
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పరీక్షపై దేశవ్యాప్తంగా ఆందోళనలకు కొనసాగుతున్న వేళ.. కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపివేయాలని కోర్టును ఆశ్రయిస్తున్నారు కొందరు. ఈ క్రమంలో దాఖలైన ఓ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు కొట్టేసింది. అంతేకాదు.. నీట్ అవకతవకలను సీబీఐతో విచారణ చేయించాలని సదరు పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఆ అభ్యర్థనలకు కోర్టు నిరాకరించింది.
ఇంకోవైపు ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే కూడా నీట్ కౌన్సెలింగ్ వాయిదా వేయాలంటూ ఇంతకు ముందు ఓ పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం.. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది.
ఇక.. వివాదాస్పదంగా మారిన గ్రేస్ మార్కుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA).. 1,563 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సుప్రీం కోర్టుకు నివేదించింది. అంతేకాదు.. విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోకుండా చూస్తామని తెలిపింది. దీంతో.. వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహించన్నారు. ఆ ఫలితాలను 30న వెల్లడించి.. షెడ్యూల్ ప్రకారం యథాతధంగా జులై 6వ తేదీనే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఎన్టీయే ఏర్పాట్లు చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment