విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్(డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 22 నుంచి 26వ తే దీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురాధ తెలిపారు. ఈ మేరకు శనివారం హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని కళాశాలలకు కౌన్సెలింగ్ జరుగుతుందని రిజిస్ట్రార్ అనురాధ తెలిపారు. ఫిబ్రవరి 28న నిర్వహించిన ఎన్టీఆర్‌యూహెచ్‌ఎస్‌పీజీమెట్-2016-17లో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులు. మరిన్ని వివరాలు, కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్ లేదా ఏపీకి చెందిన హెచ్‌టీటీపీ://ఏపీపీజీఎంఈడీ.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఏసీ.ఇన్ లేదా తెలంగాణకు చెందిన హెచ్‌టీటీపీ://టీఎస్‌పీజీఎంఈడీ.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్లలో పొందవచ్చు.