జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సంధూ
కేంద్రం నోటిఫికేషన్
న్యూఢిల్లీ: నూతన ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్‌బీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌లను కేంద్రం నియమించింది. వీరి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం కేంద్ర న్యాయ శాఖ విడుదలచేసింది. అంతకుముందు 212 పేర్లను సెర్చ్ కమిటీ ఎంపికచేసి మోదీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్‌కు పంపించింది. కాగా, వీరి నియామక విధానాన్ని సంబంధిత సెలక్షన్ ప్యానెల్‌లో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు.
‘‘ ఈ పేర్లను పరిశీలించాలంటూ 212 మంది పేర్ల జాబితాను గత రాత్రి నాకు ఇచ్చారు. తెల్లారితే సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ మోదీ అధ్యక్షతన భేటీ ఉంది. రాత్రి ఇచ్చి మధ్యాహ్నంకల్లా 212 మందిలో ఎలక్షన్ కమిషనర్‌గా అర్హత ఉన్న వ్యక్తిని ఎంపికచేయడం మానవమాత్రులకు సాధ్యమా? బుధవారం ప్యానెల్ భేటీ జరగడానికి కేవలం 10 నిమిషాల ముందు తుది జాబితా అంటూ ఆరు పేర్లున్న లిస్ట్ ఇచ్చారు.
ఈ తుది జాబితా నుంచి సుఖ్‌బీర్, జ్ఞానేశ్‌ల పేర్లను ప్యానెల్‌లోని మెజారిటీ సభ్యులు ఖరారుచేశారు. అయితే ఈ ప్రతిపాదిత పేర్లలో ఈ ఇద్దరినే ఎందుకు ఎంపిక చేశారో నాకైతే అర్ధంకాలేదు. సుప్రీంకోర్టు గత తీర్పు ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఈ ఎంపిక కమిటీలో ఉంటే బాగుండేది’ అని అధీర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్యానెల్‌లో మోదీ, అ«దీర్‌తోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్ అనూప్‌చంద్ర పాండే గత నెల 14వ తేదీన రిటైర్ కావడం, మరో ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.
ఇద్దరూ 1988 బ్యాచ్ అధికారులే
ఎలక్షన్ కమిషనర్‌లుగా ఎంపికైన సుఖ్‌బీర్, జ్ఞానేశ్‌లు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. సుఖ్‌బీర్ ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారి కాగా, జ్ఞానేశ్ కేరళ క్యాడెర్ అధికారి. సుఖ్‌బీర్ గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. అఖిలభారత సరీ్వస్‌లోకి రాకముందు సుఖ్‌బీర్ అమృత్‌సర్‌లో ఎంబీబీఎస్ చదివారు. జ్ఞానేశ్ గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా చేశారు. అమిత్ షా మంత్రిగా ఉన్న సహకార శాఖలోనూ కార్యదర్శిగా ఉన్నారు.
జమ్మూకశీ్మర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కలి్పంచిన ఆరి్టకల్ 370ని రద్దుచేయడంలో జ్ఞానేశ్ హోం శాఖలో పనిచేస్తూ కీలకపాత్ర పోషించారు. ఐఐటీ(కాన్పూర్) పట్టభద్రుడైన జ్ఞానేశ్ 2014లో ఢిల్లీలో కేరళ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్నారు. నూతన ఎలక్షన్ కమిషనర్లను ఎంపికచేసేందుకు సీజేఐ, ప్రధాని, లోక్‌సభలో విపక్షనేతలతో సెలక్షన్ ప్యానెల్‌ను ఏర్పాటుచేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరిచింది. దీనికి అనుగుణంగా కేంద్రం చట్టం చేసింది. కానీ సీజేఐకి బదులు కేంద్రమంత్రికి ప్యానెల్‌లో స్థానం కలి్పంచింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను శుక్రవారం కోర్టు విచారణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment