Central law department
-
ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్, జ్ఞానేశ్
న్యూఢిల్లీ: నూతన ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌లను కేంద్రం నియమించింది. వీరి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం కేంద్ర న్యాయ శాఖ విడుదలచేసింది. అంతకుముందు 212 పేర్లను సెర్చ్ కమిటీ ఎంపికచేసి మోదీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్‌కు పంపించింది. కాగా, వీరి నియామక విధానాన్ని సంబంధిత సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. ‘‘ ఈ పేర్లను పరిశీలించాలంటూ 212 మంది పేర్ల జాబితాను గత రాత్రి నాకు ఇచ్చారు. తెల్లారితే సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ మోదీ అధ్యక్షతన భేటీ ఉంది. రాత్రి ఇచ్చి మధ్యాహ్నంకల్లా 212 మందిలో ఎలక్షన్ కమిషనర్‌గా అర్హత ఉన్న వ్యక్తిని ఎంపికచేయడం మానవమాత్రులకు సాధ్యమా? బుధవారం ప్యానెల్ భేటీ జరగడానికి కేవలం 10 నిమిషాల ముందు తుది జాబితా అంటూ ఆరు పేర్లున్న లిస్ట్ ఇచ్చారు. ఈ తుది జాబితా నుంచి సుఖ్బీర్, జ్ఞానేశ్‌ల పేర్లను ప్యానెల్‌లోని మెజారిటీ సభ్యులు ఖరారుచేశారు. అయితే ఈ ప్రతిపాదిత పేర్లలో ఈ ఇద్దరినే ఎందుకు ఎంపిక చేశారో నాకైతే అర్ధంకాలేదు. సుప్రీంకోర్టు గత తీర్పు ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఈ ఎంపిక కమిటీలో ఉంటే బాగుండేది’ అని అధీర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్యానెల్లో మోదీ, అ«దీర్తోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్ అనూప్‌చంద్ర పాండే గత నెల 14వ తేదీన రిటైర్ కావడం, మరో ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇద్దరూ 1988 బ్యాచ్ అధికారులే ఎలక్షన్ కమిషనర్లుగా ఎంపికైన సుఖ్బీర్, జ్ఞానేశ్‌లు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. సుఖ్బీర్ ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారి కాగా, జ్ఞానేశ్ కేరళ క్యాడెర్ అధికారి. సుఖ్బీర్ గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. అఖిలభారత సరీ్వస్లోకి రాకముందు సుఖ్బీర్ అమృత్‌సర్‌లో ఎంబీబీఎస్ చదివారు. జ్ఞానేశ్ గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా చేశారు. అమిత్ షా మంత్రిగా ఉన్న సహకార శాఖలోనూ కార్యదర్శిగా ఉన్నారు. జమ్మూకశీ్మర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కలి్పంచిన ఆరి్టకల్ 370ని రద్దుచేయడంలో జ్ఞానేశ్ హోం శాఖలో పనిచేస్తూ కీలకపాత్ర పోషించారు. ఐఐటీ(కాన్పూర్) పట్టభద్రుడైన జ్ఞానేశ్ 2014లో ఢిల్లీలో కేరళ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్నారు. నూతన ఎలక్షన్ కమిషనర్లను ఎంపికచేసేందుకు సీజేఐ, ప్రధాని, లోక్‌సభలో విపక్షనేతలతో సెలక్షన్ ప్యానెల్‌ను ఏర్పాటుచేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరిచింది. దీనికి అనుగుణంగా కేంద్రం చట్టం చేసింది. కానీ సీజేఐకి బదులు కేంద్రమంత్రికి ప్యానెల్లో స్థానం కలి్పంచింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను శుక్రవారం కోర్టు విచారణ జరగనుంది. -
One Nation, One Poll: జమిలి ఎన్నికలు...కోవింద్‌తో లా కమిషన్ భేటీ
