NEET Counselling
-
నాలుగైదు రోజుల్లో మెడికల్ కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌కు లైన్ క్లియర్ అయింది. స్థానికత వ్యవహారంలో గతంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో నీట్ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాల యం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సుప్రీంకోర్టు నుంచి పూర్తిస్థాయి ఆదేశాలు తమకు చేరిన తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియను ఎలా చేపట్టాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కాళోజీ వర్గాలు తెలిపాయి. కౌన్సెలింగ్‌లో భాగంగా మొదట దరఖాస్తు చేసుకున్న విద్యార్థులతో మెరిట్ లిస్ట్ తయారు చేస్తా రు. ఆ తర్వాత వారి నుంచి వెబ్ ఆప్షన్లు తీసుకుంటారు. నెలాఖరు నాటికి మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. ముందుగా కనీ్వనర్ కోటా, తర్వాత మేనేజ్మెంట్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. అక్టోబర్ 15వ తేదీ నాటికి రెండు విడతల కౌన్సెలింగ్‌లు, ఆ నెలాఖరు నాటికి అన్ని కౌన్సిలింగ్‌లు పూర్తి చేస్తారు. 17 వేల మంది దరఖాస్తు నీట్లో అక్రమాలు, సవరణ ఫలితాలతో వైద్య విద్యా సంవత్సరం ఈసారి ఆలస్యమైన సంగతి తెలిసిందే. స్థానికత వ్యవహారం మరింత ఆలస్యానికి కారణమైంది. నీట్లో రాష్ట్రం నుంచి 47,356 మంది అర్హత సాధించగా, అందులో 17 వేల మంది రాష్ట్రంలో మెడికల్ సీట్లకు దరఖాస్తు చేసుకున్నారని కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 15 శాతం ఆలిండియా కోటా సీట్లు, డీమ్డ్ వర్సిటీలు, సెంట్రల్ యూనివర్శిటీలు, ఈ ఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఇంకా రెండు విడతల కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. వాస్తవానికి జాతీయ స్థాయిలో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్రస్థాయిలో మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించాలి.అలాగే రెండో విడత జాతీయ కౌన్సెలింగ్ తర్వాత రాష్ట్రంలో రెండో విడత మొదలవుతుంది. కానీ స్థానికత అంశం కోర్టులో ఉండటంతో ఇప్పటివరకు రా ష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. జాతీయ కౌన్సెలింగ్‌లు జరుగుతున్నా, ఇక్కడ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతోంది. అనేకమంది విద్యార్థులు తమకు ఇష్టం లేకపోయినా జాతీయ కౌన్సెలింగ్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో చేరారు. వారు ఇక్కడ చేరాలనుకుంటే ఎలాంటి వెసులుబాటు ఇస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లోనూ కౌన్సెలింగ్‌లు జరుగుతున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాల్లో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు, జాతీయ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు సాధించిన విద్యార్థులు తరగతులకు హాజరవుతారు. ‘స్థానికత’తో ఆలస్యం రాష్ట్రంలో ఎంబీబీఎస్ సహా ఇతర మెడికల్ కో ర్సులకు కౌన్సెలింగ్‌లో భాగంగా రిజిస్ట్రేషన్లు, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. ఆప్షన్లు పెట్టుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా స్థానికత అంశం కోర్టులో ఉండటంతో ఆలస్యమైంది. ఈసారి ప్రభుత్వం స్థానికత అంశంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ మధ్యలో ఏవైనా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా గుర్తించేవారు. అయితే చాలామంది ఏపీకి చెందినవారు తప్పుడు సరి్టఫికెట్లు తీసుకొచ్చి తెలంగాణ స్థానికులుగా చెప్పుకుంటున్నారని ప్రభు త్వం భావించింది. దీంతో స్థానికత విషయంలో మార్పులు చేసింది. 9, 10, ఇంటర్ రెండేళ్లు కలిపి మొత్తం నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివి న వారినే స్థానికులుగా గుర్తించాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ ఒక్కసారికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన స్థానికత వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన కొందరు విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉండడంతో ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూఢ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ ఏడాదికి గాను సదరు విద్యార్థులకు ఊరట కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.అయితే ఈ కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. వైద్యవిద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో 33ని తీసుకువచి్చంది. నీట్‌కు ముందు నాలుగేళ్లు స్థానికంగా చదివి ఉండాలని లేదా నివాసం ఉండాలని (జీవో 33 లోని నిబంధన 3 (ఏ)) పేర్కొంది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి నాగ నరసింహం అభిరామ్‌తో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తమకు అన్యాయం జరుగుతోందని నివేదించారు. హైకోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు రావడంతో.. ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీ, ప్రతివాదుల తరఫున సీనియర్ అడ్వకేట్లు మురళీధర్, నిరంజన్‌రెడ్డిలు వాదనలు వినిపించారు. 4 తీర్పులు అనుకూలంగా ఉన్నాయి: సింఘ్వీ నీట్ పరీక్షలో స్థానికతకు సంబంధించి ప్రతి విద్యార్థి స్థానికుడై 9, 10తో పాటు ఇంటర్ రాష్ట్రంలో చదవాల్సి ఉందని సింఘ్వీ చెప్పారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనంతో పాటు నాలుగు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని కోర్టు కు నివేదించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు పాఠశాల లేదా కాలేజీ విద్య విదేశాల్లో చదివి నీట్ పరీక్ష మాత్రం తెలంగాణలో రాసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.ఇలా చేయడం వలన తెలంగాణలో మొదటి నుంచి చదువుకున్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యా ర్థులు తెలంగాణలో నీట్ తీసుకుంటున్నారని, అదే తెలంగాణ విద్యార్థులకు ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ జీవో సరికాదు ప్రభుత్వ వాదనలతో విభేదించిన విద్యార్థుల తరఫు న్యాయవాది మురళీధర్.. కేవలం రెండు, మూడేళ్ల చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే విద్యార్థులకు స్థానికతను దూరం చేయడం సరికాదని వాదించారు. నీట్ ఫలితాలకు వారం ముందు జీవో తెచ్చారని, అందుకే ఆ జీవోను హైకోర్టు నిలిపివేసిందని తెలిపారు.ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని.. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన 371 (డీ) çపదేళ్ల తర్వాత ఎక్స్పైరీ అయ్యిందని, అందుకే పదేళ్ల తర్వాత ఈ కొత్త నిబంధనను ప్రభు త్వం తెచి్చందని తెలిపారు. అయితే వన్ టైం ఎక్సె ప్షన్ (ఒక్కసారికి మినహాయింపు) కింద ఈసారి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకా శం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సెప్టెంబర్ చివరి వారంలోనే తొలి, అక్టోబర్ మొదటి వారంలో రెండవ కౌన్సెలింగ్ ఉన్నందున కోర్టును ఆశ్రయించిన విద్యార్థుల మేలు కోరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మెరిట్స్‌లోకి వెళ్లే సమయం లేదు ఇరుపక్షాల వాదనల అనంతరం.. మెరిట్స్‌లోకి వెళ్లేంత సమయం లేదన్న సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఏమంది? ఒక విద్యార్థి తెలంగాణ నివాసి లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మా సనం అభిప్రాయపడింది. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం రూపొందించే మార్గద ర్శకాల మేరకు ప్రతి విద్యార్థికి స్థానిక కోటా వర్తింపజేయాలని పేర్కొంది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభు త్వం ఈ నెల 11న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
ఆగస్ట్ 14 నుంచి .. నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్
ఢిల్లీ: నీట్ యూజీ కౌన్సిలింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆగస్ట్ 14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆగస్ట్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కౌన్సిలింగ్‌పై అప్డేట్స్ను ఎంసీసీ వెబ్సైట్లో చూడాలని సూచించింది. ఈ మేరకు నీట్ అభ్యర్థులకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఒక నోటీసు విడుదల చేసింది. -
నీట్-యూజీ కౌన్సిలింగ్ జులై 3వ వారంలో: కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ : నీట్-యూజీ పరీక్షను రద్దు చేసి,మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్‌ను జులై 3వ వారంలో నాలుగు ఫేజుల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ జరిగే సమయంలో నీట్ అక్రమాల వల్ల ప్రయోజనం పొందినట్లు గుర్తిస్తే.. వారి కౌన్సిలింగ్‌ను రద్దు చేస్తామని వెల్లడించింది. పేపర్ లీకేజీ,అక్రమాలపై దాఖలైన సుమారు 40 పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం గురువారం (జులై11న) విచారణ చేపట్టనుంది.ఈ విచారణకు ముందు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. -
