సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల వెబ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం మాప్ అప్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయిందని, కన్వీనర్ కోటలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
అర్హులైన అభ్యర్థులు 5వ తేదీ మధ్యా హ్నం 3 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసు కోవాల ని సూచించింది. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కం టిన్యూ చేసినా, ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది. వివరాలకు www.knruhs. telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment