BDS
-
బీడీఎస్ కన్వినర్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ వైద్య కళాశాలల్లో యూజీ డెంటల్ కోర్సుల్లో (బీడీఎస్) మొదటి ఏడాది ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) శనివారం విడుదల చేసింది. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వర్సిటీ వెల్లడించింది. tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. సీటు పొందిన అభ్యర్థులు వర్సిటీ ఫీజు రూ.12 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీకి ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.10 వేలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.45 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 డెంటల్ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. -
ఈ ఒక్కసారికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన స్థానికత వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన కొందరు విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉండడంతో ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూఢ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ ఏడాదికి గాను సదరు విద్యార్థులకు ఊరట కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.అయితే ఈ కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. వైద్యవిద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో 33ని తీసుకువచి్చంది. నీట్‌కు ముందు నాలుగేళ్లు స్థానికంగా చదివి ఉండాలని లేదా నివాసం ఉండాలని (జీవో 33 లోని నిబంధన 3 (ఏ)) పేర్కొంది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి నాగ నరసింహం అభిరామ్‌తో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తమకు అన్యాయం జరుగుతోందని నివేదించారు. హైకోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు రావడంతో.. ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీ, ప్రతివాదుల తరఫున సీనియర్ అడ్వకేట్లు మురళీధర్, నిరంజన్‌రెడ్డిలు వాదనలు వినిపించారు. 4 తీర్పులు అనుకూలంగా ఉన్నాయి: సింఘ్వీ నీట్ పరీక్షలో స్థానికతకు సంబంధించి ప్రతి విద్యార్థి స్థానికుడై 9, 10తో పాటు ఇంటర్ రాష్ట్రంలో చదవాల్సి ఉందని సింఘ్వీ చెప్పారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనంతో పాటు నాలుగు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని కోర్టు కు నివేదించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు పాఠశాల లేదా కాలేజీ విద్య విదేశాల్లో చదివి నీట్ పరీక్ష మాత్రం తెలంగాణలో రాసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.ఇలా చేయడం వలన తెలంగాణలో మొదటి నుంచి చదువుకున్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యా ర్థులు తెలంగాణలో నీట్ తీసుకుంటున్నారని, అదే తెలంగాణ విద్యార్థులకు ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ జీవో సరికాదు ప్రభుత్వ వాదనలతో విభేదించిన విద్యార్థుల తరఫు న్యాయవాది మురళీధర్.. కేవలం రెండు, మూడేళ్ల చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే విద్యార్థులకు స్థానికతను దూరం చేయడం సరికాదని వాదించారు. నీట్ ఫలితాలకు వారం ముందు జీవో తెచ్చారని, అందుకే ఆ జీవోను హైకోర్టు నిలిపివేసిందని తెలిపారు.ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని.. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన 371 (డీ) çపదేళ్ల తర్వాత ఎక్స్పైరీ అయ్యిందని, అందుకే పదేళ్ల తర్వాత ఈ కొత్త నిబంధనను ప్రభు త్వం తెచి్చందని తెలిపారు. అయితే వన్ టైం ఎక్సె ప్షన్ (ఒక్కసారికి మినహాయింపు) కింద ఈసారి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకా శం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సెప్టెంబర్ చివరి వారంలోనే తొలి, అక్టోబర్ మొదటి వారంలో రెండవ కౌన్సెలింగ్ ఉన్నందున కోర్టును ఆశ్రయించిన విద్యార్థుల మేలు కోరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మెరిట్స్‌లోకి వెళ్లే సమయం లేదు ఇరుపక్షాల వాదనల అనంతరం.. మెరిట్స్‌లోకి వెళ్లేంత సమయం లేదన్న సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఏమంది? ఒక విద్యార్థి తెలంగాణ నివాసి లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మా సనం అభిప్రాయపడింది. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం రూపొందించే మార్గద ర్శకాల మేరకు ప్రతి విద్యార్థికి స్థానిక కోటా వర్తింపజేయాలని పేర్కొంది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభు త్వం ఈ నెల 11న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో.. యాజమాన్య కోటాకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల యాజమాన్య కోటా.. గత ఏడాది ప్రారంభించిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్.. స్వీమ్స్‌లో ఎంబీబీఎస్ సీట్ల ఎన్ఆర్ఐ కోటాలో ప్రవేశాల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. నీట్ యూజీ–2024 అర్హత సాధించిన విద్యార్థులు బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇందుకు ఈనెల 21వ తేదీ రాత్రి 9 గంటల వరకు గడువు విధించారు. అలాగే, శుక్రవారం (16వ తేదీ) సా.7 గంటల నుంచి ఆదివారం (18వ తేదీ) రాత్రి 9 గంటల వరకూ ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉండదని.. ఈ సమయంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదని వర్సిటీ వెల్లడించింది. ఈ వ్యవధిలో కన్వీనర్ కోటాలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదని తెలిపారు. ఏపీ ఆన్లైన్ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ సర్వర్లు మెయింటెనెన్స్‌లో ఉండడంవల్ల ఈ అంతరాయం ఉంటుందని సమాచారం. యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు సమయంలో విద్యార్థులు రూ.10,620ల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ.30,620ల ఆలస్య రుసుముతో 21వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 23వ తేదీ సా.6 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో నియమ నిబంధనల్లో సందేహాల నివృత్తికి 8978780501, 7997710168.. సాంకేతిక సమస్యలపై 9000780707 నెంబర్లను సంప్రదించాల్సిందిగా రిజి్రస్టార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. దళారుల మాటలు నమ్మొద్దు.. నీట్ యూజీ మెరిట్ స్కోర్ ఆధారంగా నియమ నిబంధనలకు లోబడి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కేటాయింపు ఉంటుందని.. తల్లిదండ్రులు, విద్యార్థులు దళారుల మాయమాటలు నమ్మొద్దని రాధికారెడ్డి సూచించారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ 225.. ఎన్ఆర్ఐ కోటా 95 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఉచితంగా అందజేస్తామని టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి0ది. అధికారంలోకి వచ్చాక దానిని తుంగలో తొక్కి ఎంబీబీఎస్ సీట్లను అమ్మకానికి పెట్టారు. మరోవైపు.. స్విమ్స్‌లో 23, ఎన్ఆర్ఐ–ప్రైవేట్, మైనారిటీ వైద్య కళాశాలల్లో 1,078 బీ–కేటగిరి, 472 ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. దంత వైద్య కళాశాలల్లో 489 బీ–కేటగిరి, 211 ఎన్ఆర్ఐ బీడీఎస్ సీట్లున్నాయి. -
నారాయణ మెడికల్ కాలేజీలో దారుణం
-
