Zimbabwe Tour
-
రియాన్ పరాగ్ బెస్ట్ ఎమోషనల్ మూమెంట్
-
జింబాబ్వే టూర్‌కు నితీష్‌కుమార్
విశాఖ స్పోర్ట్స్: జింబాబ్వేతో తలపడే భారత్ టీ20 జట్టులోకి నితీష్‌కుమార్ రెడ్డి చేరాడు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ నితీష్‌కుమార్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. విశాఖకు చెందిన కె.నితీష్‌కుమార్ రెడ్డి భారత్ టీ20 జట్టులో స్థానం సాధించడం పట్ల ఆంధ్ర క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు శరత్చంద్ర రెడ్డి అభినందనలు తెలిపారు. జింబాబ్వే టూర్లో రాణించాలని ఆకాంక్షించారు. సంఘం కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు నితీష్‌కుమార్‌ను అభినందించారు. -
టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..?
టీమిండియా వచ్చే నెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను త్వరలో ఎంపిక చేయనున్నారు. 20 మంది ప్రాబబుల్స్ జాబితాను ఇదివరకే ఎంపిక చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని తెలుస్తుంది.అయితే ఈ పర్యటనకు కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై గత కొద్ది రోజులుగా సందిగ్దత నెలకొంది. సెలెక్టర్లు సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రాలకు రెస్ట్ ఇవ్వాలని ముందే అనుకున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా లేక సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరో ఒకరు టీమిండియా సారధిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతుంది.తాజాగా ఈ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు శుభ్‌మన్ గిల్ జింబాబ్వే పర్యటలో టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఈ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో టీ20 వరల్డ్‌కప్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, రింకూ సింగ్‌లతో పాటు ఐపీఎల్-2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీశ్ రెడ్డి, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణా ఉంటారని సమాచారం.వీరితో పాటు టీ20 వరల్డ్‌కప్ రెగ్యులర్ జట్టులో సభ్యులైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ కూడా జింబాబ్వే పర్యటనకు ఎంపిక కానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..?
టీ20 వరల్డ్‌కప్ 2024 తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్ స్టార్లకు (అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ దయాల్) అవకాశం ఇస్తారని తెలుస్తుంది. సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రా తదితరులు ఈ సిరీస్‌కు దూరంగా ఉంటారని సమాచారం. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరో ఒకరు టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చు. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటిస్తారని సమాచారం. టీ20 వరల్డ్‌కప్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికవుతారని తెలుస్తుంది.మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. భారత తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో బీసీసీఐ అత్యున్నత వర్గాల నుంచి ఓ సమాచారం లీకైంది. కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగిశాక భారత తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపడతాడని సమాచారం. లక్ష్మణ్ ఎన్సీఏలో ఉన్న తన బృందంతో జింబాబ్వే పర్యటనకు వెళ్తాడని తెలుస్తుంది. పూర్తి స్థాయి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు గంభీర్ కాస్త సమయం అడిగినందుకు లక్ష్మణ్‌ను జింబాబ్వే పర్యటనకు హెడ్‌కోచ్‌గా ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
టీమిండియా పటిష్టమైన జట్టే కావొచ్చు.. ధీటుగా పోటీ ఇస్తాం..!
ముంబై: భారత్ గట్టి ప్రత్యర్థి అని జింబాబ్వే టెక్నికల్ డైరెక్టర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ అన్నారు. ఈ భారత మాజీ ఓపెనర్ 2018 నుంచి జింబాబ్వేకు హెడ్ కోచ్‌గా తదనంతరం ఈ జూన్ నుంచి టెక్నికల్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ టీమిండియా పర్యటిస్తున్న నేపథ్యంలో హరారేలో ఉన్న ఆయన మీడియాతో ముచ్చటించారు. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలాంటి మేటి జట్లు జింబాబ్వేతో తరచూ ఆడాలని ఆశించారు. 2016 తర్వాత భారత్ ఇక్కడ పర్యటించడం జింబాబ్వే ఆటగాళ్లకు చక్కని అవకాశమని, గట్టి పోటీ జట్టును ఎదుర్కోవడం ద్వారా ఆటగాళ్లకు మేలు జరుగుతుందని లాల్‌చంద్ రాజ్‌పుత్ అన్నారు. ఇటీవలే బంగ్లాదేశ్‌ను ఓడించిన తమ జట్టు టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత జింబాబ్వే జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల కలబోతతో దీటుగా ఉందన్నారు. -
జింబాబ్వే టూర్.. జట్లను ప్రకటించిన బంగ్లాదేశ్.. కెప్టెన్ దూరం..!
జింబాబ్వే పర్యటనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్లను శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వేతో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20ల మ్యాచ్‌లు ఆడనుంది. అయితే టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లును సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా టీ20 సిరీస్‌కు బంగ్లా రెగ్యులర్ కెప్టెన్ మహ్మదుల్లాకు సెలక్టర్లు విశ్రాంతి విశ్రాంతి ఇచ్చారు. అతడి స్థానంలో కెప్టెన్‌గా ఆ జట్టు వికెట్ కీపర్ నూరుల్ హసన్ ఎంపికయ్యాడు. అదే విధంగా జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. జూలై 30 న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో బంగ్లా పర్యటన ప్రారంభం కానుంది. ఇక ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌లో ఓటమి చెందిన బంగ్లాదేశ్.. వన్డే సిరీస్‌ను మాత్రం క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ టీ20 జట్టు: నూరుల్ హసన్ (కెప్టెన్), మునిమ్ షహరియార్, అనాముల్ హక్, లిటన్ దాస్, అఫీఫ్ హుస్సేన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, మొసద్దెక్ హుస్సేన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో,మెహిదీ హసన్ మిరాజ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ బంగ్లాదేశ్ వన్డే జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిటన్ దాస్, అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్), మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, హజ్సన్ మహ్మద్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మొసద్దెక్ హొస్సేన్, తైజుల్ ఇస్లాం చదవండి: IRE vs NZ 3rd T20: తిరుగులేని న్యూజిలాండ్.. సిరీస్ క్లీన్‌స్వీప్ -
పసికూనపై అయినా ప్రతాపం చూపిస్తాడని.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు విరాట్..?
ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి విషయంలో బీసీసీఐ కొత్త ఎత్తుగడ వేసింది. కోహ్లిని తిరిగి ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు ఓ చిన్న జట్టుతో వన్డే సిరీస్ ఆడించాలని భారత సెలెక్షన్ కమిటీ భావిస్తుంది. ఇందులో భాగంగా ఆసియా కప్‌కు ముందు జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం కోహ్లిని ఎంపిక చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా సెంచరీ లేక అవస్థలు పడుతున్న కోహ్లి జింబాబ్వేతో సిరీస్‌లోనైనా పూర్వపు ఫామ్‌ను దొరకబుచ్చుకుంటాడని బీసీసీఐ ఈ ప్లాన్ వేసింది. దీన్ని అమలు చేసేందుకు భారత క్రికెట్ బోర్డు కోహ్లి సమ్మతాన్ని సైతం లెక్కచేయకపోవచ్చని సమాచారం. కాగా, ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలోనైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడని అంతా ఆశించారు. అయితే కోహ్లి అందరి ఆశలను అడియాశలు చేస్తూ.. పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్, రెండు టీ20లు, రెండు వన్డేల్లో కలిపి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరాల్సి ఉండగా.. కోహ్లి రెస్ట్ పేరుతో ఈ పర్యటనకు డమ్మా కొట్టి పారిస్ టూర్‌కు వెళ్లనున్నాడు. విండీస్‌తో సిరీస్ అనంతరం ఆగస్టు 18 నుంచి 22 వరకు టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. అతర్వాత ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కావాల్సి ఉంది. చదవండి: Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు! -
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ దూరం..!
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌తో పాటు జింబాబ్వే పర్యటనకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ధృవీకరించింది. కాగా ప్రస్తుతం జరుగుతోన్న టీ20 సిరీస్ అనంతరం బంగ్లాదేశ్ విండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే బంగ్లాదేశ్-వెస్టిండీస్ ద్వైపాక్షిక సిరీస్ వన్డే సూపర్ లీగ్ నుంచి మినహాయించబడింది. ఈ సిరీస్ వన్డే సూపర్ లీగ్‌లో భాగం కాకపోవడంతో షకీబ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. "జింబాబ్వే టూర్, విండీస్‌తో వన్డే సిరీస్‌లకు షకీబ్ అందుబాటులో ఉండడు. ఈ విషయం మాకు ముందే అతడు తెలియజేశాడు. ఈ సిరీస్‌లకు జట్టు ఎంపిక గురించి సెలక్షన్ ప్యానెల్‌తో చర్చించాం. అయితే ఇతర సీనియర్ ఆటగాళ్లు చాలా మంది అందుబాటులో ఉండనున్నారు" అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్ పేర్కొన్నారు. చదవండి: Wasim Jaffers India Playing XI: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. ఉమ్రాన్ మాలిక్‌కు నో ఛాన్స్..! -
'చాలా థ్యాంక్స్.. మమ్మల్ని బాగా చూసుకున్నారు'
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జట్టు జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చింది. మూడు టీ20, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం పాకిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను 2-1, టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది. డబుల్ సెంచరీ చేసిన ఆబిద్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలవగా... 14 వికెట్లు పడగొట్టిన హసన్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ గా నిలిచాడు. తాజాగా పాక్ జట్టు ప్రదర్శనపై ఆ జట్టు మేనేజర్ మన్సూర్ రాణా ప్రశంసలతో ముంచెత్తాడు. '' జింబాబ్వేను టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేయడం సూపర్ అని.. జట్టుగానే గాక ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన నాకు సంతోషాన్ని కలిగించింది. బౌలర్ హసన్ అలీకి ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. ఇక జింబాబ్వేలో మేం బస చేసిన హోటల్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. వారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. రంజాన్ మాసం దృష్టిలో ఉంచుకొని ఇఫ్తార్, సెహర్ సమయాల్లో రకరకాల డిషెస్‌ను వడ్డించారు. చాలా థ్యాంక్స్ జింబాబ్వే క్రికెట్ బోర్డ్'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో పాక్ బౌలర్ హసన్ అలీ అద్బుత ప్రదర్శనతో అదరగొట్టాడు. రెండు మ్యాచ్‌లు కలిపి 8.93 యావరేజ్‌తో మొత్తం 14 వికెట్లు తీయగా.. ఇందులో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. చదవండి: 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు' నా తండ్రి ఆటను టీవీలో చూశా.. అప్పడే నిశ్చయించుకున్నా -
పాక్ సీనియర్ ఆటగాళ్లపై వేటు
కరాచీ: కొంత కాలంగా పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా తయారైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథులు షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతోపాటు పేసర్ మొహ్మమ్మద్ అమీర్‌పై వేటు పడింది. జింబాబ్వేతో ఆరంభమయ్యే వన్డే, టి20 సిరీస్‌ల కోసం 22 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టులో వీరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చోటు కల్పించలేదు. అయితే ఇటీవల ముగిసిన దేశవాళీ టి20 లీగ్ నేషనల్ టి20 కప్‌లో రాణించిన సెంట్రల్ పంజాబ్ జట్టు యువ ఆటగాడు అబ్దుల్లా షఫీక్‌కు మొదటిసారి సీనియర్ జట్టులో స్థానం లభించింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోని పేస్ ద్వయం హసన్ అలీ, నసీమ్ షా పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌ను నియమించిన పీసీబీ... వైస్ కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను నియమించింది. పాక్, జింబాబ్వే మధ్య తొలి వన్డే ఈనెల 30న జరగనుండగా... నవంబర్ 1, 3వ తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం నవంబర్ 7, 8, 10వ తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. మా వీసాల అంశాన్ని ఐసీసీ చూస్తుంది భారత్‌లో ఆడేందుకు తలెత్తే వీసా ఇబ్బందులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చూసుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వీసాల బాధ్యత పూర్తిగా ఐసీసీదేనని పీసీబీ సీఈఓ వసీమ్ ఖాన్ తెలిపారు. ఐసీసీ ఈ అంశంపై తమకు హామీ ఇవ్వాలని ఆయన చెప్పారు. అయితే దేనికైనా నిర్దిష్ట గడువు అంటూ ఉండాలని వచ్చే జనవరిదాకా ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు చెప్పారు. చిరకాల ప్రత్యర్థుల మధ్య సమీప భవిష్యత్తులో ముఖాముఖి టోర్నీలు జరుగుతాయన్న ఆశలేవీ లేవని ఆయన చెప్పారు. -
అఫ్గానిస్తాన్ ' అతిపెద్ద' విజయం
