సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ముర్ము ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యార, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నర్సింగ్‌రావు నందికొండ, హైకోర్టు రిజి్రస్టార్ జనరల్ తిరుమలాదేవి ఈద, హైకోర్టు రిజి్రస్టార్ (అడ్మినిస్ట్రేషన్) మధుసూదన్‌రావు బొబ్బిలి రామయ్య పేర్లను ఈ నెల 11న ఢిల్లీలో భేటీ అయిన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
వీరంతా 2012లో జిల్లా జడ్జిలుగా ఎంపికైనవారు కావడం గమనార్హం. కాగా న్యాయాధికారుల కోటాలో వీరి ఎంపిక జరిగింది. తిరుమలాదేవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2026 జూన్ 1 వరకు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. మిగతా ముగ్గురు రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తారని.. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ ఈ నెల 25న కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించనున్నారు. హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా, ప్రస్తుతం 26 మంది ఉన్నారు. ఈ నలుగురితో కలిపి జడ్జిల సంఖ్య 30కి చేరింది. ఇంకా 12 ఖాళీలు ఉండగా, వీటి భర్తీ కోసం న్యాయవాదులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment