ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్‌లో మంగళవారం జిల్లా స్థాయి అండర్17 బాలబాలికల త్రోబాల్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా నలుమూలల 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సెలక‌్షన్ కమిటీ సభ్యులు ఎర్రన్న, స్టాలిన్, జిలాని, చంద్రకళ, తబితజెస్సిరాణి పర్యవేక్షించారు. జార్జికారొనేషన్ క్లబ్ వారు క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించారు. ఎంపికైన క్రీడా జట్లు ఈ నెల 19, 20వ తేదీల్లో రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలు, ఎంపికలలో పాల్గొనాల్సి ఉంటుందని, బుధవారం నుంచి దేవగుడి గ్రామంలో జరిగే శిక్షణ శిబిరంలో హాజరు కావాలని తెలిపారు. ఈ ఎంపికలలో పీఈటీలు లక్ష్మీనారాయణ, ప్రసాద్‌రెడ్డి, రాజా, అంకాల్‌రెడ్డి, అంకారావు, సుధాకర్ పాల్గొన్నారు.
ఎంపికైన వారు
రాష్ట్ర స్థాయి త్రోబాల్ అండర్17 బాలుర జట్టుకు ఎం.నవీన్, కె.పురుషోత్తం, లక్ష్మినారాయణ, పి.జయప్రకాష్, బి.పెద్దమునయ్య, జె.సాయి, సుమన్, ప్రవీన్, డి.దేవేంద్ర, పి.శ్రీధర్, బి.బ్రహ్మయ్య, ఎస్.సునీల్, స్టాండ్‌బైగా వి.సాయితేజ, ఎం.శివమోహన్, బి.అనిల్, పి.హరికుమార్ ఎంపికయ్యారు. బాలికల జట్టుకు స్వాతి, శ్రావణి, బి.కళ్యాణి, కల్పన, కావ్య, శ్రీలేఖ, గౌతమి, చాముండి, మహాలక్ష్మి, పద్మావతి, సుకన్య, దీప్తి, స్టాండ్‌బైగా వరలక్ష్మీ, గాయత్రి, భార్గవి, నిరిషా ఎంపికయ్యారు.
త్రోబాల్ జట్టు ఎంపిక పోటీలు
Published Tue, Dec 13 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
Advertisement
Advertisement