మార్కులు పెరిగినా.. ర్యాంకులు ఢమాల్!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య కోర్సులు ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలకు ఈసారి విపరీతమైన పోటీ నెలకొంది. గత రెండేళ్లతో పోలిస్తే ఎక్కువ మార్కులు సాధించినవారికి సైతం ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎక్కువ మార్కులు సాధించినా ర్యాంకులు వేలల్లోకి చేరడంతో ఎక్కడ సీటు దక్కుతుందన్నదీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. 2024–25 విద్యా సంవత్సరానికిగాను యూజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ కోసం వెబ్సైట్లో రిజి్రస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఆలిండియా కోటా (ఏఐక్యూ)కు సంబంధించిన కౌన్సెలింగ్ ఈనెల 14వ తేదీ నుంచి మొదలవనుంది. తొలుత ఆలిండియా కోటా సీట్ల కౌన్సెలింగ్ పూర్తిచేసి.. తర్వాత రాష్ట్ర స్థాయి సీట్లను భర్తీ చేస్తారు.లీకేజీ గందరగోళం మధ్య.. ⇒ ఈ ఏడాది యూజీ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం విద్యార్థుల ను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. ఫలితాలు వెలువడ్డాక సుప్రీంలో కేసులు, వాదప్రతివాదనల అనంతరం కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. దీనితో కాస్త ఆలస్యంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడ్డాయి. వాటిని చూసుకున్న అభ్యర్థు లు సీటు వస్తుందా? రాదా? వస్తే ఎక్కడ రావొచ్చన్న ఆందోళనలో పడ్డారు.మార్కులు ఘనం.. ర్యాంకు పతనం.. ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంకు సాధించిన విద్యార్థికి వచి్చన మార్కులు 711, ఆలిండియా స్థాయిలో వచి్చన ర్యాంకు 137. అదే 2022 యూజీ నీట్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి 711 మార్కులేరాగా.. జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు వచి్చంది. మంచి మార్కులు వచి్చనా.. ఆలిండియా ర్యాంకు బాగా తగ్గిపోయింది. పోటీ విపరీతంగా పెరగడం, చాలా మంది విద్యార్థులకు మార్కులు పెరగడమే దీనికి కారణం. మెరుగైన మార్కులు సాధించామనుకున్న విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రం తగ్గిపోవడంతో ఆందోళనలో పడ్డారు. దీంతో ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రధానంగా ఆలిండియా కోటా సీట్ల విషయంలో సీటు ఎక్కడ వస్తుందనేది అంచనా వేసే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లోనూ అయోమయంప్రస్తుతం రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదలవడంతో విద్యార్థులు రిజి్రస్టేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ కాలేజీలో సీటు వస్తుందనేది అంచనా వేసుకుంటున్నారు. కానీ ఏపీకి 15% కోటా సీట్లు రద్దు, స్థానికతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మార్కులు, ర్యాంకుల తీరు మారడం వంటివి విద్యార్థుల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. కాలేజీల వారీగా సీట్లు, రిజర్వేషన్ కోటా ప్రకా రం విభజించి పరిశీలిస్తేనే ఏదైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని సీని యర్లు అభిప్రాయపడుతున్నారు. ఆలిండియా కోటాను మినహాయించి రాష్ట్ర స్థాయిలో సీట్ మ్యాట్రిక్స్ విడుదలైతేనే స్పష్టత వస్తుందని అంటున్నారు. -
14 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) కౌన్సెలింగ్ తాత్కాలిక షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. మరోవైపు రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ నిర్వహణకు డాక్టర్వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో నీట్ యూజీ–2024లో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలతో సన్నద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తొలుత అఖిల భారత కోటా.. నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో భాగంగా తొలుత అఖిల భారత కోటా (ఏఐక్యూ) కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15 శాతం, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిప్మెర్ వంటి జాతీయ సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ఉంటుంది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌కు చెందిన ఎంసీసీ ఏఐక్యూ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర విద్యార్థులయినా ఏఐక్యూలో సీట్లు పొందొచ్చు. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ఇలా.. తొలి విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్ ముగిశాక రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 16 ప్రైవేట్, రెండు మైనారిటీ వైద్య కళాశాలలతోపాటు శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం ఏఐక్యూలో, మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర స్థాయిలో భర్తీ చేస్తారు. రాష్ట్రంలో అన్ని రకాల కళాశాలల్లో 6,209 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ, పద్మావతి వైద్య కళాశాలల్లోని 460 ఎంబీబీఎస్ సీట్లను ఏఐక్యూలో భర్తీ చేస్తారు. కన్వినర్, బీ, సీ కేటగిరీలకు వేర్వేరుగా కౌన్సెలింగ్ చేపడతారు. రాష్ట్ర కోటాకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నీట్ ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ఆ మెరిట్ జాబితా ఆధారంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేపడతారు. అంతా ఆన్లైన్లోనే ఇక ఏఐక్యూ, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ అంతా కూడా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడం, రాష్ట్ర స్థాయి ర్యాంక్‌ల కేటాయింపు, కావాల్సిన కళాశాలల ఆప్షన్ల నమోదు, సీట్లు కేటాయింపు ఇలా కౌన్సెలింగ్ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ http:// drysruhs.edu.in/ index.html లో ప్రకటిస్తుంది. నీట్ యూజీ కౌన్సెలింగ్‌కు కావాల్సిన ధ్రువపత్రాలు» నీట్ యూజీ– 2024 ర్యాంక్ కార్డ్ » పుట్టిన తేదీ ధ్రువీకరణ (పదో తరగతి మార్కుల మెమో) » 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు » ఇంటర్మీడియెట్ స్టడీ, ఉత్తీర్ణత సర్టిఫికెట్లు » ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (ఇంటర్/10+2) » కుల ధ్రువీకరణ » ఆధార్ కార్డు » దివ్యాంగ ధ్రువీకరణ పత్రం » విద్యార్థి తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అర్హులు 43,788 మంది నీట్ అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితా విడుదల డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) నుంచి అందిన నీట్ యూజీ–2024 అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. 43,788 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు పేర్కొంది. 715 స్కోర్ సాధించి జాతీయ స్థాయిలో 44వ ర్యాంక్‌తో కె.సందీప్ చౌదరి తొలి స్థానంలో నిలవగా.. అదే స్కోర్‌తో గట్టు భానుతేజ సాయి(50), పి.పవన్‌కుమార్ రెడ్డి (81), వి.ముఖేష్ చౌదరి(150) తర్వాతి స్థానాల్లో నిలిచారు. మొత్తంగా రాష్ట్రం నుంచి 61 మంది 700, ఆపైన స్కోర్ సాధించారు. 2,349 మంది 600, ఆపైన స్కోర్ చేశారు. ఈ జాబితాను మెరిట్ లిస్ట్‌గా పరిగణించవద్దని తల్లిదండ్రులు, విద్యార్థులకు విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. -
నీట్లో ఏపీ విజయదుందుభి
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2024 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 23,33,297 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 13,16,268 మంది అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 64,931 మంది పరీక్ష రాయగా 43,858 మంది అర్హులుగా నిలిచారు. అలాగే తెలంగాణలో 77,849 మందికి గాను 47,371 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో 9.98 లక్షల మంది అబ్బాయిలు నీట్ రాయగా 5.47 లక్షల మంది, 13.34 లక్షల మంది అమ్మాయిలు పరీక్ష రాయగా 7.69 లక్షల మంది అర్హులుగా నిలిచారు. గత నెల 5న దేశవ్యాప్తంగా 571 నగరాలు, పట్టణాలతోపాటు విదేశాల్లో 14 నగరాల్లో నీట్ యూజీని నిర్వహించారు.సత్తా చాటిన రాష్ట్ర విద్యార్థులునీట్ రాసిన విద్యార్థుల్లో 68 మంది విద్యార్థులు 99.99 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్లుగా నిలిచారు. కాగా, మహారాష్ట్రకు చెందిన వి.సునీల్ షిండే, తమిళనాడుకు చెందిన సయ్యద్ ఆరి్ఫన్ యూసఫ్.ఎం, ఢిల్లీకి చెందిన ఎం.ఎం.ఆనంద్ మొదటి ర్యాంక్ సాధించిన వారిలో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కె. సందీప్ చౌదరి (21వ స్థాన), జి. భానుతేజ సాయి(29వ స్థానం), పోరెడ్డి ప్రవీణ్‌కుమార్ రెడ్డి(56వ స్థానం), వి. ముకేష్ చౌదరి(60వ స్థానం)లో నిలిచి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్లుగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనూ వీరే టాప్ ర్యాంకర్లుగా ఉన్నారు. పెరిగిన కటాఫ్‌లు నీట్–2023తో పోలిస్తే ఈ ఏడాది అన్ని విభాగాల్లో కటాఫ్ మార్కులు భారీగా పెరిగాయి. అన్ రిజర్వుడ్ /ఈడబ్ల్యూఎస్ విభాగంలో గతేడాది 720–137 కటాఫ్ మార్కులు ఉండగా ఈ ఏడాది 720–164 మధ్య ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 136–107 నుంచి 163–129కు కటాఫ్‌లు పెరిగాయి. పీహెచ్ యూఆర్/ఈడబ్ల్యూఎస్ విభాగంలో 136–121 నుంచి 163–146, పీహెచ్ ఓబీసీ, ఎస్సీ విభాగాల్లో 120–107 నుంచి 145–129కు, పీహెచ్ ఎస్టీలో 120–108 నుంచి 145–129కు కటాఫ్ మార్కులు ఎగబాకాయి. -
