సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి ప్రైవేటు కళాశాలలు ప్రత్యేకంగా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. సీట్ల భర్తీకి తాము ప్రభుత్వ ఎంసెట్‌తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించుకుంటామంటూ ప్రైవేటు వైద్య, దంత కళాశాలలు పెట్టుకున్న పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.
ఈ నేపథ్యంలో ప్రవేశ, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ)తో గురువారం ప్రత్యేకంగా చర్చించిన వైద్య విద్య శాఖ ఉన్నతాధికాధికారులు ప్రత్యేక పరీక్ష నిర్వహణకు ప్రైవేటు వైద్య, దంత కళాశాలలను అనుమతించడంవల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని, ప్రతిభకు అన్యాయం జరుగుతుందన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారు. అందువల్ల ‘ప్రైవేటు పరీక్ష’కు అనుమతించడం సమంజసం కాదని కోర్టుకు నివేదించాలని వైద్య విద్య శాఖ అధికారులు నిర్ణయించారు.
ప్రైవేటు మెడికల్ ఎంసెట్‌కు సర్కారు నో
Published Fri, May 30 2014 2:25 AM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM
Advertisement