విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసింది. విద్యార్థుల తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం మే 13లోగా దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ తెలిపారు.ఫలితాలు వర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.