ఈ ఒక్కసారికి అనుమతి | relief to telangana students for neet counselling | Sakshi
Sakshi News home page

ఈ ఒక్కసారికి అనుమతి

Published Sat, Sep 21 2024 3:46 AM | Last Updated on Sat, Sep 21 2024 3:46 AM

relief to telangana students for neet counselling

స్థానికత విషయంలో గతంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు భారీ ఊరట 

నీట్‌ కౌన్సెలింగ్‌కు వారిని అనుమతిస్తున్నట్లు తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం 

ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచి్చన సుప్రీం ధర్మాసనం 

ప్రతివాదులకు నోటీసులు జారీ, అక్టోబర్‌ 14న తదుపరి విచారణ

సాక్షి, న్యూఢిల్లీ: నీట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన స్థానికత వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన కొందరు విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉండడంతో ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూఢ్, జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ ఏడాదికి గాను సదరు విద్యార్థులకు ఊరట కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

అయితే ఈ కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. వైద్యవిద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో 33ని తీసుకువచి్చంది. నీట్‌కు ముందు నాలుగేళ్లు స్థానికంగా చదివి ఉండాలని లేదా నివాసం ఉండాలని (జీవో 33 లోని నిబంధన 3 (ఏ)) పేర్కొంది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి నాగ నరసింహం అభిరామ్‌తో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తమకు అన్యాయం జరుగుతోందని నివేదించారు. 

హైకోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు రావడంతో.. ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిõÙక్‌ మను సింఘ్వీ, ప్రతివాదుల తరఫున సీనియర్‌ అడ్వకేట్‌లు మురళీధర్, నిరంజన్‌రెడ్డిలు వాదనలు వినిపించారు.  

4 తీర్పులు అనుకూలంగా ఉన్నాయి: సింఘ్వీ 
నీట్‌ పరీక్షలో స్థానికతకు సంబంధించి ప్రతి విద్యార్థి స్థానికుడై 9, 10తో పాటు ఇంటర్‌ రాష్ట్రంలో చదవాల్సి ఉందని సింఘ్వీ చెప్పారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనంతో పాటు నాలుగు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని కోర్టు కు నివేదించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు పాఠశాల లేదా కాలేజీ విద్య విదేశాల్లో చదివి నీట్‌ పరీక్ష మాత్రం తెలంగాణలో రాసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

ఇలా చేయడం వలన తెలంగాణలో మొదటి నుంచి చదువుకున్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యా ర్థులు తెలంగాణలో నీట్‌ తీసుకుంటున్నారని, అదే తెలంగాణ విద్యార్థులకు ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

ప్రభుత్వ జీవో సరికాదు 
ప్రభుత్వ వాదనలతో విభేదించిన విద్యార్థుల తరఫు న్యాయవాది మురళీధర్‌.. కేవలం రెండు, మూడేళ్ల చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే విద్యార్థులకు స్థానికతను దూరం చేయడం సరికాదని వాదించారు. నీట్‌ ఫలితాలకు వారం ముందు జీవో తెచ్చారని, అందుకే ఆ జీవోను హైకోర్టు నిలిపివేసిందని తెలిపారు.

ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని.. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన 371 (డీ) çపదేళ్ల తర్వాత ఎక్స్‌పైరీ అయ్యిందని, అందుకే పదేళ్ల తర్వాత ఈ కొత్త నిబంధనను ప్రభు త్వం తెచి్చందని తెలిపారు. అయితే వన్‌ టైం ఎక్సె ప్షన్‌ (ఒక్కసారికి మినహాయింపు) కింద ఈసారి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకా శం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సెప్టెంబర్‌ చివరి వారంలోనే తొలి, అక్టోబర్‌ మొదటి వారంలో రెండవ కౌన్సెలింగ్‌ ఉన్నందున కోర్టును ఆశ్రయించిన విద్యార్థుల మేలు కోరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 

మెరిట్స్‌లోకి వెళ్లే సమయం లేదు 
ఇరుపక్షాల వాదనల అనంతరం.. మెరిట్స్‌లోకి వెళ్లేంత సమయం లేదన్న సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో విద్యార్థులు నీట్‌ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్‌ 14వ తేదీకి వాయిదా వేసింది.  

హైకోర్టు ఏమంది? 
ఒక విద్యార్థి తెలంగాణ నివాసి లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావు ధర్మా సనం అభిప్రాయపడింది. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం రూపొందించే మార్గద ర్శకాల మేరకు ప్రతి విద్యార్థికి స్థానిక కోటా వర్తింపజేయాలని పేర్కొంది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభు త్వం ఈ నెల 11న సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement