టీమిండియా కెప్టెన్గా రహానే
ముంబై: రహానే విల్ లీడ్ ద టీమిండియా.. రాబిన్ ఉతప్ప ఈ జ్ బ్యాక్ ఇంన్ టు ద టీమ్.. ఇలాంటి సంచలన ప్రకటనలతో సాగింది సోమవారం నాటి సెలక్షన్ కమిటీ సమావేశం. జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీం ఇండియాకు అజింక్య రహానే సారధిగా వ్యవహరించనున్నాడు.
సోమవారం ముంబైలో చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ మేరకు జట్టులో సభ్యుల పేర్లను ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు అందరికీ విశ్రాంతి కల్పించడంతో అందరూ యూవకులతో కూడిన బృందమే జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ లో భాగంగా భారత్, జింబాబ్వేలు జులై 10, 12, 14 తేదీల్లో మూడు వన్ డే మ్యాచ్ లు ఆడతాయి. 17, 19 తేదీల్లో రెండు టీ 20ల్లో తలపడతాయి.
అజింక్యా రహానే (కెప్టెన్), మురళీ విజయ్, అంబటి రాయుడు, మనోజ్ తివారీ, కేదార్, రాబిన్ ఉతప్ప, మనీష్ తివారీ, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, ధవల్ కులకర్ణీ, స్టువార్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, భువనేశ్వర్, సందీప్ శర్మ, హర్భజన్ సింగ్ (వన్ డే మ్యాచ్ లకు మాత్రమే)