Dr. NTR Health University
-
ఏప్రిల్ మొదటి వారంలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): 2017–18 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. నీట్ పీజీ మెడికల్ ర్యాంకుల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌లిస్టును తయారు చేస్తామన్నారు. అనంతరం ఏప్రిల్ మూడో వారంలో మొదటి విడత వెబ్ ఆప్షన్లకు గడువిచ్చి, అనంతరం 25వ తేదీ నుంచి 28వ తేదీలోపు సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తామని వెల్లడించారు. మే 1వ తేదీ నాటికి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. -
687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య సీట్లకు సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2017– 18 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఏదాది 687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. మొత్తం 11 వైద్య కళాశాలలుండగా అందు లో 8 కళాశాలల్లో మాత్రమే ప్రధాన విభాగాలకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. -
బీఎస్సీ నర్సింగ్ ఫలితాలు విడుదల
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ, తెలంగాణలో జూన్, జూలైలో నిర్వహించిన బీఎస్సీ (నాలుగేళ్లు, రెండేళ్ల పోస్టు బేసిక్) నర్సింగ్ డిగ్రీ ఫలితాలను మంగళవారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. కాగా విద్యార్థులు తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం ఈ నెల 10 లోగా సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి విజయకుమార్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఎస్వీ వర్సిటీ పరిధిలోని మొదటి నుంచి నాలుగో సంవత్సరం విద్యార్థులతోపాటు, పోస్టు బేసిక్ నర్సింగ్ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 29న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరుకావాలని తెలిపారు. అలాగే ఏయూ పరిధిలోని విద్యార్థులు ఈ నెల 30న, ఓయూ (తెలంగాణ) విద్యార్థులు 31న తమ హాల్‌టికెట్, కళాశాల గుర్తింపు కార్డుతో ఉదయం 11గంటలకు వర్సిటీలో హాజరవ్వాలన్నారు. ఈ బీఎస్సీ ఫలితాలు, మరిన్ని వివరాలను (హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్) వెబ్సైట్లో పొందవచ్చు. -
సెకండియర్ ఎంబీబీఎస్ ఫలితాలు విడుదల
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసింది. విద్యార్థుల తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం మే 13లోగా దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ తెలిపారు.ఫలితాలు వర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్) వెబ్సైట్లో పొందవచ్చు. -
22 నుంచి పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్(డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 22 నుంచి 26వ తే దీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురాధ తెలిపారు. ఈ మేరకు శనివారం హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని కళాశాలలకు కౌన్సెలింగ్ జరుగుతుందని రిజిస్ట్రార్ అనురాధ తెలిపారు. ఫిబ్రవరి 28న నిర్వహించిన ఎన్టీఆర్యూహెచ్ఎస్పీజీమెట్-2016-17లో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులు. మరిన్ని వివరాలు, కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ లేదా ఏపీకి చెందిన హెచ్‌టీటీపీ://ఏపీపీజీఎంఈడీ.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్ లేదా తెలంగాణకు చెందిన హెచ్‌టీటీపీ://టీఎస్పీజీఎంఈడీ.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్ వెబ్సైట్లలో పొందవచ్చు.