ఇస్లామాబాద్: పాకిస్తాన్ జట్టు జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చింది. మూడు టీ20, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం పాకిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను 2-1, టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది. డబుల్ సెంచరీ చేసిన ఆబిద్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలవగా... 14 వికెట్లు పడగొట్టిన హసన్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ గా నిలిచాడు.
తాజాగా పాక్ జట్టు ప్రదర్శనపై ఆ జట్టు మేనేజర్ మన్సూర్ రాణా ప్రశంసలతో ముంచెత్తాడు. '' జింబాబ్వేను టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేయడం సూపర్ అని.. జట్టుగానే గాక ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన నాకు సంతోషాన్ని కలిగించింది. బౌలర్ హసన్ అలీకి ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. ఇక జింబాబ్వేలో మేం బస చేసిన హోటల్‌లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. వారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. రంజాన్ మాసం దృష్టిలో ఉంచుకొని ఇఫ్తార్, సెహర్ సమయాల్లో రకరకాల డిషెస్‌ను వడ్డించారు. చాలా థ్యాంక్స్ జింబాబ్వే క్రికెట్ బోర్డ్'' అంటూ పేర్కొన్నాడు.
ఇక ఈ సిరీస్‌లో పాక్ బౌలర్ హసన్ అలీ అద్బుత ప్రదర్శనతో అదరగొట్టాడు. రెండు మ్యాచ్‌లు కలిపి 8.93 యావరేజ్‌తో మొత్తం 14 వికెట్లు తీయగా.. ఇందులో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.
చదవండి: 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు'
Comments
Please login to add a commentAdd a comment