selection comitee
-
ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్, జ్ఞానేశ్
న్యూఢిల్లీ: నూతన ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌లను కేంద్రం నియమించింది. వీరి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం కేంద్ర న్యాయ శాఖ విడుదలచేసింది. అంతకుముందు 212 పేర్లను సెర్చ్ కమిటీ ఎంపికచేసి మోదీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్‌కు పంపించింది. కాగా, వీరి నియామక విధానాన్ని సంబంధిత సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. ‘‘ ఈ పేర్లను పరిశీలించాలంటూ 212 మంది పేర్ల జాబితాను గత రాత్రి నాకు ఇచ్చారు. తెల్లారితే సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ మోదీ అధ్యక్షతన భేటీ ఉంది. రాత్రి ఇచ్చి మధ్యాహ్నంకల్లా 212 మందిలో ఎలక్షన్ కమిషనర్‌గా అర్హత ఉన్న వ్యక్తిని ఎంపికచేయడం మానవమాత్రులకు సాధ్యమా? బుధవారం ప్యానెల్ భేటీ జరగడానికి కేవలం 10 నిమిషాల ముందు తుది జాబితా అంటూ ఆరు పేర్లున్న లిస్ట్ ఇచ్చారు. ఈ తుది జాబితా నుంచి సుఖ్బీర్, జ్ఞానేశ్‌ల పేర్లను ప్యానెల్‌లోని మెజారిటీ సభ్యులు ఖరారుచేశారు. అయితే ఈ ప్రతిపాదిత పేర్లలో ఈ ఇద్దరినే ఎందుకు ఎంపిక చేశారో నాకైతే అర్ధంకాలేదు. సుప్రీంకోర్టు గత తీర్పు ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఈ ఎంపిక కమిటీలో ఉంటే బాగుండేది’ అని అధీర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్యానెల్లో మోదీ, అ«దీర్తోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్ అనూప్‌చంద్ర పాండే గత నెల 14వ తేదీన రిటైర్ కావడం, మరో ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇద్దరూ 1988 బ్యాచ్ అధికారులే ఎలక్షన్ కమిషనర్లుగా ఎంపికైన సుఖ్బీర్, జ్ఞానేశ్‌లు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. సుఖ్బీర్ ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారి కాగా, జ్ఞానేశ్ కేరళ క్యాడెర్ అధికారి. సుఖ్బీర్ గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. అఖిలభారత సరీ్వస్లోకి రాకముందు సుఖ్బీర్ అమృత్‌సర్‌లో ఎంబీబీఎస్ చదివారు. జ్ఞానేశ్ గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా చేశారు. అమిత్ షా మంత్రిగా ఉన్న సహకార శాఖలోనూ కార్యదర్శిగా ఉన్నారు. జమ్మూకశీ్మర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కలి్పంచిన ఆరి్టకల్ 370ని రద్దుచేయడంలో జ్ఞానేశ్ హోం శాఖలో పనిచేస్తూ కీలకపాత్ర పోషించారు. ఐఐటీ(కాన్పూర్) పట్టభద్రుడైన జ్ఞానేశ్ 2014లో ఢిల్లీలో కేరళ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్నారు. నూతన ఎలక్షన్ కమిషనర్లను ఎంపికచేసేందుకు సీజేఐ, ప్రధాని, లోక్‌సభలో విపక్షనేతలతో సెలక్షన్ ప్యానెల్‌ను ఏర్పాటుచేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరిచింది. దీనికి అనుగుణంగా కేంద్రం చట్టం చేసింది. కానీ సీజేఐకి బదులు కేంద్రమంత్రికి ప్యానెల్లో స్థానం కలి్పంచింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను శుక్రవారం కోర్టు విచారణ జరగనుంది. -
అలా సెలెక్టర్ అయ్యాడో లేదో రిటైర్మెంట్ ఇచ్చాడు