నీట్ కౌన్సెలింగ్.. ఇలా!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా నీట్–యూజీ! దేశ వ్యాప్తంగా.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష! కొద్దిరోజుల క్రితమే నీట్ యూజీ–2024 ఫలితాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఈ పరీక్షపై వివాదం కొనసాగుతున్నా.. నీట్ కౌన్సెలింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయనే వార్తలు! ఈ నేపథ్యంలో నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్ల భర్తీ విధానం.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీట్ల భర్తీ తీరు, నీట్ ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు తదితర అంశాలపై విశ్లేషణ..‘నీట్ యూజీ–2024 ఫలితాలపై ఆందోళనలు జరుగుతున్నా.. మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువే. కాబట్టి నీట్ ఉత్తీర్ణులు ఫలితాలపై వస్తున్న వార్తల జోలికి వెళ్లకుండా.. కౌన్సెలింగ్‌కు సిద్ధమవ్వాలి’ అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న సీట్లు⇒ నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం–దేశ వ్యాప్తంగా మొత్తం 783 ఎంబీబీఎస్ కళాశాలల్లో 1,61,220 సీట్లు ఉన్నాయి. వీటిలో 331 ప్రైవేట్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉండగా.. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 74,703. అదేవిధంగా నీట్ స్కోర్‌తోనే భర్తీ చేసే బీడీఎస్ కోర్సులో 28,088 సీట్లు, ఆయుష్ కోర్సుల్లో 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ⇒ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రస్తుతం 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,935 ఎంబీబీఎస్ సీట్లు; మరో 16 ప్రైవేట్ కళాశాలల్లో 2,850 సీట్లు ఉన్నాయి. రెండు మైనారిటీ కళాశాలల్లో 300 సీట్లు; స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి.. రెండు ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లు; 14 ప్రైవేట్ కళాశాలల్లో 1,300 సీట్లు చొప్పున ఉన్నాయి.⇒ తెలంగాణ రాష్ట్రంలో.. ఎంబీబీఎస్‌కు సంబంధించి 27 ప్రభుత్వ కళాశాలల్లో 3,790 సీట్లు; 29 ప్రైవేట్, మైనారిటీ కళాశాల్లో 4,700 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి ఒక ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు; పది ప్రైవేట్ కళాశాలల్లో 1,000 సీట్లు; వీటికి అదనంగా సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కళాశాలలో ఆరు సీట్లు ఉన్నాయి.పేరున్న కళాశాలలో సీటుప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఆల్ ఇండియా స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో రెండు లక్షల వరకు ర్యాంకు వరకూ సీట్లు పొందే అవకాశముందని అంచనా. పేరున్న ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సొంతం చేసుకోవాలంటే మాత్రం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకుతోనే సాధ్యమని చెబుతున్నారు.కౌన్సెలింగ్.. ఏఐక్యూ, స్టేట్ కోటానీట్ యూజీ కౌన్సెలింగ్‌ను రెండు విధానాల్లో నిర్వహించి సీట్ల భర్తీ చేపడతారు. అవి.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి.. రాష్ట్రాల వైద్య విశ్వ విద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.ఆల్ ఇండియా కోటాజాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలను నేషనల్ పూల్‌లోకి తీసుకెళ్లినప్పటì æనుంచి ఆల్ ఇండియా కోటా పేరుతో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం.. జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15 శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలకు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది.స్టేట్ కోటా కౌన్సెలింగ్జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15 శాతం సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు(ఆల్ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు), ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50 శాతం సీట్లను.. అదే విధంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేట్–బి పేరిట ఉండే 35 శాతం సీట్లు, ఎన్ఆర్ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే కౌన్సెలింగ్ విధానంలో భర్తీ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్ యూనివర్సిటీలే చేపడతాయి.ఫీజులు ఇలా⇒ ఏపీలో ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ పేరిట ఉండే కన్వీనర్ కోటాలో రూ.15 వేలు ఫీజుగా నిర్ధారించారు. ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కేటగిరీ–బి సీటుకు రూ.12 లక్షలు; పైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(కేటగిరీ–సి) సీట్లకు: రూ.36 లక్షలుగా పేర్కొన్నారు. బీడీఎస్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ కన్వీనర్ కోటా సీట్లకు ఫీజు రూ.13 వేలు; ప్రైవేట్ కళాశాలల్లోని కేటగిరీ–బి మేనేజ్మెంట్ సీట్లకు రూ.4 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ.12 లక్షలు వార్షిక ఫీజుగా ఉంది. ⇒ తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో సీటుకు రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటుకు రూ.60 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీటుకు రూ.11.55 లక్షలు–రూ.13 లక్షలుగా ఫీజు ఉంది. అదే విధంగా.. ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(సి–కేటగిరీ) సీటు ఫీజు బి కేటగిరీ సీటుకు రెండు రెట్లుగా ఉంది. బీడీఎస్ కోర్సులో.. ప్రభుత్వ కళాశాలల్లో రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో ఎ–కేటగిరీ(కన్వీనర్ కోటా) సీట్లు: రూ.45 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీట్లు: రూ.4.2 లక్షలు – రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సి–కేటగిరీ(ఎన్ఆర్ఐ కోటా) సీటుకు బి కేటగిరీ సీటుకు 1.25 రెట్లు సమానమైన మొత్తం ఫీజుగా ఉంది. ⇒ ఈ ఫీజుల వివరాలు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించినవిగా గుర్తించాలి. కౌన్సెలింగ్ సమయానికి వీటిలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.ఏఐక్యు.. కౌన్సెలింగ్ విధానమిదే⇒ విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించే ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఇందుకోసం ఎంసీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్ అప్లికేషన్లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. ⇒ ఆ తర్వాత అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్ అలాట్మెంట్ వివరాలను వెల్లడిస్తారు. ⇒ తొలి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ తొలి రౌండ్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకుంటే.. ఫ్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంది. వీరు రెండో రౌండ్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వచ్చు. ⇒ తొలి రౌండ్ కౌన్సెలింగ్‌లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ కౌన్సెలింగ్ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ముందుగా ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌లో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి.. ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది.పూర్తిగా ఆన్లైన్హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్సైట్లో లాగిన్ ఐడీ, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా, ఇంటర్మీడియెట్ వరకూ.. అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి.ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యంనీట్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఎంసీ–విశాఖపట్నం, జీఎంసీ–గుంటూరు, కాకినాడ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కళాశాలలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. తెలంగాణలో.. ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్ కళాశాల కాగా ఆ తర్వాత స్థానంలో గాంధీ మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిలుస్తున్నాయి.ఈ సర్టిఫికెట్లు సిద్ధంగానీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సెలింగ్‌కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. అవి.. నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు మార్క్ షీట్, సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వర్టకు స్టడీ సర్టిఫికెట్స్(స్థానికతను నిర్ధారించేందుకు), పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఎనిమిది. ఇలా కౌన్సెలింగ్ విధానంతోపాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకుంటే.. కౌన్సెలింగ్ ఎప్పుడు జరిగినా తడబాటులేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. -
NEET-UG 2024: నీట్ కౌన్సెలింగ్ వాయిదాకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 6 నుంచి జరగాల్సిన నీట్ యూజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రధాన పిటిషన్లపై విచారణను కోర్టు ఇప్పటికే జూలై 8కి వాయిదా వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను కూడా ఆ తేదీ దాకా వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీతో కూడిన వెకేషన్ బెంచ్ శుక్రవారం అందుకు నిరాకరించింది. విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. -