షార్జా: తమ వన్డే క్రికెట్లో అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్ 154 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తద్వారా తన వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని అఫ్గాన్ సొంతం చేసుకుంది.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 333 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గాన్ ఆటగాళ్లలో రహ్మత్ షా(114;110 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), నజీబుల్లా జద్రాన్(81 నాటౌట్; 51 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఇస్మానుల్లా జనాత్(54; 53 బంతుల్లో 9 ఫోర్లు)లు రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. కాగా, ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 34.4 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ నాలుగు వికెట్లతో జింబాబ్వే నడ్డివిరిచాడు. అతనికి జతగా జద్రాన్ రెండు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంచితే, అఫ్గాన్‌కు వన్డేల్లో రెండో అతిపెద్ద స్కోరు. అంతకుముందు ఐర్లాండ్‌పై 338 పరుగులు అఫ్గాన్ వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు. -
వెంటనే కోహ్లీకి మెస్సేజ్ చేశాను!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్లలో యుజువేంద్ర చాహల్ ఒకడు. 2015 సీజన్లో 23 వికెట్లు, 2016లో 21 వికెట్లు తీసి జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా జెర్సీ ధరించాలన్నది తన కల అని, నేటితో తన కల తీరనుందన్నాడు. హరారేలో నేడు జింబాబ్వేతో భారత్ తొలి వన్డే ఆడనుంది. అయితే టీమిండియాకు సెలక్ట్ అయ్యాయని తెలిసినప్పుడు విరాట్ కోహ్లీకి మెస్సేజ్ చేసి సంతోషాన్ని పంచుకున్నానని చెప్పాడు. కోహ్లీ తనను అభినందించాడని ఆ క్షణాలను గుర్తుచేసుకున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో చాహల్ కొనసాగుతున్నాడు. తాను టీమిండియాకు సెలెక్ట్ అవ్వడం ఐపీఎల్ చలవే అంటున్నాడు. తన బౌలింగ్ లో ఆటగాళ్లు భారీ సిక్సర్లు బాదినా కెప్టెన్ ఒక్కమాట కూడా అనేవాడు కాదని, అది కోహ్లీ తనపై ఉంచిన నమ్మకం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి భీకర ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్లలో బౌలింగ్ చేయడంతో మెరుగయ్యాయని లెగ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. వారు హార్డ్ హిట్టర్స్ కనుక అందుకే వారికి ప్లాన్ ప్రకారం కచ్చితమైన అన్ అండ్ లెన్త్, ఫుల్ టాస్ బంతులు వేసేవాడినని చెప్పాడు. డివిలియర్స్, కోహ్లీ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాత్రం అంతర్జాతీయ అనుభవం లేని యువ ఆటగాళ్లతో జింబాబ్వేపై సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాడు. -
'జీవితంలో ఆ బంతులు వేయను'
న్యూఢిల్లీ: తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఒక్క బంతిని కూడా దూస్రా వేయలేదని టీమిండియా జింబాబ్వే సిరీస్ కు ఎంపికైన కొత్త బౌలర్ జయంత్ యాదవ్ అంటున్నాడు. వచ్చే నెలలో అక్కడ పర్యటించనున్న బృందంలో టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులోకి తొలిసారి ఎంపికైనవారు ఆరుగురు ఆటగాళ్లలో జయంత్ ఒకడు. దూస్రా ప్రయోగించలేదని, భవిష్యత్తులోనూ ఎప్పుడూ దూస్రా బంతులు వేయనని ఆఫ్ స్పిన్నర్ జయంత్ చెప్పాడు. టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఎప్పుడూ కలవలేదని, అతడితో ఇంటరాక్ట్ అవ్వాలని ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. బ్యాట్స్ మెన్ ను దూస్రా ఔట్ చేస్తుందని తాను నమ్మనని, క్యారమ్ బంతులు మాత్రం సంధిస్తానంటున్నాడు. 40 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడిన జయంత్.. 110 వికెట్లు పడగొట్టానని, అయితే అంతర్జాతీయ మ్యాచులు ఆడి మరిన్ని వికెట్లు తీయాలని భావిస్తున్నానని చెప్పాడు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, యుజువేంద్ర చాహల్ లాంటి బౌలర్లతో తనకు కాంపిటీషన్ తప్పదని పేర్కొన్నాడు. తొలి స్పిన్నర్ గా మిశ్రా ఉంటాడని, రెండో స్పిన్నర్ కోసం తాను, చాహల్ పోటీ పడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. జింబాబ్వేతో వన్డే, టి20లకు జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఫైజ్ ఫజల్, మనీశ్ పాండే, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, రిషి ధావన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, జస్ప్రీత్ బుమ్రా, బరీందర్ శరణ్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్, జైదేవ్ ఉనాద్కట్, యజువేంద్ర చహల్. -
విరాట్ కోహ్లికి రెస్ట్ అందుకే
ముంబై:భారత క్రికెట్ జట్టు ఫిజియో థెరపిస్ట్ పాట్రిక్ ఫార్హార్ట్ సూచన మేరకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి జింబాబ్వే టూర్ నుంచి విశ్రాంతినిచ్చినట్లు చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. త్వరలో వెస్టిండీస్‌తో ప్రధానమైన టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలని ఫిజియో థెరపిస్ట్ సూచించారన్నారు. దీంతో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ముగిశాక ఆరంభమయ్యే జింబాబ్వే టూర్ నుంచి కోహ్లిని విశ్రాంతి కల్పించినట్లు సందీప్ పేర్కొన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లి నాలుగు సెంచరీలు నమోదు చేసి సరికొత్త ఫీట్ ను సృష్టించాడు. ఐపీఎల్ లీగ్ దశలో 919 పరుగులతో ఎవరకీ అందనంత ఎత్తులో ఉన్న కోహ్లి.. రాయల్ చాలెంజర్స్ ను ప్లే ఆఫ్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్‌లకు జింబాబ్వే పర్యటన నుంచి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. జింబాబ్వే పర్యటనకు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 16 మందితో కూడిన భారత వన్డే, టి-జట్టును సోమవారం ప్రకటించారు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. వచ్చే నెలలో జింబాబ్వే పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్‌లను ఆడనుంది. ఇక వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత్ టెస్టు జట్టును కూడా ఇదే రోజు ప్రకటించారు. జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న కోహ్లీ విండీస్ పర్యటనలో టెస్టు జట్టుకు సారథ్యం వహించనున్నాడు. పేసర్ శార్దుల్ ఠాకూర్‌కు భారత టెస్టు జట్టులో తొలిసారి చోటు లభించగా, మహ్మద్ షమీకి మళ్లీ అవకాశం దక్కింది. కోహ్లీ సారథ్యంలో 17 మందితో కూడిన టెస్టు జట్టును ఎంపిక చేశారు. జూలైలో విండీస్‌తో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. -
రైనా 'రెస్ట్' వెనుక 'పెద్ద' కథే నడిచిందట!