నేడు నీట్ యూజీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ యూజీ–2024)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.పెన్ అండ్ పేపర్ మోడ్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది, నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు, పలు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.24 లక్షల మందికి పైగా..ఈ ఏడాది దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ యూజీ రాయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. అయితే గతేడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 42,836 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది 70 వేల మందికిపైగా పరీక్ష రాసే అవకాశం ఉంది. 706 కళాశాలల్లో లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లునీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 706 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ కళాశాలల్లో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 5,360 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, పాడేరుల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మరో 500 సీట్లు కొత్తగా సమకూరనున్నాయి.విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు∗ పెన్ను, అడ్మిట్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీసుకెళ్లాలి.∗ ఆధార్, పాన్, ఓటరు ఐడీ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తీసుకెళ్లాలి.∗ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.∗ ఉంగరాలు, చెవి పోగులు, నగలు, ఆభరణాలు వంటివి ధరించకూడదు. -
నీట్ ర్యాంకు.. మాక్ టెస్టులే కీలకం
సాక్షి, అమరావతి: దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీని మే 5న నిర్వహించనున్నారు. పరీక్షకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మంచి ర్యాంక్ సాధించడంలో మాక్ టెస్టులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు రోజుకు ఒకటి చొప్పున మాక్ టెస్ట్ రాయడం మంచిదంటున్నారు. ప్రతి మాక్ టెస్ట్ తర్వాత స్వయంవిశ్లేషణ చేసుకుని.. బలహీనంగా ఉన్న విభాగాలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో ప్రయోజనం.. ఈ ఏడాది నీట్ సిలబస్‌లో చాలా మార్పులు చేశారు. దాదాపు 18 అంశాలను సిలబస్ నుంచి తొలగించారు. బయాలజీ, కెమిస్ట్రీల్లో కొన్ని కొత్త అంశాలను జోడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌లో లేని అంశాల జోలికి విద్యార్థులు వెళ్లకపోవడం ఉత్తమం. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు నీట్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాయని.. వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి 70 వేల మంది.. నీట్ యూజీ రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది 23.80 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. గతేడాది 20.87 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే గతేడాది ఆంధ్రప్రదేశ్ నుంచి 68 వేల మంది నీట్ రాయగా 42 వేల మంది అర్హత సాధించారు. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 70 వేల మందికిపైగా నీట్ రాసే అవకాశాలున్నాయి. గతేడాది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వరుణ్ చక్రవర్తి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. తరచూ పునశ్చరణ చేయాలి.. ఎన్సీఈఆర్టీ బయాలజీ, కెమిస్ట్రీ ప్రతి అధ్యాయంలో ముఖ్యమైన అంశాలతో షార్ట్స్ నోట్స్ రాసుకోవాలి. వాటిని తరచూ పునశ్చరణ చేస్తూ ఉండాలి. బయాలజీలో ప్లాంట్ అండ్ యానిమల్, హ్యూమన్ ఫిజియాలజీ, మార్ఫాలజీ, జెనెటిక్స్, ఎకాలజీ, బయోటెక్నాలజీ, రీప్రొడక్షన్ వంటివి ముఖ్యమైన అధ్యాయాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు. పరీక్షకు తక్కువ సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో కొత్త విషయాలు, అంశాలు నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించకపోవడం ఉత్తమం. – కె. రవీంద్రకుమార్, నీట్ కోచింగ్ నిపుణులు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ రోజు సిలబస్ ఆ రోజే పూర్తి చేయాలి.. పరీక్షలకు అందుబాటులో ఉన్న సమయాన్ని సరిగ్గా సది్వనియోగం చేసుకోవాలి. ఏ రోజు సిలబస్‌ను ఆ రోజే పూర్తి చేస్తే ఒత్తిడి ఉండదు. నా స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీ చేసేవాడిని. వారితో కలిసి మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల మాలో మాకు మంచి పోటీ ఉండేది. అత్యుత్తమ ప్రతిభ కనబరచడంలో గ్రూప్ స్టడీ నాకు ఎంతో మేలును చేకూర్చింది. ప్రశ్నను చదవడం, అర్థం చేసుకోవడంలో పొరపాటు చేయొద్దు. పరీక్ష రాసేప్పుడు తొలుత బయాలజీ సెక్షన్ పూర్తి చేసి, తర్వాత ఫిజిక్స్, చివరలో కెమిస్ట్రీ రాయడం మంచిదని నా అభిప్రాయం. – వరుణ్ చక్రవర్తి, నీట్ యూజీ–2023, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ -
మొక్కుబడిగా ‘స్థానిక’ ధ్రువీకరణ పత్రాలిస్తారా?
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) అడ్మిషన్ల భర్తీ కోసం ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల తీరు ఆక్షేపణీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానికత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణకు చెందిన వారో.. కాదో విచారణ చేసి సర్టీ ఫికెట్ ఇవ్వాలి తప్ప, మొక్కబడిగా ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో తహసీల్దార్లకు తగిన సూచనలు చేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో చదివి తిరిగి తెలంగాణకు వచ్చిన విద్యార్థులకు ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఇందులో ఫలానా చోట రెండేళ్లుగా నివాసం ఉంటున్నారని మాత్రమే జారీ చేయడంతో వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆమోదించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన వైద్య విద్య అడ్మిషన్ల నిబంధనల కారణంగా తెలంగాణకు చెందిన వారైనప్పటికీ సీట్లు కోల్పోతున్నారని, తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతర కారణాలతో ఒకట్రెండేళ్లు పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వారికి స్థానిక కోటా కింద సీటు నిరాకరించడం తగదని ఇటీవల సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎటూ తేల్చని విధంగా ఇస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో స్థానికతపై స్పష్టత ఇస్తూ సర్టి ఫికెట్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
వైద్య విద్య యూజీ కోర్సుల ఫీజుల ఖరారు
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఫీజుల అమలు ఉంటుందని పేర్కొన్నారు. 2022–23లో అమలైన ఫీజులపై 10% మేర పెంపుదల చేసి కొత్త ఫీజులను ఖరారు చేశారు. ఎంబీబీఎస్ కన్వనర్ కోటా ఫీజును రూ.16,500గా నిర్ణయించారు. బీ కేటగిరికి రూ.13.20 లక్షలు, సీ కేటగిరి (ఎన్ఆర్ఐ కోటా)కు రూ.39.60 లక్షలు చొప్పున ఫీజులు ఉన్నాయి. బీడీఎస్ కన్వనర్ కోటాకి రూ.14.300..బీ కేటగిరీకి రూ.4.40 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకి రూ.13.20 లక్షలు చొప్పున ఫీజు ఖరారు చేశారు. 2020లో ఖరారు చేసిన ఫీజుల ప్రకారం 2022–23 విద్యా సంవత్సరం వరకు ప్రవేశాలు చేపట్టారు. నీట్ యూజీ–2023లో ఏపీలో 42,836 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ యూజీ అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకుంటున్నారు. వ్యాయామ కళాశాలల్లో కోర్సులకు ఇలా.. ప్రైవేట్, అన్–ఎయిడెడ్ వ్యాయామ కళాశాలల్లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసుల మేరకు 2023–26 విద్యా సంవ్సతరానికి ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. కన్వనర్ కోటా కింద రెండేళ్ల కోర్సుల్లో భాగంగా డిప్లొమో (డీపీఈడీ)కు రూ.14 వేల నుంచి రూ.16 వేలు, బ్యాచ్‌లర్ (బీపీఈడీ)కు రూ.15 వేల నుంచి రూ.24,500, మాస్టర్స్ (ఎంపీఈడీ)కు రూ.25 వేల నుంచి రూ.35 వేల మధ్య ఆయా కళాశాలల్లోని వసతులు, విద్యా బోధనను బట్టి ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోని ఒక కళాశాలతో పాటు, గత అడ్మిషన్లలో 25% కంటే తక్కువ నమోదైన 5 కళాశాలలకు అడ్మిషన్లను 2023–26 విద్యా సంవత్సరానికి బ్లాక్ చేసినట్లు ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. -
ఎంబీబీఎస్ అన్ రిజర్వుడ్ సీట్లు ఏపీ విద్యార్థులకే
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ అన్ రిజర్వుడ్ సీట్లు ఏపీ విద్యార్థులకే లభించనున్నాయి. 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, నాన్ మైనారిటీ వైద్య, దంత కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో వంద శాతం ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. యూజీ, పీజీ కోర్సుల్లో 100 శాతం కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లను ఏపీ విద్యార్థులకు కేటాయించాలని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని కోరారు. ఈ క్రమంలో మన విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో 2014 జూన్ 2 తర్వాత ఏర్పడ్డ వైద్య కళాశాలలతోపాటు కొత్తగా మంజూరైన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను సైతం ఏపీ విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ కళాశాలల్లో అన్ రిజర్వుడ్ సీట్లు కూడా మనకే దక్కనున్నాయి. ఇప్పటివరకు ఇలా.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తున్నారు. మిగిలిన సీట్లను రాష్ట్ర కోటా కింద ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తోంది. కాగా, ఆల్ ఇండియా కోటాకు పోగా మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక, 15 శాతం అన్ రిజర్వుడ్ విభాగాల కింద భర్తీ చేసేవారు. అలాగే ప్రైవేట్ కళాశాలల్లో 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద ఉండేవి. ఈ సీట్లలో 15 శాతం సీట్లను అన్ రిజర్వుడ్ కింద భర్తీ చేసేవారు. దీంతో అన్ రిజర్వుడ్ విభాగంలో తెలంగాణ విద్యార్థులు పోటీపడి సీట్లు పొందుతూ వచ్చారు. ఇక నుంచి ఇలా.. 2014 జూన్ 2 తర్వాత ఏర్పడిన కళాశాలలు, కొత్తగా మంజూరైన సీట్లలో 15 శాతంలోనూ తెలంగాణ విద్యార్థులకు కాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే అవకాశం ఉంటుంది. ఏపీ స్థానికత కలిగిన విద్యార్థులు ఈ సీట్లలో ప్రవేశాలు పొందొచ్చు. దీంతో పాటు వేరే రాష్ట్రంలో చదువుకున్న కాలం మినహాయించి రాష్ట్రంలో పదేళ్లు నివసించిన విద్యార్థులు/పదేళ్ల పాటు రాష్ట్రంలో నివసించిన పౌరుల పిల్లలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తారు. అలాగే ప్రైవేటు కళాశాలల్లోని అన్ రిజర్వుడ్ సీట్లను కూడా మన రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తారు. అంటే.. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 100 శాతం సీట్లు (ఆల్ ఇండియా కోటా మినహాయించి) ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కనున్నాయి. అన్ రిజర్వుడ్ విభాగంలో తెలంగాణ విద్యార్థులకు ఇక అవకాశం ఉండదు. 219 అన్ రిజర్వుడ్ సీట్లు మన విద్యార్థులకే.. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ఐదు వైద్య కళాశాలలను ప్రారంభిస్తోంది. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఉన్నాయి. ప్రతి చోట ఆల్ ఇండియా కోటా 15 శాతం సీట్లు పోగా 128 చొప్పున సీట్లు రాష్ట్ర కోటాలోకి వస్తాయి. వీటితో కలిపి 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన కళాశాలల్లో 1,290 సీట్లు రాష్ట్ర కోటాలోకే వస్తాయి. వీటిలో 15 శాతం అంటే 193 సీట్లు అన్ రిజర్వుడ్ విభాగంలో ఉంటాయి. అలాగే 2014 తర్వాత కొత్తగా మంజూరైన సీట్లలో 26కు పైగా సీట్లు అన్ రిజర్వుడ్ విభాగంలోకి వస్తాయి. ఇలా 219 సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే దక్కనున్నాయి. కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో మాత్రమే కాకుండా వైద్య విద్య పీజీ సీట్లలోను 15 శాతం అన్ రిజర్వుడ్ కోటా సీట్లలో మన రాష్ట్ర విద్యార్థులకే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. -
త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మెడికల్ తదితర వైద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కసరత్తు పూర్తి చేసింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఫీజులను సవరించనుంది. ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సహా ఇతర కోర్సుల ఫీజులను మూడేళ్లకోసారి సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఏడాదికోసారి 5 శాతం చొప్పున సవరించాలన్న నిర్ణయాన్ని మార్పు చేశారు. ఆ ప్రకారం ఈ సారి తప్పనిసరిగా ఫీజుల సవరణ జరుగుతుందని హెల్త్ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రైవేటు కాలేజీ ల్లో మెడికల్ కోర్సుల ఫీజులు రూ. లక్షల్లో ఉండగా త్వర లో అంతకు మించి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో మెడికల్ కాలేజీకి ఒక్కో ఫీజు... ఇప్పటివరకు రాష్ట్రంలో మెడికల్ కోర్సుల ఫీజులు ఒకే రీతిన ఉన్నాయి. ఇకపై ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజు ఉండనుంది. ఆ ప్రకారమే ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సహా ఇతర వైద్య కోర్సుల ఫీజులుంటాయి. అందుకు అనుగుణంగానే కాలేజీలవారీగా ఆడిట్ రిపోర్టులను టీఏఎఫ్ఆర్సీ తీసుకుంది. వాటి ఆధారంగానే ఫీజుల సవరణ చేయనుంది. ఇందులో కాలేజీల నిర్వహణ ఖర్చులు మొదలు, బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, ల్యాబ్‌ల నిర్వహణ తదితర పూర్తిస్థాయి సమాచారం సేకరించారు. ఈ ఖర్చులు గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఒక రకంగా ఉంటే పట్టణ ప్రాంతాల్లోని కాలేజీల్లో మరో రకంగా ఉంటాయి. ఈ దిశగా కాలేజీవారీగా ఆడిట్ నివేదికలు పరిశీలించిన టీఏఎఫ్ఆర్సీ ఫీజుల సవరణపై ఒక అంచనాకు వచ్చింది. కాలేజీలవారీగా ఫీజుల పెంపు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమరి్పంచినట్లు తెలిసింది. దీంతో ఫీజుల పెంపు వ్యవహారంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కొన్ని కాలేజీల్లో 20 శాతం వరకు పెరిగే అవకాశం.. ప్రస్తుతమున్న ఫీజులను కొన్ని కాలేజీలు 20 శాతం వరకు పెంచాలని కోరగా మరికొన్ని 10 శాతం, కొన్ని 5 శాతం, ఇంకొన్ని యథాతథంగా ఉంచాలని కోరినట్లు సమాచారం. ప్రైవేటు కాలేజీల్లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఏ–కేటగిరీ (కన్వినర్) ఫీజు రూ. 60 వేలు ఉండగా బీ–కేటగిరీ ఫీజు రూ. 11.55 లక్షలుగా ఉంది. ఇక సీ–కేటగిరీ (ఎన్ఆర్ఐ) అడ్మిషన్ ఫీజు బీ–కేటగిరీకి రెట్టింపు అంటే రూ. 23.10 లక్షల వరకు వసూలు చేసుకొనే వీలుంది. ఇక పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏ–కేటగిరీ ఫీజు రూ. 7.5 లక్షలు, బీ–కేటగిరీ రూ. 28 లక్షల నుంచి రూ. 30 లక్షల చొప్పున ఉన్నాయి. బీడీఎస్ కోర్సులకు సంబంధించి ఏ–కేటగిరీ ఫీజు రూ. 45 వేలు ఉండగా బీ–కేటగిరీ ఫీజు రూ. 4.2 లక్షలు, ఇక సీ–కేటగిరీ ఫీజు బీ–కేటగిరీ కంటే రెట్టింపు వసూలు చేసుకోవచ్చు. వాటితోపాటు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, హోమియోపతి, పారామెడికల్ కోర్సులకు సంబంధించిన ఫీజులు కూడా కాలేజీలవారీగా భిన్నంగా ఉన్నాయి. -
ఏ ర్యాంక్‌కు ఎక్కడ మెడికల్ సీటొస్తుంది?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2023 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 68,578 మంది విద్యార్థులు నీట్ రాయగా 42,836 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజిలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకొంటున్నారు. కాలేజీల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,185 సీట్లు 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఒక్కో కాలేజిలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇది విద్యార్థులకు వరమే. వీటితో కలుపుకొంటే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 2,935కు పెరుగుతాయి. వీటిలో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు గత ఏడాది నుంచి బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్ర వైద్య కళాశాలలో ఇలా సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కాలేజిలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కాలేజిలో గత ఏడాది (2022–23) ఎస్టీ విభాగంలో 456 స్కోర్‌తో 120176 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 76695 ర్యాంక్, బీసీ–ఏలో 25137, బీసీ–బిలో 31874, బీసీ–సిలో 26291, బీసీ–డిలో 17632, బీసీ–ఈలో 68801, ఓసీ కేటగిరీలో 15652, ఈడబ్ల్యూఎస్‌లో 19907 ర్యాంక్ వారికి చివరి సీట్లు వచ్చాయి. దాని తర్వాతి స్థానాల్లో గుంటూరు, కర్నూలు, కాకినాడ తదితర ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి. గుంటూరు వైద్య కళాశాలలో ఓసీ విభాగంలో 22531, ఈడబ్ల్యూఎస్‌లో 26162, బీసీ–ఎలో 46529, బీసీ–బిలో 36192, బీసీ–సిలో 42535, బీసీ–డిలో 32830, బీసీ–ఈలో 65595, ఎస్సీలో 94801, ఎస్టీ విభాగంలో 132580 ర్యాంక్ వరకూ సీట్లు వచ్చాయి. కర్నూలు వైద్య కళాశాలలో ఓసీ కేటగిరీలో 20419, బీసీ–ఎలో 46268, బీసీ–బిలో 34676, బీసీ–సిలో 32239, బీసీ–డిలో 45304, బీసీ–ఈలో 36371, ఈడబ్ల్యూఎస్‌లో 26954, ఎస్సీలో 91270, ఎస్టీ విభాగంలో 115105 ర్యాంక్ వరకు విద్యార్థులు సీట్లు సాధించారు. కాకినాడ రంగరాయలో ఓసీ విభాగంలో 25622, బీసీ–ఎలో 48837, బీసీ–బిలో 47893, బీసీ–సిలో 44104, బీసీ–డిలో 31589, బీసీ–ఈలో 89637, ఈడబ్ల్యూఎస్‌లో 31333, ఎస్సీలో 97913, ఎస్టీ కేటగిరీలో 143288 ర్యాంక్‌ల వరకూ సీట్లు లభించాయి. -
బీడీఎస్ కన్వీనర్ సీట్లకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల వెబ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం మాప్ అప్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయిందని, కన్వీనర్ కోటలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు 5వ తేదీ మధ్యా హ్నం 3 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసు కోవాల ని సూచించింది. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కం టిన్యూ చేసినా, ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది. వివరాలకు www.knruhs. telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు. -
ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకుగాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని విశ్వవిద్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. -
NEET 2021: నీట్ రాసారా.. ఇది మీ కోసమే!
నీట్–యూజీ–2021. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల(సెప్టెంబర్) 12న జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్ష! ఇందులో ర్యాంకు ఆధారంగా.. మెరిట్ లిస్ట్, ఫైనల్ కటాఫ్‌లను నిర్ణయించి.. ఆల్ ఇండియా కోటా.. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో కన్వీనర్ కోటా విధానంలో సీట్లు భర్తీ చేస్తారు!! నీట్ యూజీ ఈసారి క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు..పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు లభించే అవకాశం ఉందని భావించే విద్యార్థులు! మరోవైపు.. పరీక్ష సరిగా రాయలేక పోయామని.. ఆశించిన ర్యాంకు రాకపోవచ్చని ఆవేదన చెందే విద్యార్థులు! ఫలితాలు వెలువడటానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. నీట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిపుణుల సలహాలు.. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ 2021కు దాదాపు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నీట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 59,951 మంది, తెలంగాణ నుంచి 59,069 మంది దరఖాస్తు చేసుకున్నారు. ‘గత ఏడాదితో పోల్చితే నీట్ ఈసారి క్లిష్టంగా ఉంది. 450 మార్కులకు పైగా వచ్చిన వారికి సీటు లభించే అవకాశం ఉంది’ అని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్) 450 కంటే ఎక్కువ నీట్‌ను మొత్తం 720 మార్కులకు నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరై.. 450 కంటే ఎక్కువ మార్కులు వస్తాయని భావిస్తున్న విద్యార్థులు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలోని మెడికల్, డెంటల్ కళాశాలల వివరాలు తెలుసుకోవడంపై దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ఫలితంగా కౌన్సెలింగ్ సమయంలో ప్రాథమ్యాలుగా పేర్కొనాల్సిన కాలేజీలపై స్పష్టత వస్తుంది. కౌన్సెలింగ్‌కు సన్నద్ధం నీట్లో మెరుగైన ప్రతిభ చూపామని, సీటు ఖాయమని భావించే విద్యార్థులు.. కౌన్సెలింగ్‌కు సన్నద్ధమవ్వాలి. కౌన్సెలింగ్ సమయంలో అవసరమయ్యే అన్ని రకాల ధ్రువ పత్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తదితర ధ్రువ పత్రాలను వీలైనంత ముందుగా ఫలితాలు వెలువడేలోపు పొందేందుకు కసరత్తు చేయాలి. (ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు...) ముందుగా ఆల్ ఇండియా కోటా ప్రస్తుతం నీట్–యూజీ ప్రవేశాలను ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అనే రెండు విధానాల్లో నిర్వహిస్తున్నారు. ముందుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాలో.. అన్ని రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. వీటికి స్థానికత, పుట్టిన రాష్ట్రం తదితర అంశాలతో సంబంధం లేకుండా.. ఏ రాష్ట్ర విద్యార్థులైనా దరఖాస్తు చేసుకొని..ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. గతేడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం–ఆల్ ఇండియా కోటాలో దాదాపు 6,700 ఎంబీబీఎస్ సీట్లు; నాలుగు వేల బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కౌన్సెలింగ్ సమయానికి ఈ సంఖ్యలో మార్పులు,చేర్పులు జరిగే అవకాశముంది. (చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!) రాష్ట్రాల స్థాయిలో కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ముగిశాక.. రాష్ట్రాల స్థాయిలో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల హెల్త్ యూనివర్సిటీలు వేర్వేరుగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. వీటికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు పేర్కొన్న కాలేజ్, సీటు ప్రాథమ్యాలు; వారు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తారు. కాలేజ్ ఎంపిక ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల విషయంలో ఏ కాలేజ్‌లో సీటు వచ్చినా ఓకే అనుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కారణం..సీట్ల పరిమితే! కానీ నీట్లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కళాశాలలో చేరేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు నాణ్యమైన ఇన్స్టిట్యూట్లో చేరేలా ప్రాథమ్యాలను ఇవ్వాలి. ప్రత్యామ్నాయ మార్గాలు నీట్ పరీక్షను ఆశించిన విధంగా రాయలేదని భావిస్తున్న విద్యార్థులు.. ప్రత్యామ్నాయ కోర్సులవైపు దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీరు వైద్య అనుబంధ కోర్సులుగా పేర్కొనే ఆయుష్‌తోపాటు మరెన్నో కోర్సులను ఎంచుకోవచ్చు. ఆయుష్ కోర్సులూ నీట్‌తోనే ► ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు దక్కని విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఆయుష్ కోర్సులు. బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, యునానీ(బీయూఎంఎస్), బీఎన్‌వైఎస్ వంటి కోర్సులను పూర్తి చేసుకుంటే.. డాక్టర్ కల సాకారం అవుతుంది. ► ఆయుష్ కోర్సుల సీట్లను కూడా నీట్ స్కోర్ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత.. ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తెలంగాణలో కేఎన్ఆర్యూహెచ్ఎస్, ఏపీలో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు ఈ ప్రక్రియను చేపడతాయి. బీహెచ్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్ఎంఎస్).గత కొన్నేళ్లుగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటున్న కోర్సు ఇది. బీహెచ్ఎంఎస్ పూర్తి చేసిన వారికి ప్రస్తుతం అవకాశాలకు కొదవ లేదు. రోగుల్లో ఈ వైద్య విధానంపై ఆసక్తి పెరగడం, పలు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏపీలో నాలుగు కళాశాలల్లో,తెలంగాణలో అయిదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఏఎంఎస్ మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కళాశాలల్లో, తెలంగాణలో రెండు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉన్నత విద్యపరంగా ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. యునానీ (బీయూఎంఎస్) ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో కోర్సు.. బీయూఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎన్‌వైఎస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్.. బీఎన్‌వైఎస్. బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక కళాశాలలో అందుబాటులో ఉంది. బీవీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ). ఈ కోర్సు ద్వారా.. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. పౌల్ట్రీ ఫారాలు, పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు,వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ బీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అవకాశాలు అందించే మరో కోర్సు.. అగ్రికల్చర్ బీఎస్సీ. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లుగా కొలువులు దక్కించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో.. ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ(ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. హార్టికల్చర్ సైన్స్ బైపీసీ విద్యార్థులు బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్‌ను ఎంచుకోవచ్చు. వీరికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ వంటి వాటిల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎఫ్ఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్.. సంక్షిప్తంగా బీఎఫ్ఎస్సీ. బైపీసీ విద్యార్థులు ఈ కోర్సు ద్వారా చేపల పెంపకంపై ప్రత్యేక నైపుణ్యాలు పొందొచ్చు. వీరికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు. తెలంగాణలో పి.వి. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇతర కోర్సులు కూడా బైపీసీ విద్యార్థులు ఆసక్తి ఉంటే.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ అనస్థీషియా టెక్నాలజీ వంటి కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత నీట్ కౌన్సెలింగ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఆన్లైన్ కౌన్సెలింగ్, ఛాయిస్ ఫిల్లింగ్ విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ముందస్తు కసరత్తు ప్రారంభించాలి. నిర్దిష్టంగా కాలేజీ, కోర్సు విషయంలో స్పష్టత వచ్చాక.. దానికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలు పేర్కొనాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ పత్రాలు దగ్గర ఉండేలా చూసుకోవాలి. – డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి, వైస్ ఛాన్స్లర్, కేఎన్ఆర్యూహెచ్ఎస్ నీట్–2021– ముఖ్యాంశాలు ► జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌కు దాదాపు 16 లక్షల మంది హాజరు. ► దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో 83 వేలు, బీడీఎస్‌లో 27 వేల సీట్లు. ► నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం–ఏపీలో 5,210 ఎంబీబీఎస్ సీట్లు, తెలంగాణలో 5,240 ఎంబీబీఎస్ సీట్లు. ► గత ఏడాది హెల్త్ యూనివర్సిటీల నోటిఫికేషన్ గణాంకాల ప్రకారం– ఏపీలో 1440 బీడీఎస్ సీట్లు , తెలంగాణలో 1140 బీడీఎస్ సీట్లు. ► 450పైగా స్కోర్ వస్తుందనుకునే విద్యార్థులు కౌన్సెలింగ్‌కు సన్నద్ధంగా ఉండాలి. ► కౌన్సెలింగ్‌కు అవసరమైన అన్ని ధ్రువ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ► ఎంబీబీఎస్, బీడీఎస్‌కు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న ఆయుష్, ఏజీ బీఎస్సీ, బీవీఎస్సీ, ఫిషరీస్ తదితరాలు. -
మమ్మల్నీ పాస్ చేయండి..!
సాక్షి, హైదరాబాద్: ఇతర అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేసినట్లు తమనూ పాస్ చేయాలని లేదా మార్కుల శాతాన్నైనా తగ్గించాలని ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యార్థులు కోరుతున్నారు. కరోనాతో ఆన్లైన్ క్లాసుల వల్ల చాలావరకు నష్టపోయామని, పరీక్షల్లో ఫెయిలయ్యామని మొదటి ఏడాది పరీక్షలు రాసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన క్లాసులవారి పరిస్థితీ అంతే. ఈ విషయాన్ని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫస్టియర్ పరీక్షల్లో 71 శాతం మంది పాసవగా, మిగిలినవారు ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యారని వర్సిటీ వర్గాలు చెప్పాయి. కరోనాకు ముందు మొదటి ఏడాది పరీక్షల్లో 88 శాతంపైగా ఉత్తీర్ణు లయ్యారు. ఒకవేళ ప్రమోట్ చేయడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదనుకుంటే, పాస్ మార్కులను 50 శాతం నుంచి 35 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు పట్ల తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? కరోనా కేసులు నమోదవుతుండటం, థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో యూజీ టూ పీజీ వరకు తరగతులన్నింటినీ ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించినా, మెడికల్ క్లాసులపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఎంబీబీఎస్, డెంటల్, ఆయుష్, నర్సింగ్ తదితర వైద్య కోర్సుల తరగతులు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. మరి వాటిని అలాగే ఆన్లైన్లోనే కొనసాగించాలా? లేదా నేరుగా తరగతులు నిర్వహించాలా? అన్నదానిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పాయి. మెడికల్ పీజీ విద్యార్థులు సహజంగా బోధనాసుపత్రుల్లో వైద్య సేవల్లో నిమగ్నం కావాల్సిందే కాబట్టి వారికి మినహా యింపు ఉండదు. ఎంబీబీఎస్, డెంటల్, ఆయుష్ కోర్సులకు కూడా జాగ్రత్తలతో నేరుగా క్లాసులు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వైద్య వర్గాల్లోనూ, కొందరు విద్యార్థుల్లోనూ ఉంది. విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా విభజించి, నెలలో 15 రోజులు ఒక బ్యాచ్, మరో 15 రోజులు రెండో బ్యాచ్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కొందరంటున్నారు. అయితే నేరుగా క్లాసులు తీసుకోవడం రిస్క్ అవుతుందన్న అభిప్రాయంలో కాళోజీ వర్సిటీ వర్గాలున్నాయి. దీంతో ఆన్లైన్లోనే తరగతులు కొనసాగింపు విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. 55 వేల మందికి ఆన్లైన్లోనే.. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ సహా ఇతర అన్ని రకాల కాలేజీల్లో మొత్తం విద్యార్థులు దాదాపు 55 వేల మంది ఉంటారు. 33 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది నుంచి చివరి ఏడాది వరకు విద్యార్థులు 20 వేల మంది వరకు ఉంటారు. 20 వేల మంది నర్సింగ్, 6 వేల మంది డెంటల్, 5 వేల మంది ఫిజియోథెరపీ విద్యార్థులు, మిగిలినవారు ఆయుష్ సహా ఇతరత్రా కోర్సులకు చెందినవారు ఉంటారని అధికారులు తెలిపారు. అన్ని కాలేజీల్లో కరోనా మొదటి వేవ్ సందర్భంగా కూడా ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించారు. కరోనా తగ్గినప్పుడు మధ్యలో రెండు నెలలపాటు ప్రాక్టికల్స్ వరకు నేరుగా నిర్వహించారు. వాస్తవంగా మెడికల్ క్లాసులను ఆన్లైన్లో నిర్వహించడం సమంజసం కాకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాల్సి వచ్చింది. -