Supreme Court: ‘నీట్’ కౌన్సెలింగ్ రద్దు కుదరదు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీ కౌన్సెలింగ్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ, పేపర్ లీక్, మూల్యాంకనంలో వ్యత్యాసాలపై దాఖలైన పలు పిటిషన్లను గురువారం ధర్మాసనం విచారించింది. నీట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ పిటిషన్లపై తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది కోరారు. గ్రేసు మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఈ నెల 23న నిర్వహించనున్న పరీక్షపై స్టే ఇవ్వాలని మరో న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. గ్రేసు మార్కులు పొందిన అభ్యర్థులకు ఈ నెల 23న నిర్వహించే పరీక్షతోపాటు వచ్చే నెల 6న జరిగే కౌన్సెలింగ్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. అడ్మిషన్ల ప్రక్రియ తుది తీర్పునకు లోబడే ఉంటుందని వ్యాఖ్యానించింది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు ఈ పిటిషన్లను జత చేస్తూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. వేర్వేరు హైకోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఎన్టీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులకు సుప్రీం నోటీసులిచ్చింది. హైకోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్నపిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. ఆయా హైకోర్టుల్లో విచారణలపై స్టే విధించింది. -
సుప్రీం కోర్టులో ‘నీట్’ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పరీక్షపై దేశవ్యాప్తంగా ఆందోళనలకు కొనసాగుతున్న వేళ.. కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపివేయాలని కోర్టును ఆశ్రయిస్తున్నారు కొందరు. ఈ క్రమంలో దాఖలైన ఓ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు కొట్టేసింది. అంతేకాదు.. నీట్ అవకతవకలను సీబీఐతో విచారణ చేయించాలని సదరు పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఆ అభ్యర్థనలకు కోర్టు నిరాకరించింది. ఇంకోవైపు ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే కూడా నీట్ కౌన్సెలింగ్ వాయిదా వేయాలంటూ ఇంతకు ముందు ఓ పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం.. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది.ఇక.. వివాదాస్పదంగా మారిన గ్రేస్ మార్కుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA).. 1,563 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సుప్రీం కోర్టుకు నివేదించింది. అంతేకాదు.. విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోకుండా చూస్తామని తెలిపింది. దీంతో.. వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహించన్నారు. ఆ ఫలితాలను 30న వెల్లడించి.. షెడ్యూల్ ప్రకారం యథాతధంగా జులై 6వ తేదీనే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఎన్టీయే ఏర్పాట్లు చేసుకుంటోంది. -
నీట్ కౌన్సెలింగ్‌పై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తోపాటు కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మరోవైపు వివాదాస్పదంగా మారిన గ్రేస్ మార్కుల అంశంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నీట్ కౌన్సెలింగ్‌ను ఆపేది లేదని.. కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ‘‘కౌన్సెలింగ్ కొనసాగుతుంది. మేము దానిని ఆపబోం. పరీక్ష పూర్తైంది కాబట్టి మిగతాది అంతా సజావుగా సాగుతుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు’’ అని వెకేషన్ బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు జారీ చేస్తూ.. పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. జులై 6వ తేదీ నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు వివాదాస్పద గ్రేస్ మార్కుల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంది. అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న 1,563 మంది ఫలితాలను నిలిపివేశామని, వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష విధిస్తామని.. 30న ఫలితాలు వెల్లడిస్తామని, ఆ తర్వాతే కౌన్సెలింగ్ చేపడతామని(జులై 6లోపు పూర్తి చేస్తామని) ఎన్టీఏ కోర్టుకు నివేదించింది. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని ఈ సందర్భంగా ఎన్టీఏ కోర్టుకు తెలిపింది.Supreme Court reiterates that it will not stay the counselling of NEET-UG, 2024.“Counselling will go on and we will not stop it. If the exam goes then everything goes in totality so nothing to fear,” says Supreme Court. pic.twitter.com/ACAB1dmyt5— ANI (@ANI) June 13, 2024ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఎన్నికల ఫలితాలకు ముందురోజు హడావిడిగా ఫలితాలు విడుదల చేయడంపైనా రాజకీయపరమైన విమర్శలు సైతం చెలరేగాయి. దీంతో నీట్లో అవినీతి, అక్రమాలు చోటు ఉండబోదని చెబుతూ ఎన్టీఏ మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 మార్కులు కలిపారని అన్నారు. పరీక్ష నిర్వహణపై ఒక స్వతంత్ర ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఏ పాలసీ ప్రకారం గ్రేస్ మార్కులు ఇచ్చారో ఎన్టీఏ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకోవైపు విద్యాశాఖ నీట్ గ్రేస్ మార్కుల పునఃసమీక్ష కోసం ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రేస్ మార్క్‌ల నిర్ణయాన్ని వెక్కి తీసుకోవడం, ఆ 1500 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయంతో ఆ కమిటీ భవితవ్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.