గత నెల జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టులో సభ్యుల ఎంపిక, కెప్టెన్సీ ఎవరికి కట్టబెట్టాలనే నిర్ణయాల వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలిసింది. నిజానికి ఆ పర్యటనకు టీమిండియా కెప్టెన్‌గా సురేశ్ రైనా పేరును సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. కానీ చివరి నిమిషంలో బీసీసీఐలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ పెద్ద మనిషి ఒత్తిడి మేరకు రైనాకు రెస్ట్ ఇచ్చి అజింక్యా రహానేను కెప్టెన్‌గా ప్రకటించింది. జింబాబ్వే టూర్‌కు జట్టును ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ జూన్ 29న ముంబైలో సమావేశమైంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించడంతోపాటు యువ జట్టును సిద్ధం చేసి.. వారికి సారధిగా రైనాను ఎంపికచేశారు. కానీ బీసీసీఐ పెద్ద రాకతో సీన్ రివర్సయింది. రైనాకు కెప్టెన్సీ వద్దని, ఇతర సీనియర్లలాగే అతనికి కూడా రెస్ట్ ఇవ్వమని సెలక్షన్ కమిటీని ఒత్తిడి చేశాడట ఆ పెద్దమనిషి. మరోదారిలేని సెలెక్టర్లు ఆయన చెప్పినట్లే రైనాకు విశ్రాంతినిచ్చారు. ఎందుకిలా చేశారంటే.. సెలక్షన్ కమిటీ సమావేశానికి సరిగ్గా రెండురోజుల ముందు ఐపీఎల్ స్కాంస్టర్ లలిత్ మోదీ ఓ సంచనల ట్వీట్ వదిలాడు. 'చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, డ్వెయిన్ బ్రావోలు ఓ రియల్ ఎస్టేట్ దిగ్గజం నుంచి ముడుపులు తీసుకుని ఫిక్సింగ్ కు పాల్పడ్డారు' అని మోదీ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో రైనాపై నమ్మకం సడలిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి కెప్టెన్సీ కట్టబెట్టడం అంగీకారం కాదని బీసీసీఐ పెద్దలు భావించారట. అదే విషయాన్ని తమ సహచరుడి ద్వారా సెలక్షన్ కమిటీకి చెప్పించారట. ఆ సందర్భంలోనే 'సెలక్షన్ కమిటీ నిర్ణయాం వెనుక లలిత్ మోదీ ట్వీట్ ప్రభావమేమైనా ఉందా?' అనే ప్రశ్నకు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ బదులిస్తూ 'రైనా అంతర్జాతీయ స్థాయి ఆటగాడు కనుక ఐసీసీయే అతడి వ్యవహార్ని పర్యవేక్షిస్తుంది' అని చెప్పడం, రైనా కూడా 'నేను ఎలాంటి తప్పుచేయలేదు. ఆటే ప్రాణంగా శ్వాసించాను' అని ప్రకటించడం తెలిసిందే. -
జింబాబ్వేలో పాక్ పర్యటన రద్దు
కరాచీ: వచ్చే నెలలో తమ జింబాబ్వే పర్యటనను పాకిస్తాన్ జట్టు రద్దు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆ జట్టుతో పాక్ మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఇరు దేశాల బోర్డుల అంగీకారంతో ఈ సిరీస్ రద్దయినట్టు సమాచారం. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారి ఒకరు ధృవీకరించారు. ‘టూర్ రద్దు విషయం నిజమే. ఈ సిరీస్‌కు స్పాన్సర్‌ను సంపాదించడంలో జింబాబ్వే బోర్డుకు సమస్యలు ఎదురవుతున్నాయి’ అని చెప్పారు. -
వీరికి ఇదే అవకాశం
యువ ఆటగాళ్లకు పరీక్షగా మారిన జింబాబ్వే టూర్ కొంత మంది సీనియర్లకు కూడా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో జింబాబ్వే టూర్‌కు యువ జట్టును ఎంపిక చేశారు సెలక్టర్లు. పూర్తిగా యువకులతో కూడిన జట్టు కాకపోయినా కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంతో పాటు గతంలో ఆడి తెరమరుగయిన ఆటగాళ్లకు కూడా మరోసారి ఛాన్స్ ఇచ్చారు. తొలిసారి ప్రతిభ చూపేందుకు కొత్త ఆటగాళ్లు ఆరాటపడుతుండగా, ఈ సిరీస్‌లోనైనా నిరూపించుకోవాలని గతంలో ఆడిన ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో అభిమానులు కాస్త ఆసక్తిగా గమనించేబోయే ఆటగాళ్లను పరిశీలిస్తే... సందీప్ శర్మ.. భారత పేసర్లు బౌలింగ్‌లో వైవిధ్యం చూపించడం లేదని బంగ్లాతో సిరీస్ అనంతరం ధోని వ్యాఖ్యానించాడు. అంటే ధోనికి ప్రస్తుత బౌలర్లపై కాస్త నమ్మకం తగ్గిందనే చెప్పాలి. ఇలాంటి దశలో జట్టులో చోటు సంపాదించాడు సందీప్ శర్మ. ఈ సీజన్ ఐపీఎల్లో ఘోరంగా విఫలమైన పంజాబ్ జట్టులో ఆడి అంద ర్నీ ఆకట్టుకున్న ఆటగాడు సందీప్ శర్మ. ఈ సీజన్లో 13 వికెట్లు, గత సీజన్లో 14 వికెట్లు తీసి సత్తా చాటాడు. రంజీ సీజన్లో 36 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. స్వింగ్ బౌలింగ్‌తో ఆకట్టుకునే సందీప్‌కు జింబాబ్వే పిచ్‌లు సహకరించకపోవచ్చు. అయినా భువనేశ్వర్‌కు జోడీగా రెండో ప్రధాన పేసర్‌గా జట్టులో చోటు దక్కే అవకాముంది. సందీప్ వయసు 22 ఏళ్లే కాబట్టి చాలాకాలం పాటు భారత జట్టుకు అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సత్తా చాటితే ఇక జాతీయ జట్టులో చోటు సుస్థిర స్థానం సంపాదించినట్లే. హర్భజన్ సింగ్.. 35 ఏళ్ల హర్భజన్ సింగ్ గురించి కొత్త చెప్పెదేమి లేదు. భారత జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లలో ఒకడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. వయసు దృష్ట్యా భజ్జీ భవిష్యత్తులో ఎక్కువ కాలం జట్టులో కొనసాగే అవకాశం లేదు. అయితే అశ్విన్ మినహా మిగిలిన స్పిన్నర్లు జడేజా, అక్షర్ విఫలమవుతున్న ప్రస్తుత సందర్భంలో హర్భజన్ అవకాశాలను కొట్టిపారేయలేం. మరికొంత కాలమైనా జట్టులో చోటు పదిలం చేసుకోవాలంటే ఈ సిరీస్‌లో రాణించడం ముఖ్యం. పైగా గత నెలలో ఆడిన ఏకైక టెస్టులో పెద్దగా రాణించింది లేదు. ఈ సిరీస్ భజ్జీకి కెరీర్‌కు కీలకం కానుంది. మనీష్ పాండే.. ప్రస్తుత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నేతృత్వంలో అండర్-19 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు. ఐపీఎల్ రెండో సీజన్లో సెంచరీ చేసి ఆ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్ట్రోక్ ప్లేతో పాటు వేగంగా ఆడడంలోనూ దిట్ట. టాపార్డర్, మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగలడు. ఐపీఎల్ తొలి మూడు సీజన్లు బెంగుళూరు జట్టుకు ఆడిన 25 ఏళ్ల మనీష్.. తర్వాత కోల్‌కతాకు మారాడు. ఆ జట్టు మిడిలార్డర్లో వెన్నెముకలా తయారయ్యాడు. రంజీల్లో కర్ణాటక తరఫున 50కి మించి సగటుతో 5వేలకు పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది విజయ్‌హజరే ట్రోఫీలో ఏకంగా 118 సగటుతో 652 పరుగులు చేశాడు. గత డిసెంబర్లో వెస్టిండీస్‌తో సిరీస్‌లో టీ20 మ్యాచ్‌కు ఎంపికైనా.. ఆ జట్టు పర్యటనను రద్దు చేసుకోవడంతో మళ్లీ ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. తుది జట్టులో కూడా మనీష్‌కు చోటు ఉండే అవకాశం ఉంది. భారత్-ఎ తరఫున కూడా సత్తా చాటిన మనీష్ భవిష్యత్తులో స్టార్ ఆటగాడిగా ఎదిగే అవకాశాలున్నాయి. ఆ క్రమంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. మురళీ విజయ్.. ప్రస్తుతం విదేశాల్లో అద్భుతంగా రాణిస్తున్న భారత ఆటగాడు మురళీ విజయ్. దిగ్గజాలు సైతం పరుగులు చేయడానికి ఇబ్బందిపడిన ఇంగ్లండ్, ఆసీస్‌ల్లో సత్తా చాటాడు. అయితే అది టెస్టుల్లోనే. వన్డేల్లో పరిస్థితి వేరేలా ఉంది.ఇప్పటివరకు 14 వన్డేలు ఆడినా సగటు 20కి మించలేదు. పైగా శిఖర్, రోహిత్‌లు ఓపెనర్లుగా స్థానాలను పదిలం చేసుకోవడంతో జట్టులోకి రాలేకపోయాడు. ఈ సిరీస్‌లో సత్తా చాటితే మరో రిజర్వ్ ఓపెనర్ దొరుకుతాడు. ఓపెన ర్లలో ఎవరైనా గాయపడితే ప్రత్యామ్నాయం ఉండడం అవసరం. ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ తరఫున పెద్దగా రాణించకపోయినా.. రంజీల్లో 1,042 పరుగులు సాధించాడు. కీపింగ్ స్థానం కోసం.. దాదాపు ధోని వచ్చిన కొంతకాలానికే జట్టులో చోటు పొందిన రాబిన్ ఉతప్ప ఇప్పుడు దేశవాళీలకే పరిమితమయ్యాడు. యువ ఆటగాళ్లకు అవకాశమిస్తున్న సెలక్టర్లు చాలా రోజులుగా ఉతప్పను పట్టించుకోలేదు. ఐపీఎల్, దేశవాళీల్లో గత రెండు సీజన్లుగా టన్నుల కొద్ది పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో కీపింగ్ చేసే అవకాశాలు ఎక్కువ. ఓపెనర్‌గానే కాకుండా లోయర్ అర్డర్‌లో కూడా ఆడే సామర్థ్యం ఉంది. ధోని కూడా మూడేళ్లకు మించి ఆడే అవకాశాలు లేనందున రిజర్వ్ కీపర్‌గా ఉపయోగపడతాడు. అయితే మరో ఆటగాడు కేదార్ జాదవ్ నుంచి ఉతప్పకు పోటీ ఉంది. వికెట్‌ను అంత సులభంగా ప్రత్యర్థి సమర్పించుకొని కేదార్ ఓంటరి పోరాటం చేయగలడు. టెయిలెండర్లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతాడు. కీపింగ్ కూడా చేయగల కేదార్ నుంచి ఉతప్పకు పోటీ ఉంది. మనోజ్ తివారీ.. ఎప్పుడో 2008లోనే ఆస్ట్రేలియాపై వారి సొంతగడ్డలోనే ఆరంగేట్రం చేశాడు మనోజ్ తివారీ. ప్రతిభ ఉన్న యువ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న తివారీ వయసు ప్రస్తుతం 29 ఏళ్లు. ఇప్పటివరకు ఆడింది 9 వన్డేలే. ప్రతిసారి జట్టులోకి సెలక్ట్ అవడం, గాయంతో తప్పుకోవడం అలవాటుగా మారింది. దాంతో సెలక్టర్లు కొన్నేళ్లుగా అతణ్ని పరిగణించడమే మానేశారు. గతేడాది చివరిసారిగా బంగ్లాతో వన్డే ఆడాడు. సీనియర్లు తప్పుకోవడం మళ్లీ పిలుపు అందుకున్నాడు. లక్ష్మణ్ సలహాలతో రాటుదేలుతానని చెప్పిన తివారీ ఈసారైనా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. మిడిలార్డర్లో ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. ఒకవేళ ఈ సిరీస్‌లో విజయవంతమైతే మన రిజర్వ్ బెంచ్ మరింత బలపడుతుంది. -
ధోని కెప్టెన్సీని గౌరవిస్తా: రహానే
న్యూఢిల్లీ: తనదైన శైలిలో జట్టును నడిపిస్తానని జింబాబ్వే పర్యటనకు టీమిండియా కెప్టెన్ గా ఎంపికైన అజింక్య రహానే తెలిపాడు. తన వ్యూహాలు అనుసరిస్తానని చెప్పాడు. కెప్టెన్ గా నియమితుడైన తర్వాత రహానే తొలిసారిగా సోమవారం విలేకరులతో మాట్లాడాడు. ధోని నాయకత్వ లక్షణాలను గౌరవిస్తానని, వాటి నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. ధోని శాంతగుణం తనకెంతో నచ్చుతుందని చెప్పాడు. వన్డేలోకి హర్భజన్ సింగ్ పునరాగమనంపై రహానే సంతోషం వ్యక్తం చేశాడు. జింబాబ్వే పర్యటనకు నాలుగు రోజుల ముందు టీమిండియాకు దెబ్బ తగిలింది. చేతివేలి గాయం కారణంగా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. ఈ నెల 10 నంచి ప్రారంభంకానున్న జింబాబ్వే టూరులో టీమిండియా 3 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. -
రహానేకు పగ్గాలు
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఎంపిక ఎనిమిది మంది సీనియర్లకు విశ్రాంతి హర్భజన్, ఉతప్పలకు చోటు జింబాబ్వే పర్యటనకు సీనియర్ జట్టుతో పాటు ‘ఎ’ జట్ల ముక్కోణపు సిరీస్‌కు భారత్ ‘ఎ’ జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లు సోమవారం సమావేశమయ్యారు. తీరా జట్లను ప్రకటించాక చూస్తే రెండూ ‘ఎ’ జట్లనే ప్రకటించినట్లుంది. ధోని, కోహ్లి సహా ఏకంగా ఎనిమిది మంది సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి... రహానేకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. బంగ్లాదేశ్‌తో సిరీస్ ద్వారా టెస్టుల్లో పునరాగమనం చేసిన హర్భజన్‌తో పాటు ఉతప్పకు కూడా వన్డే జట్టులోకి తలుపులు తెరిచారు. న్యూఢిల్లీ: జింబాబ్వేతో మూడు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత సెలక్టర్లు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చారు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, వన్డే కెప్టెన్ ధోనిలతో పాటు రోహిత్ శర్మ, సురేశ్ రైనా కూడా అందుబాటులో లేకపోవడంతో రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. హర్భజన్ సింగ్ వన్డేల్లోనూ పునరాగమనం చేస్తుండగా... ఉతప్ప కూడా తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆకట్టుకున్న పేసర్ సందీప్ శర్మ కూడా తొలిసారి భారత జట్టులోకి వచ్చాడు. టెస్టు ఓపెనర్ మురళీ విజయ్, లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ, కర్ణాటక బ్యాట్స్‌మన్ మనీష్ పాండేలకు కూడా అవకాశం కల్పించారు. అయితే జట్టులో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ లేడు. ఉతప్ప, జాదవ్, రాయుడు ముగ్గురూ వికెట్ కీపింగ్ చేస్తారు. వీరిలో దాదాపుగా ఉతప్ప కీపర్‌గా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. జులై 10, 12, 14 తేదీలలో మూడు వన్డేలు... 17, 19న రెండు టి20లు జరుగుతాయి. మ్యాచ్‌లన్నీ హరారేలోనే ఆడతారు. భారత జట్టు: రహానే (కెప్టెన్), మురళీ విజయ్, ఉతప్ప, రాయుడు, తివారీ, కేదార్ జాదవ్, మనీష్ పాండే, హర్భజన్, అక్షర్ పటేల్, కరణ్‌శర్మ, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీ, భువనేశ్వర్, మోహిత్, సందీప్ శర్మ. 2016 టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేశాం. భవిష్యత్‌లో ఉన్న సిరీస్‌లనూ పరిగణనలోకి తీసుకుని కొందరు క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చాం. బంగ్లాదేశ్‌తో టెస్టులో ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని హర్భజన్‌ను వన్డేలకూ ఎంపిక చేశాం. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో మెరుగైన జట్టును ఎంపిక చేశాం. తుది జట్టుపై నిర్ణయం కెప్టెన్ తీసుకుంటాడు. రహానే అన్ని ఫార్మాట్లలో బాగా ఆడుతున్నాడు. తన కెరీర్ అద్భుతంగా సాగుతోంది. కాబట్టి కెప్టెన్సీ విషయంలోనూ అతను ఎలా ఉంటాడో చూడాలనుకుని అవకాశం ఇచ్చాం. -సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ ‘ఎ’ జట్టులో ప్రజ్ఞాన్ ఓజా స్వదేశంలోనే జులై 19 నుంచి జరిగే ‘ఎ’ జట్ల ముక్కోణపు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత్ ‘ఎ’ జట్టులో హైదరాబాదీ ప్రజ్ఞాన్ ఓజాకు చోటు లభించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు కూడా పాల్గొనే ఈ టోర్నీ (నాలుగు రోజుల మ్యాచ్‌లు)లో భారత జట్టుకు చతేశ్వర్ పుజారా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. లోకేశ్ రాహుల్, ముకుంద్ లాంటి టెస్టు క్రికెటర్లతో పాటు శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్ లాంటి యువ క్రికెటర్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ సిరీస్ ద్వారానే రాహుల్ ద్రవిడ్ ‘ఎ’ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్ ‘ఎ’ జట్టు: పుజారా (కెప్టెన్), లోకేశ్ రాహుల్, ముకుంద్, కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, నమన్ ఓజా, విజయ్ శంకర్, అమిత్ మిశ్రా, ప్రజ్ఞాన్ ఓజా, శార్దూల్ ఠాకూర్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ గోపాల్, బాబా అపరాజిత్. రవిశాస్త్రి డుమ్మా భారత జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లడం లేదు. యాషెస్ సిరీస్‌లో టీవీ విశ్లేషకుడిగా వ్యవహరించేందుకు ఆయన ఇంగ్లండ్ వెళ్లనున్నారు. బంగ్లాదేశ్ పర్యటనకు శాస్త్రిని బోర్డు నియమించకముందే..ఇంగ్లండ్‌లోని స్కై టీవీతో రవిశాస్త్రి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత 2016 టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రిని కొనసాగించాలనే ఉద్దేశం బోర్డుకు ఉన్నట్లు తెలిసింది. అయితే టీవీ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కుదరదు కాబట్టి... జింబాబ్వే పర్యటనకు తాను అందుబాటులో ఉండటం లేదని శాస్త్రి బోర్డుకు తెలిపారు. ఆగస్టులో శ్రీలంకలో పర్యటనకు మాత్రం డెరైక్టర్ అందుబాటులో ఉంటారు. -
టీమిండియా కెప్టెన్‌గా రహానే
-
టీమిండియా కెప్టెన్‌గా రహానే
ముంబై: రహానే విల్ లీడ్ ద టీమిండియా.. రాబిన్ ఉతప్ప ఈ జ్ బ్యాక్ ఇంన్ టు ద టీమ్.. ఇలాంటి సంచలన ప్రకటనలతో సాగింది సోమవారం నాటి సెలక్షన్ కమిటీ సమావేశం. జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీం ఇండియాకు అజింక్య రహానే సారధిగా వ్యవహరించనున్నాడు. సోమవారం ముంబైలో చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ మేరకు జట్టులో సభ్యుల పేర్లను ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు అందరికీ విశ్రాంతి కల్పించడంతో అందరూ యూవకులతో కూడిన బృందమే జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ లో భాగంగా భారత్, జింబాబ్వేలు జులై 10, 12, 14 తేదీల్లో మూడు వన్ డే మ్యాచ్ లు ఆడతాయి. 17, 19 తేదీల్లో రెండు టీ 20ల్లో తలపడతాయి. అజింక్యా రహానే (కెప్టెన్), మురళీ విజయ్, అంబటి రాయుడు, మనోజ్ తివారీ, కేదార్, రాబిన్ ఉతప్ప, మనీష్ తివారీ, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, ధవల్ కులకర్ణీ, స్టువార్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, భువనేశ్వర్, సందీప్ శర్మ, హర్భజన్ సింగ్ (వన్ డే మ్యాచ్ లకు మాత్రమే) -
సీనియర్లకు విశ్రాంతినిస్తారా!