నత్తనడకన మెడికల్ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ప్రవేశాలకు ప్రకటన వెలువడి దాదాపు 3 వారాలు పూర్తయినా ఇప్పటికీ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆలిండియా కోటాలో మొదటిదశ ప్రవేశాలు పూర్తయ్యాయి. ఆలిండి యా కోటాలో మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన వెంటనే, రాష్ట్రంలోనూ మొదటి విడత ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వాలి. ఈసారి మాత్రం తీవ్రమైన జాప్యం జరుగుతోంది. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విద్యార్థుల సమక్షంలో జరగ్గా, ఇప్పుడు కరోనా కారణంగా ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతోంది. దీంతో విద్యార్థులు ధ్రువపత్రాలు అప్లోడ్ చేయలేదంటున్నారు. చాలావరకు తప్పుల తడకగా ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాల్లోనూ అనేక తప్పులు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని కులాలు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉంటాయి. కానీ కొందరు సంబం ధిత జిల్లాలో లేని కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కేటగిరీలో ధ్రువపత్రాల్లోనూ తప్పులు ఉన్నాయి. కొందరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కూడా ఈడబ్లు్యఎస్ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేశారు. వారికి ఈడబ్లు్యఎస్‌కు సంబంధం లేకున్నా తహసీల్దార్లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు ఉండాల్సి ఉండగా, రూ.10 లక్షలకు పైగా ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు కొందరు ఈడబ్ల్యూఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇటువంటి వాటిని గుర్తించి, విద్యార్థులకు ఫోన్లు చేసి చక్కదిద్దడానికి ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. (చదవండి: ఎంబీబీఎస్ రాక.. బీడీఎస్ ఇష్టం లేక..) 28 నుంచి వెబ్ ఆప్షన్లు... రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ ఆప్షన్లను ఈ నెల 28 నుంచి నిర్వహించడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యే అవకాశాలున్నాయని, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హుల జాబితాను ప్రకటిస్తారు. జాబితాపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించడానికి మరో రెండ్రోజులు సమయం తీసుకుంటారు. అనంతరం మెడికల్ కాలేజీని ఎంచుకోవడానికి వచ్చే సోమవారం నుంచి విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నెలాఖరులో మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడిస్తామని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. కన్వీనర్ కోటాలో తొలివిడత పూర్తయిన తర్వాత ప్రైవేటు వైద్యకళాశాలల్లో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ల భర్తీకి ప్రకటన జారీచేస్తారు. (చదవండి: పక్కింటి పద్మావతితో ప్రేమాయణం.. 14 ఏళ్ల తర్వాత డాక్టర్‌గా) రెండో విడత ప్రవేశాలు.. ఆలిండియా మెడికల్ ప్రవేశాల్లో రెండో విడత శుక్రవారం నుంచి నిర్వహిస్తారు. ఈ నెల 24 వరకూ రెండో విడతలో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 27న సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడిస్తారు. 28 నుంచి వచ్చే నెల 8లోగా కేటాయించిన మెడికల్ కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాల వల్ల అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం జరుగుతుందని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి నీట్లో అర్హత సాధించినవారు ఈ నెల 21 సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కోర్సుల్లో కటాఫ్ స్కోర్, స్టేట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ముందు అఖిల భారత కోటాలో 15 శాతం సీట్లు, తర్వాత స్టేట్ కోటాలో ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లు, తదుపరి యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేస్తారు. మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం (ఈ నెల 13) నుంచే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు 147, ఎస్సీ ఎస్టీ, బీసీలకు 113, దివ్యాంగులకు 129గా కటాఫ్ మార్కులను నిర్ణయించారు. దరఖాస్తుకు వెబ్సైట్.. http://ntruhs.ap.nic.in/ అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు.. ► స్థానికులై ఉండటంతోపాటు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల్లో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం, దివ్యాంగులకు 45 శాతం) మార్కులు వచ్చి ఉండాలి. ► అభ్యర్థికి 2020 డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. వైకల్యం ఉన్నవారు నిర్ధారిత సర్టిఫికెట్ పొంది ఉండాలి. దరఖాస్తు ఫీజు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే జనరల్, బీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.3,540 (జీఎస్టీతో కలిపి). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,950 (జీఎస్టీతో కలిపి). అభ్యర్థులు ఆన్లైన్లో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. కావాల్సిన ధ్రువపత్రాలు ఆన్లైన్ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువపత్రాలన్నీ పీడీఎఫ్ ఫార్మాట్లో కేబీల్లోనే ఉండాలి. ► నీట్ ర్యాంకు కార్డు ► ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ మార్కుల మెమోలు ► 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు ► టీసీతోపాటు కులధ్రువీకరణ పత్రం,మైనార్టిలు, ఈడబ్ల్యూఎస్‌లకు సంబంధిత శాఖలు జారీ చేసిన ధ్రువపత్రాలు ► ఆధార్ కార్డు, లోకల్ సర్టిఫికెట్ కార్డు, పాస్‌పోర్టు ఫొటో, సంతకం, నివాస ధ్రువీకరణ పత్రం వంటివన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు సంప్రదించాల్సిన నంబర్లు ► సాంకేతిక సమస్యలకు: 9490332169, 9030732880, 9392685856 ► సలహాలు, సందేహాలకు: 08978780501, 7997710167 -
ప్రశాంతంగా ముగిసిన నీట్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆదివారం జరిగిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు మాస్కులు, గ్లౌజులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులను మూడు స్లాట్లుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడంతో ఉదయం 11 గంటలకే కేంద్రాలకు వచ్చినవారు మూడు గంటల పాటు వేచిఉండాల్సి వచ్చింది. ఉష్ణోగ్రతలు ఆదివారం తగ్గి వాతావరణం చల్లబడటంతో అభ్యర్థులు కాస్త ఉపశమనం పొందారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులను థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు ఇతర సెక్యూరిటీ పరికరాలతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతించారు. ప్రశ్నపత్రంపై మిశ్రమ స్పందన పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రశ్న పత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పేపరు కొంచెం సరళంగా వచ్చిందని కొంతమంది, ఫిజిక్స్ కష్టంగా ఉందని మరికొందరు, బయాలజీ, కెమిస్ట్రీ పేపర్లు సులభంగా ఉన్నాయని ఇంకొందరు చెప్పారు. గతేడాది కంటే ఈ ఏడాది కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉన్నట్టు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది 518 మార్కులకు ఓసీకి సీటు వచ్చింది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ వస్తేనే సీటు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 61 వేల మందికిపైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. -
‘నీట్’ దరఖాస్తు ప్రక్రియ మొదలు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీచేసింది. 2020–21 వైద్య విద్యాసంవత్సరానికి గానూ వచ్చే ఏడాది మే 3న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులను nta.ac.in లేదా ntaneet.nic.in వెబ్సైట్లలో పొందవచ్చు. దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. రుసుము చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫారం ఒక్కోసారి రద్దయిపోతే, చెల్లించిన రుసుం తిరిగి వెనక్కు వస్తుంది. -
నేటి నుంచి ‘నీట్’ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి మెడికల్ అడ్మిషన్లకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. పరీక్ష మే నెల 3న నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తారు. తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 2020–21కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) దరఖాస్తు విడుదల చేయనుంది. దరఖాస్తులను ఎన్టీఏ.ఏసీ.ఇన్, ఎన్‌టీఏనీట్.ఎన్ఐసీ.ఇన్‌ల్లో పొందవచ్చు. దరఖాస్తులో ప్రత్యక్ష ఫొటోతోపాటు అదనపు పత్రాలూ జోడించాల్సి ఉంటుందని, ఆ మేరకు మార్పులు చేసే అవకాశాలున్నాయి. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. 180 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఎయిమ్స్ ప్రవేశాలూ నీట్ ద్వారానే... 2020–21 సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు నీట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించాలంటే నీట్ ర్యాంకు తప్పనిసరి. మొదటిసారిగా ఎయిమ్స్, జిప్మర్ మెడికల్ కాలేజీ ల్లోని ఎంబీబీఎస్ సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 532 మెడికల్ కాలేజీల్లోని 76,928 సీట్లను భర్తీ చేస్తారు. అలాగే 914 ఆయుష్ కాలేజీల్లోని 52,720 సీట్లకు, 313 బీడీఎస్ కాలేజీల్లోని 26,949 సీట్లకు, 15 ఎయిమ్స్ కాలేజీల్లోని 1,207 ఎంబీబీఎస్ సీట్లకు, రెండు జిప్మర్ ఎంబీబీఎస్ కాలేజీల్లో ఉన్న 200 సీట్లకు నీట్ ద్వారానే భర్తీ జరుగుతుంది. అన్ని రాష్రాల కన్వీనర్ కోటాలోని 15 శాతం సీట్లను ఆలిండియా ర్యాంకులతో భర్తీ చేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తారు. ఆ మేరకు రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటిస్తుంది. డీమ్డ్, సెంట్రల్ వర్సిటీల్లోని సీట్లను 100 శాతం నీట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎన్ఆర్ఐ, బీ కేటగిరీ సీట్లను నీట్ ద్వారానే భర్తీ చేస్తారు. గతేడాది రాష్ట్రం నుంచి 48,996 మంది నీట్ రాయగా, 33,044 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్య కాలేజీల్లో 4,900 వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి. -