#WATCH | On the Supreme Court's hearing on the NEET-UG 2024 exam, Education Minister Dharmendra Pradhan says "There is no corruption. In connection with the NEET examination, 24 lakh students appear in the examination. A hearing in the Supreme Court is underway today and this… pic.twitter.com/xpS9v55ptY— ANI (@ANI) June 13, 2024 -
TS: పీజీ నీట్ కటాఫ్ మార్కులు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పీజీ నీట్–2022 కటాఫ్ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తగ్గించింది. దీనితో మరింత మంది విద్యార్థులు ప్రవేశాలకు అర్హత సాధించిన నేపథ్యంలో.. అడ్మిషన్ల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పీజీ మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి కన్వీనర్ కోటాతోపాటు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వర్సిటీ పేర్కొంది. వివిధ కేటగిరీల్లో పర్సంటైల్ మారుస్తూ.. పీజీ నీట్–2022 కటాఫ్ స్కోరును 25 పర్సంటైల్ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించడంతో అన్ని కేటగిరీల్లో పర్సంటైల్ మారినట్టు కాళోజీ వర్సిటీ తెలిపింది. జనరల్ కేటగిరీలో 25 పర్సంటైల్‌తో 201 మార్కులు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 15 పర్సంటైల్‌తో 169 మార్కులు.. దివ్యాంగుల కేటగిరీలో 20 పర్సంటైల్‌తో 186 మార్కులు సాధించినవారు ప్రవేశాలకు అర్హత పొందుతారని వెల్లడించింది. కటాఫ్ మార్కులు తగ్గిన మేరకు అర్హత పొందిన అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదే యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించింది. మరింత సమాచారం కోసం యూని వర్సిటీ వెబ్సైట్ www. knruhs. telangana. gov. in ను సందర్శించాలని సూచించింది. -
వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: నీట్ పీజీ–21 కౌన్సిలింగ్లో ఏకంగా 1456 సీట్లు ఖాళీగా మిగిలిపోవడంపై సుప్రీంకోర్టు విస్మయం వెలిబుచ్చింది. దేశమంతా డాక్టర్ల కొరతతో అల్లాడుతుంటే ఇదేం నిర్వాకమంటూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) తీరును తూర్పారబట్టింది. మెడికల్ పీజీ ఖాళీల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, అనిరుద్ధ బోస్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ బుధవారం విచారించింది. ‘‘ఒక్క సీటు మిగిలినా దాన్ని ఖాళీగా పోనీయొద్దు. అది మెడికల్ కౌన్సిల్ బాధ్యత. కానీ ఏటా ఇదే సమస్య పునరావృతమవుతోంది. ఇన్ని సీట్లు ఖాళీగా మిగిలిపోతే ఎలా?’’ అంటూ తూర్పారబట్టింది. సీట్ల సంఖ్య, అడ్మిషన్ల సంఖ్య వెల్లడికి కటాఫ్ డేట్ ఉండాలని మేం గతంలోనే తీర్పు ఇచ్చాం. అయినా కౌన్సెలింగ్ మధ్యలో సీట్లను ఎందుకు జోడిస్తున్నారు? ఇలాంటి చర్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎంతటి ఒత్తిడి పడుతుందో ఆలోచించారా? స్టూడెంట్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయమిది. అహర్నిశలూ పట్టుదలగా చదివి పరీక్ష రాయాలి. 99 శాతం తెచ్చుకున్నా చివరికిలా అడ్మిషన్ సమస్యలు! ఇలాంటి పరిస్థితి వారినెంతటి నరకంలోకి నెడుతుందో మీకు అర్థమవుతోందా?’’ అని ప్రశ్నించింది. కేంద్రం తరఫున వాదించాల్సిన అదనపు సొలిసిటర్ జనరల్ బల్బీర్‌సింగ్ వ్యక్తిగత సమస్యతో రాలేకపోయినందున వాయిదా ఇవ్వాలన్న విజ్ఞప్తికి తిరస్కరించింది. ‘‘ఇది వైద్య విద్యార్థుల హక్కులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం. పైగా సుప్రీంకోర్టులో కేంద్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఒక్క ఏఎస్జీ మాత్రమే లేరుగా!’’ అని పేర్కొంది. మొత్తం సీట్లు, ఖాళీలు, అందుకు కారణాలతో 24 గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఎంసీసీని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. అడ్మిషన్ల వ్యవహారాలు చూసే డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ గురువారం హాజరవాలని ఆదేశించింది. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుంటే వారికి పరిహారమివ్వాల్సిందిగా ఆదేశాలిస్తామని పేర్కొంది. చదవండి: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆహుతైన కార్లు, బైక్‌లు, రిక్షాలు, ఫొటోలు వైరల్ -
ఎన్నదగిన తీర్పు
మన దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల విధానం ప్రతిభకు అవరోధంగా మారిందని, అది సమానావకాశాలను దెబ్బతీస్తున్నదని వాదించేవారికి సుప్రీంకోర్టు తాజా తీర్పు కళ్లు తెరిపించాలి. మెడికల్, డెంటల్ కోర్సుల్లో యూజీ, పీజీ అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష నీట్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ తీర్పు వెలువడింది. ఓబీసీ కోటా, ఆర్థికంగా వెనకబడినవారి కోటా సక్రమమైనవేనని ఈ నెల 7న మధ్యంతర ఉత్తర్వులిచ్చిన సుప్రీంకోర్టు గురువారం అందుకు సంబంధించిన పూర్తి స్థాయి తీర్పును వెల్లడించింది. ఎంబీబీఎస్‌లో కోటాను వినియోగించుకుని పట్టభద్రులైనవారిని ఇక వెనకబడినవారిగా పరిగణించాల్సిన అవసరం లేదని, పీజీ అడ్మిషన్లకు కేవలం ప్రతిభే గీటురాయిగా ఉండాలని పిటిషనర్లు వాదించారు. పీజీ స్థాయిలోనూ, సూపర్ స్పెషాలిటీ స్థాయిలోనూ అత్యున్నత శ్రేణి నైపుణ్యం, పరిజ్ఞానం అవసరమవుతాయని... వీటిని బేఖాతరు చేసి కోటా అమలు చేయడం వల్ల జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నది పిటిషనర్ల ఆందోళన. 2021–22 విద్యా సంవత్సరం కోసం నిర్వహించే నీట్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓబీసీ కోటా ఉత్తర్వులివ్వడాన్ని కూడా ఎత్తిచూపి, ఆ విధంగా చూసినా అది చెల్లుబాటుకాదని వాదించారు. ఆట మొదలయ్యాక దానికి సంబంధించిన నిబంధనలు ఎలా మారతాయన్నది పిటిషనర్ల ప్రశ్న. ఈ తీర్పులో జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం సవివరమైన తీర్పునిచ్చింది. కోటా అమలుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి రాజ్యాంగ పరంగా 15(4), 15(5) అధికరణల కింద ప్రభుత్వానికి తిరుగులేని అధికారం ఉన్నదని చెబుతూ 15(1) అధికరణలో సూచించిన ‘సుదృఢమైన సమానత్వం’ సాధనకు ఈ నిర్ణయం అనుగుణ మైనదేనని వివరించింది. అసలు పరీక్షల్లో సాధించే మార్కులు ప్రతిభకు కొలమానమా, కాదా అనే అంశాన్ని కూడా లోతుగా పరిశీలించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అత్యధిక మార్కులు సాధించిన వ్యక్తి మంచి పనులకు ఆ ప్రతిభను వినియోగించనప్పుడు అతన్ని ప్రతిభావంతు డనవచ్చునా లేదా అని జస్టిస్ చంద్రచూడ్ సంధించిన ప్రశ్నకు ఎవరి దగ్గరా జవాబుండదు. నీట్ ప్రవేశాల్లో కోటా అమలుపై దాఖలైన పిటిషన్లలో లేవనెత్తిన అంశాలు నిజానికి చాలా పాతవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు బీసీ కోటా అమలుకు చర్యలు తీసుకున్నప్పుడూ... మాజీ ప్రధాని స్వర్గీయ వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసినప్పుడూ వాటిని వ్యతిరేకించినవారు ‘ప్రతిభ’ వాదనే లేవదీశారు. కోటా కింద ఎంపికయ్యేవారంతా ఎలాంటి తెలివితేటలూ లేనివారని, వారికి అవకాశాలు కల్పిస్తే ప్రతిభ కలిగిన తామంతా రోడ్డున పడతామని వాదించారు. దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వ్యవస్థ కారణంగా అట్టడుగు వర్గాలు సామాజిక అణచివేతకు గురయ్యాయి. పర్యవసానంగా విద్యాగంధానికీ, అందువల్ల కలిగే ఫలాలకూ దూరమయ్యాయి. ఎదుగూబొదుగూ లేకుండా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలోనే ‘వ్యవస్థీకృత అవరోధాల’ కారణంగా వెనకబడిన వర్గాలకు సమానావకాశాలు దక్కకుండా పోయాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవస్థీకృత అవరోధాలు కేవలం ఆ వర్గాలకు అన్యాయం చేయడం మాత్రమే కాదు... దేశ పురోగతిని కూడా ఆటంకపరిచాయన్నది చేదు నిజం. మెజారిటీ పౌరులకు ప్రవేశంలేని... వారి ప్రమేయంలేని వ్యవస్థ ఏలుబడిలో ఉన్న దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండగలదా? నీట్ వంటి పరీక్షలు అభ్యర్థు లందరికీ సమానావకాశాలు ఇస్తాయన్నది వాస్తవమే కావొచ్చు. కానీ ఆ సమానావకాశాల ద్వారా లబ్ధి పొందేందుకు అనువైన వాతావరణం కొన్ని వర్గాలకు కొరవడినప్పుడు అవి అర్థరహిత మవుతాయి. అక్కడే కోటా అవసరమవుతుంది. వ్యక్తుల్లో కనబడే ప్రతిభలో నిగూఢమైన వారసత్వ నేపథ్యం ఉంటుందని, దాన్ని ఒకరి స్వయంకృషిగా మాత్రమే అర్థం చేసుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడటం గమ నించదగ్గది. శతాబ్దాల అసమానతలు సృష్టించిన సామాజిక అంతరాలను సాధ్యమైనంతవరకూ తగ్గించాలంటే అవకాశాలను అందుకోవడంలో విఫలమవుతున్నవారికి ఆలంబనగా ఉండాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగం రిజర్వేషన్ల విధానానికి చోటిచ్చింది. ఈ రిజర్వేషన్లను మొదట్లోనే ఎస్సీ, ఎస్టీలతోపాటు సామాజికంగా వెనకబడిన కులాలకు కూడా కల్పించి ఉంటే బాగుండేది. రాజ్యాంగంలోని 15, 16 అధికరణలు కేంద్ర ప్రభుత్వానికి అందుకు అవకాశమిచ్చాయి కూడా. కానీ మన పాలకులు నిర్లక్ష్యం చేశారు. జనతాపార్టీ పాలనలో 1979లో సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఏడాది వ్యవధిలోనే నివేదికను సమర్పించింది. కానీ దాదాపు మరో దశాబ్దంపాటు అది ఫైళ్లకే పరిమితమయింది. చివరకు 1989లో నాటి వీపీ సింగ్ సర్కారు ఆ కమిషన్ సిఫార్సులకు బూజు దులిపి అమల్లోకి తీసుకొచ్చింది. విద్యా ఉద్యోగావకాశాల్లో కల్పించే కోటాను అందుకోలేని కులాలు ఈనాటికీ ఉన్నాయంటేనే సమానత్వ సాధనకు మనం ఎన్ని వేల యోజనాల దూరంలో ఉన్నామో ఆలోచించు కోవాల్సిందే. ప్రతిభవంటి నిరర్థకమైన వాదనలకు తాజా తీర్పు అడ్డుకట్ట వేయగలిగితేనే అలాంటి సమానత్వ భావన దిశగా మనం కదులుతున్నట్టు లెక్క. -
ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది. కాగా ఇటీవల నీట్ పరీక్షల్లో ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను రూ.8 లక్షల క్రీమీలేయర్ ఆధారంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం జనవరి 7వ తేదీన తీర్పు వెలువరించింది. అయితే ఈ అంశంపై గురువారం సుప్రీంకోర్టు సుధీర్ఘంగా ఉత్తర్వులు వెలువరించింది. కాగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం 2021 జులైలో నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే అయితే కొంతమంది అభ్యర్థులు ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే, ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేసేందుకు రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ అకడమిక్ సెషన్ నుంచి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయరాదని, ఈ కారణంగా నీట్ పీజీ కౌన్సిలింగ్ జాప్యమవుతుండటాన్ని నిరసిస్తూ వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. చదవండి: 'వైద్య నిపుణుల సూచనలతో బడులు ప్రారంభిస్తాం' మరోవైపు ప్రస్తుత కౌన్సిలింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ కేసు తుది తీర్పునకు లోబడి భవిష్యత్తు రిజర్వేషన్ల అర్హతలు ఆధారపడి ఉంటాయని పేర్కొంది. ఈ కేసు తుది విచారణ మార్చి చివరి వారంలో చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. చదవండి: Corona: ఒక్కరోజే 3 లక్షల కేసులు..8 నెలల తర్వాత తొలిసారి.. -
నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్
-
నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా 2021-22 ఏడాదికి సంబంధించి నీట్-పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓబీసీలకు 27 శాతం,ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల కోటా సబబే అని సుప్రీంకోరర్ట పేర్కొంది. గతంలో మాదిరిగానే క్రిమిలేయర్.. సంవత్సర ఆదాయం 8 లక్షలలోపు ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింప చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నీట్లో 10 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం లభించింది. -
పోలీసులు-రెడాల మధ్య ఉద్రిక్తత.. వైద్యసేవలు బంద్!
NEET PG Counselling Delay: నీట్ పీజీ అడ్మినిషన్ కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సోమవారం పోలీసులు రెసిడెంట్డాక్టర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పలువురు రెడాలు గాయపడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇక ఈ ఉదయం నుంచీ అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీట్ విషయమై వాదనలు వింటున్న సుప్రీం కోర్టుకు రెడాలు ఎయిమ్స్ పక్కనే ఉన్న సఫ్దార్జంగ్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి మార్చ్ నిర్వహించబోతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు మూసేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక రెడాలపై పోలీసుల తీరును ఖండిస్తూ.. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోషియేషన్(FAIMA) డిసెంబర్ 29, ఉదయం 8గం. నుంచి దేశవ్యాప్తంగా అన్నీ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి డిసెంబర్ 2020లో నీట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడుతూ వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నడుమే ఈ సెప్టెంబర్‌లో నీట్ పరీక్షను నిర్వహించింది ప్రభుత్వం. అయితే అడ్మిషన్ ప్రక్రియ మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. ఈ తరుణంలోనే రెసిడెంట్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెడాలపై లాఠీఛార్జ్, అసభ్య పదజాల ప్రయోగం ఆరోపణలను పోలీసులు ఖండించారు. పైగా రెడాలే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. నిరసనకారుల్లో 12 మందిని అరెస్ట్ చేసి.. ఆపై రిలీజ్ చేసినట్లు ప్రకటించారు. సఫ్దార్జంగ్ ఆస్పత్రి నుంచి మార్చ్ నిర్వహించకుండా మాత్రమే అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో నిన్న ఉదయం నుంచే అత్యవసర సేవల్ని మినహాయించి.. అన్ని విభాగాలను రెసిడెంట్ డాక్టర్లు బహిష్కరించారు. కరోనా, ఒమిక్రాన్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఆస్పత్రులు సైతం ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.