న్యూఢిల్లీ: ‘ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు’ అంశంపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీతో కేంద్ర లా కమిషన్ బుధవారం భేటీ అయింది. లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగానికి చేయాల్సిన సవరణలు తదితరాలతో కూడిన రోడ్ మ్యాప్‌ను కమిటీ ముందు ఉంచింది. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా లా కమిషన్‌ను కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే పురమాయింది. వాటితో పాటు మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యతను కోవింద్ కమిటీకి అప్పగించింది. ఈ అంశంపై లా కమిషన్ రూపొందిస్తున్న నివేదిక ఇంకా తుది రూపు సంతరించుకోవాల్సి ఉందని సమాచారం. ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు అంశంపై అభిప్రాయాలు, సూచనలు 3 నెలల్లో చెప్పాలంటూ రాజకీయ పార్టీలకు కోవింద్ కమిటీ తాజాగా లేఖలు రాసింది. ఆరు జాతీయ పార్టీలు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు నమోదైన గుర్తింపు లేని పార్టీలకు లేఖలు వెళ్లాయి. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల పదవీకాలాలను పొడిగించడం, తగ్గించడం వంటి చర్యల ద్వారా 2029లో వాటికి సైతం లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన విధాన రూపకల్పనలో లా కమిషన్ ప్రస్తుతం తలమునకలైంది. -
విషాదం: కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి మృతి
న్యూఢిల్లీ: మనుషుల జీవితాలను కరోనా వైరస్ రెండో దశ అతలాకుతలం చేస్తోంది. ఎలాంటి తారతమ్యం లేకుండా నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటోంది. ఎంతో మంది ప్రముఖులు, సాధారణ ప్రజలు కోవిడ్ కోరల్లో చిక్కుకొని మృత్యువాతపడుతున్నారు. తాజాగా కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నారాయణరాజు(62) మృతిచెందారు. డీఆర్డీవో ఫెసిలిటీలో చికిత్స పొందుతూ నారాయణరాజు మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నారాయణరాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా. ఇటీవలే రాజుకు న్యాయశాఖ కార్యదర్శిగా ఒక సంవత్సరం పొడిగింపు ఇచ్చారు. చదవండి: కోవిడ్ సెకండ్ వేవ్: ఏపీలో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ -
దేశవ్యాప్తంగా డీఎన్ఏ డేటా బ్యాంకులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో డీఎన్ఏ డేటా బ్యాంకులను కేంద్రం త్వరలోనే ఏర్పాటు చేయనుంది. నిబంధనలకు విరుద్ధంగా పౌరుల డీఎన్ఏ వివరాలను బయటకు వెల్లడిస్తే మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ డీఎన్ఏ ముసాయిదా బిల్లును రూపొందించింది. డీఎన్ఏ ప్రొఫైల్స్, డీఎన్ఏ శాంపిల్స్, రికార్డులను బాధితులు, నిందితులు, అనుమానితులు, తప్పిపోయినవారు, మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తుల్ని గుర్తించేందుకు మాత్రమే వాడతామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ బిల్లు రూపకల్పనలో న్యాయశాఖ బయోటెక్నాలజీ విభాగం సలహాలను తీసుకుందన్నారు. ఈ ముసాయిదా బిల్లుకు ప్రస్తుతం న్యాయశాఖ తుదిరూపు ఇస్తోందన్నారు. డీఎన్ఏ సమాచారాన్ని అక్రమంగా కోరేవారికి కూడా మూడేళ్ల జైలుశిక్షతో పాటు లక్ష వరకూ జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. వచ్చే సమావేశాల్లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఇటీవల కేంద్రం సుప్రీంకు తెలిపిందన్నారు. -
ట్రిబ్యునల్లకు కత్తెర!
న్యూఢిల్లీ: పెద్ద సంఖ్యలో ఉన్న వివిధ ట్రిబ్యునళ్లకు కత్తెర వేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. గందరగోళానికి కారణమయ్యే అనవసర, అడ్డగోలు చట్టాలను రద్దుచేయాలనే ప్రధాని మోదీ విధానాలకు అనుగుణంగా... ఒకే విధమైన విధులు నిర్వర్తిస్తున్న ట్రిబ్యునల్లను విలీనం లేదా రద్దుచేసే ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ పరిధిలోని న్యాయ వ్యవహారాల విభాగం .. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు లేఖ రాసింది. ప్రస్తుతమున్న ట్రిబ్యునళ్ల, వాటిలో ఒకేవిధమైన విధులు నిర్వర్తిస్తున్న ట్రిబ్యునళ్లను విలీనం చేయడంపై సాధ్యాసాధ్యాలతో కూడిన వివరాలను అందజేయాలని కోరింది. దేశంలో దాదాపు 35 ట్రిబ్యునళ్లు ఉన్నాయి.