రిజర్వేషన్లకు లోబడే మెడికల్ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది రెండో విడత ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు చట్టబద్ధంగా జరిగాయని, రిజర్వేషన్ల అమల్లో తప్పులు జరగలేదని హైకోర్టు తీర్పు చెప్పింది. నిబంధనల మేరకే ప్రవేశాలు జరిగాయని, రిజర్వేషన్ల అమలు వల్ల ఎవరికీ నష్టం జరగలేదని న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ పి.కేశవరావుల ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. రెండో విడత వైద్య విద్య ప్రవేశాలను జీవోలు 550, 114 ప్రకారం జరగలేదని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లా ఎన్.భావన మరో నలుగురు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో గతంలో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలు రద్దయింది. తొలి విడత ప్రవేశాల్లో వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన సీట్లను ఓపెన్ కేటగిరీ ద్వారా భర్తీ చేశాకే రిజర్వేషన్ కోటా భర్తీ చేయాలని జీవోలు స్పష్టం చేస్తున్నాయని, అయితే కాళోజీ వర్సిటీ అధికారులు రెండో విడత సీట్లను ముందుగా రిజర్వేషన్ కేటగిరీ సీట్లను భర్తీ చేసిన తర్వాత ఓపెన్ కోటా సీట్లను భర్తీ చేశారనే వాదన సరికాదని తేల్చింది. అయితే కౌన్సెలింగ్‌లో చట్ట నిబంధనల అమలు విషయంలో వర్సిటీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘రెండు విడతల ప్రవేశాలు జరిగాక వర్సిటీ ఇచ్చిన వివరాల్ని పరిశీలిస్తే రిజర్వేషన్ కేటగిరీకి అన్యాయం జరగలేదని స్పష్టం అవుతోంది. 2,487 సీట్ల భర్తీ తర్వాత 1,800 సీట్లు రిజర్వ్డ్ అభ్యర్థులకు లభించాయి. ఓసీలకు 687 సీట్లు వచ్చాయి. ఓపెన్ కోటాలో 137, మిగిలిన 1,663 సీట్లు రిజర్వేషన్ కోటాలో రిజర్వేషన్ వర్గాలకు సీట్లు దక్కాయి. ఓపెన్ కోటాలో ప్రతిభావంతులైన రిజర్వేషన్ వర్గాలకు చెందిన 440 సీట్ల భర్తీలోనూ తప్పులేమీ కన్పించలేదు’ అని ధర్మాసనం వివరించింది. స్పష్టం చేసి ఉండాల్సింది: జీవో 550ను 2001లో జారీ చేశారు. ఆ జీవోను పేరా 5 ప్రకారం ఓపెన్ కేటగిరీ సీటు ఎంపిక చేసుకున్న రిజర్వ్డ్ కోటా అభ్యర్థి తర్వాత దాన్ని వదులుకుని రిజర్వేషన్ కోటాలో సీటు పొందితే.. ఓపెన్ కోటాలో వదిలిన సీటును రిజర్వ్డ్ కోటా అభ్యర్థితోనే భర్తీ చేయాలి. దీనినే ప్రభుత్వం జీవో 114లో పేర్కొంది. ఫలితంగా జీవో 550 రద్దు అయినట్లే. జీవో 114 గురించి ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టులకు నివేదించింది. దీని గురించి వర్సిటీ సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు స్పష్టం చేయలేదు. దీంతో జీవో 550 వినియోగంలో ఉందనే ఆశల్లో పలువురు ఉండిపోయారు. ఈ విషయంలో కాళోజీ వర్సిటీ స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేదని ధర్మాసనం తప్పుపట్టింది. -
ఫస్ట్ ప్రైవేటుకా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ పూర్తికాకముందే ప్రైవేటు కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల భర్తీ అయిపోయాకగానీ ప్రైవేటు సీట్ల వైపు విద్యార్థులు వెళ్లరు. ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మూడో విడత, ఆ తర్వాత నాలుగో విడత కౌన్సెలింగ్‌లు నిర్వహించాల్సి ఉంది. పైగా జాతీయస్థాయిలో నీట్ రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత, నేషనల్ పూల్‌కు రాష్ట్రం నుంచి ఇచ్చిన 15 శాతం సీట్లల్లో భర్తీ కాకుండా మిగిలే సీట్లను తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. వాటిని కూడా మూడో విడత కన్వీనర్ కోటా సీట్లతోపాటు భర్తీ చేస్తారు. అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 190 సీట్లు, ఎన్సీసీ సీట్లు ఉన్నాయి. వాటన్నింటికీ మూడో విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఇవన్నీ ఉండగా.. వాటి కౌన్సెలింగ్ పూర్తికాకముందే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లను నింపడం కోసం ముందస్తుగానే కౌన్సెలింగ్ నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు కన్వీనర్ కోటాలో రెండో విడత కౌన్సెలింగ్ మాత్రమే పూర్తయింది. రెండో విడతలో సీట్లు వచ్చిన విద్యార్థులు ఈ నెల 24 లోగా కాలేజీల్లో చేరాల్సి ఉంది. మూడో విడత ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానుంది. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీలకు ఈ నెల 25 నుంచి 28 వరకు కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోతామని ఆందోళన.. మూడో విడతలో సీటు వస్తుందన్న ఆశ ఉన్నప్పటికీ, ఏదో భయంతో బీ, సీ కేటగిరీ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు హాజరుకాక తప్పని పరిస్థితి. ఒకవేళ అందులో సీటు వస్తే చేరాలా? వద్దా? ఒకవేళ చేరితే కన్వీనర్ కోటాలో మూడో విడత కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ సీటు వస్తే ఏమవుతుందనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఏ కేటగిరీలో ప్రభుత్వ కాలేజీలో రూ.10 వేలు, ప్రైవేట్ కాలేజీల్లో రూ.60 వేలుగా ఫీజు ఉంది. అదే బీ కేటగిరీ అయితే ఏడాదికి రూ.12 లక్షలు, సీ కేటగిరీకి రూ.24 లక్షలకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంది. బీ కేటగిరీ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలంటే రూ.40 వేలు డీడీనీ యూనివర్సిటీ ఫీజు కింద చెల్లించాలి. సీటు వచ్చిందంటే రూ.12 లక్షలు కాలేజీ ఫీజు, రెండో ఏడాదికి మరో రూ.12 లక్షల గ్యారంటీతో ఆగస్టు రెండో తేదీలోపు ఆయా ప్రైవేటు మెడికల్ కాలేజీలో చేరాలి. అప్పటివరకు ఏ కేటగిరీ మూడో విడత కౌన్సెలింగ్ జరగదు. ఒకవేళ బీ కేటగిరీలో చేరిన తర్వాత ఏ కేటగిరీలో సీటు వస్తే రూ.40 వేలు, కాలేజీకి సంబంధించిన ఇతరత్రా ఫీజులు దాదాపు రూ.50 వేలు వదులుకోవాల్సిందే. అలా అని వదిలేస్తే సీటు పోతుందేమోనని భయం. ఎటూ తేల్చుకోలేక తల్లిదండ్రులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఒకవేళ వదులుకోవాలని ప్రయత్నిస్తే కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఇబ్బంది పెట్టే అవకాశముంది. పైపెచ్చు బీ, సీ కేటగిరీ సీట్లకు డబ్బులు సమకూర్చుకోవడం, చెల్లించడం, బ్యాంకు గ్యారంటీ చూపడం తప్పదు. ఇదంతా కూడా మధ్యతరగతి ప్రజలకు అత్యంత భారం కానుంది. దీనిపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. బీ, సీ కేటగిరీ సీట్లు నింపకపోతే సమస్య.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించాలి. ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన ప్రక్రియ. అప్పటివరకు బీ, సీ కేటగిరీ సీట్లను భర్తీ చేయకపోతే ఏకంగా ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లు నిండే అవకాశం ఉండదు. అంత తక్కువతో కాలేజీలను ఎలా ప్రారంభించగలం? కన్వీనర్ కోటాలో సీటు వస్తుందా? రాదా? అన్నది విద్యార్థులు వారివారి ర్యాంకులను బట్టి అంచనాకు వచ్చే అవకాశముంది. ఆ ప్రకారం కన్వీనర్ కోటాలో వచ్చేట్లయితే బీ, సీ కేటగిరీలో చేరకుండా ఉండాలి. అంచనా వేయలేని పరిస్థితుల్లో బీ కేటగిరీలో చేరి.. మూడో దశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా సీటు వస్తే చెల్లించిన డొనేషన్‌ను ప్రైవేటు కాలేజీలు తిరిగి వెనక్కి ఇస్తాయి. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. –డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