పాకిస్తాన్ వికెట్ కీపర్ క్రమాన్ అక్మల్ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ జాతీయ సెలెక్షన్ కమిటీకి ఎంపికైన కమ్రాన్ అక్మల్ తాజాగా రిటైర్మెంట్ ఇవ్వడం ఆసక్తిని సంతరించుకుంది. ఇక పీఎస్ఎల్లో తాను ప్రాతినిధ్యం వహించిన పెషావర్ జాల్మీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇక కమ్రాన్ అక్మల్ 2002లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 15 ఏళ్ల పాటు పాక్ జట్టు తరపున ఆడిన కమ్రాన్ ఫ్రంట్‌లైన్ వికెట్ కీపర్‌గా పనిచేశాడు. ఓవరాల్‌గా పాకిస్తాన్ తరపున 157 వన్డేల్లో 3236 పరుగులు, 53 టెస్టుల్లో 2648 పరుగులు, 58 టి20ల్లో 987 పరుగులు సాధించాడు. ఇక వన్డేల్లో ఐదు సెంచరీలు, టెస్టుల్లో ఆరు సెంచరీలు బాదాడు. 2009లో టి20 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో కమ్రాన్ అక్మల్ సభ్యుడిగా ఉన్నాడు. 2010లో పాకిస్తాన్ టెస్టు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా ఎంపికైనప్పటికి.. కొన్ని రోజుల్లోనే స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం ఆరోపణలు రావడంతో వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారు. అలా రెండేళ్ల పాటు ఆటకు దూరమైన కమ్రాన్ అక్మల్ తిరిగి 2012లో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత యువ ఆటగాళ్లు దూసుకురావడంతో కమ్రాన్‌కు క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. 2017లో వెస్టిండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్ కమ్రాన్ అక్మల్‌కు చివరిది. ఇక ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో కమ్రాన్ అక్మల్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 2016 నుంచి 2022 వరకు పెషావర్ జాల్మీ తరపున ప్రాతినిధ్యం వహించిన కమ్రాన్ 2017 సీజన్లో లీగ్‌లో తొలి సెంచరీ అందుకున్నాడు. ఇక ఆ సీజన్లో కమ్రాన్ అక్మల్ నుంచి మంచి ప్రదర్శన రాగా.. జట్టు కూడా ఫైనల్ వరకు వెళ్లగలిగింది. చదవండి: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!' రెండు దేశాల తరపున సెంచరీ.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు -
కోహ్లి ఆడిన మ్యాచ్‌ల్లో సగం కూడా ఆడలేదు.. వాళ్లకేం తెలుసు!
Keerthi Azad Slams BCCI Selectors About Kohli Captaincy Removal.. ఇండియన్ క్రికెట్ చరిత్రలో కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదం అత్యంత వివాదాస్పదంగా మారింది. కోహ్లిని తొలగించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడంపై చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇక కోహ్లి కూడా సౌతాఫ్రికా టూర్‌కు ఒక్కరోజు ముందు మీడియా ముందుకు వచ్చి బీసీసీఐపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. గంగూలీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బహిరంగంగా పేర్కొన్నాడు. దీంతో కెప్టెన్సీ వివాదం కాస్తా.. కోహ్లి వర్సెస్ బీసీసీఐగా మారిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కీర్తీ ఆజాద్ కోహ్లికి మద్దతిస్తూ బీసీసీఐ సెలక్టర్లను ఏకీపారేశాడు. చదవండి: Ind Vs Sa Test Series: కెప్టెన్‌గా కోహ్లికిదే చివరి అవకాశం.. కాబట్టి ''కోహ్లి విషయంలో సెలక్టర్లు వ్యవహరించిన తీరు తప్పుగా కనిపిస్తుంది. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడం కరెక్టే కావొచ్చు. కానీ చెప్పిన విధానం బాగాలేదు. విరాట్ కోహ్లి టీమిండియాకు కెప్టెన్‌గా గొప్ప విజయాలు అందించాడు. ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లు ఆడి మంచి అనుభవం సంపాదించిన ఒక సీనియర్ క్రికెటర్‌గా జట్టులో ఉన్నాడు. ఇంత అనుభవజ్క్షుడి విషయంలో బీసీసీఐ సెలక్టర్లు కాస్త గౌరవంగా ఉంటే బాగుండేది. కెప్టెన్సీ తొలగింపుపై కోహ్లికి చెప్పి ఉంటే హుందాగా కనిపించేది. ఇప్పుడున్న సెలక్టర్లు గొప్పవాళ్లు కావొచ్చు.. కానీ కోహ్లి ఆడిన మ్యాచ్‌ల్లో సగం కూడా ఆడలేదు. అతన్ని కించపరిచే హక్కు వాళ్లకు లేదు. నేను జాతీయ సెలక్టర్‌గా ఉన్న సమయంలో ముందు జట్టును ఎంపిక చేసి ప్రెసిడెంట్ దగ్గరకు తీసుకెళ్తారు. ఆయన ఒకసారి పరిశీలించి ఓకే అన్న తర్వాత జట్టును ప్రకటిస్తాం.. ఇది రూల్. దానిని ప్రస్తుతం పూర్తిగా మార్చేశారు'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: IND Tour Of SA: 'పొద్దున్నే నేనే దొరికానా.. నన్ను వదిలేయ్' ఇక సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా అక్కడ మూడు టెస్టులు.. మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక గాయంతో రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. -
ఆ ఇద్దరి కోసం పట్టుపట్టిన కోహ్లీ సేన.. బేఖాతరు చేసిన చీఫ్ సెలక్టర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కావడంతో, టీమిండియా మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఓపెనర్లైన పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌లను ఇంగ్లండ్‌కు పంపించాలని భారత సెలక్షన్ కమిటీని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గత నెల చివర్లో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మకు మెయిల్ చేశాడని, బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే షా, పడిక్కల్‌ను కాదని అనూహ్యంగా బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌ను స్టాండ్‌బైగా ఇంగ్లండ్ పర్యటనకు పంపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2019-20 రంజీ సీజన్, ఇండియా ఏ న్యూజిలాండ్ పర్యటనలో ఏ మాత్రం ప్రభావం చూపని అభిమన్యు ఈశ్వరన్‌ను ఏ ప్రాతిపాదికన ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారనే విమర్శలు తలెత్తుతున్నాయి. కాగా, ఈ విషయమై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా జోక్యం చేసుకుంటేనే సెలక్షన్ కమిటీ చైర్మన్ స్పందించేలా ఉన్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి పృథ్వీషా, పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపాలని టీమిండియా మేనేజ్మెంట్ నుంచి బీసీసీఐకి ఎలాంటి అధికారిక రిక్వెస్ట్ అందలేదు. మరోవైపు షా, పడిక్కల్ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో ఉన్నారు. జూలై 26న ఈ సిరీస్ ముగిసాక వీరి ఇంగ్లండ్ పర్యటన అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉంది. -
త్రోబాల్ జట్టు ఎంపిక పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం జిల్లా స్థాయి అండర్17 బాలబాలికల త్రోబాల్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా నలుమూలల 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులు ఎర్రన్న, స్టాలిన్, జిలాని, చంద్రకళ, తబితజెస్సిరాణి పర్యవేక్షించారు. జార్జికారొనేషన్ క్లబ్ వారు క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించారు. ఎంపికైన క్రీడా జట్లు ఈ నెల 19, 20వ తేదీల్లో రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలు, ఎంపికలలో పాల్గొనాల్సి ఉంటుందని, బుధవారం నుంచి దేవగుడి గ్రామంలో జరిగే శిక్షణ శిబిరంలో హాజరు కావాలని తెలిపారు. ఈ ఎంపికలలో పీఈటీలు లక్ష్మీనారాయణ, ప్రసాద్‌రెడ్డి, రాజా, అంకాల్‌రెడ్డి, అంకారావు, సుధాకర్ పాల్గొన్నారు. ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి త్రోబాల్ అండర్17 బాలుర జట్టుకు ఎం.నవీన్, కె.పురుషోత్తం, లక్ష్మినారాయణ, పి.జయప్రకాష్, బి.పెద్దమునయ్య, జె.సాయి, సుమన్, ప్రవీన్, డి.దేవేంద్ర, పి.శ్రీధర్, బి.బ్రహ్మయ్య, ఎస్.సునీల్, స్టాండ్‌బైగా వి.సాయితేజ, ఎం.శివమోహన్, బి.అనిల్, పి.హరికుమార్ ఎంపికయ్యారు. బాలికల జట్టుకు స్వాతి, శ్రావణి, బి.కళ్యాణి, కల్పన, కావ్య, శ్రీలేఖ, గౌతమి, చాముండి, మహాలక్ష్మి, పద్మావతి, సుకన్య, దీప్తి, స్టాండ్‌బైగా వరలక్ష్మీ, గాయత్రి, భార్గవి, నిరిషా ఎంపికయ్యారు. -
త్రోబాల్ జట్టు ఎంపిక పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం జిల్లా స్థాయి అండర్17 బాలబాలికల త్రోబాల్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా నలుమూలల 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులు ఎర్రన్న, స్టాలిన్, జిలాని, చంద్రకళ, తబితజెస్సిరాణి పర్యవేక్షించారు. జార్జికారొనేషన్ క్లబ్ వారు క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించారు. ఎంపికైన క్రీడా జట్లు ఈ నెల 19, 20వ తేదీల్లో రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలు, ఎంపికలలో పాల్గొనాల్సి ఉంటుందని, బుధవారం నుంచి దేవగుడి గ్రామంలో జరిగే శిక్షణ శిబిరంలో హాజరు కావాలని తెలిపారు. ఈ ఎంపికలలో పీఈటీలు లక్ష్మీనారాయణ, ప్రసాద్‌రెడ్డి, రాజా, అంకాల్‌రెడ్డి, అంకారావు, సుధాకర్ పాల్గొన్నారు. ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి త్రోబాల్ అండర్17 బాలుర జట్టుకు ఎం.నవీన్, కె.పురుషోత్తం, లక్ష్మినారాయణ, పి.జయప్రకాష్, బి.పెద్దమునయ్య, జె.సాయి, సుమన్, ప్రవీన్, డి.దేవేంద్ర, పి.శ్రీధర్, బి.బ్రహ్మయ్య, ఎస్.సునీల్, స్టాండ్‌బైగా వి.సాయితేజ, ఎం.శివమోహన్, బి.అనిల్, పి.హరికుమార్ ఎంపికయ్యారు. బాలికల జట్టుకు స్వాతి, శ్రావణి, బి.కళ్యాణి, కల్పన, కావ్య, శ్రీలేఖ, గౌతమి, చాముండి, మహాలక్ష్మి, పద్మావతి, సుకన్య, దీప్తి, స్టాండ్‌బైగా వరలక్ష్మీ, గాయత్రి, భార్గవి, నిరిషా ఎంపికయ్యారు. -
టీమిండియా కెప్టెన్‌గా రహానే
ముంబై: రహానే విల్ లీడ్ ద టీమిండియా.. రాబిన్ ఉతప్ప ఈ జ్ బ్యాక్ ఇంన్ టు ద టీమ్.. ఇలాంటి సంచలన ప్రకటనలతో సాగింది సోమవారం నాటి సెలక్షన్ కమిటీ సమావేశం. జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీం ఇండియాకు అజింక్య రహానే సారధిగా వ్యవహరించనున్నాడు. సోమవారం ముంబైలో చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ మేరకు జట్టులో సభ్యుల పేర్లను ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు అందరికీ విశ్రాంతి కల్పించడంతో అందరూ యూవకులతో కూడిన బృందమే జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ లో భాగంగా భారత్, జింబాబ్వేలు జులై 10, 12, 14 తేదీల్లో మూడు వన్ డే మ్యాచ్ లు ఆడతాయి. 17, 19 తేదీల్లో రెండు టీ 20ల్లో తలపడతాయి. అజింక్యా రహానే (కెప్టెన్), మురళీ విజయ్, అంబటి రాయుడు, మనోజ్ తివారీ, కేదార్, రాబిన్ ఉతప్ప, మనీష్ తివారీ, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, ధవల్ కులకర్ణీ, స్టువార్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, భువనేశ్వర్, సందీప్ శర్మ, హర్భజన్ సింగ్ (వన్ డే మ్యాచ్ లకు మాత్రమే)