సందిగ్ధంలో సెలక్షన్ కమిటీ జింబాబ్వే పర్యటనకు నేడు భారత జట్టు ఎంపిక న్యూఢిల్లీ: ఒకవైపు సుదీర్ఘ సీజన్ తర్వాత బాగా అలసిపోయామంటూ ధోని తదితరులు విశ్రాంతి కోరుతున్నారు. మరోవైపు చిన్న సిరీసే కదా ఆడితే ఏముంది, తర్వాత నాలుగు నెలలు ఎలాగూ విశ్రాంతి ఉందనేది బోర్డు పెద్దల వాదన. ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం (నేడు) ఇక్కడ సమావేశం కానుంది. ఈ టూర్లో భాగంగా భారత్, జింబాబ్వే మూడు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఇదే సమావేశంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్లతో జరిగే ముక్కోణపు సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును కూడా ఎంపిక చేస్తారు. కెప్టెన్ ఎవరు? జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకుండా తమకు విశ్రాంతి ఇవ్వాలని ఇప్పటికే ధోని, విరాట్ కోహ్లి, అశ్విన్ రవిచంద్రన్, ఉమేశ్ యాదవ్, రోహిత్ శర్మ బోర్డును కోరినట్లు సమాచారం. అయితే వీరిలో కోహ్లి, అశ్విన్‌లతో పాటు గాయాలకు గురి కాకుండా ఉమేశ్‌కు కూడా బ్రేక్ లభించవచ్చు. ధోని టెస్టుల నుంచి ఎలాగూ తప్పుకున్నాడు కాబట్టి ఈ సిరీస్‌కు అతను ఉంటే మంచిదని, ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్ వరకు వన్డేలు లేవని బీసీసీఐలోని కీలక వ్యక్తి ఒకరు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా రోహిత్ శర్మకు కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే కమిటీ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. ఒక వేళ ధోనికి విరామం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మాత్రం రైనా, రోహిత్‌లలో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేయవచ్చు. 2010 జింబాబ్వే టూర్లో సురేశ్ రైనా కెప్టెన్‌గా వ్యవహరించినా... భవిష్యత్తు కెప్టెన్‌గా సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం రోహిత్ శర్మను పరీక్షించే ప్రయత్నం చేయవచ్చు. ఎవరికి చాన్స్! జట్టులో ఖాయంగా ఉండే ఆటగాళ్లలో అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ ఉన్నారు. అశ్విన్ తప్పుకుంటే జమ్మూ కశ్మీర్ ఆఫ్ స్పిన్నర్ పర్వేజ్ రసూల్‌కు చోటు దక్కవచ్చు. హర్భజన్ టెస్టు టీమ్‌లో ఉన్నా, యువ ఆటగాడిగా రసూల్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక రాబిన్ ఉతప్ప, వరుణ్ ఆరోన్, సంజు శామ్సన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా భారత ‘ఎ’ జట్టు తొలిసారి దక్షిణాఫ్రికా ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్లతో ముక్కోణపు సిరీస్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో మరీ జూనియర్లు కాకుండా అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లతో తనకు పటిష్టమైన జట్టును ఇవ్వాలని ద్రవిడ్ కోరినట్లు తెలిసింది. ఈ టీమ్‌కు పుజారా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. వచ్చే నెల 19 నుంచి చెన్నై, వాయనాడ్‌లలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తారు. -
సీనియర్లు వెళతారా?
