయిటేజీ మార్కులు మాత్రమే పొందాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఇన్ సర్వీస్ కోటా రద్దు చేసి దాని స్థానే వెయిటేజీ మార్కులిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులు సబబేనని సోమవారం తీర్పు వెలువరించింది. పీజీ మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మాత్రమే రాష్ట్ర కోటా కింద ఉన్న 50 శాతం సీట్లలో రిజర్వేషన్లు పొందడానికి పిటిషనర్లు అర్హులని పేర్కొంటూ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇన్ సర్వీస్‌లోని వైద్యులు గరిష్టంగా గిరిజన ప్రాంతాల్లో మూడేళ్ల వైద్య సేవలు అందిస్తేనే వెయిటేజీ మార్కులు పొందేందుకు అర్హులంటూ తెలంగాణ ప్రభుత్వం జీవోలో పేర్కొన్న పేరాను హైకోర్టు తప్పుపట్టింది. జీవోలోని ఆ విభాగాన్ని ధర్మాసనం రద్దు చేస్తూ.. ఏడాది, రెండేళ్లు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించిన వైద్యులూ పీజీ మెడికల్ అడ్మిషన్లలో వెయిటేజీ మార్కులు పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది. -
12, 13న ‘పీజీ మెడికల్’ కౌన్సెలింగ్
నోటిఫికేషన్ జారీచేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్, డిప్లొమా సీట్ల అడ్మిషన్ల కోసం ఈ నెల 12, 13 తేదీల్లో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13 సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ కౌన్సెలింగ్ నిమ్స్ సహా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని పీజీ మెడికల్ సీట్లకు మాత్రమే నిర్వహించారు. ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల సీట్ల ఫీజుల వ్యవహారం తేలక పోవడంతో మొదటి విడత కౌన్సెలింగ్ ప్రభుత్వ సీట్లకే పరిమితమైంది. మంగళవారం పీజీ సీట్ల ఫీజుల పెంపుపై జీవో జారీచేయడంతో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ సీట్లతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మైనారిటీ కోటా సీట్లకు మాత్రం మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కాగా, మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ దాదాపు 600 సీట్లకు నిర్వహించగా, విద్యార్థులు చేరకపోవడంతో 238 సీట్లు మిగిలిపోయాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు మిగిలిపోయాయి. తదుపరి కౌన్సెలింగ్‌లో నిమ్స్ తదితర ప్రముఖ కాలేజీల్లో సీటు వస్తుందన్న ఆశతోనే చాలా మంది చేరలేదని భావిస్తున్నారు. -
ఆన్లైన్లో పీజీ మెడికల్ మూల్యాంకనం!
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఆన్లైన్ విధానంలో చేపట్టేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వర్సిటీలో సోమవారం నిర్వహించనున్న పాలకమండలి 221వ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తుండటంతో ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈవిధానంలో జవాబు పత్రాలను బార్కోడ్ చేసి భద్రపరిచి.. వాటిని ప్రొఫెసర్‌కు పంపించి ఆన్లైన్లోనే మూల్యాంకనం చేయించనున్నారు. దీనికి సంబంధించిన పాస్వర్డ్ ‘కీ’ని ప్రొఫెసర్‌కు ఇస్తారు. ఆన్లైన్ మూల్యాంకనం వల్ల ఫలితాలు త్వరగా విడుదల చే యొచ్చని చెబుతున్నారు. అలాగే ప్రతి సబ్జెక్టులో జవాబు పత్రాన్ని వేర్వేరు ప్రొఫెసర్లతో రెండు సార్లు మూల్యాంకనం చేయిస్తారు. ఇద్దరి మూల్యాంకనంలో తేడా 15 శాతం కంటే ఎక్కువ ఉంటే మూడోసారి వేరే ప్రొఫెసర్‌తో చేయిస్తారు. ఈ విధానంతో సత్ఫలితాలు వస్తే ఎంబీబీఎస్, బీడీఎస్‌కు కూడా ఆన్లైన్ మూల్యాంకనం చేయించాలనే యోచనలో అధికారులున్నారు. -
పీజీ మెడికల్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్
విజయవాడ: ఏపీలో పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈనెల 11న సర్వీస్ అభ్యర్థులకు, 16, 17 తేదీల్లో నాన్-సర్వీస్ అభ్యర్థులకు రెండో విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురాధ తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని ఆయా అభ్యర్థులు పైన తెలిపిన తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని కోరారు. ఇంతకుముందు ఒరిజినల్ సర్టిఫికె ట్ల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు నేరుగా ఆప్షన్లను పెట్టుకోవచ్చని వెల్లడించారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లలో పొందవచ్చు. తెలంగాణకు సంబంధించి రెండో విడత పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని రిజిస్ట్రార్ అనురాధ తెలిపారు. -
ముగిసిన పీజీ మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో నాన్ సర్వీస్, ఇన్‌సర్వీస్ సర్టిఫికెట్ల పరిశీలన ఆదివారంతో ముగిసింది. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన తెలంగాణ, ఏపీకి చెందిన దివ్యాంగ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా ఆదివారం ముగిసింది. ఏపీ అభ్యర్థులకు సంబంధించి హైదరాబాద్ జేఎన్టీయూలో 151, ఏయూలో 72, ఎస్వీ యూనివర్సిటీలో 49, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 379 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్సిటీ కింద జేఎన్టీయూ హైదరాబాద్‌లో 430, కాకతీయ యూనివర్సిటీలో 47, ఎన్టీఆర్ యూనివర్సిటీలో 223 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో కలిపి దివ్యాంగులకు జరిగిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో 20 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తెలంగాణలో నాన్ సర్వీస్ అభ్యర్థులకు జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సోమవారం 1,001 నుంచి 4వేల ర్యాంకుల వరకు ఆహ్వానించారు. -
22 నుంచి పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్(డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 22 నుంచి 26వ తే దీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురాధ తెలిపారు. ఈ మేరకు శనివారం హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని కళాశాలలకు కౌన్సెలింగ్ జరుగుతుందని రిజిస్ట్రార్ అనురాధ తెలిపారు. ఫిబ్రవరి 28న నిర్వహించిన ఎన్టీఆర్యూహెచ్ఎస్పీజీమెట్-2016-17లో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులు. మరిన్ని వివరాలు, కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ లేదా ఏపీకి చెందిన హెచ్‌టీటీపీ://ఏపీపీజీఎంఈడీ.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్ లేదా తెలంగాణకు చెందిన హెచ్‌టీటీపీ://టీఎస్పీజీఎంఈడీ.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్ వెబ్సైట్లలో పొందవచ్చు.