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఎంపిక 29న ముంబై : వచ్చే నెలలో జరగాల్సిన జింబాబ్వే పర్యటన అధికారికంగా ఇంకా ఖరారు కాకపోయినా... ఈనెల 29న భారత జట్టును మాత్రం ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. సీనియర్ క్రికెటర్లు కొంతమంది ఈ పర్యటనకు దూరం కానున్నారనే వార్తల నేపథ్యంలో... విశ్రాంతి కావాలని తమకెవరూ ఇప్పటివరకూ చెప్పలేదని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ చెప్పారు. ఎవరైనా ఆటగాడు అందుబాటులో లేకపోతే బోర్డు కార్యదర్శి ఠాకూర్‌కు తెలియజేస్తారని ఆయన తెలిపారు. ఏడాది కాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నందున కొందరు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి ద్వితీయ శ్రేణి జట్టును పంపిస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. జింబాబ్వే పర్యటన గురించి బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. అయితే రెండు బోర్డుల వెబ్సైట్లలో ఈ సిరీస్ షెడ్యూల్ ఉంది. వచ్చే నెల 10, 12, 14 తేదీల్లో 3 వన్డేలు, 17, 19ల్లో రెండు టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. -
ధోని చిట్కాలు లాభించాయి
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌లో కెప్టెన్ ఎం.ఎస్. ధోని నుంచి నేర్చుకున్న చిట్కాలు... జింబాబ్వే పర్యటనలో భారత జట్టును నడిపించేందుకు చాలా ఉపయోగపడ్డాయని స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అన్నాడు. ‘ఎంఎస్ ఏ విషయాన్ని ఎక్కువగా చెప్పడు. అయితే రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు అతనితో మాట్లాడే వాణ్ని. జట్టు కు సారథ్యం వహిస్తున్నప్పుడు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, అందుకు తాను ఏం చేయాలో తెలుసుకునేవాణ్ని. విండీస్‌లో నేను జట్టుకు కెప్టెన్సీ చేస్తున్నప్పుడు అతనితో ఇలాంటి విషయాలు చాలా మాట్లాడాను. అతను ఇచ్చిన చిట్కాలు నిజంగా చాలా ఉపకరించాయి’ అని తనపై ధోని నాయకత్వ ప్రభావం ఏ మేరకు ఉందో వెల్లడించాడు. జింబాబ్వేలో సిరీస్ గెలిచిన తర్వాత ధోనితో మాట్లాడలేదన్నాడు. ‘సెలవుల కోసం మహి బయటకు వెళ్లినప్పుడు అతన్ని కాంటాక్ట్ చేయడం చాలా కష్టం. ఫోన్లో మెసేజ్ పెట్టేందుకు ప్రయత్నించా. కానీ అతనికి చేరలేదు. జింబాబ్వే సిరీస్ గురించి త్వరలోనే ధోనితో మాట్లాడతా’ అని ఇక్కడ జరిగిన ఓ వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లి పేర్కొన్నాడు. ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్న స్పిన్నర్ రవీంద్ర జడేజాపై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. నిలకడగా రాణించడంతో ఇది సాధ్యమైందన్నాడు. ‘టాప్ ర్యాంక్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. కొన్నేళ్లుగా అతను చాలా కఠినంగా శ్రమిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో నా కెప్టెన్సీలో ఆడాడు. మంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదుగుతున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. భవిష్యత్‌లో కూడా ఇలాగే రాణిస్తాడని ఆశిస్తున్నా’ అని ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ వ్యాఖ్యానించాడు. పెద్ద సవాళ్లు ఎదురైనప్పుడు ఎలా తీసుకోవాలో భారత్ ‘ఎ’ జట్టు ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా పర్యటనలో తెలుస్తుందన్నాడు. ‘క్రికెటర్లకు ఎమర్జింగ్ టోర్నీ చాలా ప్రధానమైంది. 2009లో జరిగిన ఈ టోర్నీ వల్లే నేను పునరాగమనం చేయగలిగా. ఈ టోర్నీలో గట్టి పోటీ ఉంటుంది. మెరుగ్గా రాణించేందుకు ప్రతి ఆటగాడు మైదానంలో వంద శాతం కష్టపడతాడు’ అని కోహ్లి వివరించాడు. -
నా నిర్ణయం సరైనదే
బులవాయో: జమ్మూ కాశ్మీర్ నుంచి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా పర్వేజ్ రసూల్ పేరు తెచ్చుకున్నప్పటికీ జింబాబ్వే పర్యటనలో అరంగేట్రం చేయలేకపోయాడు. చివరి వన్డేలో చాన్స్ దక్కుతుందనుకున్నప్పటికీ ఈ ఆల్‌రౌండర్‌కు నిరాశే ఎదురైంది. ఈ విషయంలో పలువురి నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అయితే తమ ప్రణాళికలను కెప్టెన్ విరాట్ కోహ్లి సమర్థించుకున్నాడు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని వివరణ ఇచ్చాడు. సమతూకంతో ఉన్న జట్టు బౌలింగ్ విభాగంలో రసూల్‌ను ఆడించే అవకాశం లేకుండా పోయిందని అన్నాడు. భవిష్యత్‌లో అతడికి మరిన్ని అవకాశాలు వస్తాయన్న కోహ్లి పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... మార్పులు వద్దనుకున్నాం: జట్టులో ఓ ఆటగాడిని ఆడించే విషయంలో ఇతరులు ఏమనుకుంటారో అనే విషయం నాకనవసరం. ఈ ఐదు మ్యాచ్‌ల్లో ఆడిన ఆటగాళ్లు కూడా ఇప్పటిదాకా రెండు నెలలు అంతకంటే ఎక్కువగానే వేచి చూశారు. జట్టులో బౌలింగ్ కాంబినేషన్ చక్కగా కుదిరింది. ఈ విషయాన్ని పర్వేజ్ కూడా అర్థం చేసుకున్నాడు. ఇందులో ఎలాంటి మార్పులు చేయదలుచుకోలేదు. అతడికి చాన్స్ రాకపోవడం దురదృష్టకరం. భవిష్యత్‌లో అతడు మరిన్ని సిరీస్‌లు ఆడగలిగితే అతడి సామర్థ్యం బయటపడుతుంది. జడేజాను వదులుకోవడం కష్టం: ఆల్‌రౌండర్ జడేజా స్థానంలో రసూల్‌ను ఆడించాలని అనుకోవడం సరికాదు. అలాంటి ఆటగాడిని వదులుకోవడం కష్టం. ఎందుకంటే అతడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్ తీయగలడు. ఏ మ్యాచ్‌ను కూడా తేలిగ్గా తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే బౌలింగ్‌లో మరీ ఎక్కువ ప్రయోగాలు చేయదలుచుకోలేదు. చాలా రోజులుగా మిశ్రా రిజర్వ్ బెంచికే పరిమితమయ్యాడు. అతడికి నాలుగైదు మ్యాచ్‌ల అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. దక్షిణాఫ్రికా పర్యటనలో చాన్స్: పర్వేజ్ ఇప్పుడు భారత్ ‘ఎ’ జట్టుతో పాటు దక్షిణాఫ్రికా వెళ్లనున్నాడు. అక్కడ అతడు చాలా మ్యాచ్‌లు ఆడతాడు. అలాగే అనుభవం కూడా వస్తుంది. అరంగేట్రంలోనే అదరగొట్టారు: వన్డేల్లో తొలిసారిగా ఆడే అవకాశం వచ్చినా మా ఆటగాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా మోహిత్ శర్మ, ఉనాద్కట్ విశేషంగా రాణించారు. అమిత్ మిశ్రా నిరంతరంగా రెండు నెలల పాటు చోటు కోసం వేచి చూసినా ఈ సిరీస్‌లో 18 వికెట్లతో దుమ్ము రేపాడు. పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు సరైన బంతులు విసరగలిగారు.